ఈమాట » రంగులు

Expand to right
Expand to left

రంగులు

వరిచేలు పచ్చగా లేవు
మట్టి దిబ్బలు ఎర్రగా లేవు

ప్రకృతి రంగులన్నిటినీ
దోచేసుకుని రాత్రి
ఎటో పారిపోతోంది

తూరుపు కొండ చాటున
మాటు వేసిన సూర్యుడు
రాత్రి మీద దాడిచేసి
వేటి రంగుల్ని తిరిగి
వాటికే ప్రసాదించాడు

గడ్డిపరక మీద
రెండు కన్నీటి బొట్లు విడిచి
రాత్రి మాయమైంది!


మూలా సుబ్రహ్మణ్యం

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు.  ...

 

(5 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. radhika అభిప్రాయం:

    January 3, 2008 12:16 pm

    చాలా బాగుందండి

  2. కృష్ణ అభిప్రాయం:

    January 3, 2008 3:08 pm

    బాగుంది. ఇదీ కవిత్వమంటే. కొత్త ఆవకాయ ఘుమఘుమలు బాగున్నాయి. ఇంత తక్కువే పెట్టారే? నిజంగా కొత్తదనమున్న కవిత.

  3. teresa అభిప్రాయం:

    January 5, 2008 6:55 am

    ఈ ఆవకాయ తక్కువ పెట్టినా చాలా బావుందండీ. మళ్ళీ మళ్ళీ తినాలన్పించేలా1

  4. Sowmya అభిప్రాయం:

    January 30, 2008 6:48 am

    బాగుందండీ… ఇదే భావం మరెక్కడో చదివినట్లు గుర్తు నాకు. కానీ…. అది పక్కన పెట్టేస్తే…
    “గడ్డిపరక మీద
    రెండు కన్నీటి బొట్లు విడిచి
    రాత్రి మాయమైంది!”
    - బాగుంది చాలా….

  5. తెలుగు అభిమాని అభిప్రాయం:

    February 22, 2008 9:34 am

    బాగుంది. చక్కటి కవిత్వం.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a