Comments on: బాలమురళీకృష్ణ

by: mOhana
నా వరకు అన్ని నిర్వచనాలకు బద్ధులైన చివరి క్లాసికల్ వాగ్గేయకారులు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ మరియు వారి శిష్యులైన మైసూర్ వాసుదేవాచార్యులు. మిగిలినవారు ఆ ఔన్నత్యాన్ని అందలేదు అని నా భావన. అందులో వాసుదేవాచార్యులు సుమారు వంద సంవత్సరాలు జీవించారు. చివరి వరకు గాన విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు. వీరి మాతృభాష కన్నడము అయినా కూడా తెలుగులోనే రాశారు. వీరికి సంస్కృతములో ఎనలేని పాండిత్యము. వీరి గురువుగారే వీరివద్ద సంస్కృతములో రాసినది చదివిచూడమనే వారట! బాలమురళిగారి పాటలను మిగిలిన గాయకులు తమ కచేరీలలో ఇప్పుడు కూడా పాడుతున్నారా, ఈ విషయం నాకు అంతగా తెలియదు. గాయకులందరు వీరి పాటలను “బ్రోచేవారెవరురా..” లేక “రఘువంశ సుధాంబుధి..” లా పాడుతుంటే వీరు కూడా వారిలాటి మహనీయ వాగ్గేయకారులే. అందరూ వాగ్గేయకారులే. కాని Some are more equal than others అని అంటారు గదా! విధేయుడు - మోహన

by: Rohiniprasad
వాగ్గేయకారులకి మోహనగారు సరైన నిర్వచనం చెప్పారు. దాన్నిబట్టే అదొక పాతకాలపు tag అని తెలుస్తోంది కదా. ఆధునికులకి ఇటువంటి పదాలు అనవసరమనే నా ఉద్దేశం. రమగారికి బాలమురళి సాహిత్యం ఇంప్రెసివ్ గా లేదన్నారు. దానికి అభ్యంతరం ఉండదు. అయితే ఇప్పటి సమాజంలో, ఇప్పటి పరిస్థితులకు స్పందించే కళాకారులు అప్పటివారిలాగా ఎలా రాయగలరు? డబ్బింగు పాటలు రాసేవారూ, త్యాగరాజూ ఒకటేనని నేనంటానా? Modern context లో వాగ్గేయకారుణ్ణి నిర్వచించడం కష్టమని అనిపిస్తుంది.

by: కొత్తపాళీ
వాగ్గేయకారులు అనే మాట ఫ్యూడల్ పదం ఎలాగైందో నాకర్ధం కాలేదు!

గేయ సాహిత్యము రాసుకుని దానికి సంగీతం సమకూర్చినంత మాత్రాన అది చేసిన ప్రతివారూ వాగ్గేయకారులైపోరని రోహిణీప్రసాదుగారు తెలియనట్టుగా మాట్లాడ్డం విడ్డురంగా ఉంది. ఇంత మాత్రానికి దానికి “పాతకాలపు tags” అని లేనిపోని రంగు అద్దడం కూడా ఆశ్చర్యంగా ఉంది.

నచ్చడం నచ్చకపోవడం వేరే సంగతి. దాన్ని గురించి నాకు మాట్లాడ్డం ఇష్టం లేదన్నా అదో పద్ధతి. బాలమురళీ అసలు వాగ్గేయకారుడే కాదు అనడం (రోహిణీ ప్రసాదు గారు కాదు, ఇంకెవరో అన్నారు), లేక ఇలాంటి “పాతకాలపు tags” వాడ్డం ఇష్టం లేదనడం హాస్యాస్పదంగా ఉంది.

by: mOhana
వాగ్గేయకారులపైన చర్చ జరుగుతుంది కనుక ఇక్కడ

కొన్ని విషయాలను గురించి చెప్పాలి. కాకి నలుపే,

కోకిల నలుపే, కాని వసంతఋతువులో కాకి కాకే, కోకిల

కోకిలే అన్నట్లు, ఒక పాట వ్రాసి దానికి ఒక వరుస

కట్టినంత మాత్రాన ఒక వ్యక్తిని వాగ్గేయకారుడు అనలేము.

వాగ్గేయకారునికి సాహిత్యం బాగా తెలిసి ఉండాలి. భాషలలో

ప్రజ్ఞ ఉండాలి. ఛందస్సు, వ్యాకరణం  తెలిసి ఉండాలి.

అలంకారాల ఉపయోగం తెలిసి ఉండాలి. సంగీత శాస్త్రంలో

గొప్ప ప్రతిభ ఉండాలి. మూడు కాలాలలో పాడే శక్తి ఉండాలి

అతని కంఠానికి. సంగీతశాస్త్రంలోని వివరాలను చక్కగా

ఎరిగి ఉండాలి. రాగ తాళ లయాదుల జ్ఞానం క్షుణ్ణంగా

అవగాహన చేసికొని ఉండాలి. రసానుభూతిని కలిగి

ఉండాలి. స్వరాల ఉపయోగాన్ని తెలిసికొని ఉండాలి.

వివిధ విధాలైన కృతులను వ్రాసి వాటిని సంగీతంతో

జీవంతం చేసి ఉండాలి. ఉదాహరణకు, త్యాగరాజు

పాటలను మాత్రమే కాదు, రెండు యక్షగానాలను

కూడా వ్రాశారు. ఇన్ని లక్షణాలు ఉన్న వాళ్లు ఏ

కొందరు మాత్రమే నిజంగా వాగ్గేయకారులు.

మిగిలినవారు “నేను కూడా వాగ్గేయకారుడినే” ఆని

అనుకొన్నవారు.  విధేయుడు - మోహన

by: rama
rohiNiprasad garu.. asalu aamaatakoste sastreeya samgeetamantaa mothamgaa mari ” fuedal”   kaaLa avutunde ??danigurinchi “prajaswamika pramaNalato” marela matladukuntam?? prateedanikee pramaNalu vuntayi kadandee !! .meeru anesukunte saripotunda?? sastram kooda oppali.. sarasulu ounanianaali. meerichhina nirvachanam prakaram asalu vaggeyakaarulu kaanivarantoo    evaroovundaranukuntaanu. political slogans ki padalu andinche vaalloo.. AD films ki matalani supply chesevaritosaha   antaa telugu “vaggeyakarule”

bhavadeeya RAMA/ rama.

by: rama
బాబ్జీలు గారు !! విశ్లేషణ ఇంకెవరు చేసినా నేను వింటాను. నాకు ఆనందం ప్రమాణం! రసాస్వాదనని కలిగించాలి. “వాక్కు“ ఎప్పుడైనా ఎవరిదైనా!

అన్నమయ్య ..త్యాగయ్య ..క్షేత్రయ్య ..యాగంటివారి తత్వాలు ..వింటున్నప్పుడు కలిగే అక్షరానందం నాకు ..బాలమురళీ రాసిన వాటిల్లో ఎప్పుడూ కలగలేదు. మీలో ఎవరైనా ఆయన అక్షరం అన్నమయ్య పదం తో సమానమైన ఆనందం ఇచ్చిందని _త్యాగరాజ కీర్తన వింటున్నప్పుడు కలిగే ఆనందం కలిగించిందనీ చెప్తే ..వివరించి చూపితే.. నేను ఒక వేళ పొరబడితే గనక తప్పకుండా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. అయితే నాకు నా అభిప్రాయాన్ని సవరించుకోగల అవకాశం మరి ఇవ్వాల్టి వరకూ కలగలేదు. గేయకారుడిగానే తప్ప వాగ్గేయకారుడిగా బాలమురళి నన్ను ఆకట్టుకోలేదు.

“ఖగరాజు, నీ ఆనతివిని వేగ చనలేదో! గగనానికి ..ఇలకూ బహుదూరంబనినాడో! జగమేలే పరమాత్మా ఎవరితో మొరలిడుదూ” అన్న వాక్యాలలోని “ఆర్తిని“ మీరు బాలమురళీ “వాక్” లో దర్శించారా??

“మగువ తన కేళికామందిరము వెడలె” అన్న మువ్వగోపాల పదం లోని సరసతని మీరు బాలమురళీ “వాక్” నించి అనుభవించారా?

”జగడపు చనవుల జాజర.. సగినల మంచపు జాజర”__అన్న అన్నమయ్య వాక్కులలో విరజిల్లే తూగుని మీరు బాలమురళీ “వాక్కు” లలో విన్నారా?? ఇదే చెప్పండి చాలు.

నేను వినలేదు గనక బాలమురళీ “వాగ్గేయకారితనాన్ని” ఒప్పలేదు.. ఏ కళకి ఆ కళ విలక్షణమైనది. దేని విశిష్టత దానిది. బాలమురళీ కర్నాటక సంగీతానికి అమరిన ఒక ఆభరణం. కానీ తెలుగు “వాగ్గేయకారితనం” ఆయనలో లేదు. ఈ రెండూ వేరు వేరు. ఒకదాన్లో గొప్ప అయినంత మాత్రన అంతే సమానంగా మిగతా కళల్లో కావాలని ఎక్కడాలేదు.

Rama.

by: కొత్తపాళీ
బాలమురళీ “వాగ్గేయకారితనం” ఋజువు చెయ్యడానికి ఒకే ఒక్క మాట చాలు - తిల్లానా.

by: Rohiniprasad
బాలమురళీకృష్ణను వాగ్గేయకారుడు అనడానికి రమ/రామ గారికేదో అభ్యంతరం ఉన్నట్టుంది. నిజానికి అదొక ఫ్యూడల్ పదం. పాటలు రాసి ట్యూన్ కట్టినవారెవరినైనా వాగ్గేయకారుడు అనవచ్చు. నేనూ ఆ పని చేశాను, రవీంద్ర జైన్ చేస్తూనే ఉన్నాడు కనక రమ/రామ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సిద్ధాంతరీత్యా మేమూ వాగ్గేయకారులమే. మరి రజనీకాంతరావుగారి నేమనాలి?

తన రచనల గురించి బాలమురళీకృష్ణ ఏమన్నారో నేను తరవాతి వ్యాసంలో రాస్తాను. బాలమురళీకృష్ణ రచనల గురించి రమ/రామ గారికి సురేశ్ వాడ్కరంత గొప్ప అభిప్రాయం లేకపోవచ్చు. ఎవరిష్టం వారిది. నా మటుకు నాకు ఈ పాతకాలపు tags ఈ రోజుల్లో వాడడం అంతగా నచ్చదు.

by: baabjeelu
rama గారూ,

సినారె ని వొదిలెయ్యండి. సినారె certification బహుశా అంత విలువ లేనిదయుండొచ్చు.

బాలమురళి “వాగ్గేయకారితనం” మీరెందుకు ఒప్పుకోట్లేదో కొంచెం వివరిద్దురూ?

రేపు ఎవరు ఎక్కడుంటారో ఎవరూ చెప్పలేరు. చక్కగా చెప్పేరు.

ఇవాళ సంగతి ఏవిటి?

by: Rohiniprasad
బాలమురళి కొన్ని వందల సందర్భాల్లో కచేరీలు చేసి, ఇంటర్వ్యూలిచ్చి, అభిమానులతో ముచ్చటించి ఉంటారు గనక వాటిలో చాలా విషయాలు పాఠకులకు తెలిసే అవకాశం ఉంటుందని నేననుకున్నాను. నేనేదో కొత్తగా కనిపెట్టినట్టు కాకుండా, నాకు వ్యక్తిగతంగా తెలిసిన కొన్ని వివరాలను (ఆయన సంగీతపు వ్యక్తిత్వానికి అద్దంపట్టేవి) మాత్రమే రాశాను. ఆయన వాగ్గేయకారుడనీ, కొత్త రాగాలు తయారుచేశాడనీ, పంతొమ్మిదేళ్ళకే 72 మేళకర్తల్లోనూ రచనలు చేశాడనీ అందరికీ తెలిసినదే కదా అని ప్ర్రత్యేకంగా రాయలేదు. అయితే ఈ కామెంట్లన్నీ చదివాక మరొక వ్యాసం రాసి పంపవలసిన అవసరం ఉందనిపిస్తోంది. అందుకు ప్రయత్నిస్తాను. మోహనరావుగారు ఆడియో లింకులిచ్చి మంచిపని చేశారు.

by: rama
బాబ్జీలు గారూ,

రోహిణీప్రసాద్ గారేమంటారో నాకు తెలీదుగానండీ .. అదేంటోగానీ, “కవి” అన్న పదం లోని ఆకర్షణ అలాంటిదనుకుంటాను.. చాలామందికి తాము “కవులం కాబోలు” అనే భ్రమ ఒకటి వుంటుంది. తీరా పేరు వచ్చేసరికి దాన్ని నిజమే అని వాళ్ళు నమ్మడం మొదలు పెడతారు. పేరు వల్ల వచ్చే అతిశయం ఒకటి వుంటుంది పైగా. అందువల్ల వాళ్ళకి వాస్తవాన్ని చెప్పే వాళ్ళు ఎవరూ వుండరు చాలసార్లు. మన బాలమురళి గారి “వాగ్గేయకారితనం” కూడ అలాంటిదే. ఆయన వాగ్గేయకారుడు అని అనుకుంటున్నాడు. నమ్ముతున్నాడు. ఏంచెయ్యగలం.

నారాయణ రెడ్డి ప్రతీ వాళ్ళకీ అలుపు లేకుండా “కితాబులు” ఇవ్వటానికి అలవాటు పడిపొయాడా.. మరి బాలమురళిని ఆయన “వాగ్గేయకారుడు” అనకపోతే మనం ఆశ్చర్యపడాలి గానీ.. అలా అంటే అందులో వింత ఏముంది?? సినారె కవులంటూ ముందుమాటలు రాసిన వాళ్ళు ఎవరూ ఇవాళ కవులుగా ఎక్కడున్నారో మనకి తెలీదు. రేపు మన బాలమురళి ఎక్కడుంటారో “వాగ్గేయకారుడిగా” కూడా మనకి తెలీదు. సినారె కీ బాలమురళి కీ తెలిస్తే చాలు అని అనొచ్చు మీరు. నేనూ అదే అంటాను.[నేను గాయకునిగా బాలమురళి గాత్రాభిమానిని..ఆయన “వాక్” మీద నాకేమంత సరదా లేదు].

భవదీయ..

Rama

by: baabjeelu
రోహిణీ ప్రసాద్ గారూ,

మొత్తం వ్యాసం మీద, ఒక్కసారి కూడా “వాగ్గేయకారుడు” అని వాడలేదు మీరు, బాల మురళీ గురించి.

డా. సి.నారాయణ రెడ్డి “అన్నమయ్యతో ప్రారంభమైన, తెలుగు వాగ్గేయకారుల పరంపర, ప్రస్తుతం, బాలమురళీ దగ్గర సేద దీరుతోంది” అన్నారు.

బాలమురళీ సొంత కీర్తనలూ, కృతులూ రాసేరంటారు. “ఉన్నవాటికి తోడు, ఈ మధ్యని స్వంత కీర్తనలే ఎక్కువైపోతున్నయి, ఈయన కచేరీల్లో” అనికదా బాలమురళీ విమర్శకులు చిందులు కూడా తొక్కుతారు.

by: baabjeelu
రోహిణీ ప్రసాద్ గారూ,

పెద్దాడ సుందర రామకృష్ణ గారి “ప్రార్థన” అద్భుతం.

సంగీతం లో అ, ఆ లు రాని వాళ్ళం బాలమురళీ కచేరలకి, హాజరవుతాం. అలాగే మరో నాలుగు పాసులెక్కువ తీసుకుని, గేటు బయట పాసుల్లేని వాళ్ళకి మిగిలిన పాసులిచ్చి సంతోషపడే వాళ్ళూ ఉంటారు. కచేరీ కొచ్చినవాళ్ళలో, నార్తిండియన్సూఎక్కువే ఉంటారు. వీళ్ళతో సమానంగా, “నా మొహం. ఏముక్కకాముక్క విడగొట్టి, ఏ కీలుకాకీలు విరిచేసి, అడ్డదిడ్డంగా పాడతాడు. అదేం శాస్త్రీయ సంగీతం?” అని అనేవాళ్ళూ ఉన్నారు. మిగిలిన విద్వాంసులకి ఇలాటి పరిస్థితి లేదు.

బాలమురళీ సంగీతం గురించి ఇంతకన్నా ఇంకొంచెం వివరంగా, ఇంకో వ్యాసం రాయాలి మీరు.

by: రంగ
“పాడటానికి నేనూ,  వాయించటానికి తమ్ముడు చిట్టిబాబూ చాలు” అని “అన్నగారు బాలమురళి” అనే వారని చిట్టిబాబుగారన్నారు.  తమిళ (గాత్ర) విద్వాంసుల ప్రతిభ మీద గబుక్కున జోక్స్ వేసేయటం ఇద్దరికీ అలవాటనుకుంటాను.  అది అనేక యుద్ధాల్లో ఆరితేరిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమో, నిశ్చతమైన అభిపాయమో, లేక కేవలం పెట్టీనెస్సో  వెంటనే తెలిసేది కాదు.

బాలమురళీగారు ఆత్మకథ వ్రాశారు కాదా?  ఎక్కడో సీరియల్ గా చూసిన గుర్తు. (పినాకపాణి గారి ఆత్మకథతో కన్ఫ్యూస్ అవుతున్నానేమో?)

చక్కటి వ్యాసాన్ని అందినంచినందుకు రోహిణీప్రసాద్ గారికి కృతజ్ఞతలు.

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
శ్రీ బాలమురళి పై ఇంత సాధికారంగా రోహిణీప్రసాద్ గారు రాయగలరని నాకు తెలుసు. అయినా, “ఈమాట” కోసం రాసినందుకు ధన్యవాదాలు.

ఈ వ్యాసంలో ముచ్చటించిన ఒకటి, రెండు విషయాలను మళ్ళీ మీ ముందుంచాలని:

1. “గాయకుడిగా శ్రీబాలమురళీ దరిదాపులకు వచ్చేవాళ్ళు లేకున్నా,  శ్రీ బాలమురళీకి మరిన్ని సుగుణాలు ఉంటే బాగుండేది” అన్న వ్యాసకర్త మాటలు, గమనించతగ్గవి. ఆలోచింపతగ్గవి. సంగీతంతో (పుస్తక జ్ఞానమేకాక) అన్ని రకాలుగా ఎంతో గాఢమైన పరిచయం, అనుభవం ఉంటే కాని ఇటువంటి వాక్యాలు రాయలేరు.

2. శ్రీ బాలమురళి సంగీతం, జీవితం తరవాత తరాల కోసం డాక్యుమెంటేషన్ విషయమై, రోహిణీప్రసాద్ గారు చేసిన సూచనలు ఆలోచించి, ఆచరణలో పెట్టవలసినవి. నాకు ఉన్న పరిచయంలో, తెలుగు సంఘాలకి గాని, సంస్థలకి గాని అటువంటి దమ్ము, ఆసక్తి ఉన్నాయని నే అనుకోను.

మోహనరావుగారికి:

మీ అభిప్రాయంలో, మీరిచ్చిన లింకులకి ధన్యవాదాలు.

విష్ణుభొట్ల లక్ష్మన్న

by: peddada sundera ramakrishna
శ్రీ బాలమురళి గారి గురించి చక్కని వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు. బాలమురళి వారు ఒక జీనియస్. వారు కట్టిన రాగాలు గురించి మీరు మరింత వివరణ ఇవ్వమని మా ప్రార్ధన.

by: Rohiniprasad
మరొక ముచ్చట గుర్తుకొచ్చింది. చిన్నతనంలో తనను పరీక్షించడానికొచ్చిన ఒక విద్వాంసుడు తలొక్క చేత్తో తలొక కాలంలో ఆదితాళం వేసి చూపుతూ, ఆ విద్యను కుర్రవాడికి నేర్పమని బాలమురళి గురువుకు సలహా ఇచ్చాడట. అంటే ఒక వేగంతో ఒక చేత్తోనూ, దానికి రెండింతల వేగంతో మరో చేత్తోనూ వేళ్ళు కదుపుతూ ఆదితాళాన్ని సూచించడం అన్నమాట. ఇది చూసిన బాలమురళి తానుకూడా వెంటనే అలా చేసి చూపడమే కాక చేతులు మార్చి మళ్ళీ తాళం వేసి చూపాడట. మీరలా చెయ్యగలరా అని ఆ వచ్చినాయనను బాలమురళి అడిగితే ఆయన చల్లగా జారుకున్నాడట. ఈ రకమైన అవయవ నియంత్రణ ఆదిభట్ల నారాయణాదాసుగారికి ఉండేదనీ, ఆయన ఏకకాలంలో పంచముఖి అనే అయిదురకాల తాళాలను ఒకేసారి (రెండు కాళ్ళూ, రెండు చేతులూ, నోటిపాట ద్వారా) వేసి చూపేవాడనీ అంటారు.

by: mOhana
బాలమురళీకృష్ణగారిని గురించిన వ్యాసం  చదవడానికి బాగుంది. వారు తెలుగు సినిమాలలో  పాడిన పాటలను అందరూ వినే ఉంటారు. వీరు మిగిలిన  దక్షిణ భాషల సినిమాలలో కూడా పాడారు. అందులో కొన్ని  ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. మలయాళంలో దక్షిణామూర్తి  మాస్టారు దర్శకత్వంలో గానం అనే చిత్రంలో వీరు పాడారు. ఆ పాటలను ఇక్కడ వినగలరు -

గానం (మళయాళం) (devaragam.com నుండి)

ఇందులో ఒక స్వాతి తిరునాళ్ పాట బాలమురళిగారు సుశీలగారికి   నేర్పినట్లు ఉంటుంది.

తమిళములో నాకు తెలిసి వీరి మూడు సినిమా  పాటలు ప్రసిద్ధమైనవి. అవి -

1. కలైక్కోయిల్ అనే చిత్రంలో విశ్వనాథన్-రామమూర్తి సంగీత  దర్శకత్వంలో తంగ రదం వందదు వీదియిలే అనే పాట. ఇంటర్నెట్లో నాకు ఆ పాట లభ్యము కాలేదు. మిగిలినవి -

2. బాబ్జీలుగారు చెప్పిన తిరువిళైయాడల్లోని రాగమాలిక ఒరు నాళ్ పోదుమా (సంగీతం - మహాదేవన్). దానిని ఇక్కడ వినగలరు -

ఒరు  నాళ్ పోదుమా  (musicindiaonline నుండి)

3. మరొకటి ఇళయరాజా దర్శకత్వములో కవిక్కుయిల్లోని  చిన్న కన్నన్ అళైక్కిరాన్

చిన్న కన్నన్ అళైక్కిరాన్ (musicindiaonline నుండి)

కన్నడ సినిమాలలో వీరు చాల అందంగా పాడారు. నాకు తెలిసినవి - సంధ్యారాగ (ప్రసిద్ధ రచయిత అ.న. కృ. వారి నవలపై  ఆధారం). ఇందులో వీరు మరియు భీమసేన్ జోషీగారు ఇద్దరు  పాడారు. ఇందులో రెండు ఈ పరియ సొబగు (పురందరదాసు), నంబిదె నిన్న నాద దేవతె పాటలను యూట్యూబులో వినవచ్చు.

మరొకటి హంసగీతె. ఇందులో శ్యామశాస్త్రి పాటను అత్యద్భుతముగా  పాడారు. అంతేకాక జయదేవుని అష్టపదులను ఎం. ఎల్. వసంతకుమారితో పాడారు. ఈ పాటలను ఇక్కడ వినవచ్చు -

హంసగీతె (కన్నడ) (musicindiaonline నుండి)

కన్నడములోని మూడవ చిత్రం సుబ్బా శాస్త్రి. ఇది ఒక మస్ట్ సీ  చిత్రము. దీని సంగీత దర్శకుడు వీణా దొరైస్వామి అయ్యంగారులు. ఇందులో దేవరనామములను మురళికృష్ణగారు చాల చక్కగా పాడారు. ఈ పాటలను ఇక్కడ వినగలరు -

సుబ్బా శాస్త్రి  (కన్నడ) (musicindiaonline నుండి)

ఈ చిత్రపు మరొక అందమైన పాట (నాకు ఈ పాట అంటే ఎంతో ఇష్టం) శ్రీరంగం గోపాలరత్నంగారు పాడిన కృష్ణన కొళలిన కరె. దీనిని నేను ఒకప్పుడు తెలుగులో అనువాదం చేసి రచ్చబండలో  ప్రచురించినట్లు గుర్తు.

- మోహన

by: baabjeelu
ఆరుద్ర, బాలమురళీ మీద రాసిన వ్యాసం, తపాలా శాఖ వారి దయ వల్ల గాల్లో కలిసిపోయిందని చాలా ఏళ్ళ కిందట చదివినప్పుడు కలిగిన బాధ, ఈ వ్యాసంతో ఉపశమించింది.

బాలమురళీ ఛలోక్తులు:

బొంబాయిలో రంగ్ భవన్ కచేరీ లో, స్వాతి తిరునాళ్‌ కీర్తన ముందు, “ఈ హిందీ పాట, ఒక మళయాళీ రాజుగారు రాసింది. ఒక మళయాళీ సినిమా కోసం, వరస కట్టి పాడింది, తెలుగునాట పుట్టి, తమిళనాట్లో పెరిగిన కుర్రాడు. ఆ కుర్రాణ్ణి నేనే.”

ఈ కచేరీలోనే “ఒరునాళ్ పోదుమా …” మొదలెట్టి, పాట ఆపి “పోగాదు ముడిచిట్టుమా?” అనడం.

ఈ కచేరీలోనే “రబీంద్రొ షొంగీత్” మొదలెట్టినపుడు, వెనక వరసలో కూచున్న బెంగాలీ “ఖూబ్ భాలో” అన్నప్పుడు, ఆశ్చర్యం వేసింది.

ఆగష్టు 24, 2008 న రవీంద్రభారతి లోజరిగిన కార్యక్రమం లో, “ఇలా అన్నీ పాడేస్తే ఇక నన్నెవరూ కచేరీలకి పిలవరు.” రసికులిచ్చిన లిస్ట్ చూసి.

ఎస్. జానకి గారు, స్టేజి దగ్గరకెళ్ళి, “దేవీ బ్రోవ సమయమిదే” అని నాలుగైదు సార్లు గట్టిగా అడిగేరు. బాలమురళీ “ఇదేనా?”

“తుంగా తరంగే” పాడమని ఎవరో రాసి పంపితే, “అవన్నీ బాలమురళీ గా వున్నప్పుడు పాడినవి.”

కచేరీ వినడానికి వచ్చిన వాళ్ళని బట్టి కచేరీ చెయ్యడం ఈయనొక్కరే చెయ్యగలరని నా నమ్మకం.

బాలమురళీ, శ్రీరంగం గోపాలరత్నం గార్లు కలిసి “ఎంకి పాటలు” కూడా పాడేరు. భక్తిరంజని కార్యక్రమం లాగే వుంటుంది. బహుశా అందుకే ఎవరూ వాటి ఊసు ఎత్తరేమో?

by: T.Raja gopal
శ్రీ. బాలమురళి గారి గురించి, నాకు తెలియని  చాల చక్కని

విశేషాలు వ్రాసారు. ధన్యవాదములు.

by: మురళి నందుల
చక్కటి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.