బంధుత్వం
దూరం వెళ్ళే కొద్దీ
దూరపు బంధుత్వాలు కూడా
దగ్గరగా తోస్తాయి
ఈ మహావృక్షంలో
ఏ పిల్లవేరు నీళ్ళులేక అల్లాడినా
నా కళ్ళల్లో నీళ్ళు నిలుస్తాయి
బాదరాయణ సంబంధాలు కూడా
ఈ పథ్యం నోటికి
పులపుల్లగా రుచి కలిగిస్తాయి
ఎవరెవరో విడిచిపెట్టారనిపిస్తుంది
ఆకాశంలో నెలవంక
రెక్కలు రెపరెపలాడిస్తూ కొంగలగుంపు ఎగిరిపోయాక
మిగిలిపోయిన కొంగలా కనిపిస్తుంది
కలుసుకోవాలనుంటుంది
రక్తనాళాల గజిబిజి దారుల్లో
తప్పిపోయిన ఒక రక్తపుబొట్టుని
తరాలుగా అందిన అంశలో
నూరోవంతైనా కలిసిన ఒక చేతిని
ప్రేమగా స్పృశించాలనుంటుంది
Subrahmanyam Mula అభిప్రాయం:
July 1, 2008 9:46 pm
చాలా బావుందండీ. పదచిత్రాలు చక్కగా కుదిరాయి.
Indrani Palaparthy అభిప్రాయం:
July 3, 2008 12:01 am
చాలా బాగుందీ కవిత.
S. Mallinath అభిప్రాయం:
July 3, 2008 1:02 am
వంశవృక్షం ఆధారంగా బంధుత్వ సంబంధాలను నెలకొల్పే Geni.com, Amiglia వంటి వెబ్ సైట్ లకు వాణిజ్య ప్రకటనగా వాడుకోగలిగేంత బాగుందీ కవిత.
baabjeelu అభిప్రాయం:
July 8, 2008 4:27 am
“కాబూలీ వాలా” లోని మన్నాదే పాట గుర్తొచ్చింది.
“మల్లినాథ్” గారి అభిప్రాయం అంత బాగుంది ఈ కవిత.
మంచి కవిత.
Surya అభిప్రాయం:
July 9, 2008 3:10 am
కవిత బాగుంది
A. Prasuna అభిప్రాయం:
August 13, 2008 6:22 am
చాలా బాగుంది. మా తాతయ్య గారే గుర్తొచ్చారు.