Comments on: ఒంటరి గృహిణి - “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా
by: B.AJAY PRASAD
లక్ష్మన్నగారూ మీరు రాసిన వ్యాసం చాలా బాగుంది. చారులత నాకు ఇష్టమైన సినిమాలలో ఒకటి. ముఖ్యంగా చారులత (మాధవి ముఖర్జి ) కవిత రాస్తున్నప్పుడు ఆమె కంటిపాపలో కనిపించే పడవ, ఆ వెంటనే కొలిమి అదొక ఎన్నటికీ మరచిపోలేని దృశ్యం. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
అభినందనలతో..
బి.అజయ్ ప్రసాద్
by: భాను ప్రకాశ్ శిరిగిరి
చారులత పాత్రని చాలా బాగా చూపించారు. మీ విశ్లేషణ ఆకట్టుకొంది. మీకు ధన్యవాదములు.
by: విష్ణుభొట్ల లక్ష్మన్న
రాజేంద్ర గారికి, మోహన రావు గారికి:
నా వ్యాసం నచ్చినందుకు సంతోషం.
మోహనరావు గారిచ్చిన లింకులు ఈ వ్యాసాన్ని చదివే వారికి సహయపడతాయి. అమి చినిగొ, చినితొ పాట ఆడియోలోనే కాక వీడియోగా ఇవ్వటం బాగుంది. నటి మాధవి ఈ పాటకి స్పందనతో అమల్ పాత్రపై తనకున్న ఇష్టాన్ని చక్కగా చూపించింది.
రాయ్ సినిమాల్లో పాటకి ప్లేబాక్ సింగరుగా కిషోర్ కుమార్ ని వాడుకోటం ఇదే మొదలు, చివర అనుకుంటా.
ఈ లింకులు ఇచ్చి మోహనరావు గారు మంచి పని చేసారు.
లక్ష్మన్న
by: mOhana
చారులతను గురించి చక్కగా రాసిన రచయితకు అభినందనలు, ధన్యవాదాలు. నాకు నచ్చిన చలనచిత్రాలలో చారులత ఒకటి. ఈ కథను చిత్రం చూడడానికి ముందే కన్నడములో చదివాను. ఇది ఒక పెద్ద కథ లేక నవలిక. కొద్దిగా రవీంద్రుని జీవితంలోని సంఘటనలపైన ఆధారపడిందే. చారులతలాగే కాదంబరీదేవికి కూడా బంకించంద్రునిపై మక్కువ ఎక్కువ. చారులత బొంకిం, బొంకిం అని పాటలా కూడా పాడుతుంది ఈ చిత్రంలో. కాదంబరీదేవికి రవీంద్రుని ముద్దు పేరు హెకేట్ (ఒక నిగూఢ దేవత). ఆమె రవీంద్రుని భాను అని పిలిచేది. తన మొదటి రచనలను రవీంద్రుడు భానుసింహుని పేరుతో రాశాడు. చిత్రంలోని ముగింపు కథకు విరుద్ధమైనది. కథలో భూపతి మైసూరికి వెళ్తాడు. నేను కూడా రావచ్చా అని చారు అడిగితే మాట్లాడ లేదు భూపతి. ఆమె సరే ఇలాగే ఉండనీ అంటుంది. కానీ చిత్రం ఫ్రీజ్ షాట్తో సందిగ్ధంగా అంతమవుతుంది. భారతీయ చిత్రసీమలో ఇదే మొదటి ఫ్రీజ్ షాట్ అట. ఇందులో అమల్ చారుల మధ్య ఆకర్షణ క్రమేణా వస్తుంది. అతని చనువు, భర్త అశ్రద్ధ, ఆమె ఒంటరిదనం దీనికి దారి తీసింది. భర్తకు చివర తాను అశ్రద్ధ చేశాననే పశ్చాత్తాపం, అమల్కు హద్దు మీరరాదనే భావం, కాని ఆమెకు ఇట్టివి ఏమీ లేదు. అందువల్ల ఆమె చివర రాజీ పడటానికి సంసిద్ధురాలైంది. రాయ్ గారు ఇందులో మొట్ట మొదట నేపథ్య గాయకుని ఉపయోగించారు. కిశోర్ కుమార్ గంగూలీ పాడిన ఆమి చినిగొ చిని తుమారే ఆ పాట. దీనికి బ్యాక్ గ్రవుండ్ మ్యూసిక్ కూడా ఉంది. సామాన్యంగా రాయ్ గారి చిత్రాలలో ఇది అరుదు. ఆ పాటను ఇక్కడ చూచి, విని ఆనందించగలరు -
http://www.chakpak.com/video/ami-chini-go-chini—charulatha/25532
ఆ పాట, అదే మెట్టులో దానికి నా తెలుగు భావానువాదం కింద -
ఆమి చిని గొ చిని తొమారే, ఓగొ బిదేశినీ
తుమి థాకొ సింధు పారే, ఓగొ బిదేశినీ
నిను తెలుసు తెలుసు నాకు ఒహో విదేశినీ
ఆ సంద్ర మావ లున్న నిన్నో విదేశినీ
తొమాయ్ దేఖేచి శారద ప్రాతే
తొమాయ్ దేఖేచి మాధవి రాతే
తొమాయ్ దేఖేచి
హృది మాఝారే, ఓగొ బిదేశినీ
నిను జూచేను శారద వేళ
నిను జూచేను ఆమని రేయి
నిను జూచేను
హృది లోలోన, ఒహో విదేశినీ
ఆమి ఆకాశే పాతియ కాన్
సూనేచి సూనేచి తొమారే గాన్
ఆమి తొమారే సోంపేచి ప్రాణ్, ఓగొ బిదేశినీ
నే నాకాశ మంత చెవులై
విన్నాను విన్నాను త్వదీయ గీతి
నే నిచ్చేను ప్రాణమ్ము నీకు, ఒహో విదేశినీ
భూబన భ్రొమియ శేషే
ఆమి ఏసేచి నూతన దేశే
ఆమి అతిథి తొమారి ద్వారే, ఓగొ బిదేశినీ
భువన మెల్ల వెదకి
నిను గంటి క్రొత్త చోట
నే నతిథి నీ గృహాన, ఒహో విదేశినీ
ఈ పాటను 1895లో కవిగారు రాశారట. దీని తన స్వంత అనువాదాన్ని ఆర్జెంటీనాకు చెందిన విక్టోరియా ఒకాంపోకు ఆ దేశాన్ని సందర్శించినప్పుడు కవిగారు ఇచ్చారట. ఆమెయే టాగూరు విదేశిని! చిత్రంలో ఈ పాట చివర అమల్ బౌ ఠాకూరాణీ అని తన వదినగారిని ఉద్దేశించి అంటాడు.
చారులతను గురించి రాయ్ గారి కుమారుడు సందీప్ చెప్పినవి కింది లింకులో రొష్మీలా భట్టాచార్య రచనలో చదువగలరు -
http://www.screenindia.com/old/fullstory.php?content_id=15822
ఇందులోని మిగిలిన పాటలు ఎలా ధ్వనిస్తాయో అని మీకు ఆసక్తి
ఉంటే కింది లింకులలో వినవచ్చు -
ఫూలే, ఫూలే ఢోలే ఢోలే - ఇక్కడ
ఈ ఫూలే ఫూలే పాట ఛాయలు ఈ మధ్య వచ్చిన పరిణీత చిత్రంలోని పీయూ బోలే, జియా డోలే అనే పాటలో ఉన్నవి అని గమనించగలరు.
- మోహన
by: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ఆంధ్రవిశ్వవిద్యాలయములో నేను యం.యే ఫిలాసఫీ చేసినప్పుడు నా మిత్రులు ఎక్కువగా ఆంగ్లసాహిత్యవిధ్యార్ధులు ఉండేవారు.వాళ్ళంతా ఇంగ్లీషు సాహిత్యం తెగ చదివేస్తున్నారని నేను ఓ తెగ ఇదై పోయేవాడిని.చదవాలి,కానీ అంత సామర్ధ్యం లేదు ఇలా సతమవుతూ ఉండగా నాకొక రహస్యం తెలిసింది,దానితో వారి సిలబస్ దాదాపుగా స్పెషలైజేషన్ల తోసహా చదివి అవతపడేసా.అదే పారా ఫ్రేజ్ గైడ్లు.శామ్యూల్ జాన్సన్ రచించిన “introduction to shakespear” మామూలుగా ఐతే నా జీవితకాలంలో చదవగలిగేవాడిని కాను,కానీ ఆ గైడు పుస్తకాల పుణ్యమాఅని ఆ మహానుభావుల గురించి కాస్త తెలుసుకోగలిగాను.
సత్యజిత్ రాయ్ (రే కాదు రాయ్ అనాలని ఈ మధ్య రోహిణీప్రసాద్ గారు చెప్పారు) అలాగే, సినిమాల్లో చారులత సినిమాలోని సున్నితమైన మానసిక విశ్లేషణను,పాత్రల మధ్య అంతర్గత సంఘర్షణలను ఏనాటికైనా అర్ధం చేసుకోవటం నావల్ల అవుతుందా అని బుర్రబద్దలు కొట్టుకుని కొన్నాళ్ళయ్యాక మానేసాను.కానీ తలవని తలంపుగా మీ వ్యాసం నా అజ్ఞానతిమిరం మీద సన్నని వెలుగురేఖలు దోసిళ్ళతో విరజిమ్మింది,ఇది చదివి కూడా తెలుసుకోలేకపొతే సత్యజిత్ రాయ్ సినిమాలు చూడటం,చదవటం,మాట్లాడటం,రాయటం చేస్తే రౌరవాది  మహానరకప్రాప్తి  ఏమో గానీ సగటు సినిమా అభిమాని అని చెప్పుకోవటం కూడా నేరం కింద పరిగణించాలి.