ఈమాట » తెలుగు వార్తాపత్రికలు - ఒక ప్రసంగం

Expand to right
Expand to left

తెలుగు వార్తాపత్రికలు - ఒక ప్రసంగం


ఆకాశవాణి ప్రసంగం - విలేకరి గూడూరి నమశ్శివాయ
నిడివి: 10నిమిషాల 30క్షణాలు (1.89 Mb)

(సేకరణ: పరుచూరి శ్రీనివాస్)

 

(6 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. rama అభిప్రాయం:

    July 4, 2008 2:15 am

    శ్రీరంగం గోపాలరత్నం గారి గొంతుని వినే అవకాశం, పాత తెలుగు పత్రికలని గురించిన విలువైన సమాచారం అందించారు మీరు. చాలా సంతోషం శ్రీనివాస్ గారు. మీరు ఇటువంటి మరికొన్ని పాత విషయాలున్న ఎటువంటి వివరాలనైన ఇవ్వగలిగితే, పరిశోధకులకి వుపకారం జరుగుతుంది. అయితే పాత పత్రికలు ఇవాళ లభ్యం అవుతాయా అన్నది సందేహమే.

    బ్రౌన్ దొర గారు పత్రికని కూడా పెట్టి పండితుల చేత సాహిత్య సంగతులని మట్లాడించినట్లు నమశ్శివాయ గారి ప్రసంగం వలన తెలిసిన కొత్త విషయం. చాలా విలువైన సమాచారం ఉన్నది గూడూరి వారి ప్రసంగంలో.

    ఇవాళ సాహిత్యం కోసం పత్రికలు లేవు. పత్రికలలోని సాహిత్యపు పేజీలు తప్ప. కవులు, పండితులకి సాహిత్యం గురించి మాట్లాడుకుందికి ఒక స్థలం కావాలన్నా తపన ఎక్కడ లేదు ఇవ్వాళ. బాధగా అనిపించే వాస్తవం కదా ఇది.

    మంచి సమాచారాన్ని నలుగురితో పంచుకున్న మీకు నా కంగ్రాట్స్ చెపుతూ,

    రమ.

  2. పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    May 12, 2009 3:20 pm

    Thanks for the kind words. A few comments…

    బ్రౌన్ ఎలాంటి తెలుగు పత్రికనూ పెట్టలేదు/నడపలేదు. Madras Journal of Literary Studies (MJLS) అనే జర్నల్‌కు కొంతకాలం సంపాదకత్వం వహించాడు. కొన్ని సంచికలు కొద్దికాలంగా వెబ్‌లో లభ్యమవుతున్నాయి. అలాగే “పాత పత్రికలు ఇవాళ లభ్యం అవుతాయా అన్న” సందేహం అవసరం లేదు. ఉదాహరణకు నమశ్శివాయ గారి ప్రసంగంలో ప్రస్తావించిన చాలా, చాలా పత్రికలు హైదరాబాదులోనే దొరుకుతాయి. రాజమండ్రి, వేటపాలెం, కాకినాడలలో కూడా … చెదలు తింటాయనో, సరైన సంరక్షణ లేదనో కూడా భయపడనవసరంలేకుండా ఈ పత్రికలన్నీ - దొరికినంతవరకూ - డిజిటైజ్‌ చేయబడ్డాయి. ఇక భారతి, ఆంధ్రపత్రిక-ఉగాది, ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రికల సంచికలు లాంటివైతే చాలాకాలంగా వెబ్‌లో ఉన్నాయి. [ఒకవేళ తెలుగుదేశంలో దొరకకపోతే లండన్‌ బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీలోనో, Cambridge లోనో ప్రయత్నించవచ్చు. ఈ మధ్య అవసరమైతే వీరేశలింగం నడిపిన 1860లనాటి “హితవాది” సంచికలు తెప్పించుకోగలిగాను.]

    జర్నలిజం చరిత్రకొస్తే … మరీ విస్తృతమైన సాహిత్యం అయితే లేదు కానీ ఒక విధంగా పై ప్రసంగానికి మూలాధారాలు అనదగ్గ కొన్ని పుస్తకాలు, వ్యాసాలు చాలా తేలికగానే దొరుకుతాయి; “బ్రౌన్‌జాబులు తెలుగు జర్నలిజం చరిత్ర 1832 నుంచి 1857 దాక”, బంగోరె, 1973, నెల్లూరు; Studies in the history of Telugu journalism : presented to V. R. Narla on the occasion of his shashtyabdapurti, Kancherla Rama Seshagiri Rao, Delhi, 1968 (ముఖ్యంగా ఈ పుస్తకంలో ఆరుద్ర వ్యాసం); J. Natarajan, History of Indian Journalism, 1955; కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, పురాతనాంధ్ర వార్తాపత్రికలు, ఆంధ్రపత్రిక ఉగాది - రౌద్రి, 1920, ఇంకా నిడదవోలు వెంకటరావు, భారతి, మే 1929, …

    ఇలా చెప్పుకుంటూపోతే ఎంతైనా వుంది. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఆపేస్తాను. Personally I don’t believe in lamenting about the lack of (literary) space and resources. If one wants to pursue serious academic research in Telugu related matters (and publish it) there is always a way out. ఆ హోదాలో కాకపోయినా, సాహిత్యం గురించి మాట్లాడుకోవాలనే తపనతోనే కదా ఈమాట మొదలైంది? ఈమాటలో ఇప్పడికే లోతైన సాహిత్య చర్చని ప్రోత్సహించేవి కొన్నైనా వ్యాసాలున్నాయి. లేదూ ఒక కొత్త వ్యాసం వ్రాసి ప్రచురించగలిగినా సరే, ఉత్తమస్థాయిలో సాహిత్యచర్చకు తెరతీయవచ్చు. What we do with the space (limited may be) we have, is in our hands.

    Regards,
    Sreenivas

  3. M.S.Prasad అభిప్రాయం:

    May 13, 2009 9:54 pm

    పరుచూరి శ్రీనివాస్ గారికి,
    ప్రాచీనాంధ్ర సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాలు, సమీక్షలు కొన్ని డిజిటలైజ్ అయి వెబ్ లలో ఉపలభ్యమౌతాయని తెలుసుకుని చాలా ఆనందం కలిగింది. తిరుపతి వేంకట కవుల “నానా రాజ సందర్శనం” అనే పుస్తకం ఎక్కడైనా వెబ్ లో దొరుకుతుందా? దానిని సంపాదించడానికి నేనే విధంగా ప్రయత్నించాలసి వుంటుంది తెలుపగలరు. అలాగే వారికి కొప్పరపు కవులతోనూ, వేంకట పార్వతీశం కవులతోనూ జరిగిన సభా వివాదాల వివరాలను తెలిపే సాహిత్యంగురించి కూడా.

    ధన్యవాదాలతో

    భవదీయుడు

  4. పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    May 14, 2009 9:48 am

    ప్రసాద్-గారు,

    నానారాజసందర్శనము DLI లో ఇక్కడ దొరుకుతుంది.

    తి.వెం.కవుల పుస్తకాలు కొన్ని ఆర్కైవ్.ఆర్గ్ లో ఉన్నాయి. ఆ వెబ్‌ పేజీలోని అన్ని పుస్తకాలు వాళ్ళవి కావు అని గమనించగలరు.

    భవదీయుడు,
    శ్రీనివాస్

  5. M.S.Prasad అభిప్రాయం:

    May 14, 2009 11:51 pm

    శ్రీనివాస్ గారికి
    దశ సహస్ర శత కోటి ధన్యవాదాలు. ఆర్కైవ్ ఆర్గ్ లోపుస్తకాలు లభిస్తున్నాయి నా కిష్టమైన “శనిగ్రహం” పద్యాలు చదివాను. కానీ “నానా రాజ సందర్శనం” “ఇక్కడ” (మీరు పొందుపరచిన లింకులో) దొరకలేదు. తగిన కంప్యుటర్ పరిజ్ఞానం లేకపోవడమే కారణం. త్వరలో సాధించగలననుకొంటాను. లేదా డీ ఎల్ ఐ వారి సైట్ అడ్రస్ ద్వారా చిక్కించుకుంటాను.

    మరొక్కసారి ధన్యవాదాలతో

    భవదీయుడు

    [శ్రీనివాస్ గారికి “పన్ను” నొప్పి రాకుండా ఒక సహస్ర శత కోటి తగ్గిస్తే బాగుంటుందేమో :-) ]

  6. M.S.Prasad అభిప్రాయం:

    May 26, 2009 10:37 am

    శ్రీనివాస్ గారికి
    అనేకానేక నమస్కారలతో
    తిరుపతి వేంకటీయములైన వేరే పుస్తకాలు మీ సమాచారం వలన లభించినాయి కానీ “నానా రాజసందర్శనము” మాత్రము మీ లింకు ద్వారానూ DLI వద్దనుండి గానీ లభ్యం కాలేదు. మరొక్క మారు మీరు పంపగలరా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టుతున్నందుకు క్షమించండి.

    భవదీయుడు

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a