నా జ్ఞాపకం
ఆ సాయంత్రం
యవ్వనమింకా
శీతాకాలపు ప్రొద్దుటి
పదిగంటల ఎండలా
మెరిసిపోతున్న వేళ
నడిచి వెళ్తున్న మట్టిరోడ్డు
ఎక్కడో అలసి ఆగి కాకి
అరిచిన వెర్రి అరుపు
పాత సామానులు కొనే
నల్ల తాత గావుకేక
పరిగెత్తే రైలు కూత
చీర ఆరవేస్తూ ఆగిపోయిన
రంగి చూపు
నీకు పూలతోటలా
పరుగులెత్తే జలపాతపు
నీటి అలజడిలా
తేనెటీగల రొదలా
మెత్తటి తివాచీపై
పడుకొని రూపాలు మార్చే
మేఘంలా
రంగులు మార్చే ఆకాశంలా ఉందంటే
నా ప్రేమ మత్తుగాక
మరేమిటి?
తెరవకుండానే
ఎగిరిపోయిన ఉత్తరాన్ని.
పెట్టుకోకుండానే రాలిపోయిన
వజ్రపుటుంగరాన్ని.
మరోసారి కొరికేలోపే
జారిపోయిన బందరు మిఠాయిని
తియ్యగుంటానో
కమ్మగుంటానో
మత్తుగొలిపేనో
అని ఒంటరితనం
రాలిపడ్డ పండుటాకులా
నిన్ను ఆవరిస్తూ ఉంటే
నా జ్ఞాపకం గూడు వదిలిన
సీతాకోకచిలుకలా
నిన్ను మళ్ళీ గతం వైపు
మొగ్గలేయిస్తుంది!
teresa అభిప్రాయం:
January 1, 2008 7:00 pm
మొదట చదవగానే ఈ కవిత కొంత disconnected గా అన్పించింది గానీ నాలుగు సార్లు ఓపిగ్గా చదివితే మంచి భావం కనబడింది!
Subrahmanyam Mula అభిప్రాయం:
January 3, 2008 9:00 pm
చాలా బావుందండీ.. మీ పాత కవితలు కూడా చదివాను.మంచి పదచిత్రాలు ఉన్నాయి. keep writing!
yasasvi అభిప్రాయం:
February 15, 2008 8:15 am
డియర్ వేలూరి,
అనుకోకుండా మీ సైట్ లోకి రావటము, కొన్ని రచనలని చదవటము జరిగింది.
congratulations చెప్తాను ముందు. ఎందుకంటే పత్రిక అన్నది - అదీ ఈ formలో కానివ్వండి - నడపటం కొంచెం కష్టమైన విషయమే గనక. అందునా మీరు “ఉత్తమ సాహిత్యం” తెలుగులొ ప్రచురిస్తామని మీ ధ్యేయం గ చెప్పేసరికి కొంచెం ఆసక్తి గ మీ పత్రిక ని browse చేసాను.
నన్ను మరీ నిరాశ పరిచింది మీరు అచ్చు వేసిన కవిత్వం. బహుశా మీరు మంచి సాహిత్యాన్ని తెలిసిన వారే అయి వుంతారు. మంచి కవిత్వాన్ని కూడ. మీరు ప్రకటించిన ఉత్తమమైన అనే standard లోకి రాకపొతే పొయే, గాని మరీ నేలబారు గ వుంటే ఎలాగండీ?? పద్మలత అయల సొమయాజుల గారి ది కవిత్వమా? భాష లేదు. భావం లేదు. మిగతా వాళ్ళవి కూడ బొత్తిగా బాగులేవు. జంధ్యాల సినిమా లో “తవిక” అని వెక్కిరించిన స్థాయి లొ వున్నాయి. ఉదయకళ అన్న ఆవిడవి కాస్త మెరుగు.
మీరు ఒక standard ని ప్రకటించాక అంతకు తగ్గ కుండా వుండక పోయినా అసలు కవిత్వం రాయటం రానివాళ్ళవో… రాయలేని వాళ్ళవో ప్రచురించటం poetry కి ద్రోహం చేయటం కాదా??
am sorry to say this.. కవిత్వం రాయటం చాత కాని వాళ్ళు .. తమ హద్దులు తెలుసుకుని ఆగిపోవటం మంచిది. తెలుగు కవుల మీద గౌరవం వుంటేనూను, తెలుగు పాఠకుల మీద ప్రేమ కాకపోయిన కనీసం జాలి లాంటిది ఉంటేనూను.
అనేక నమస్కారాలతో,
యశస్వి