Comments on: అమెరికా పర్యాటకుల రెండు పుస్తకాలు - II

by: Sai Brahmanandam Gorti
రవిశంకర్ గారి కవిత్వం అంటే ఇష్టపడే వాళ్ళల్లో నేనొకణ్ణి.  ఈ వ్యాసం మొదటి భాగం కవితా సమీక్ష ఉన్నట్లుగా నవలా సమీక్ష లేదు.

నవీన్ గారు ఆయన అనుభవాలు రాసారు. అమెరికాలో జరిగే కొన్ని విషయాల గురించి పైపైనే స్పృశించి చెప్పారు. అందువల్ల ఇది ఇండియానుండి వచ్చేవాళ్ళకి గైడులా ఎలా ఉపయోగపడుతుంది? ఈ నవల్లో చాలా చోట్ల పొందుపర్చిన వివరాలు సరిగ్గా లేవు. తెలీని వాళ్ళకి పరవాలేదు కానీ, అమెరికాలో ఉంటున్న వాళ్ళకి ఈ నవల ఓ పట్టాన మింగుడుపడదు.

ఎయిర్ పోర్ట్లో అమెరికన్ సంభాషణ గురించి ఈ వ్యాసంలో రాయలేదు. ఇరాక్ యుద్ధం గురించి నవీన్ గారేమనుకుంటున్నారో అది అమెరికన్తో మాట్లాడినట్లుగా రాసారు. పరిచయం లేని వ్యక్తుల దగ్గర అమెరికన్లు అంత లా మనసు విప్పి చెప్పరు. సిడ్నీ షెల్డన్ నవల్లో సెక్స్ లేకపోతే ఇక్కడ పుస్తకాలెవరూ కొనరన్నట్లుగా రాసారు. అది మాత్రం నిజం కాదు.  ఇలాంటి చోటే నవీన్ సొంత అభిప్రాయాల్ని చొప్పించారన్నట్లుగా ఉంది. ఇవేమీ ఈ వ్యాస సమీక్షలో రాయలేదు. ఇది ఖచ్చితంగా రివ్యూ రాసేటి నవలల జాబితాలో చేరదు. వ్యాస రచయిత చెప్పినట్లుగా ఒక్క బిగిని చదివేసే నవల మాత్రం కాదు.

ప్రశంసల దగ్గర పెల్లుబికిన విశేషణాలు విమర్శ దగ్గర మౌనం వహించడం ఈ వ్యాసంలో కొట్టచ్చినట్లుగా కనిపించింది. నవల చదివితే ఈ అభిప్రాయం మరింత నిర్ధారింప బడుతుంది. ఇదే ఏ పేరులేని మామూలు రచయితో  రాస్తే ఇలా రివ్యూలకి నోచుకుంటుందా? అందుకే అతితక్కువగా మెల్లని స్వరంలో విమర్శ సాగింది.

యాత్రా నవల అన్నారు. అంటే యాత్ర చేస్తూ రాసిన నవలనా లేక యాత్ర గురించి నవలనా? ట్రావెలాగ్ అని అనుంటే పోయేది. మరలా నవల అంటూ ఈ బిల్డప్పు ఏమిటి? నవలకి కావల్సిన మౌలిక లక్షణాలు ఈ పుస్తకంలో ఏ కోశానా కనిపించవు. అది వ్యాస రచయిత ఎక్కడా చెప్పినట్లు లేదు. విమర్శ మాత్రం ఘాటుగా లేదు. మరీ చెయ్య లేదనకుండా “కవర్ డిజైన్” సరిగ్గా లేదు. ఇంకాస్త శ్రద్ధ చూపిస్తే బాగుండేది అని రాసారు. ఇందులో నవలా వస్తు విమర్శ లేదు. స్నేహ పూర్వక సమీక్షలా వుంది.అందుబాటులో వుంటే చదవండి. చదివాక మీరూ నాతో ఏకభవిస్తారన్న నమ్మకం నాకుంది.

[ఈ కామెంటు ఎడిట్ చేయబడినది - సం.]