ఈమాట » చంద్రోదయం

Expand to right
Expand to left

చంద్రోదయం

ఆకాశానికి
రంగులు పులమడు

పక్షుల అట్టహాసం
అసలే ఉండదు

ఎలా వస్తాడో
ఎప్పుడు వెళ్తాడో

మచ్చలున్నా
స్వచ్ఛంగా నవ్వుతూ!


మూలా సుబ్రహ్మణ్యం

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు.  ...

 

(8 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Lakshmi Kallakuri - 'Sailakshmi' అభిప్రాయం:

    September 4, 2008 12:25 am

    అందుకే మావా! ( మామా!) చందమామా !

  2. వినీల్ అభిప్రాయం:

    September 4, 2008 6:23 pm

    చంద్రోదయమంత చక్కగా ఉంది. అభినందనలు.

  3. suvarna అభిప్రాయం:

    September 5, 2008 5:32 am

    “పక్షుల అట్టహాసం అసలే ఉండదు” వాక్యం అర్ధం కాలేదు.
    చంద్రోదయం అప్పుడూ పక్షులు గూళ్ళకు చేరుతూ కిలకిలరావాలు చేస్తాయి కదా!
    సువర్ణ.

  4. Srinivas Nagulapalli అభిప్రాయం:

    September 5, 2008 8:20 am

    బాగుంది. దీన్ని రాయడానికి ప్రేరణ కూడా ఇచ్చింది.
    ********
    ఆకాశానికి
    రంగులు పులమడు
    అవకాశం
    వస్తేనే వెలుగుతాడు.

    అట్టహాసంగా పెరుగుతాడు
    అంతలోనే కృశిస్తాడు.

    పూర్తిగా వస్తే పున్నమే
    లేకపోతే అసలు అమాసే!

    ఇచ్చే వెన్నెల
    అరువు తెచ్చుకున్న కాంతే
    సొంతానికి ఉన్నవి
    స్వచ్చంగా మచ్చలే!

    ఇంతైనా శివుని శిరమునుండి
    స్థానబలం తోటే
    ఆదరణ అందుకుంటాడు.
    *****
    విధేయుడు
    Srinivas

  5. Audisesha Reddy Kypu అభిప్రాయం:

    September 20, 2008 5:53 am

    కవిత చిన్నదే అయినా చక్కగా వుంది.

  6. M S Naidu అభిప్రాయం:

    September 26, 2008 11:41 pm

    chandrodayam is as delicate as its coming.
    Thank you.

  7. janardhanchoudary అభిప్రాయం:

    October 2, 2008 10:49 pm

    hi,it’s simple and good…

  8. రానారె అభిప్రాయం:

    October 6, 2008 7:12 am

    భలే మంచి పరిశీలన. బాగుంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a