Comments on: పుస్తక సమీక్షల గురించి…

by: రవికుమార్
అయ్యా చాలా ఆలశ్యంగా ఈ వ్యాఖ్య రాస్తున్నాను. మీ వ్యాసంలో ప్రస్తావించిన విమర్శలతో గాని, విమర్శకులతో గాని ఏ మాత్రమ్ పోలిక లేకపోయినా, ఒక సామాన్య పాఠకుడిగా ఇతర పాఠకులను బుజ్జగిస్తూ, వినయంగా బతిమాలుకుంటూ గత ఏడాది కాలంగా నేను పుస్తక పరిచయాలను మీరు చదివారా? బ్లాగులో రాస్తున్నాను. దయచేసి అవొక్కసారి చూసి మీరు మీ అభిప్రాయం తెలియజేస్తే, అదో పెద్ద రివార్డుగా మురిసిపోతాను.

by: కొత్తపాళీ
నిష్పాక్షికం = without bias, ok, అర్ధమయింది.

మీరే నేననేది అర్ధం చేసుకోలేదనుకుంటాను. నా మొదటి ప్రతిపాదన ఏ సమీక్షా నిష్పాక్షికంగా ఉండదు. రెండో ప్రతిపాదన, ఒకేళ ఉంటే, అటువంటి రచన వల్ల పాఠకుడిగా నాకేం ప్రయోజనం ఒనగూడదు. భావస్పందన స్పష్టత గురించి మీరన్నారని నాఉద్దేశం కాదు. నా ఉద్దేశంలో ఏది మంచి విమర్శో చెప్పానంతే.

by: vElUri VEMkaTESvara raavu
—రామ (రమ) భరద్వాజ్ గారికి:

మీరు ఉదహరించిన రెండు సమీక్షలు/విమర్శలూ నాకు తెలుసు. వాటి ప్రతులు నా దగ్గిర లేకపోవటంతో, నేను వాటి ప్రస్తావన తేలేదు. నా సంపాదకీయం/వ్యాసం (?)(సరేనా విప్లవ్ గారూ! మీకు అభినందనలు) లో నేను ఉదహరించిన వాటన్నిటికీ నాదగ్గిర ప్రతులున్నాయి!   మీరు ఆ రెండుసమీక్షలూ గుర్తుకితెచ్చి నన్ను మందలించినందుకు కృతజ్ఞుడిని.

—రోహిణీప్రసాద్ గారికి:

ఈ మాట గురించి మీరు చెప్పిన రెండు మంచి మాటలు మాకెంతో ఆనందం; గర్వకారణం. మీకు నా నమస్సులు.

—కొత్తపాళీ గారికి:

నిష్పాక్షికము అన్న మాట నేను without bias కి అనువాదంగా వాడాను.  నా ఉద్దేశంలో విమర్శలలోసాధ్యమైనంతవరకూ ఏవిధమైన bias (పక్షపాతం అన్న మాట ఒప్పుకుంటారా?) ఉండకూడదు. అంటే విమర్శకుడి biases సమీక్షలోను, విమర్శలోనూ కనపడకూడదు, అని!  తన భావస్పందన స్పష్టం గా ఉండకూడదనే అర్థం నావ్యాసం(?)/సంపాదకీయంలో వచ్చిఉంటే, రచయితగా అది నా చేతకానితనం. క్షమార్హుణ్ణి.

హనుమంతరావుగారికి:

కొ.కు. చెప్పినా, రా .రా. వ్రాసినా, తా.ధ. మందలించినా; — అసలు నిజం ఇది:   కీట్స్ మరణానికి కారణం అతని క్షయ వ్యాధి.  తన క్షయ వ్యాధి, దరిమిలా తన రాబోవు మరణం గురించి కీట్స్ చాలా మథన పడ్డాడు. కీట్స్ apothecary గా ( అంటే, మన భాషలో కాంపౌండర్  అనవచ్చనుకుంటా!) శిక్షణ పొందాడు!

1821 లో (కీట్స్ మరణానంతరం) ఈ కథ / రూమర్ మొదలయ్యింది.  క్వార్టర్లీ రివ్యూ పత్రికలో ఒక “కర్కోటక” విమర్శకుడు(విమర్శకురాలు?) వ్రాసిన  సమీక్ష కీట్స్ మరణానికి కారణం అని! ఈ రూమర్ కి ఆజ్యం పోసిన వాడు షెల్లీ.  మీరు చదివే ఉంటారు; షెల్లీ వ్రాసిన Adonais. అది కీట్స్ పై  elegy అని మీకు నేను చెప్పనక్కరలేదు.  పోతే, బైరన్ వ్రాసిన Don Juan పద్యంలో,  ఈ రూమర్ని కాస్త తక్కువ పాళ్ళల్లో పాడాడు:

‘Tis strange the mind, that very fiery particle,

Should let itself be snuffed out by an Article.”

Stanley Plumly  ఈ మధ్యనే Posthumous Keats ( Norton, 2008)  ప్రచురించాడు.  అందులో ఈ కథ/రూమర్ ప్రస్తావన దొరుకుతుంది.

విధేయుడు, — వేలూరి వేంకటేశ్వర రావు.

by: కొడవళ్ళ హనుమంతరావు
రారా, తాపీ, కీట్సు, కుటుంబరావు

ఇది మొదలెట్టడంతోటే నాకు కుటుంబరావు వ్యాసం, “విమర్శలకు ప్రమాణాలు,” (సాహిత్య వ్యాసాలు, పేజీ 413), గుర్తొచ్చింది.

సెవెన్ స్టార్స్ సిండికేట్ ప్రచురించిన ‘నవత’ పత్రికలో కవిత్వాన్ని రారా నిశితంగా విమర్శిస్తే, తాపీ రారాని మందలిస్తూ, “రారా గారి విమర్శన లాంటి విమర్శనలు ప్రతి సంఘటనకూ స్పందించే సున్నిత హృదయులైన రచయితల మీద ఎంతటి తీవ్రంగా పని చేయగలదో చెప్పాలంటే పూర్వం ఇలాంటి విమర్శ కారణంగానే కీట్సు కవి జీవితం అంతమయింది. విమర్శకుని కర్తవ్యం అభ్యుదయ రచనను పెంపొందించటం తప్ప ఖండించడం కాదు,” అని రాశారు.

రారాని సమర్థిస్తూ కుటుంబరావు రాసిన వ్యాసం అది.

కొడవళ్ళ హనుమంతరావు

by: Rohiniprasad
సమీక్ష అనేది రకరకాల స్థాయిల్లో పనిచేస్తుంది. ప్రస్తుత ప్రపంచంలో ‘రోడ్డవతల’ ఉన్న పుస్తకాల షాపుకు వెళ్ళి చూడగలిగే పరిస్థితి లేనప్పుడు ఫలాని పుస్తకం ఒకటి అచ్చయింది అనే ప్రాథమిక సమాచారం అందజెయ్యడం దగ్గర్నుంచీ అది దేన్ని గురించో వగైరా విషయాలు ఈ సమీక్షల ద్వారా తెలుస్తాయి. నేను ఇంటర్నెట్ మీద ఆంధ్రజ్యోతి, ఈనాడు, వార్త ఎడిషన్ల ఆదివారం అనుబంధంలో ఈ వివరాలు చూస్తూ ఉంటాను. సమీక్షకుడు సాహితీపరుడుగా పేరున్నవాడు కాకపోతే అతని విమర్శను పాఠకులు సీరియస్ గా తీసుకోకపోవచ్చు.

1970-75 ప్రాంతాల్లో ఆంధ్రప్రభ వీక్లీవారు మా నాన్న కుటుంబరావుగారి చేత పుస్తక సమీక్షలు రాయించేవారు. ఎమెస్కో ప్రచురించిన విశ్వనాథ రచనలూ (దిండు కింద పోకచెక్క వగైరా), ఇతర పుస్తకాలూ చదివి ఆయన సమీక్షలు రాసేవారు. అందుకు పారితోషికం పది రూపాయలు! ఇది ఆ రోజుల్లోనూ చాలా తక్కువే. ఆయన సీనియర్ కథకుడు కనక సరికొత్త కథకి కూడా అప్పట్లో వాళ్ళిచ్చినది 75 రూపాయలే అనుకోండి. మొత్తం మీద సాహిత్య విమర్శకి భారతి మూతపడ్డాక విలువ తగ్గిందనిపిస్తుంది.

ఈ వ్యాసం (లేదా ఎడిటోరియల్) బాగుంది.  Self-congratulatory అని కాదుగాని ఈమాటకూ తక్కిన వెబ్ పత్రికలకూ ఇటువంటి విషయాల్లోనే తేడా కనిపిస్తుంది. పాఠకులు కామెంట్లు రాసేటప్పుడు hyper critical ధోరణి అవలంబించకుండా ఈ ప్రయత్నాలకు ప్రోత్సాహాన్నివ్వడం మంచిది.

by: కొత్తపాళీ
ఏ రచన అయినా నిష్పాక్షికం ఎలా అవుతుంది? అందులోనూ విమర్శ, సమీక్షల్లాంటి రచనలు ..?

ఒక వేళ ఉన్నా, అలాంటి రచనవల్ల ఒనగూడే ప్రయోజనం ఏవిటో నాకు అర్ధం కావడంలేదు. వ్యంగ్యాలు, వెటకారాలు కాసేపు పక్కన పెడితే, ఒక పుస్తకం తనలో కలిగించిన భావస్పందనల సారాన్ని (మంచో చెడో) సమీక్షకుడు ప్రతిబింబించ గలిగితే అది మంచి సమీక్షే అని నేననుకుంటాను. తుని న్యాయం చెప్పినట్టు ఉండే నిష్పాక్షిక సమీక్ష నాకేమీ చెప్పదు.

by: విప్లవ్
డియర్ ఎడిటర్,

ఇది పూర్తి నిడివి వ్యాసమే! సంపాదకీయం లోకి ఎందుకొచ్చి పడింది?  వేలూరి గారికే ఎరుక :).

భారతి, స్వతంత్ర, జ్వాల, వీణ ఇవన్నీ TIFF Files గానో మరో రకంగానో ‘ఈమాట’ వారందించగలరా?  ఉన్నంత వరకే, ఒక డంపింగ్ గ్రౌండొకటి తయారు చేసి మిగతా పాఠకులను కూడా వాళ్ళ దగ్గరున్నయి శేర్ చేయమంటే సరిపోతుందేమో (పాతవి కనుక కాపీ రైట్స్ పెద్దగా అడ్డురావేమో).

ఏవో ఒకటీ అరా చూడటమే కాని అంత పాతవి నేను పెద్దగా చదవలేదు, అప్పటి పత్రికల్లో విమర్శకూ సమీక్షకూ పెద్ద తేడాలేదా?

“నిజం చెప్పాలంటే, కీట్స్ ఆ సమీక్షని అమరజీవిగా చేసాడని చెప్పడం సబబు.”

రచనలో సారం లేకున్నా అది నిలవటానికి (వేరే కారణాలతో) ఇదో ఉదాహరణ అనుకుంటాను.

విప్లవ్

by: rama
వెంకటేశ్వర రావు గారు, మీ దృష్టికి రాలేదో, లేక మీకు దొరకలేదో, నాకు తెలీదు గానీ, జయప్రభ గారి “వామనుడి మూడోపాదం” కవితా సంపుటి మీద వెల్చేరు నారాయణ రావు గారు చేసిన సమీక్ష చెప్పుకోవలసిన  రివ్యూ. ఆ పుస్తకం అచ్చై తెలుగులో ఒక సంచలం సృష్టించిన రోజుల్లో ఆంధ్రజ్యోతి వీక్లి లో అచ్చు అయ్యింది. అలాగే దాదాపు వెనువెంటనే అనుకుంటాను జయప్రభ గారి “భావకవిత్వంలో స్త్రీ” అన్న విమర్శ పుస్తకాన్ని పురాణం సుబ్రమణ్య శర్మ గారు ఒక మూడు వారాల పాటు ఆంధ్ర జ్యోతి వీక్లి లోనే సమీక్ష చేసారు. అది ఒక కొత్త దృక్పథాన్ని సరిగా గ్రహించలేక సమీక్షకుడు ఎన్ని పిల్లి మొగ్గలు వేసి బొల్తాపడతాడో చెప్పడానికి మరో వుదహారణ. మీరు వీటిని పట్టించుకోలేదేమా? అనుకున్నాను.

rama