Comments on: కల్యాణి రాగం - అనుబంధం

by: Rohiniprasad
శంకరాభరణం వర్ణం (సామినిన్నే)లో స ద ప మ పా అనే ప్రయోగం ఉంది. ఇది బుద్ధిపూర్వకంగా చేసినదని అంటారు.

మేళకర్తల పేర్లు కటపయాది సూత్రం కోసమని తయారుచేసినవనేది తెలుస్తూనే ఉంటుంది. రాగాలు ప్రాచీనమైనవి. మేళకర్త సిస్టం ఆ తరవాత ఎప్పుడో ఏర్పాటైనది.

మేళకర్త కాకపోతే సందర్భాన్ని బట్టీ, మూడ్ ను బట్టీ రాగాన్ని కొంత వైవిధ్యంతో ఆవాహన చెయ్యవచ్చు.  ఉదాహరణకు హిందూస్తానీ పద్ధతిలో విద్యార్థులకు యమన్ నేర్పుతున్నప్పుడు ని రి గమ అని నేర్పుతారు. స రి గమ అని పాడితే మార్కులు తగ్గిస్తారు. అయితే కొన్ని ఖయాల్, గత్ రచనల్లో ఆ ప్రయోగం వినిపిస్తుంది. బిస్మిల్లా ఖాన్ రికార్డు ఒకటి గత్ స ని సారిరిగారీ సనిసని దానీసా అని మొదలవుతుంది.

by: Srinivas
కళ్యాణి అనే రాగాన్ని కటపయాది సూత్రం కోసం మేచ కళ్యాణి గా మార్చారనేది నిర్వివాదాంశం. మేచ కళ్యాణి వేరే రాగం అయితే అందులో ఒక కృతి చెప్పండి? శంకరాభరణం, ధీరశంకరాభరణం రాగాలు కూడా అంతే. మీరు అన్న ఆ ‘చెప్పబడుతున్న’ తేడా ఏంటి? మీరనుకునే ధీరశంకరాభరణం లో ఒక ఉదాహరణ ఇవ్వండి.

ఇంకొకాయన అన్నట్టు జన్య రాగం ముందు ఉండి జనక రాగం తర్వాత పుట్టడం లో అసంబద్ధత ఏమీ లేదు. ఉన్న రాగాల్ని categorize చెయ్యడానికి, అర్థం చేసుకోటానికి మనం కల్పించుకున్న formulaలు జనక రాగాలు. జగమెరిగిన సత్యాల్ని science కోడీకరించినట్లు.

by: surya
విన్నవించుకోనా చిన్న కోరికా, ఐనదేదో ఐనది, ఎవరివో నీవెవరివో, నాదు ప్రేమ భాగ్య రాశి, నా ప్రియ కుటీర, ఓం నమో నమ యవ్వనమా … the list is endless.   What is interesting is that all noteworthy Kalyanis are creations of yester-year composers only, like Saluru vaaru and Pendyala gaaru.

I appreciate Mr.Rohini Prasad’s commitment in adorning the articles with audio support. The article is simply ‘add-to-favorites-able’.

by: Rohiniprasad
రాజాశంకర్ గారూ,

మీరడిగిన ప్రశ్నలు తరుచుగా ఎదురయేవే. నేను కొన్ని లెక్చర్ డెమాన్ స్ట్రేషన్లలో ఇటువంటివే విని ఇన్ ఫార్మల్ గా కొంతవరకూ సమాధానాలు చెప్పాను. ఇవన్నీ విశదీకరించగలిగిన పెద్దలు చాలామందే ఉంటారు. ఇతర మార్గాలూ ఉంటాయి. నాకు తెలిసినంత మేరకు, వీలు వెంట కొన్ని వ్యాసాల్లో మీరడిగిన విషయాలను వివరించడానికి ప్రయత్నిస్తాను.

by: rajasankar kasinadhuni
రోహిణీప్రసాద్ గారూ,

రాగాలని పరిచయం చేస్తూ మీరు, లక్ష్మన్న గారూ వ్రాసిన వ్యాసాలు బాగున్నాయి.  ఇవి సంగీతం నేర్చుకుంటున్నవాళ్ళకు బాగా ఉపయోగపడతాయి.  కాకపోతే వచ్చిన చిక్కల్లా నాలాటి వారితొనే.  సంగీతాన్ని విని ఆనందించడం తప్ప దాని గురించి ఓనమాలు తెలియని నాలాంటి వాళ్ళకి కలిగే చొప్పదంటు అనుమానాలు ఎన్నెన్నో.  ఉదాహరణకు, కేవలం స్వరాలవలనే పాట Tune తయారవుతుందా? (కాదని నేననుకుంటున్నాను కాని స్వరాలు కాక ఇంకా ఏమి కావాలన్నది నాకు అంతు బట్టని విషయం, బహుశా ఊనికా?).  ఆరోహణ, అవరోహణ అనేవి దేనికోసం ఉపయోగిస్తారు? అంటే, ఒక రాగాన్ని ఆధారంగా చేసుకుని స్వరరచన చేసేటప్పుడు ఇవి స్వరాల క్రమాన్ని నిర్దేశిస్తాయా?  ఫలానా వారి పాటలో ఎన్నో సంగతులున్నాయి అంటారు, ఈ సంగతులు ఏమిటి?  ఈ సంగతులు లేకపోయినా, అపస్వరం రాకుండా పాడితే సరిగ్గా పాడినట్లే (గాత్ర సంగీత విషయంలో) లెక్కా?  గమకాలు మళ్ళీ వేరుగా ఉన్నాయా? ఇలా వ్రాసుకుంటూ పోతే విసిగించే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.  అంచేత, మీరు సంగీతంలో ఉన్న ప్రాథమికాంశాలన్నిటినీ వివరిస్తూ నాలాంటి వారికోసం ఒక వ్యాసం వ్రాస్తే, మీ తక్కిన వ్యాసాలని కూడా చదివి ఆనందించే అవకాశాన్ని మాకు కలగజేసిన వారవుతారు.

ధన్యవాదాలతో,

రాజాశంకర్ కాశీనాథుని

by: Rohiniprasad
తెలుగు అభిమానిగారు కొత్త సినిమాపాటల రాగాలని గుర్తుచేసి నా లోపాన్ని చక్కగా సవరించారు. ఈమధ్య ‘హృదయం ఎక్కడున్నది’ అనేపాట విన్నప్పుడు అందులో ఖరహరప్రియ నాకు వినబడింది. అలాగే ‘నవమన్మథుడా’ అనే పాట శుద్ధధన్యాసి రాగం. కొత్తపాటలు విని వాటి రాగాలను ఉదహరించేంత ఓపికా, వ్యవధీ, ఆసక్తీ లేకపోవడమే నా లోపం.

శాస్త్రీయసంగీతం వెంట విధిగా ఉండే కొంత ‘చాదస్తం’ ప్రతివారికీ రుచించకపోతే వారిని తప్పుపట్టలేం. మెలొడీని విని ఆనందించేందుకు సరిపోయేంత మటుకు కొంత గ్రామరును పరిచయం చేస్తే తెలుగువారిలో సంగీతం మరింత బలపడుతుందని ఆశ. ఈ ప్రయత్నం చాలా గొప్పదని కాని, తద్వారా కీర్తిప్రతిష్ఠలు వస్తాయనిగాని కలలో కూడా అనుకోను.

by: నాగ మురళి
నాకు సంగీతం గురించి తెలిసింది చాలా తక్కువ. కొద్దికాలం భారతీయ విద్యాభవన్ లో వేణువు నేర్చుకున్నాను. డాక్టర్ జాన్ మార్ గారు చెప్పిన మొదటి, రెండు సంవత్సరాలు థియరీ కోర్సు నేర్చుకున్నాను. జనక, జన్య రాగాల గురించి పెద్ద కాంట్రవర్సీ ఉన్నదనే ఆయనా చెప్పారు. కొన్ని జన్య రాగాలుగా చెప్పబడుతున్నవి వాటి జనక రాగాలుగా చెప్పబడుతున్నవాటి కన్న చాలా పాతవి ఉన్నాయట(ముందే కనిపెట్టబడ్డాయి). ఆయన ఉదాహరణలు చెప్తూ ఖరహరప్రియ 18వ శతాబ్దంలో పుట్టిందనీ, దాని జన్య రాగమైన శ్రీ రాగం 13వ శతాబ్దంలోనే (అధమంగా 16వ శతాబ్దంలో) పుట్టిందనీ చెప్పారు. అలాంటప్పుడు వాటిల్ని జనక, జన్య రాగాలుగా పేర్కొనడంలో ఔచిత్యమేమిటని కూడా ఆయన అన్నారు. అలాగే హరికాంభోజి కన్నా దాని జన్యంగా పేర్కొనే కాంభోజి పాతదిట.

by: Rohiniprasad
సాయి గొర్తి గారూ,

నా మటుకు రాగాలనేవి సజీవంగా మోగుతూ, శ్రోతలను ఆనందపరిచేవి. నా వ్యాసాల ఉద్దేశం కూడా సంగీతాన్ని సామాన్యశ్రోతలకు దగ్గర చేర్చాలనే.

ఇక కాంట్రవర్సీ మాటకొస్తే జన్యరాగం అనేదాని పేరెంటేజిని నిర్ణయించడానికి తంటాలు తప్పవు. ఉదాహరణకు మోహనరాగంలో మ, ని స్వరాలు ఉండవు. సిద్ధాంతరీత్యా దాన్ని రి2, గ2, ద2 ఉన్న హరికాంభోజి(28), ధీరశంకరాభరణం(29), వాచస్పతి(64), మేచకల్యాణి(65) లలో ఏ మేళకర్తనుంచయినా జన్యంగా అనుకోవచ్చు. సంప్రదాయాన్ని బట్టీ, అనుస్వరాలనిబట్టీ పండితులు హరికాంభోజికి జన్యమని అంటారు.

మేళకర్త రాగాలతో లిబర్టీస్ తీసుకోవడం కష్టమనీ, కల్యాణిలో నిరిగమ మొదలైన ప్రయోగాలు యథేచ్ఛగా చెయ్యవచ్చనీ కొందరు గాయకులు నాతో అన్నారు. ప్రాక్టికల్ మ్యూజిషియన్లకి ఈ సంగతులు తెలుస్తాయి. మేళకర్త సిస్టం పక్కాగానూ, మరీ పక్కాగానూ ఉంటుందనీ, హిందుస్తానీ వారి పది ఠాఠ్ ల పద్ధతి మరీ తక్కువగానూ అనిపిస్తుందనీ రవిశంకర్ ఒక సందర్భంలో అన్నాడు. మేళకర్త రాగాలను గురించి నేను బాలమురళిగారినీ, సంగీతరావుగారినీ, రజనీకాంతరావుగారినీ అడిగాను. ఎవరి అనుభవాన్నిబట్టి వారు సమాధానాలు చెప్పారు.

సంగీతాన్ని చూసి జడవకుండా వీలయినంత ఎక్కువమంది విని తెలుసుకోవాలని నా ఉద్దేశం. మేచకల్యాణిని దాటి ముందుకు వెళ్ళి, నా వ్యాసం కల్యాణి రాగంతో పరిచయాన్ని పెంచగలిగిందో లేదో మీరు చెపితే సంతోషిస్తాను.

[This comment has been edited - Editors]

by: D.Girija
This is an excellent idea to introduce one particular ragam to students like me. Thank you Prasadgaru. Only you can think of such innovative ideas and make good use of.a web magazine.

Before reading this article, I used to think that Kalyani and Mechakalyani are one and the same. Though it is not very important in the context, I did some R&D, consulted my gurus, and came to know that they are slightly different in fact and have a little variance in bhavams.

Thanks to Eemaata for a useful and interesting article.

Please keep this series up and give similar articles in future also.

by: తెలుగు అభిమాని
రాగాలలో కళ్యాణి మకుటంలేని మహరాణి అనడంలో సందేహం లేదు. చక్కటి వ్యాసం అందించినందుకు నెనరులు.  ‘ప్రతి మధ్యమం’ పంచమం’ స్వరాలు కళ్యాణి రాగం మాధుర్యానికి కారణమనిపిస్తుంది.   కళ్యాణిలో కీరవాణి స్వరపరిచిన రెండు  పాటలు . 1) ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రంలో ‘ఒక మనసును’ 2)  బొంబాయి ప్రియుడు లో ‘చందన చీరలు కట్టి’ .  చక్కని గీతాలు.  అలాగే శంకర్ మహదేవన్ ‘breathless’  కూడా కళ్యాణిలో చందన చర్చలు చేస్తుంది.

by: Rao Pamganamamula
శ్రీ లక్ష్మన్నగారి రాగాల పరిచయ వ్యాసాలను చదవగానే నాలో మెదిలిన రెండు ఆలోచనలలో మొదటిదానికి శ్రీ రోహిణీ ప్రసాదు గారు ఈ వ్యాసంలో రూప కల్పన చేసి ఊపిరి పోశారు. నాబోటి సంగీత జ్ఞానం లేనివారికి ఇది చాలా గొప్ప సహాయకారి. ఈరెండు వ్యాసాల అధారంగా యెవరైనా ఒక ఆల్బమ్ తీసుకొని వస్తే బాగుంటుందన్నఅప్పటి నా మరో ఆలోచనను ఎవరైనా ముందుకు తీసుకొవెళ్ళే ప్రయత్నంచేసేటట్లవుతే వారికి నా సహాయ సహకారాలు అందచేయగలను.

రావు పంగనామముల

by: Rama Pandra
This is really a great article. I thank Eemaata for publishing this kind of articles. These articles provide the music lovers insight about the ragas in a simple way. I have become a fan of Rohini Prasad garu and Lakshmanna garu because of these articles. Please continue to publish the information about the songs and ragas in them, I will appreciate. I also thank Ranga garu for his link on Kalyani.

by: vishNubhoTla lakshmanna
రోహిణీ ప్రసాద్ గారు:

మీరు కల్యాణి రాగానికి మంచి వ్యాఖ్యానంతో పాటు ఆడియో లింకులిచ్చి, రాగాన్ని మరింత సులువుగా శ్రోతపాఠకులకి తెలియజేయటం చాలా బాగుంది. మీరు ఇలాగే మిగిలిన రాగాలను కూడా పరిచయం చేస్తే బాగుంటుంది.

మీరిచ్చిన లింకుల్లో, బాలమురళి, భీంసేన్ జోషిల జుగల్బంది ఒక అరుదైన కచేరి. సంగీతంలో రెండు మేరు పర్వతాలైన ఇద్దరు వస్తాదులు ఒకే వేదికపై ఉంటే ఇక చెప్పేదేముంది! బాలమురళి పాడుతున్నప్పుడు, భీంసేన్ జోషి అంత పరవశంగా ఎలా స్పందించాడో! ముంబై షన్ముఖానంద హాలులో జరిగ ఈ కచేరీ చూడగలగటం నా అదృష్టం. పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చినందుకు ధన్యవాదాలు.

లక్ష్మన్న

by: Rohiniprasad
రంగాగారికి,

రాజన్ పారీకర్ వెబ్ సైటుని పాఠకులకి పరిచయం చేసి మంచిపని చేశారు. శాస్త్రీయసంగీతంలో (ముఖ్యంగా హిందూస్తానీ) ఎంతో దుర్లభం అనిపించే ఆడియో క్లిప్ లను అతను సేకరించాడు. ఎన్నెన్నో రాగాలు…ఎందరెందరో విద్వాంసులు…అవన్నీ చూస్తూ, వింటూ ఉంటే ఎంతసేపైనా గడిచిపోతుంది.

by: Ranga
Here is another outstanding article on Kalyani:

Ranga.

by: Sai Brahmanandam Gorti
రోహిణీ ప్రసాదు గారూ,

మీరు రాసినట్లుగా

అసలు జనక, జన్య రాగాల విభజన గురించి పెద్ద కాంట్రవర్సీయే ఉంది. కటపయాదిసూత్రం కోసమని కల్యాణిని మేచకల్యాణి అంటారని అనేవారూ ఉన్నారు, రెండూ కొద్దిగా వేరని వాదించేవారూ ఉన్నారు.

జనక, జన్య రాగాల విభజన గురించి పెద్ద కాంట్రవర్సీ ఉందని నేనెక్కడా వినలేదు. మద్రాసు సంగీత అకాడమీ వాళ్ళు వేసిన గానకళా బోధిని లో కూడా మీరు చెప్పినట్లు కాంట్రవర్సీ ప్రస్తావించ లేదు. అక్కడే కాదు, నేను సంగీతానికి సంబంధించిన ఏ పుస్తకంలోనూ చదవలేదు. ఏ సంగీత విద్వాంసుడి నోటా వినలేదు. “రెండూ కొద్దిగా వేరని వాదించేవారి” గురించి కొన్ని రెఫరెన్సులు ఇస్తే నాలాంటి పాఠకులకి ఉపయోగపడుతుంది.

మీకు వ్యక్తిగతంగా జన్య, జనకరాగాల మీద ఆసక్తి లేకపోతే ఆ విషయం ప్రస్తావించకుండా ఉండుంటే బాగుండేది.

- సాయి బ్రహ్మానందం గొర్తి

[This comment has been edited - Editors]

by: Jayasri
This is an interesting article for all Kalyani lovers. Thanks to the author and to eemaata, for taking the trouble of giving so many audio links.

by: Rohiniprasad
అసలు జనక, జన్య రాగాల విభజన గురించి పెద్ద కాంట్రవర్సీయే ఉంది. కటపయాదిసూత్రం కోసమని కల్యాణిని మేచకల్యాణి అంటారని అనేవారూ ఉన్నారు, రెండూ కొద్దిగా వేరని వాదించేవారూ ఉన్నారు. సంగీతం గురించి బాగా తెలిసినట్టున్న సాయి బ్రహ్మానందం గొర్తిగారికి శంకరాభరణానికీ, ధీరశంకరాభరణానికీ మధ్య ఉన్నట్టుగా చెప్పబడుతున్న తేడా ఏమిటో తెలుసనుకుంటాను. వ్యక్తిగతంగా నాకు ఇటువంటి జన్య, జనకరాగాల మీద ఆసక్తి లేదు. హిందూస్తానీలో ఈ విభజన ఇంకా అస్తవ్యస్తం. నా వ్యాసం ఉద్దేశం సామాన్యశ్రోతలు రాగాన్ని విని తెలుసుకునేందుకే. ఇది సంగీత పాఠ్యపుస్తకం కాదు.

by: Sai Brahmanandam Gorti
ఈ క్రింది వాక్యం శుద్ధ తప్పు.

“లక్ష్మన్న చెప్పినట్టుగా కల్యాణి రాగం 65వ మేళకర్త అయిన మేచకల్యాణి నుంచి జనించిన రాగం.”

కళ్యాణి రాగం మేచ కళ్యాణి జన్యం కాదు. రెండు రాగాలూ, అంటే మేచకళ్యాణి నే కళ్యాణి అని పిలుస్తారు.  ఇది 72 మేళ కర్త రాగాల విభజన కోసం కటపయాది చక్రం ప్రకారం కళ్యాణి రాగాన్ని మేచ కళ్యాణి గా వ్యవహరిస్తున్నారు తప్ప రెండూ ఒకటే!  జన్య రాగ నిర్వచనం వేరు.

ఈ విషయం లక్ష్మన్న గారి వ్యాసం చదివినప్పుడే రాద్దామనుకున్నాను. ఎందుకో కుదరలేదు.

కానీ అదే విషయాన్ని ఇంకో సంగీతకారుడు బలపరచడం చూసి ఉండబట్టలేక రాస్తున్నాను.

ఈ మాట సంపాదకులు ఇలాంటి సంగీత పరమైన వ్యాసాల్ని కూడా ప్రచురించే ముందు సంగీతం వచ్చిన వారి చేత సమీక్ష చేయిస్తే ఇలాంటి తప్పులు దొర్లవని నా అభిప్రాయం.

-సాయి బ్రహ్మానందం గొర్తి