Comments on: లింకన్ తో ఓ రాత్రి

by: Lavanya
కథ బాగుంది. సౌమ్య గారికి అబినందనలు.

by: Nanduri Venkata Subbarao
సౌమ్య గారికి అభినందనలు. కథనం బాగుంది. కానీ చెప్పదల్చుకున్న అంశంలో స్పష్టత లేదు. ( ఏమీ చెప్పదల్చుకోలేదని మీరు అంటున్నారు కానీ ఇది స్వగతం కాదు కదా, పాఠకుల కోసం వ్రాసిన కథ. దయ్యాలకు భయపడి దేవుడున్నాడని ఒప్పుకోవడం వాస్తవానికి దగ్గరగా ఉండటం నిజమే. కానీ లింకన్ దయ్యమే ఎందుకు కనబడింది, కనబడినా ఎందుకు కోపగించుకుంది? వీటి వెనుక తర్కం లేదు. హాస్య కథ విజయవంతమ్ కావాలన్నా తర్కం ఉండాల్సిందే. మీకున్న లకథన శక్తికి మరింత కసరత్తు చేస్టే పది రోజులపాటు గుర్తుండే కథ వ్రాయగలిగేవారని నా విశ్వాసం.

by: B.Srikanth
కధ బాగుంది. సరదాగా ఉంది.

by: రవికిరణ్ తిమ్మిరెడ్డి
సౌమ్య గారికి,

ఎంత సెక్సిస్టు ఆలోచన సరళి నుంచి తప్పుకున్నావని అనుకున్నా, తెలీకుండానే ఏ హానీలేదనిపించే, అమాయకవైన పద ప్రయోగంతో బయటపడే మురికిని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. నేను కూడా మాలతి గారికి జవాబిస్తూ రచయిత్రి బదులు రచయిత పదం వాదటం జరిగింది. రచయిత(త్రి) అనే పద ప్రయోగం కాకుండా లింగబేధం సూచించని తెలుగు పదం ఎవరన్నా సూచిస్తే బాగుండు రచయిత(త్రి) బదులు.

[ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఫెమినిస్టుల ఉద్యమాల కారణంగానే ఇంగ్లీషులో authoress, actress, waitress, stewardess వంటి పదాల వాడుక దాదాపు కనుమరుగైపోయింది. రచయిత అన్న పదాన్ని లింగరహిత (gender neutral) నామవాచకంగా ప్రయోగించడం తెలుగులో  కొంత కాలం నుంచే ఉందన్న అభిప్రాయం తోనే, ఈమాటలో కూడ రచయిత్రికి బదులుగా రచయిత అన్న పదాన్ని ఈ మధ్య కాలంలో వాడుతూ వచ్చాము. - సంపాదకులు]

by: Sowmya
@praveen: నేను రచయిత్రిని. రచయితను కాను :).

లింకన్ నే ఎందుకు పెట్టాను? ఇంకెవరినన్నా పెట్టుండొచ్చు. నిజమే. కానీ, ముందే చెప్పినట్లు, లింకన్ ఆత్మ గురించి ప్రచారంలో ఉన్న కథలే ఈ కథకి inspiration. కనుక నేను ఇంకోళ్ళని పెట్టుకోలేను. ఇది లింకన్ ని కించపరచడం కాదు అని మరోసారి మనవి చేసుకుంటున్నా.

by: ప్రవీణ్ గార్లపాటి
పైన జరిగిన చర్చ చాలా రసవత్తరంగా బాగుంది.

నా వరకూ కథ పెద్దగా నచ్చలేదు. ఇందులో హాస్యం పాళ్ళ కోసం రాసానని రచయిత చెప్పినా కథలో ఆ పాళ్ళు పెద్దగా లేవనే నాకనిపించింది. కథనం నడిపిన విధానం బాగానే ఉంది.

అన్నిటికన్నా నాకు నచ్చనిది లింకన్ పాత్రనే దెయ్యం గా ఎంచుకోవడం ఎందుకు ? ఆ పాత్రకి సంబంధించిన సంభాషణ జరగలేదు. అంటే లింకన్ కి సంబంధించి జరిగిన చర్చ ఏదీ లేదు కథలో. ఆ పాత్రని దేనితో మార్చినా కథ అలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఒక ప్రముఖ కారెక్టరుని ఉపయోగించడం అనవసరం.

ఇక రచయితలు విమర్శలని స్వీకరించే విధానంలో మార్పు రావాలనే నా ఉద్దేశం కూడా. విమర్శ మంచిది అనిపిస్తే దానిని స్వీకరించి తమ రచనా విధానంలో మార్పులు చేసుకోవచ్చు. అలా కాక నే ఆలోచించిన విధానంలోనే పాఠకులు కూడా ఆలోచించాలి అనుకుంటే వారికే నష్టం. విమర్శలో పస లేకపోతే దానిని దాని మానాన వదిలెయ్యవచ్చు.

by: రవికిరణ్ తిమ్మిరెడ్డి
మాలతి గారు,

ఎవరో కొందరు పాఠకులు పైమెట్టు మీద వున్నావని అనుకున్నందు వలన రచయితకి నష్టవేవిటండి? ఏ మెట్టుమీదున్నా విమర్శని తీసుకోవటం, తిరస్కరించటం రచయిత ఇష్టాఇష్టాలే కదా. రచయిత పైమెట్టు మీదున్నానని అనుకోకపోతే చాలు (అనుకుంటే రచయితకే నష్టం).

“ఈమధ్య కొందరు పాఠకులు తమ ఆలోచనాసరళికి ఏమాత్రం భిన్నంగా వున్నకథ అయినా, దాన్ని పీకి పాకాన పెడుతున్నారు.” ఆ పాకం పాఠకుల హక్కు. పాకం బాగుంటే మరింత రుచిచూడండి, లేదనుకుంటే రుచిచూడకండి. ఎందుకు బాగలేదో చెప్పండి. కానీ పాకం బాగలేదని నిష్టూరపోతే ఎలా మాలతి గారు.

by: Sai Brahmanandam Gorti
మాలతి గారూ,

మొదటిగా -

ఏ పత్రికకయినా వారి వారి అభిరుచుల్ని బట్టి కొన్ని నియమాలుంటాయి. ప్రమాణాలు ఉండచ్చు. దాన్ని బట్టే ఆ పత్రిక నాణ్యత ఉంటుంది. కాబట్టి కథల ఎంపిక విషయంలో అది వారిష్టం. ఒక పత్రిక తిరిగి పంపిన కథకి, ఇంకో పత్రిక బహుమతి ఇవ్వచ్చు. కథలని ప్రచురణకి ముందు, సమీక్ష చేయడం ఈమాట వారి ప్రమాణం కావచ్చు.  ఇదికూడా ఆయా సమీక్షకుల అభిరుచిని బట్టీ, వారు వెలుబుచ్చే అభిప్రాయాలబట్టీ ఉంటుంది. ఒక్కోసారి సమీక్షకులు బాగా చేయచ్చు. లేదా బాగోలేదనీ సంపాదకులకు చెప్పచ్చు. ప్రచురణ విషయంలో  అక్కడ సంపాదకుల విచక్షణకి ఆయా రచన పరిమితం అవుతుంది.  కాబట్టి ఇవి నచ్చినప్పుడే రచయితలూ రాయడం జరుగుతుంది.  మీరు రాసివ్వండి, మేము కళ్ళు మూసుకొని వేసేస్తాం అన్న ధోరణి తో అనేక పత్రికలు నడుస్తున్నాయి.  ప్రమాణాలు ఎప్పుడూ సాపేక్షమే!

ఇహ రెండోది.

“అంటే ఆ రచన కనీసం ఒక రేటింగుకి నోచుకున్నట్టే.. రచయితలనుండీ పాఠకులు సహృదయత ఆశించడం ఎంత న్యాయమో, పాఠకులనుండీ రచయితలు కూడా అలాటి సహృదయతనే ఆశిస్తారు.” అన్న విషయంతో నేను ఏకభవించను.  ఒక రచయిత తన రచనని ప్రజల ముందు వదిలాక అది బాగుందీ, బాగోలేదూ అన్నది పాఠకుల అభీష్టం. రచయితకెలా రాసే హక్కు ఉందో,  పాఠకులకీ విమర్శించే హక్కు ఉంది.  ఇక్కడ సహృదయత ఆశంచడం ఎంత వరకు సబబు? రాసిన ప్రతీ రచన్నీ మెచ్చుకోవాలని ఆశించడం సహృదయతా? లేక నొప్పించకుండా పరవాలేదు అని చెప్పడం సహృయదతా?

అందరికీ అన్నీ నచ్చాలని లేదు. విషయ పరంగా నచ్చకపోయినా వస్తుపరంగా విమర్శ ఉంటే అది స్వీకరించడానికి రచయితలు సిద్ధంగా ఉండరు అన్నదే నా పాయింటు.

వెబ్ లో అనేక పత్రికలున్నాయి. ఎన్ని పత్రికలు ఇలా చర్చలకి ఆహ్వానం పలుకుతున్నాయి? ఈ మాట సంపాదక వర్గమూ కొన్ని అభిప్రాయాలని కత్తిరించిన సందర్భాలున్నాయి.  కాదనను. ఇదీ విమర్శకులూ, రచయితలూ హద్దు మీరినప్పుడే!  కొన్ని పత్రికలయితే కేవలం “ఆహా, ఓహో” అనే పొగడ్తలనే రాస్తాయి. తెగడ్తలని తుంచి పారేస్తాయి. ఇండియాలో పత్రికలయితే సరేసరి.  స్థలా భావం సాకు ఎలాగూ ఉంది.

కాకపోతే మనకి అమెరికన్లలాగ నొప్పించకుండా చెప్పడం రాదు.  చెత్త ప్రశ్నని కూడా “చాలా మంచి ప్రశ్న” అని మొదలెట్టి, చివరికి చెత్తలో చేర్చడం మనకలవాటులేదని నా అభిప్రాయం.

చివరగా, ఒక్కసారి ఈ అభిప్రాయాల శీర్షిక లేదనుకోండి.  మనం ఇలా ఇన్ స్టంట్ గా చర్చించుకునే వాళ్ళమా, చెప్పండి?

by: కొడవళ్ళ హనుమంతరావు
“తెలుగు సంగతులు”

మాలతి గారూ,

మీరు బూదరాజు రాధాకృష్ణ గారి వాక్యాలు అర్థం కాలేదన్నారు. సందర్భం అవసరం కావచ్చు. ఆ వ్యాసం అందుబాటులో  ఉన్న “తెలుగు సంగతులు” అన్న పుస్తకంలో ఉంది. ఆయన రచనలన్నీ చదవదగ్గవి.

కొడవళ్ళ హనుమంతరావు

by: malathi
హనుమంతరావు గారూ, నాకు రాధాకృష్ణగారి వ్యాక్యాలు అర్థం కాలేదు కానీ, మీరు చెప్పింది - రచయితలు పాఠకులవిమర్శలని సహృదయతతో స్వీకరించి ఆలోచించుకోవావి అన్నది అర్థం అయింది. ఒప్పుకుంటాను. రచయితలందరితరఫునా నేను వాదించడంలేదు కానీ, నామటుకు నేను నారచయితమిత్రులతో సంప్రదించి మార్పులు చేసుకున్న సందర్బాలున్నాయి.

బ్రహ్మానందం గారు వెలిబుచ్చిన రెండు అభిప్రాయాలు - రచయితలు తామేదో పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారు అనీ, ఈమాటవారు తమకి వచ్చిన విమర్శనలన్నిటినీ నిష్పక్షపాతంగా ప్రచురిస్తున్నారు అనీ.

ఈమాట వారు విమర్శలని ప్రచురిస్తారు కానీ కథలకి అలా కాదు. తమ కొలమానాలకి నప్పితేనే వేసుకుంటారు. అంటే ఆ రచన కనీసం ఒక రేటింగుకి నోచుకున్నట్టే.. రచయితలనుండీ పాఠకులు సహృదయత ఆశించడం ఎంత న్యాయమో, పాఠకులనుండీ రచయితలు కూడా అలాటి సహృదయతనే ఆశిస్తారు.

ఇలాటికథలు రాయకండి అని రచయితలకీ, ఇలాటివి వేసుకోకండి అని సంపాదకులకీ చెప్పడం సమంజసమే అనుకునే పాఠకులు తాము పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారేమోనని అనుకోడానికి అవకాశం వుంది కదా,

by: Sowmya
బ్రహ్మానందం గారు:

“ఇది తెలుగు సాహిత్యానికి పట్టిన దౌర్భాగ్యం.”

తెలుగు సాహిత్యానికి మాత్రమే నంటారా?

నాకు అది ఎక్కడన్నా కనిపించే సహజ గుణమేమో అని అనుమానం.

by: Sai Brahamanandam Gorti
సౌమ్య గారూ,

కాకి పిల్ల కాకికి ముద్దు అన్న చందంగా ఎవరి రచన వారికి బాగుంటుంది. బాగోలేదనే సరికే అసలు గొడవ ప్రారంభం అవుతుంది. అన్నవాళ్ళని తక్కువగా చూడ్డం, మీరు చెప్పినట్లు అభిమానులు గుడ్డిగా వంత పాడ్డం ఇవన్నీ తెలుగు సాహిత్యానికి మంచిని చేయలేవు.  విమర్శకీ, కువిమర్శకీ తేడా తెలియని రచయితలే ఎక్కువ. మంచి విమర్శ వల్ల కొత్త విషయాలూ, కనిపించని కోణాలూ వెలుగులోకి వస్తాయన్న అవగాహన రచయితల్లో కొరవడింది. ఇది తెలుగు సాహిత్యానికి పట్టిన దౌర్భాగ్యం. ఏం చేస్తాం? ఇది మాత్రం మింగుడుపడని వాస్తవం.

చాలా పత్రికలు బాగోలేదని విమర్శ  రాసినా వేయవు. ఈ విషయంలో ఈమాట ఒక్కటే మినహాయింపు.

-సాయి బ్రహ్మానందం గొర్తి

by: V.B.Sowmya
అజయ్ గారికి & వినీల్ గారికి:

రాయ్ కథలు చదివిన మీ నుండి వచ్చిన వ్యాఖ్యలు నాకు విలువైనవి. ధన్యవాదాలు.

బ్రహ్మానందం గారికి:

మీరన్నది కొంతవరకు నిజం, నా దృష్టిలో. మిగితా సగం, రచయితలే కాదు, రచయితల అభిమానులు కూడా కారణం :). తమ అభిమాన రచయిత ని విమర్శిస్తే తట్టుకోలేనంత అభిమానం ఉన్న అభిమానులు :).

by: Sai Brahmanandam Gorti
“తెలుగులో సాహిత్య విమర్శ”

హనుమంత రావు గారూ, మీరు అనుకున్నట్లుగా చాలామంది రచయితలుండరు.  వ్యక్తులకీ, వస్తువుకీ తేడా తెలియదు చాలామందికి.  కథ బాగుందని రాసారా, సంతోషిస్తారు, మంచి పాఠకులుగా దండేస్తారు. కాస్త ఏదయినా వాస్తవానికి దూరంగా అనిపించిందా, రచయితలు ఒప్పుకోడానికి సిద్ధంగా ఉండరు.  విమర్శించే వాళ్ళ దాంట్లో విషయం ఉన్నా, రాసేవాళ్ళ అహం ఒప్పుకోదు. ఒక కథ అందరికీ ఆమోద యోగ్యంగా రాయాలనేం లేదు.  చిన్న చిన్న విమర్శలు పరవాలేదు చాలా మందికి.  కాస్త ఘాటుగా రాస్తే, విమర్శ పై విమర్శ దారితప్పి, వ్యక్తిగతం అయ్యే ప్రమాదం ఉంది.  మరీ గట్టిగా గదమాయిస్తే, మేం మామూలు పాఠకులకోసం రాసామంటూ చర్చనుండి తప్పిస్తారు. తెలుగు సాహిత్యంలో విమర్శ ఎదగకపోవడానికి రచయితలే ముఖ్య కారణం. పొగడ్తలు ఇచ్చే వాళ్ళు మిత్రులూ, విమర్శకులు శత్రువులుగా పరిగణించడం సర్వ సాధారణం. రాసేవాళ్ళు ఎప్పుడూ పైనే ఉంటారు, చదివేవాళ్ళు క్రిందనే ఉంటారు అన్న భావన చాలా మందికుంటుంది. రాసేవాళ్ళు తమ తప్పులు ఒప్పుకోరు. అంగీకరించినా, లేకపోయినా ఇది మాత్రం వాస్తవం.

ఈ కథపై వచ్చిన చర్చ బాగుంది. దీని వల్ల రాసేవాళ్ళకీ, చదివే వాళ్ళకీ ఉపయోగమే!

- సాయి బ్రహ్మానందం గొర్తి

by: B.AJAY PRASAD
సౌమ్యగారూ.. మీరు రాసిన కథ బాగుంది. పై విమర్శలలో సహేతుకమైన వాటిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని మంచి కథలు రాయండి.

సత్యజిత్ రాయ్ రాసిన “టాడ్ పోల్ గుడ్డు” కథ నాకు చాలా ఇష్టం.  అసంఖ్యాకమైన రాయ్ అభిమానుల్లో నేనూ ఒకడిని.

అభినందనలతో..

బి.అజయ్ ప్రసాద్

by: వినీల్
సౌమ్య గారు, నేను సత్యజిత్ రాయ్ కథలు చదివి కనీసం పదేళ్ళయింది. కొన్ని ఇప్పటికీ గుర్తున్నాయి. మీ కథ కూడా ఇంచుమించు అలాగే ఉంది. అభినందనలు.

by: rajasankar kasinadhuni
ఈ చర్చలవలన నాకు కొత్తగా బోధపడిన విషయం ఏమిటంటే, కాఫీ తాగుతూ లేదా కూరగాయలు తరుగుతూ చెప్పుకునే కబుర్లు కథలనిపించుకునే దాకా కథల పరిమితి పెరిగిందనీ, అలా పెరగడానికి వీలుగా కొత్త కొలమానాలు కనుక్కోబడుతున్నాయనీ.  సందేశం (బ్రహ్మ రహస్యాల మాట దేవుడెరుగు) ఉన్నా లేకపోయినా, పాఠకులని నవ్వించడమో, కవ్వించడమో, ఏడిపించడమో, ఆలోచింపచేయడమో, ఆసక్తికరంగా చదివించడమో వగైరా వగైరా లక్షణాలు కథలకి ఉండాలనే అపోహలో ఉన్నాను ఇంతకాలం.  ఇహనేఁ, నాలాంటి వాళ్ళుకూడా రచనలు మొదలుపెట్టవచ్చు (లేక కథల, కవితల స్థాయి పడిపోవడానికి ఇదే కారణమా?)

by: Sowmya
కథ ప్రయోజనం ఏమిటీ? అన్న దాన్ని బట్టి ఉంటుంది మనం ఏం ఆలోచిస్తాం అన్నది. మీరు ఈ కథ ఒకలా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ, రాసే మనిషిని నేను. నేను రాసే కారణాలు వేరు. అలాంటప్పుడు, మీ ఆలోచనలని నా కథలో ఎలా జొప్పించగలను?

by: రాజేంద్ర
నేను కథ రాసేటప్పుడు అదంతా ఆలోచించలేదు.

ఆలోచించి రాస్తే ఇంకా బాగుంటుంది అన్నదే నా అభిప్రాయం కూడా.

by: Sowmya
@Rajendra: Basically, I want to tell something here. Lincoln’s ghost is not my creation. Stories about Lincoln’s ghost have been in vogue since his death. There are some related links here: Wikipedia’s article on Lincoln’s Ghost. Also this kind of photos are galore: Ghost of Lincoln’s Bedroom.

ఇక్కడ నాకు లింకన్ ని కించపరచాలన్న ఉద్దేశ్యం లేదు. మీరు వర్రీ కాకండి.

నేను కథ రాసేటప్పుడు అదంతా ఆలోచించలేదు. ఏదో, సరదాగా రాసానంతే. ముందే చెప్పినట్లు, నాకు సత్యజిత్ రాయ్ రాసే విధానం లో ఉండే కథలంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టం. అందుకని ఆ పద్ధతి లో రాసాను. అంతకు మించి వేరే అర్థాలు తీసుకోడానికేమీ లేదు ఇందులో. లింకన్ తో పాత పగలేవీ కూడా లేవు.. :)

by: కొడవళ్ళ హనుమంతరావు
“తెలుగులో సాహిత్య విమర్శ”

మాలతి గారి కథ మీదా, సౌమ్య గారి కథ మీదా నేను నాలుగు మాటలు రాయడాన, మాలతి గారు నన్ను కూడా దృష్టిలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, వారికి జవాబుగా ఇదిగో మరో ముక్క.

నచ్చిందనో నచ్చలేదనో ముక్తసరిగా చెప్తే,  ప్చ్, నిర్మాణాత్మకంగా లేదు, అని పెదవి విరుస్తారు సంపాదకులు. ఇది ఇందుకు నచ్చింది, ఇది ఇందుకు నచ్చలేదు అని సామాన్య పాఠకుడు తన స్థాయికి తగ్గట్టుగా రాస్తే, పీకి పాకాన పెడుతున్నాడని కళెర్ర చేస్తారు రచయితలు. ఎలా చావడం?!

ఈ సందర్భంలో బూదరాజు రాధాకృష్ణ మన విమర్శ గురించి అన్న మాటలు ఆలోచించదగ్గవి: “గ్రంథానికి లేని విలువ దాని విమర్శకు రాదు; విమర్శకు లేని విలువ గ్రంథానికీ రాదు. ఈ రెండూ అన్యోన్యాశ్రితాలు. ఈ రెంటికీ విడదీయరాని పరస్పర సంబంధముంది. ఒకటి పేలవమైతే రెండోది అప్రశస్తమవుతుంది. ఒకటి దురభిమానభూయిష్ఠమయితే రెండోది నిస్సారమవుతుంది. ఉన్నత సాహితీ సృష్టికి విమర్శలను తట్టుకొని పదికాలాల పాటు బతకాలనే ఆకాంక్ష బలవత్తరంగా ఉండాలి. ఉత్తమ విమర్శకు గుణదోష పరీక్షణ శక్తి కావాలి.”

అయితే రచయితలొక విషయం గుర్తుంచుకోవాలి. నాలాంటి పాఠకులు వృత్తిరీత్యా, కనీసం ప్రవృత్తి రీత్యా నయినా విమర్శకులు కారు. వాళ్ళ పరీక్షణ శక్తి చాలా పరిమితం అని గ్రహించాలి. ఆ పరిమిత శక్తితో వాళ్ళు చేసే విమర్శకు కించిత్ విలువన్నా ఉందో లేదో రచయితలే పరామర్శించుకోవాలి.

ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే ఈమాట లాంటి పత్రికలో ప్రచురించినందుకు రచయితలు గర్వపడొచ్చు. వాటిని కొందరు పాఠకులు మెచ్చుకున్నందుకు పొంగిపోవచ్చు. అది సహజమే. కాని విమర్శించిన సామాన్య పాఠకుల అమాయకత్వానికి జాలిపడకుండా, విమర్శలో తమ రచనలు ఇంకా పైస్థాయికి చేరే సూచనలుంటే స్వీకరించడం, లేకపోతే మర్యాదగా తిరస్కరించడం - అది బాధ్యతగల రచయితల విధి అని నాఉద్దేశం.

కొడవళ్ళ హనుమంతరావు

by: రాజేంద్ర
మాలతి గారికి,

నమస్కారాలు,పాఠకులు తమకు ఏ రచనైనా నచ్చనప్పుడు బాగాలేదు,నాకు నచ్చలేదు ఫలాన కారణాలవల్ల అని చెప్పటం తప్పంటారా?లింకన్ ను దయ్యంగా చూపటంతో పాటు ఇతరత్రా కొన్ని అభ్యంతరాలు నేను రాసాను,అలా రాయటం నేరమంటారా?లాల్ బహదూర్ శాస్త్రి అమితాబ్ బచ్చన్ అంత ఎత్తు లేడనీ,సినీనటి సావిత్రి లావుగా ఉంటుందనీ,ఫిడేలు నాయుడుగారికి కళ్ళు లేవనీ ఇలా చాలా పాత్రలు కధలూ వస్తాయి,అప్పుడూ ఇలా మీరు సదరు రచయితలకు మద్దతిస్తారా అని నా అనుమానం.వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం ఒక కధ గురించి ఎందుకుంటుంది?

by: malathi
ఈవ్యాఖ్యలన్నీ చూస్తుంటే మరోసారి నామాట రాయలేకుండా వుండలేను.. ఈమధ్య కొందరు పాఠకులు తమ ఆలోచనాసరళికి ఏమాత్రం భిన్నంగా వున్నకథ అయినా, దాన్ని పీకి పాకాన పెడుతున్నారు. అలా జరగడానికి అవకాశం లేదు. అంచేత ఆకథ రాయడానికి వీల్లేదు అనుకుంటున్నట్టున్నారు వారు.

నాకథలమీద కూడా ఇలాటి వ్యాఖ్యలు వచ్చేయి కనక ఇక్కడ రాస్తున్నాను. ఒకసంఘటన కాస్త కొత్తగా కనిపించినప్పుడు, ఇది జరిగిందనో, జరగగల అవకాశం వుందని చెప్పడానికో కథ రాస్తాం. నేను ఇలాటికథ చదివితే, నాకు లింకన్ కలలోకి రాలేదు, సౌమ్యకి ఎలా వచ్చేడు అనుకోను. లింకన్ కలలోకి వచ్చినట్టు ఎక్కడో రచయిత్రి చదివి వుండొచ్చు. పైవ్యాఖ్యాతలు అది పర్సనల్ గా తీసుకోనవసరంలేదు.

అలాటిదే నాకు ఒక్కముక్క అర్థం కాలేదన్న వ్యాఖ్య కూడాను. . అన్ని కథలూ ఏవో బ్రహ్మరహస్యాలు బోదించడానికో, మరేదో చెయ్యడానకో కాదు కదా. కనీసం నేను అనుకోను.

ఈమధ్య వస్తున్న చాలా కథలు కేవలం coffee table conversations లాటివే. ఇంచుమించు వారానికి కొన్నివందల కథలు పత్రికలలోనూ, నెట్ లోనూ ప్రచురితమవుతున్నాయి. అన్నీ ఒకే మూసలో పోసినట్టుండవు. ఒకే రకం కొలమానాలకి అందవు. అలా అందుతాయనుకోడం కూడా అమాయకత్వమే.

by: రాజేంద్ర
ఇప్పటివరకూ నేను చదివిన సౌమ్యరచనల్లో నన్ను అసలు ఏమాత్రం ఆకట్టుకోని రచన ఇది.

వాడు .. ఆ పుట్టు నాస్తికుడు …

అబ్రహాం లింకన్ని ఒక దెయ్యపు పాత్రగా ప్రవేశపెట్టటం

పైగా..లింకన్! నా వైపు అభావంగా చూస్తున్నాడు!

లింకన్ కళ్ళలో నాకు కోపం కనబడ్డది,

లింకన్ పెదాలపై ఓ విషపు నవ్వు మెరిసింది.

ఆ పెదాలపై ఇందాకటి విషపు నవ్వు. “ఇప్పుడర్థమైందా, నేనెవర్నో?” అన్నట్లు ఉంది ఆ నవ్వు.

లింకన్ విషపు నవ్వు తీవ్రత తగ్గినట్లు అనిపించింది.

ఇలా వీలయినన్ని సార్లు ఆ మహనీయుడిని తూలనాడటం చాలా ఆశ్చర్యకరంగా,అభ్యంతరకరంగానూ ఉంది.

దయ్యపు పాత్రలతో హాస్యంపండించితీరాలి అనుకున్నప్పుడు ఏ హిట్లర్నో లేదా కుర్రభూషయ్యనో ఒక పాత్రగా తీసుకుని ఉండాల్సింది,పుట్టు నాస్తికుడు అనే జీవి అసలు ఉంటుందా?పైగా వాడికి లింకన్ దెయ్యం లాకనిపించటం దానితో వాడు తెల్లారెపాటికి గంటలకొద్దీ పూజలు చేసి,గంటకొట్టి హారతులిచ్చే స్థాయికి మారటం ఏమిటి?నాస్తికుడు చివరిరీలుకొచ్చేసరికి భక్తశిఖామణిగా మారి తీరాలన్న మన భారతీయ సినిమా సంస్కృతిని నరనరానా జీర్ణించుకోపోతే తప్ప సాధారణంగా ఇలాంటి కధలు అలాంటి ముగింపులు ఇవ్వటం చాల కష్టం.

by: Sowmya
“చదువుకున్న అమ్మాయిలు, తొక్కా, తోలూ, ఏహె లాంటి మాటలు వాడటం చదివి, ఔరా అనుకున్నాను.)”

@Hanuma garu:ఒక్కసారి మా హైదరాబాదొచ్చి కాలేజీపిల్లల మాటలు వినండి. ఇంతకన్నా వివరణ ఏమీ లేదు. వింటే చాలు. నేనుగా ఈ పదాలు వాడకున్నా కూడా. నేను రోజులో పదుల సంఖ్యలో ఇవన్నీ వింటూనే ఉంటాను. హైదరాబాదనే కాదు, ఇక్కడి ఏ ఊర్లో అన్నా ఇంతే ఉండొచ్చని నేను అనుకుంటూన్నా.

by: కొడవళ్ళ హనుమంతరావు
“ఇందిరా గాంధీ, నేనూ రెండు దోసెలూ!”

సౌమ్య గారూ,

ప్రతి కథా ఏదో సందేశం ఇవ్వాలని నేనూ ఆశించను కానీ, హాస్య రచనకి ప్రత్యేకమైన ఉద్దేశం లేనపుడు, భాషలో, సంభాషణలో చతురత అన్నా ఉండాలి. దయ్యాలూ, దేవుళ్ళూ, సిమెట్రీ, క్వాంటం థియరీ - ఇవేవీ నా బలహీనతలని గుర్తు తేలేదు - అన్వయించుకొని నవ్వుకోడానికి. పూజా, పూరీలకు మించి కథలో తెలుగు వాతావరణమే తక్కువనిపించింది. (తెలుగుతనం గురించి పెద్దగా తెలుసని కాదు. దేశం వదిలి పాతికేళ్ళవుతోంది. చదువుకున్న అమ్మాయిలు, తొక్కా, తోలూ, ఏహె లాంటి మాటలు వాడటం చదివి, ఔరా అనుకున్నాను.)

నాయకులు కలలోకి రావడమంటే గుర్తొచ్చింది. పురాణం సీత “ఇల్లాలి ముచ్చట్లు” లో సీత భర్తకి ఇందిరా గాంధీ కలలోకొచ్చి దోశెలు తిన్న వైనం ఉంది. అది చదివి నవ్వకుండా ఉండలేము. అదీ ఇతరులవి మరి కొన్నీ, భార్గవీరావు గారు సంకలనించి “ఆహా … ఓహో! (ఆధునిక హాస్య వ్యంగ్య రచనలు)” క్రింద ప్రచురించారు. హాస్య రచనలంటే ఇష్టమున్నవాళ్ళు చదవదగ్గది.

కొడవళ్ళ హనుమంతరావు

by: Sowmya
@Malathi garu, Vijay, Mahesh, Sai Lakshmi and kosyasuraa: Thanks.

@Raja Sankar: నాకు సందేశాత్మక ముగింపు ఇచ్చే ఉద్దేశ్యం లేదు. ప్రతి కథకీ ఓ సందేశం ఉండాలన్న పట్టుదలేదీ నాకు లేదు. ఈ కథ రాయడంలో నా ఉద్దేశ్యం కేవలం చదివి నవ్వుకోవడం కోసమే. ఇలాంటి సంఘటనలు మన జీవిత స్రవంతిలో ఎంత విరివిగా ఉన్నా కూడా కథ విషయానికొస్తే వాటి సహజమైన దోవలో పోనీయం మనం చాలావరకు. అలా కాకుండా దాని దోవన దాన్ని పోనిచ్చే విధంగా రాయాలనిపించి రాసిన కథ ఇది.

@కొడవళ్ళ గారు: పైన చెప్పినట్లే, ఈ కథకి ప్రత్యేకంగా ఓ ఉద్దేశ్యం అంటూ లేదు. ఏదో ఒక సమయంలో పేజీ తెరిచి, చదువుకుని, ఒకటో అరో చిర్నవ్వులు (వస్తే) నవ్వుకుని, ఇలాంటి బలహీనత ఒకటో అరో మీలో ఉన్నది గుర్తొస్తే , గుర్తుతెచ్చుకోడం. అది జరిగితే ఈ కథ ఉద్దేశ్యం నెరవేరినట్లే.

@CJ: నో కామెంట్స్. :)

by: CJ
ఎంటో ఒక్క ముక్క అర్ధమయితే ఒట్టు. లేదా నేను యిలాంటి ఆధునిక సాహిత్యమ్ కి దూరమేమో?

by: rajasankar kasinadhuni
పూజారిగారు మంత్రం చెప్పి మమ అనుకోమన్నట్లు, కొడవళ్ళగారి అభిప్రాయం చదివి మమ అనుకున్నాను.  ఈ కథ ముఖ్యోద్దేశం నాకు ఏ మాత్రం అర్థం కాలేదు.  అమెరికాదేశ చరిత్రని మలుపు తిప్పిన లింకన్ అంతటివాడు కనబడితే సదరు ‘రాజా’ పాత్ర దుప్పటి ముసుగు తన్ని భయంతో నాస్తికత్వాన్ని వదిలిపెట్టి పొద్దున్న దేవుడికి హారతి ఇస్తాడు.  పాత్రల మధ్య చక్కిలిగింతలు పెట్టుకున్నా నవ్వు రాని సంభాషణ అంతా ఈ విషయం మీదే, కాబట్టి, అసలే పసలేని కథ ఇంకా చప్పగా తయారయింది.  పైగా ముగింపు కూడా రేపటినుంచి ఏ దేవుడికి పూజ చెయ్యాలన్న ఒక అర్థంలేని ప్రశ్నతో.  కనీసం లింకన్ తో జరిగిన సంభాషణ వలన రాజాకి సంఘంలోని అసమానతల విషయంలో కనువిప్పు కలిగినట్లు కథ అల్లి ఉంటే ఆ మార్పు పాఠకులకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఉండేది.

భవదీయుడు,

రాజాశంకర్ కాశీనాథుని

by: కొడవళ్ళ హనుమంతరావు
“సత్యజిత్ రాయ్ ఎవరు”

నాకు సత్యజిత్ రాయ్ సాహిత్యంతో పరిచయం లేదు; డాన్ బ్రౌన్ ఎవరో తెలియదు. నీల్స్ బోర్ principle of complementarity గురించి కొంచం తెలుసు. ఈ కథ సారాంశం నాకర్థం కాలేదు. వింత మనుషులతో కాపురం/స్నేహం ఎలా ఉంటుందనా? దీనికి ప్రేరణ ఇచ్చిన రాయ్ సాహిత్యం చదువుదాం అన్న ఆసక్తి నాకు ఎంతమాత్రమూ కలగలేదు.

పోల్చి కించపరిచే ఉద్దేశం లేదు కాని, రాయ్ పుట్టినరోజన్నారు కనుక చెప్తాను. నిన్న రాత్రి ఎందుకో శ్రీపతి కథలు చదువుతుంటే, ఒకటి నన్ను గట్టిగా కదల్చింది. ఇవాళంతా నా ఆలోచనల్లోనే ఉంది. కథ పేరు, “సత్యజిత్ రాయ్ ఎవరు.” అది చదివి, నేను రాయ్ చిత్రాలు మరొకసారి చూడాల్సిన అవసరం ఉంది అని తీర్మానించుకున్నాను.

కొడవళ్ళ హనుమంతరావు