షష్ఠ్యంతములు
ముగింపు
ఓనమాలకు, కేశవనామములకు, అష్టోత్తరశతనామములకు, సహస్రనామములకు అనుకరణగా ప్రారంభమైన షష్ఠ్యంతరచనా పద్ధతి సుమారు ఎనిమిది శతాబ్దాలు అవిచ్ఛిన్నముగా కావ్యములలో కొనసాగింది. ఇరవైయ్యవ శతాబ్దములో ఆరంభమైన నవ కవిత అనే పెనుగాలిలో ఎన్నో పద్ధతులు కొట్టుకొని పోయాయి. అందులో షష్ఠ్యంతాలు కూడ ఒకటి. ఇప్పుడు దీనిని చమత్కారముకొరకై ఎప్పూడైనా ఎవరైనా రాస్తారు, అంతే. మరుగుపడిన ప్రాచీన తెలుగు సాహిత్యపు సౌందర్య ఖనులలో షష్ఠ్యంతము ఒకటి.
- అచ్చతెనుగు కుబ్జాకృష్ణవిలాసము - నళ్లంతిఘల్ చక్రవర్తుల లక్ష్మీనృసింహాచార్యులు, 1932.
- ఆంధ్రభాషాభూషణము - మూలఘటిక కేతనకవి, వావిళ్ల రామస్వమి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1949.
- ఆంధ్రమహాభారతము - విరాటోద్యోగ పర్వములు - తిక్కన సోమయాజి, వావిళ్ల రామస్వమి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1915.
- ఆంధ్రమహాభారతము - సంపుటము 1 - ఆదిసభాపర్వములు - నన్నయభట్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ముద్రణాలయము, హైదరాబాదు, 1968.
- ఉత్తరరామాయణము - కంకంటి పాపరాజు, సీ. వీ. కృష్ణా బుక్ డిపో, మదరాసు, 1957.
- కర్ణాటకభాషాభూషణం మత్తు ఆంధ్రభాషాభూషణము - ఒందు తౌలనిక అధ్యయన - టి . శంభులింగప్ప, చిత్రదుర్గ ప్రకాశన, చిత్రదుర్గ, 1999.
- కవిజనాశ్రయము - వేములవాడ భీమకవి, పరిష్కర్త జయంతి రామయ్య పంతులు - ఆంధ్రసాహిత్య పరిషత్తు, కాకినాడ, 1932.
- కుమారసంభవము - నన్నెచోడ మహాకవి, వ్యాఖ్యాత జొన్నలగడ్ద మృత్యుంజయ రావు - తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1994.
- చతుర్థీవిభక్తి సంస్కృతములో - జెజ్జాల కృష్ణ మోహన రావు -
ఛందస్సు గుంపులో వ్యాసము
రచ్చబండ గుంపులో వ్యాసము - చతుర్థీవిభక్తి తెలుగులో - జెజ్జాల కృష్ణ మోహన రావు -
ఛందస్సు గుంపులో వ్యాసము
రచ్చబండ గుంపులో వ్యాసము - తెలంగానా శాసనములు, సంపుటము 1 - లక్ష్మణరాయ పరిశోధక మండలి, హైదరాబాదు, 1935.
- దశకుమారచరిత్రము - కేతనకవి, వావిళ్ల రామస్వమి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1925.
- దాశరథీవిలాసము - క్రొత్తపల్లి లచ్చయ్య
- నారదీయపురాణము - అల్లాడు నరసింహకవి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓరియెంటల్ మాన్యుస్క్రిప్ట్స్ అండ్ రెసెర్చి ఇన్స్టిట్యూట్, హైదరాబాదు, 1976.
- నిర్వచనోత్తరరామాయణము - తిక్కన సోమయాజి, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1916.
- బాలవ్యాకరణము - చిన్నయసూరి, వావిళ్ల రామస్వమి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు.
- భువనమోహినీవిలాసము - పెంగలూరి వేంకటాద్రి, పద్మావతీ ఆర్ట్స్ ప్రింటర్స్, నాగర్ కర్నూల్, 1986.
- మనుచరిత్ర - అల్లసాని పెద్దన, వావిళ్ల రామస్వమి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1951.
- యుద్ధమల్లుని బెజవాడ శాసనము - జయంతి రామయ్య పంతులు, సదానందనిలయ ముద్రాక్షరశాల, మదరాసు, 1917.
-
విభక్తుల పేరులు - జెజ్జాల కృష్ణ మోహన రావు -
ఛందస్సు గుంపులో వ్యాసము
రచ్చబండ గుంపులో వ్యాసము - విష్ణుచిత్తీయము అను నామాంతరముగల ఆముక్తమాల్యద - శ్రీకృష్ణదేవరాయలు, వావిళ్ల రామస్వమి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1914.
- శ్రీకృష్ణాభ్యుదయము - మండపాక పార్వతీశ్వరకవి, రమానిలయ ముద్రాక్షరశాల, నెల్లూరు, 1903.
- శ్రీమహాభాగవతము - సంపుటము 1, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, హైదరాబాదు, 1983.
- శ్రీవేంకటాచలమాహాత్మ్యము - తఱిగొండ వేంకమాంబ, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1937.
- షష్ఠీవిభక్తి - జెజ్జాల కృష్ణ మోహన రావు - ఛందస్సు గుంపులో వ్యాసము
రచ్చబండ గుంపులో వ్యాసము - హరవిలాసము - శ్రీనాథుడు, వావిళ్ల రామస్వమి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1931.
- A comparative grammar of the Dravidian or South-Indian family of languages - Robert Caldwell, Trubner and Co., London, 1875.
- Historical Grammar of Telugu - కోరాడ మహాదేవ శాస్త్రి, శ్రీవేంకటేశ్వరా యూనివర్సిటీ, తిరుపతి, 1969.
గ్రంథసూచి

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు (విద్వత్కవిభూషణ వేదం వేంకటకృష్ణ శర్మ తెలుగు పాఠాలు చెప్పారు).తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ... పూర్తిగా »
rajasankar kasinadhuni అభిప్రాయం:
March 3, 2008 10:57 am
కృష్ణమోహన్ గారు, మీ వ్యాసంలో విభక్తుల పరిచయం బాగుంది. పెద్దవాళ్ళ పోరు పడలేక సంస్కృత శబ్దాలు నేర్చుకునే నేపథ్యంలో మాయాబజార్లో లంబు, జంబుల లా విభక్తి ప్రత్యయాలు ముక్కున పట్టడమే కానీ మీరు స్పష్టం చేసిన లోతులకి ఎప్పుడూ వెళ్ళలేదు. ధన్యవాదాలు.
పోతనగారి పద్యం “క్షోణితలంబునిన్ నుదురు సోకగ…” మీ వ్యాసంలో ఉదహరింపబడకపోవటం కొంచెం ఆశ్చర్యం కలిగించింది.
ప్రాచీనసాహిత్యంలో మరొక మంచి అంశాన్ని తెలియపరచినందుకు ధన్యవాదాలు.
రాజాశంకర్ కాశీనాథుని
mOhana అభిప్రాయం:
March 6, 2008 12:09 pm
రాజాశంకర్ గారూ :
పోతన గారి ఇష్టదేవతా ప్రార్థనలలో కొన్ని షష్ఠీ విభక్తితో అంతమవుతాయి.
వాటిని ఇక్కడ చూడగలరు -
మరొక విషయం, షష్ఠ్యంతాలలో సామాన్యముగా క్రియ ఉండదు.
ఒక విధముగా అవి అసంపూర్ణము అని చెప్పవచ్చు. ఇట్టి వానికి
లేక ఇట్టి దేవికి అని మాత్రమే ఈ పద్యాలలో ఉంటాయి. క్షోణీతలంబు
వంటి పద్యాలలో క్రియ ఉంటుంది. ఈ తేడాను గురించి నేను
నా వ్యాసములో నొక్కి చెప్పనందుకు చింతిసున్నాను.
- మోహన
P. N. Raja Rao అభిప్రాయం:
March 7, 2008 3:54 am
మోహన రావు గారూ:
నమో నమః మంచి వ్యాసం మాకు అందించారు.
మనుచరిత్ర గురించి చెప్పి, విజయ విలాసములోని ” ఏతాదృగ్గుణ ఖనికిన్…”, వగైరా ఉదహరించపోవడం ఆశ్చర్యంగా ఉన్నది.
విశ్వనాథ వారు రామాయణం మొట్టమొదటి ప్రచురణలో ఈ షష్ట్యంతాలు ఉన్నాయని విన్నాను. తరువాతి ప్రచురణలలో ముప్పాళ్ళ రాజా గారిని పొగుడుతూ రాసిన పద్యాలు కత్తిరింబడ్డాయని వినికిడి. ఆ మొదటి ప్రతి పద్యాలు మీ దగ్గిర ఉంటే వాటిని మాకు చెప్పండి.
అభినందలతో,
పి.యన్.ఆర్.
Kameswara Rao అభిప్రాయం:
March 7, 2008 9:58 pm
విశ్వనాథ తన రామాయణ కల్పవృక్షాన్ని ఈశ్వరునికే అంకితం చేసారు.
ముత్యాల రాజా వారికి చెపుతున్నట్లుగా రాసారు. ఆ రాజావారి వంశచరిత్ర మాత్రం ఉంది. షష్ఠ్యంతాలు లేవు, నాకు తెలిసి.
కామేశ్వర రావు
M.S.Prasad అభిప్రాయం:
April 21, 2009 3:29 am
ప్రాచీనాంధ్ర సాహిత్యానికి సంబంధించిన ఇటువంటి వ్యాసాలు చదివినప్పుడల్లా హృదయం అమందానంద సందోహ కందళిత మై ఉత్తేజితమౌతుంది. మీ వ్యాసాలు చాలా బాగుంటున్నాయి. విభక్తులగురించి షష్ఠ్యంతాలు గురించి బాగా వివరించారు. ఏకో కవిః పోతన ఏవ అని భావించే నాకు ఆయన షష్ఠ్యంతాలు వదలక ఉదహరించడం ఆనందం కలిగించింది. పోతన తరువాత నాకెక్కువ అభిమాన పాత్రుడై కవిత్వంలోనూ విద్వత్తులోనూ అద్వితీయుడైన సురభి మాధవరాయల షష్ఠ్యంతాలు కొన్ని నా స్మృతిపధంలో వున్నవి మీతో పంచుకోడానికి ఉత్సహిస్తాను
భాషాధివ, శెషాహివ,
భాషా భూషాయితాత్మ పటుగుణ తతికిన్
దోషాచర, దోషాచర,
దోషాచర చక్ర కలిత దోర్బల ధృతికిన్
పాపాయిత, కోపాయత
భూపాయిత దనుజ మధన పూజిత మతికిన్
గోపాలన, గోపాలన,
గోపాలన నిబిడ రతికి, గోహిత మతికిన్
కమలాస జనక నాభికి,
కమలన్మోహాంధ తమస కమలాంకునకున్
కమలాలయ, కమలాలయ,
కమలాలయ శయన ధృతికి, కాంతాకృతికిన్
శరణాగత పరిరక్షణ
చరణ ప్రవణాత్మ చిత్త సరసీజునకున్
నరకాసుర, నరకాసుర,
నరకాసుర బాణహృతికి, నరసారధికిన్
సమధికమైన ప్రతిభ, విద్వత్తు కలిగిన మీ లేఖిని నుండి ఇటువంటి అనేక వ్యాసాలు జాలువారి రసజ్ఞ హృదయాలనలరింపజేయాలని ఆశిస్తూ
భవదీయుడు