వాడుక భాషలో పద్యాలు

ముగింపు

మొన్ననుండి నిన్న పుట్టింది, నిన్ననుండి ఈరోజు పుట్టింది, ఈరోజునుండి రేపు పుడుతుంది. మొన్న ఉన్నవాళ్ళు నిన్న లేరు, నిన్నటివాళ్ళు నేడు లేరు, నేటివారు రేపు ఉండరు. కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. భాసుడి తరువాత కాళిదాసు, కాళిదాసు పిదప నన్నయ, నన్నయ తరువాత పోతన, పోతన తరువాత శ్రీశ్రీ, శ్రీశ్రీ పిదప ఇంకా ఎందరో. నన్నయనాటి భాష వేరు, నేటి భాష వేరు. అవే పదాలతో, అలాగే పద్యాలు రాయనవసరం లేదు ఈ రోజు. అంటే ఆకాలపు పద్యాలు బాగులేవని కాదు. కొత్త గాలి వీచింది, కొత్త శైలి వచ్చింది. అవే నియమాలు కూడా పాటించ నవసరం లేదు. ఒక వృత్తపు లయను పాడు చేయకుండా, ఒక గురువును రెండు లఘువులు చేస్తూ, రెండు లఘువులను ఒక గురువుగా చేస్తూ రాస్తే ఛాందసులు ఒప్పుకోకపోయినా అది ఒక వృత్తము కాకపోదు. ఛందస్సులో కూడా దానికి విషమవృత్తమని ఒక పేరు ఉంది. గణాలు తప్పినా, గమనం తప్పలేదని అంగీకరిస్తారనుకొంటాను చంపకమాలను బోలిన కింది పద్యంలో.

తలుపుల తీయరా, పసిడి తలుపుల తీయర కొత్త మేడలో
పలుకుల నాడరా, తెలుగు పలుకుల నాడర కొత్త పాటలో
నిలువక సాగరా ముందు, నిలువక సాగర కొత్త ఊహతో
వెలుగుల జిమ్మరా, అలల వెలుగుల జిమ్మర కొత్త దారిలో

నా ఉద్దేశంలో ఇలా గతిలయలు చెడకుండా శ్రుతుల కింపుగా రాస్తే అది తప్పు కాదు. ఇక్కడ శ్రీశ్రీగారు చెప్పిన కింది వాక్యాలతో [రా-2] ఈ వ్యాసాన్ని ముగిస్తాను –
“నేను ఏవో యతిప్రాసలు లేని పద్యాలు వ్రాస్తూండడం చూచి మా నాన్నగారు నాకు సులక్షణసారం [తి-1] కొనిపెట్టారు. ఛందస్సు ప్రథమపాఠం చెప్పారు. అప్పటికి నాకు ఏడెనిమిది సంవత్సరాలకు మించి ఉండదు. ఆ రోజు నుండి ఎన్ని పద్యాలు వ్రాశానో చెప్పను, అన్నీ తప్పులే! కాని ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చెయ్యలేదు. అందరూ నా తప్పులు దిద్దేవారే! కొన్ని తప్పులు నాకు తప్పుగా తోచలేదు. అవి చెయ్యడానికి నాకేదో హక్కు ఉందనిపించింది. అందువల్ల నా వ్యక్తి చైతన్యం ప్రగాఢతరం అవుతున్నట్లు, నా బలం హెచ్చినట్లు నాకు స్పష్టంగా తోచింది!”


గ్రంథసూచి:

  1. [కా-1] భైరవభట్ల కామేశ్వరరావు, పద్యాలు – వాడుక భాష, ఈమాట, జనవరి 2007.
  2. [కా-2] భైరవభట్ల కామేశ్వరరావు, కవిత్వ భాష తీరుతెన్నులు, ఈమాట, జులై 2008.
  3. [గో-1] కె. గోపాలకృష్ణరావు, శతకసౌరభం, యువభారతి, సికిందరాబాదు, 1976.
  4. [తి-1] లింగమగుంట తిమ్మకవి, సులక్షణ సారము, పరిష్కర్త రావూరి దొరసామి శర్మ, 1980. ఈ పుస్తకం ఇక్కడా, ఇక్కడా లభ్యం.
  5. [తె-1] పాత తెలుగు పాటలు, పరచూరి శ్రీనివాస్, శనగవరపు శ్రీనివాసరావు, జొన్నవిత్తుల శ్రీనాధ్ (search phrase – murisEvu virisEvu)
  6. [పా-1] టి. ఎస్‌. పార్థసారథి, భావరాజు నరసింహారావు, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల కృతులు, త్రివేణి పబ్లిషర్స్‌, మచిలీపట్టణము, 1978.
  7. [ప్ర-1] ప్రసాదరాయ కులపతి, కవితా మహేంద్రజాలం, డాక్టర్ కులపతి షష్టిపూర్తి అభినందన సమితి, హైదరాబాదు, 1998.
  8. [భా-1] శ్రీమహాభాగవతము, రాయప్రోలు సుబ్బారావు నేతృత్వములో సంపాదక వర్గము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, హైదరాబాదు, 1983.
  9. [మ-1] మహతీ శంకర్, కరుణశ్రీ కవితా విజయశ్రీ, మోహన్ పబ్లికేషన్స్, విజయవాడ, 1995.
  10. [మో-1] జెజ్జాల కృష్ణ మోహనరావు, వాడుక భాషలో తెలుగు కవితా వికాసం, ఈమాట, జులై 2008.
  11. [మో-2] జెజ్జాల కృష్ణ మోహనరావు, శంకారాచార్యుల రచనలో ఛందస్సు వైభవం, ఈమాట, జులై 2007.
  12. [మో-3] జెజ్జాల కృష్ణ మోహనరావు, ఏనుగుల ఆటలా – నవరసాలకు బాటలా, ఈమాట, సెప్టెంబర్ 2006.
  13. [మో-4] జెజ్జాల కృష్ణ మోహనరావు, చంపకోత్పలమాలల కథ, ఈమాట, సెప్టెంబర్ 2007.
  14. [రా-1] మిరియాల రామకృష్ణ, శ్రీశ్రీ కవితావైభవం, యువభారతి, సికిందరాబాదు, 1981.
  15. [రా-2] మిరియాల రామకృష్ణ, శ్రీశ్రీ కవిత్వం, దుర్గా ప్రెస్, కాకినాడ, 1980. (ఇది కూడా చూడండి).
  16. [రు-1] కందుకూరి రుద్రకవి, జనార్దనాష్టకం, ఆరుద్ర పీఠిక, ఆనందమోహన కావ్యమాల, మదరాసు, 1960.
  17. [వా-1] ఎన్. వీ. క్రిష్ణ వారియర్‌, A History of Malayalam Metre, Dravidian Linguistics Association, Trivandrum, 1977.
  18. [వీ-1] గుంటూరు వీరరాఘవశాస్త్రి, పరిష్కర్త, శతకరత్నాకరము, ప్రథమ సంపుటము, గుండు సూర్యనారాయణ అండు సన్స్, బెజవాడ, 1930.
  19. [వే-1] వేమన పద్యములు, నేదునూరి గంగాధరం సంకలనం, సరస్వతీ పవర్ ప్రెస్, రాజమండ్రి, 1960.
  20. [శా-1] సుప్రభ, శారద యాహూ గుంపు,
  21. [శ్రీ-1] శ్రీరంగం శ్రీనివాసరావు, పాడవోయి భారతీయుడా, సినిమా పాటలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1995.
  22. [స-1] కోవెల సంపత్కుమారాచార్య, చేరాకు ఒక శతమానం, అభినవ ప్రచురణలు, హైదరాబాదు, 2003.
  23. [సీ-1] గిడుగు వేంకట సీతాపతి, తెలుగులో ఛందో రీతులు, విశాలా పబ్లికేషన్స్‌, హైదరాబాదు, 1961.
  24. [సు-1] రాయప్రోలు సుబ్బారావు, దూతమత్తేభము, తి. తి. దేవస్థానం ప్రెస్, తిరుపతి, 1959.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి:

జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు.

 ...