Comments on: నాకు నచ్చిన పద్యం - పారిజాతాపహరణంలో సత్యభామ

by: srihari
ఇది చాలా మంచిపద్యము. ఇది తెలిపినందుకు కృతజ్ఞతలు. ఇలాంటివి పారిజాతాపహరణములో ఎన్నో ఉన్నాయి.

by: వాడపల్లి శేషతల్పశాయి
పోతనగారు చాలా చాకచక్యంతో  “నీవు గుణరహితుండవు”  అని వ్యాజస్తుతి చేశారు. మఱిన్ని వివరాలకై దివాకర్ల  వేంకటావధానిగారి “పోతన వ్యాజస్తుతి-వ్యంగ్య వైభవము” అన్న వ్యాసమును “భాగవత వైజయంతిక” లో చదువవచ్చు.

నమస్సులతో,

వాడపల్లి శేషతల్పశాయి.

by: రానారె
యెర్నేనిగారూ,  కృతజ్ఞతలు. ‘ఘనసింహంబుల’ పద్యాన్ని నేను తప్పుగా వుటంకించాను.

రుక్మిణి సోదరుడు రుక్మి “గోపాలకా, వెన్నదొంగా” -అంటూ కృష్ణుని వెంబడించి, “కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, విడువు విడువవేని…” అని బెదిరించడం, ఆతరువాత కృష్ణుడు రుక్మిని చంపబోతే రుక్మిణి వచ్చి, “ముకుందుడు మాకు అల్లుడయినాడని సంతోషించు నాతల్లిదండ్రులకు పుత్రశోకం కలిగించకుమ”ని ప్రాధేయపడటం, కృష్ణుడు దయదలచి రుక్మి తలవెండ్రుకలు, గడ్డము,మీసాలను పాయలుపాయలుగా ఖండించడం … ఇది తలవంపులపనే కదా!

by: జె.యు.బి.వి. ప్రసాద్
కౌసల్య అంతపురంలో పంజరం లోని పక్షులు ఎలా కైకని దూషిస్తాయో తెలియజేసే వర్ణన కూడా వాల్మీకి మూలంలో వుంది. అంటే సవతుల మధ్య వైషమ్యాలు మొదటి నించీ వున్నాయనే అర్థం. ఈ రోజుల్లో లాగా పూర్వకాలంలో సవతులు సఖ్యంగా వుండే వారు కాదు. పల్లెటూర్లలో స్త్రీలు, తమ భర్తలు చేరదీసిన స్త్రీలకి కళ్ళు పోతే, వెంకన్న స్వామికి వెండి కళ్ళు చేయిస్తామని మొక్కుకున్న సంఘటనలు వున్నాయి. భర్తలని అనడం, వాళ్ళని కంట్రోల్ చెయ్యడం చేతగాక, భర్తలు చేరదీసిన స్త్రీల మీద అక్కసు చూపించుకోవడం జరుగుతుండేది. ఈ రోజుల్లో అయితే, ఇద్దరు భార్యలున్న ఓ విప్లవ కవి, చక్కగా చెరో భార్య భుజం మీదా చెరో చెయ్యీ వేసి, ఫొటో తీయించుకుని, పత్రికలో వేయించుకుంటాడు. అనేక కారణాల వల్లా ఆ సవతులిద్దరూ, ఎంతో సఖ్యతతో ఒదిగి మదిగి వుంటారు ఫొటోలో. పాత కాలంలో అలా కాదు మరి.

ప్రసాద్

by: Sai Brahmanandam Gorti
వి.ఎన్.రాయ్ గారూ,

కైకేయిపై ఆవిడకి పీకలవరకూ మంట అనే వాక్య ప్రయోగం నేను సరిగ్గా రాయలేదు. మంట అనకుండా అక్కసు అని రాసుంటే బాగుండేదేమో అనిపించింది.  ఈ కావ్యాలూ, పురాణాలు చదివినప్పుడు ఎవరి దృక్పథంలో వాళ్ళు ఆలోచిస్తారు. ఒక్కోసారి మన అభిప్రాయాలు మూలాలపై ఆక్రమణ చేస్తాయి.  మరోసారి వాల్మీకి రామాయణం తిరగేసి నా వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

-సాయి బ్రహ్మానందం్ గొర్తి

by: Sai Brahmanandam Gorthi
ఎన్. వి. రాయ్ గారూ

కౌసల్యకి కైక అంటే కిట్టదు. కారణాలు అనేకం. కానీ పైకి చెప్పదు కూడా. తన మనసులో ఉన్నది మొదటి సారి చెప్పింది రాముడికే! అదీ కాసింతే! దశరధుడు పోయాక మొత్తం కసి వెళ్ళ్గక్కుతుంది. సుమిత్ర దగ్గర కూడా కైకని ఆడిపోసుకుంటుంది.

అది దృష్టిలో ఉంచుకునే రాసాను( ఆ భావం రాలేదేమో)

” కౌసల్య కి కైక అంటే పీకల వరకూ మంట. ఇది కైక వరాలు అడగక ముందు నుంచీ ఉన్నదే! వాల్మీకి రామాయణం మూలం చదివితే అర్థం అవుతుంది మిడిమిడి జ్ఞానంతో మన సినీ ప్రియులు చేసిన కావ్య హత్యలు.”  అన్న ఈ రెండు వాక్యాలూ రెండు పేరాలుగా రాసి ఉండాల్సింది.  ఇందులో రెండో వాక్యం సినిమా వాళ్ళకి చెందుతుంది. కౌసల్య అంటే సాత్వికురాలిగా చిత్రీకరించార న్నదే నా అభిప్రాయం.

-సాయి బ్రహ్మానందం గొర్తి

by: N. V. Roy
కామేశ్వర రావు గారికి అబివాదాలు.

నిజమే! కౌసల్యతో రాముడు  తాను దండకారణ్యానికి వెళ్ళుతున్నానని చెప్పినపుడు, కౌసల్య ఆడినదుర్భాషలు దశరథుడు తనని ఏ విధముగా చూచెడివాడో చెప్పినది. ఆమె కోపముగా చెప్పిన మాటలలో  కైకేయిని దూషిస్తున్న అర్థం ఎక్కడ వున్నది? తనని, దశరథుడు కైకేయియొక్క దాసజనముతో సమానముగా, అంతకంటె తక్కువగా చూచెడివాడని అన్నది. పోతే,  కైకేయిపై ఈర్ష్య ఉండడం సహజమే! తాను పట్ట మహిషి. కైకేయి చిన్న భార్య. దశరథుడి ముద్దుల భార్య.  బహుభార్యాసమాజంలో్సవతులపై ఇటువంటి ఈర్ష్యలు  ఉండడం సహజమే కద!

మీరు రాసిన ఆఖరి వాక్యం మీ స్వంత వ్యాఖ్య. వాల్మీకిలో లేదు కాబట్టి, దానిపై నేను వ్యాఖ్యానించను.  పోతే, తన గోడు చెప్పుకుంటూ,

సా బహూన్య మనోజ్ఞాని వాక్యాని  హృదయఛ్చిదాం,

అహం శ్రోష్యే సపత్నీ నామవరాణాం వరా సతీ. అని వాపోయింది.  ఇందులో అందరు సవతులూ తనని అనే ఎన్నో చెడ్డ మాటలు వినవలసి యున్నది, అన్న అర్థం ఉన్నదికదా!  ఆవిడకి సవతులందరూ ఒకటే! కైకేయిపై ఆవిడకి పీకలవరకూ మంట అనే భావం నాకు పట్టలేదు.

విధేయుడు,

యన్. వి. రాయ్

by: Kameswara Rao
రాముడు అడవికి వెళతానని తల్లికి చెప్పినప్పుడు మొదటిసారిగా కౌసల్య తన దుఃఖాన్ని బయట పెడుతుంది వాల్మీకంలో.

“నా భర్త రాజుగా ఉన్న ఇన్ని రోజులూ నేను ఎలాటి సుఖాలూ పొందలేదు. కనీసం నువ్వు రాజువయ్యాకైనా పొందుతాననుకున్నాను! నా సవతులనించి నేనెన్ని దుర్భాషలు విన్నాను పట్టమహిషినై కూడా! నా భర్త నాకు ఏ స్వాతంత్ర్యమూ ఇవ్వక చాలా తక్కువగా చూసేవాడు. కైకేయి దాసీజనం కన్నా హీనంగా నన్ను చూసేవాడు”. ఈ మాటలబట్టి కౌసల్యకి చాలా రోజులుగానే మనసులో ఆవేదన, కైకేయి అంటే ఈర్ష్యా ఉన్నాయనే అనిపిస్తుంది. ఈ మాటలనేటప్పటికి రాముడు కైకేయి వరాల వల్లే అడవికి వెళుతునాడన్న విషయం తెలుసని కూడా చెప్పలేం.

by: Lyla yerneni
రానారె అన్నారు:

“యాదవులు తమ కంటే తక్కువవారని భావించే ఈ ‘ఘనసింహంబులకు’ రుక్మిణి తలవంపులు తెచ్చినట్లేకదండీ? ”

కాదండి. మన్నించాలి.

‘ఘనసింహాలు’ రుక్మిణి పుట్టింటి వాళ్ళు కారండి. వాళ్ళు శిశుపాలుడు, జరాసంధాది రాజులు. యదు సేనల  చేతిలో బాగా దెబ్బలు తిని పారిపోతూ ఆ రాజులు శిశుపాలుడికి;

బ్రతుకవచ్చు నొదల బ్రాణంబు లుండిన

బ్రతుకు గలిగెనేని భార్య గలదు

బ్రతికి తీవు భార్యపట్టు దైవ మెరుంగు

వగవవలదు చైద్య! వలదు వలదు.

అని చెప్పేసి, వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయారు.

ఒకవేళ అంతకుముందు బలాబలాలు గురించి ఏమనుకున్నా, అప్పటికి యాదవులదే పై చేయి అని తేలింది.

శిశుపాలుడికి ఇంకా నయం రుక్మిణి నివ్వలేదు.  ఆమె కృష్ణుడిని  ఎంచుకుని మంచి పని చేసింది, అని రుక్మిణి పుట్టింటి వాళ్ళు అప్పటికైనా తప్పు గ్రహించుకుని , లెంప లేసుకుని ఉండరూ.

లైలా

* ఈ పద్యమూ పోతన భాగవతము నుంచే.

by: ఎన్‌. వి. రాయ్‌
” కౌసల్య కి కైక అంటే పీకల వరకూ మంట. ఇది కైక వరాలు అడగక ముందు నుంచీ ఉన్నదే! వాల్మీకి రామాయణం మూలం చదివితే అర్థం అవుతుంది మిడిమిడి జ్ఞానంతో మన సినీ ప్రియులు చేసిన కావ్య హత్యలు. ”

అయ్యా, బ్రహ్మానందంగారూ! నాకు వాల్మీకి బాగా తెలీదు.  అందుకని ఈ ప్రశ్న.

ఈ  పై పేరగ్రాఫు నాకు సరిగా బోధపడలేదు.  కౌసల్యకు కైక అంటే పీకలవరకూ మంట,  కైక వరాలు అడగకముందునుంచే ఉండటం వాల్మీకిలో ఉన్నదా? లేక సినిమాలవాళ్ళు తయారు చేసారా? మూలంలో కౌసల్యావిలాపలోఅన్న భాగంలో మాత్రమే కైకేయిని కౌసల్య దూషణభాషలాడుతుంది. అది సహజమేకదా! కొడుకుని, కోడలినీ అడవులకి తోలేస్తే,  కైకని కావలించుకొని అందలానికెక్కిస్తుందా? అప్పుడు తప్ప, కౌసల్యకి పీకలవరకూ కైకపై కోపం వరాలు అడగకముందునుంచీ ఉన్నట్టు వాల్మీకిలో ఎక్కడ ఉన్నది? ఒకవేళ అది సినిమాలవాళ్ళు సృష్ఠిస్తే, అదే మీ ఉద్దేశం అయితే, మీరు రాసిన పేరగ్రాఫులో మాత్రం ఆ సూచన సూటిగా రాలేదు. మీరువేసిన ఆశ్చర్యార్థకం(!) లో గూఢంగా ఆ  అర్థం ఉంటే మన్నించగలరు, మరియూ  దయచేసి వివరించగలరు.

విధేయుడు,

ఎన్. వి. రాయ్

by: రానారె
>> “తను నమ్మిన దానికోసం కన్న వాళ్ళని ఎదిరించి కృష్ణుణ్ణి యుద్ధానికి ప్రేరేపించి, ఎవరికీ తలవంపు లేకుండా కార్య సిద్ధి కావించిన ధీర వనిత.”

కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వరకూ సరే అయినా, ఆమె పుట్టినింటివారికి తలవంపులు మాత్రం తప్పలేదు కదా! రుక్మిణిని కృష్ణుడు రథమెక్కించి తీసుకెళ్తున్నాడన్నవార్త విన్న ఆమె బంధువులు కుతకుతలాడిపోతూ, తమకు రోషాలు నూరిపోసుకంటూ కృష్ణుణ్ణి నిలువరించడానికి సమాయత్తమయ్యే సన్నివేశంలోని ఒక పద్యం …

ఘనసింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్ బాలఁ దోడ్కొని గోపకుల్ చనుచున్నారదె, శౌర్యమెన్నటికి? మీ శస్త్రాస్త్రముల్ కాల్పనే? తనుమధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్!?

(పద్యం నాకు సరిగా గుర్తులేక తప్పులు దొర్లి వుండవచ్చు… )

యాదవులు తమ కంటే తక్కువవారని భావించే ఈ ‘ఘనసింహంబులకు’ రుక్మిణి తలవంపులు తెచ్చినట్లేకదండీ?

by: Sai Brahmanandam Gorti
లైలా గారూ,

‘ తులసి దళం చేత్తో పట్టుకుని, పతిభక్తి అనుకుంటూ పాదసేవలూ, పూజలూ చేసే రుక్మిణి లాగా వుండే సత్యభామను తెలుగువారు అంగీకరించలేరు. ” అని రాసారు. మన తెలుగు సినిమా వాళ్ళ దౌర్భాగ్యం వల్ల రుక్మిణి అంటే పళ్ళెంలో తులసీ దళం, వీలున్నప్పుడల్లా కృష్ణుడి పాదాభివందనం, తల దించుకుని ఒద్దిక గా ఉన్న స్త్రీ గా చూపించారు. ఇది కేవలం సత్యభామని తలబిరుసున్న వ్యక్తిగానూ, రుక్మిణి అంటే సాత్వికంగానూ చూపించి పాత్రల మధ్య విభిన్నత చూపించే ప్రయత్నంలో రుక్మిణి పాత్రని ఖూనీ చేసి పడేసారు.  రుక్మిణి చాలా ధైర్యవంతురాలే కాదు, అనుకున్నది సాధించే గంభీరమైన వ్యక్తిత్వ మున్న స్త్రీ!

తను నమ్మిన దానికోసం కన్న వాళ్ళని ఎదిరించి కృష్ణుణ్ణి యుద్ధానికి ప్రేరేపించి,  ఎవరికీ తలవంపు లేకుండా కార్య సిద్ధి కావించిన ధీర వనిత.

సినిమాలు చేసే చెడ్డల్లో ఇదొకటి. తీసేవాళ్ళు చదవరు. చదివే వాళ్ళు తీయరు. అందుకే ఈ అపోహలని నా అభిప్రాయం.

రామాయణంలో కౌసల్య ని కూడా రుక్మిణిని కట్టిన గుంజకే కట్టి పడేసారు. కౌసల్య కి కైక అంటే పీకల వరకూ మంట.  ఇది కైక వరాలు అడగక  ముందు నుంచీ ఉన్నదే!  వాల్మీకి రామాయణం మూలం చదివితే అర్థం అవుతుంది మిడిమిడి జ్ఞానంతో మన సినీ ప్రియులు చేసిన కావ్య హత్యలు.

-సాయి బ్రహ్మానందం గొర్తి

by: Lyla yerneni
రానారె అన్నట్లుగానే,  ఈ పద్య వ్యాఖ్యానం చాలా రసవత్తరంగా ఉంది.

“తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే (ఇమేజ్) వేరు.”

పై మాటలూ సబబే.

తిమ్మ కవి భాగవతం లో లేనేలేని ఘట్టాన్ని కల్పించే ముందే,  ” కులమును రూపమున్మగని కూరిమి కలదాననంచు” రుక్మిణి,  సత్యభామలు ఇద్దరి మనసుల్లో రవరవలున్నాయని  మనకు చెప్పి అప్పుడు పారిజాతప్పువ్వుతో నారద ప్రవేశం చేయించి అందమైన కథ అల్లారు కదా.

పోతన భాగవతంలో, నరకాసుర వధ తర్వాత సత్యభామతో కలిసి కృష్ణుడు దేవలొకం వెళ్ళి ఆమె అడిగితే నందనవనము నుంచి పారిజాత వృక్షము దొంగిలించి తెస్తాడు.  ఒకవేళ ఆయన ఆ పని చెయ్యక పోతే సత్యభామే తెచ్చుకునేది. ఆమె విలువిద్యా కౌశలం ఎంత గొప్పదో నరకసుర వధ సందర్భంగా పోతన మనకు భాగవతంలొ చూపలేదా :-)

భార్యల మధ్య ఈసు అంటారా - విశ్వనాథ వ్రాసిన పీఠికలో చెప్పినట్లు, - కృష్ణుడి విషయంలో అది కొద్దిగా నమ్మటం కష్టం. భాగవతంలొ నరకాసుర వధ తర్వాత చెరసాల్లో ఉన్న పదహారు వేల రాజకన్యలను విడిపించి వారికి ఎన్నెన్నో బహుమానాలిచ్చి, వాళ్ళను ద్వారక పంపించి అప్పుడుకదా ఆయన ఇంద్రుడిని చూడ్డానికి వెళ్ళింది.  ఆ తతంగమంతా చూసి, అప్పుడు గరుత్మంతుడినెక్కి, ఆయనతో ఇంచక్కా వెళ్ళిన సత్యభామకు, అంత ఈసు ఎక్కడినించి వస్తుంది చెప్పండి. అదీ ఒక్క పూవు గురించి.

ఐనా తిమ్మన కవి కథ మార్చి,-సవతిని గూర్చి నారదుడి రెచ్చగొట్టే మాటలు, చెలికత్తె అవి చేరవేసినప్పుడు  కలిగే చిన్నతనం - వాటినుంచీ కథ పెంచుకుంటూ రసవంతంగా కథ నడిపారు.

‘ తులసి దళం చేత్తో పట్టుకుని, పతిభక్తి అనుకుంటూ పాదసేవలూ, పూజలూ చేసే రుక్మిణి లాగా వుండే సత్యభామను తెలుగువారు అంగీకరించలేరు. ”

తెలుగు సినిమాల్లో ఆ నీరసపు నటి శ్రీరంజనితో  రుక్మిణి పాత్ర వేయించి, రుక్మిణి ఇమేజ్ పాడు చేశారు.  పోతన భాగవతం చదివితే ఒక చక్కని ధీర ప్రణయిని, ఆదర్శనీయమైన కథానాయిక - అసలు రుక్మిణి కనబడుతుంది గదా.

లైలా

by: రానారె
ఈ వ్యాఖ్యానం విన్నాక ఈ పద్యం ఎంత శక్తివంతమైనదో తెలుస్తోంది. నాలుగు పాదాల్లో ఎంత స్క్రీన్ ప్లే యిమిడివుందో తెలుసుకొన్నాక చాలా ఆనందం కలిగింది. మొత్తంగా ఈ శీర్షికే మహగొప్పగా వుంది. బృందావనరావుగారికి నమస్సులు.

by: మురళి నందుల
మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు సంతోషం. వీలుచేసుకొని, ఆ ముక్కు పద్యాన్ని కూడా వివరించగలరు.