Comments on: అమ్మ

by: జె.యు.బి.వి. ప్రసాద్
నిన్న నా అనుభవం రాసే హడావుడీలో, రాద్దామనుకున్న కొన్ని పాయింట్లు మర్చిపోయాను. పొద్దున్న హైకింగు చేస్తూ వుంటే గుర్తొచ్చాయి.

పాము సంఘటన చాలా డ్రమెటిక్ గా వుండి, సహజత్వానికి దూరంగా వుంది. పాము వచ్చి పిల్లాడి మీదకి పాకింది. అప్పుడు అటు వేపు పోతున్న లలిత, “పాము, పాము” అని అరిచింది. ఆ చప్పుళ్ళకి పాము దడుచుకుని, పిల్లాడిని కరవడమో, లేక పారిపోవడమో చేస్తుంది. అదీ పిల్లాడు పడుకున్నది ఓ మూల నున్న గదిలో కాదు. అందరూ అటూ, ఇటూ తిరుగుతూ వుండే హాల్లో. ఇంట్లో బారసాల జరుగుతోంది. అంత హడావుడిగా వుండే ఇంట్లోకి పామెలా వచ్చిందో! వచ్చిందే అనుకోండీ, లలిత అరవగానే, “హన్నా, నా మీదే అరుస్తావా” అని చెప్పి, ఆ పామెళ్ళి ఆమెని కరిచింది. ఎక్కడో సహజత్వం లోపించింది ఈ వివరాలలో.

ఒక్కోసారి చిన్నప్పుడు జరిగినవి మనకి పూర్తిగా గుర్తుండవు. కానీ ఆ తరవాత కాలంలో చుట్టూ వున్న పెద్దాళ్ళు ఆ విషయాలు మాట్టాడుకున్నప్పుడు, ఓ జ్ఞాపకం మన మెదడులో చోటు చేసుకుంటుంది. వయసు పెరిగే కొద్దీ, ఆ జ్ఞాపకం మన సొంత అనుభవమే అని అనుకుంటాము. అలా జరిగి వుండదు అని ఎవరన్నా అన్నా మనం నమ్మం. వేరే వాళ్ళు మాట్టాడుకున్నప్పుడు, విషయాలు కొన్ని కొంత రూపాంతరం చెందుతాయి. లేని వివరాలు వస్తాయి. కానీ అది ఆ పిల్లాడి సొంత అనుభవమై కూర్చుంటుంది.

ఆ తరవాత, చెల్లాయినో, తమ్ముడినో తీసుకురావడానికి ఆస్పత్రి తీసుకెళ్ళే వాళ్ళు, పాము కరిచినా ఆస్పత్రికి తీసుకెళ్ళరు. పైపెచ్చు మంత్రగాడిని పిలుస్తారు. తరవాత ఓ డాక్టరుని కూడా పిలుస్తారు. మంత్రగాడు మంత్రం అన్నా వేస్తాడు, ఆ డాక్టరు మాత్రం ఏమీ చెయ్యడు, పాము చరిత్ర అడగడం తప్ప. కరిచిన పాము విష పూరితమైంది అయివుండదు. లలితకేమీ కాలేదు. కానీ, లలిత భరించ లేనంత మంచితనంతో, “మంచి కాలం, నన్ను కరిచింది. చంద్రంను కరిచి ఉంటే” అని అంటుంది. “అమ్మయ్య, పిల్లాడిని కరవలేదు” అని తల్లి సంతోషిస్తే చక్కగా వుంటుంది. పాము వచ్చింది కాబట్టి, ఎవర్నో ఒకర్ని కరవాలి కాబట్టి, పిల్లాడి బదులు నన్ను కరిచింది అని అనడం గానీ, అనుకోవడం గానీ అసహజంగా వుంది.

ఈ సంఘటనలో లోపించిన సహజత్వం, లలిత లోని ఉత్తమ గుణాల విలువని తగ్గించదు.

అంత ప్రేమగా పెంచిన తల్లిని కూడా వదిలి, “నేను” పాత్ర అమెరికాలో సెటిలవుతుంది. మామూలు ప్రేమల విషయాల గురించి కాదు మాట్టాడేది. అంత అద్భుతమైన ప్రేమ దొరికితే ఎలా వదిలి పోగలుగుతారా అన్నది పాయింటు.

అలాగే పెళ్ళికి చెప్పిన ఒకే ఒక్క కారణం మన్మధుడు విసిరిన పుష్ప బాణాలు. పెళ్ళికి అవి అవసరమే గానీ, వాటి వల్లే పెళ్ళి అనుకుంటే ఎలా? సాధారణంగా పెళ్ళి అంటే, మనుషులకి మన్మధుడు గుర్తొస్తాడు గానీ, కంపాటిబిలిటీ గుర్తు రాదు.

మొత్తానికి మనుషుల్లో మంచితనాన్ని చూపించే కధ.

- ప్రసాద్

by: Srinivas
కధ బావుంది.  కథా లేక నిజమేనా?

by: జె.యు.బి.వి. ప్రసాద్
బాగానే వుంది కధ. ఇది చదువుతుంటే, చిన్నప్పటి విషయం ఒకటి గుర్తొచ్చింది.

ఆరవ తరగతి చదివే రోజుల్లో, ఒక రోజు స్కూలి నించి ఇంటికి వస్తున్నాను. మా సందులో సగం దూరం వచ్చే సరికి, తెలిసున్న వాళ్ళింటి దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది. ఆ ఇంటి వాళ్ళబ్బాయి మా క్లాసుమేటే. వాడేదో తుంటరి పని చేశాడని, వాళ్ళ ఎదురింటి వాళ్ళు వాళ్ళింటి మీదకి గొడవకి వచ్చారు. మా క్లాసుమేట్ వాళ్ళమ్మ ఆ ఎదురింటి వాళ్ళతో శివంగిలాగా, హోరాహోరీగా పోట్టాడుతోంది కొడుకుని వెనకేసుకుని. అక్కడ మూగిన జనానికి కాస్సేపట్లోనే తెలిసింది తుంటరి పని చేసింది మా క్లాసుమేటని. అయినా సరే, వాళ్ళమ్మ తగ్గకుండా వాళ్ళతో పోట్టాడి, తన కొడుకుని లోపలకి తీసుకుని వెళ్ళింది. ఆ రోజు ఇంటికి వెళ్ళాక, ఏదో చేశానని మా అమ్మ నన్ను తిట్టింది. అప్పుడు నేను, “ఫలానా వాళ్ళమ్మ చూడు, వాడు తప్పు చేసినా వాడిని వెనకేసుకొచ్చి, అందరితోనూ దెబ్బలాడింది. నువ్వేమో నేను చేసిన చిన్న తప్పుకే, సవతి తల్లిలా తిడుతున్నావు. నాకెన్ని కష్టాలో బాబూ!” అంటూ వాపోయాను.సినిమాల ప్రభావం ఎక్కువగా వుండేది నా మీద ఆ రోజుల్లో. మా అమ్మ నవ్వి, “వెదవా! వెధవ సినిమా వాగుళ్ళు నేర్చావు. అయినా ఆవిడ మీ క్లాస్ మేట్ సొంత తల్లి కాదు. సవతి తల్లి. నేను నిజంగా నీకు సొంత తల్లిని” అంది. ఆశ్చర్యపోయాను. అంత మంచి సవతి తల్లులుంటారని ఎప్పుడూ ఎరగను. అప్పటి నించీ, వాళ్ళింటి ముందు నించీ వెళ్ళేటప్పుడు, ఆవిడని చాలా కుతూహలంగా పరిశీలిస్తూ వుండేవాడిని. అన్ని విషయాల్లోనూ అందరి లాగానే వుండేదావిడ. దీనికి వ్యతిరేకంగ మా ఇంటి ఎదురింటావిడ, వాళ్ళ సొంత పిల్లలు ఏ తప్పూ చెయ్యకపోయినా, ఎవరన్నా వచ్చి, వాళ్ళ పిల్లల మీద ఏమన్నా కాస్త చెడుగా అంటే, తన పిల్లల్ని అక్కడే వాళ్ళ ఎదురుగానే చావబాదేది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఈ లలిత లాంటి వాళ్ళకి అంత సంస్కారం, మంచితనం ఎక్కడ నించీ అలవడ్డాయా అని. సవతి తల్లులు చెడ్డగా వుంటే, చాలా సులభంగా అర్థం అయిపోతుంది సంగతి. వారు చాలా మంచిగా వున్నారంటే, వారి వెనుక నున్న చరిత్ర తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంది. ఈ కధలో రచయిత్రి లలిత అంత వున్నతంగా ప్రవర్తించడానికి కారణాలు ఏమన్నా చెప్పి వుంటే బాగుణ్ణనిపించింది. చిన్నప్పటి నించీ చదువుతున్న ఉత్తమ సాహిత్యమా, ఇంట్లోని ప్రేమతో కూడిన వాతావరణమా, మరేమన్నానా అని ఆలోచించాలి.

కధ చాలా పాజిటివ్ గా వుంది.

- ప్రసాద్