తారామతి బిరాదరి
పేరు తెలియని చెట్టు ఒకటి
వానకు తడుస్తూ నిలబడి ఉంది
దూరాన,ఎన్నడో మరణించిన
నాన్న గొంతు వినబడుతోంది
ఆదరా బాదరా ఓ యువతి
బిరాదరిలోకి పరిగెడుతోంది
ఎక్కడినించో తారామతి పాట
రెక్కలార్చుతూ వరండాలో వాలుతోంది
మబ్బు కొప్పులోంచి నీళ్ళ దండ
జారి చెట్ల కొమ్మల్లో చిక్కుకుంటోంది
గత రాత్రంతా నిద్రించని ఈ దేహాన్ని
అన్ని వైపుల నుండి ఏవో అదృశ్య హస్తాలు
ఊపేస్తున్నట్టుగా అనిపిస్తోంది
Hrk అభిప్రాయం:
September 1, 2008 9:50 pm
‘మబ్బు కొప్పు లోంచి నీళ్ల దండ/ జారి చెట్ల కొమ్మల్లో చిక్కుకుంటోది’ … ఊహ చాల చాల బాగుంది. మొత్తంగా పద్యం బాగుంది. …హెచ్చార్కె
నిషిగంధ అభిప్రాయం:
September 2, 2008 8:10 am
చాలా బావుందండి.. HRK గారికి నచ్చిన వాక్యాలే నాకూ బాగా నచ్చాయి!
కొత్తపాళీ అభిప్రాయం:
September 5, 2008 8:01 am
ఆసక్తికరంగా ఉంది.
మీరు ఇటీవల తారామతి బిరాదరి చూశారా?
ఈ పద్యంలో ఆవిష్కృతమైన పదచిత్రంలో నాకు ఆ బిరాదరి కనబడ్డం లేదు. అందుకే కొంచెం కుతూహలంగా ఉంది.
Indrani Palaparthy అభిప్రాయం:
September 9, 2008 9:05 pm
గత మూడేళ్ళుగా తారామతి బిరాదరిని ప్రతి రోజూ సందర్శిస్తూనే ఉన్నాను.
వర్షం కురిసిన ఓ సాయంకాలం బిరాదరిలో నాకు కలిగిన అనుభూతే ఈ కవిత.
పాలపర్తి ఇంద్రాణి.
jaabilli అభిప్రాయం:
September 15, 2008 10:06 am
ఈమాట సంచిక వెలువడగానే నేనాసక్తిగా వెదికి చదివేది మీ కవితే. మీరూహించే తీరు, దాని అభివ్యక్తి చాలా చాలా స్నిగ్ధంగానూ ముగ్ధంగానూ వుంటాయి. కవిత్వం ఒక కళ….కవిత్వం ఒక వరం … ఆ భగవంతుడు సదా మిమ్ములను ఆశీర్వదించును గాక!