ఈమాట » జేబఱబూచి

Expand to right
Expand to left

జేబఱబూచి


వికీపీడియా నించి

అమాకారు రాత్రి జాఱుడు ఊబి బుయ్యల్లోంచి జరజరా
బూఱడ కన్ను పాఱడ పళ్ళు కొరుకుతూ రాకాసి
కోఱల నోరు బారడు చాచి వొచ్చెస్తాడు జేబఱబూచి మాబోయ్
ఱంపం వొళ్ళు వంకర తోక ఝాడించుకుంటూ రంకెలు వేసి
అమ్మో మమ్మీ వెనక ఉలుబులుకు దాంకో పారిపో పారిపో.

జేబఱబూచి కరిసీగల్డు జాగర్త బూగుచ్చుముండా నీ
ఊబులకుయ్యి నొక్కెస్తాడు కోఱల పార బుసగొట్టి
శూలం కొమ్ము దించెస్తాడు బ్లేంకీలోకి దూలి నీ
బెల్లీబటన్ లూలెస్తాడురా వాడు కోపాల నేపాళబూచాడు!

ఱంపం కత్తి ఝళిపించి నిలబడ్డాడు బున్ను
మంచం కింద కించులబండ అదిలించి రారా జేబఱా రమ్మన్నాడు
రాక్షసలోయ ద్వారం మీద తలగడా తొడగొట్టి
పందిరి చెట్టు ఊడలకి వేలాడి పాతాళ మాంత్రికుడి
తెంపరి చూపు టక్కరి చెవ్వు అశ్శరభ రిక్కించి క్రీగన్ను.

అచ్చర కాలు సవరించుకున్నంత ఇంతలో ఆ వెనక సడి చూడు
పచ్చల కళ్ళు జబ్బర తోక తాటించి నీ బొజ్జ కరిసెస్తాడు
గొగ్గఱ పళ్ళు బుగ్గల మీద బులికించి గున గునా వూబుల వొళ్ళు
నాగుల తేప రాసెస్తాడు అగ్నిశ్వాస ఎగజిమ్మి ఊసెస్తాడు
తప తపా ఆషాఢ భూషాడు!

దమ్ములుంటే రా రా నీ మేంగో జ్యూసు లూలెస్తాను బూచీ అని
అమ్ములపొదిని ఝళిపించి వొంకల కత్తి కస కసా గుచ్చీసేడు బజ్జన్న
జిజ్జర పిట్ట ఏడుపులు జేబఱ నాగు జడిచచ్చి పడ్డట్టు చప్పుళ్ళు
జారుడు లాగు ఎగదోసుకుంటూ విజయ నాసికలు ఎగబీల్చి జగమొండి రాజా.

అమ్మో జేబఱబూచినే సితక చంపీసేవు కన్నా?
ఒచ్చీ వొచ్చి నా బొజ్జమీదెక్కిపోవే అనుమంతు ముండా!
జయ ధ్వానాలు చేస్తాము రా రా అల్లల్లబున్నీ అక్కుచిక్క
పక్కెక్కి చప్పట్లు కొట్టించుకుంటూ రాకాసి శశి వదన!

అమాకారు రాత్రి జాఱుడు ఊబి బుయ్యల్లోంచి జరజరా
బూఱడ కన్ను పాఱడ పళ్ళు కొరుకుతూ రాకాసి
కోఱల నోరు బారడు చాచి వొచ్చెస్తాడు జేబఱబూచి మాబోయ్
ఱంపం వొళ్ళు వంకర తోక ఝాడించుకుంటూ అటు చూసి ఇటు చూసి.

[మూలం : Lewis Carrol - Jabberwocky]

 

(5 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. కొత్తపాళీ అభిప్రాయం:

    November 3, 2007 4:51 pm

    అద్భుతం!
    బండి ఱ ఉపయోగం బూచి భీకరత్వాన్ని ఇనుమడింప చేసింది.
    “జ్యూసు లూలెస్తాను బూచీ”?? అర్ధం కాలే!

  2. Poolavari Venkanna అభిప్రాయం:

    November 4, 2007 2:26 pm

    మంచి ప్రయత్నం. మాత్రా ఛందస్సులో స్వేఛ్ఛాను వాదం వర్తమానానికి అనుకూలంగా ఉండవచ్చని సలహా.

  3. #vishNubhoTla lakshmanna# అభిప్రాయం:

    November 14, 2007 10:22 am

    నేనూ, రామన్నా పుట్టి పెరిగిన ఊరూ కనకప్రసాద్ గారి ఇంటి పేరూ ఒకటే కావటం కాకతాళీయం కాదు!

    నాకు మా ఊరు సరిపల్లె అంటే ఎంత ఇష్టమో, కనకప్రసాద్ గారి రచనలంటే అంటే అంతకన్నా ఇష్టం. వీరి శైలి పరమాద్భుతం! చదువుతుంటే, కళ్ళకు కట్టినట్టుండే వర్ణనల వల్ల బహుశా అమెరికాలో తెలుగులో వచనంలో రాసే వారందరిలో ముఖ్యులు అని నా అభిప్రాయం!

    అమెరికాలో తెలుగువారి జీవిత విషయాలను ఇతివృత్తంగా ఈమాటలో వీరి కథలను చదవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. కనకప్రసాద్ గారికి నా కోరిక చెప్పాను కూడా! వీలు చూసుకొని రాస్తారని ఆశిస్తూ,

    లక్ష్మన్న

  4. abvr అభిప్రాయం:

    November 17, 2007 8:27 am

    1. “…బూగుచ్చుముండా….”
    2. “….బెల్లీబటన్ లూలెస్తాడురా వాడు కోపాల నేపాళబూచాడు!……”

    ఫై వాడుకలు లేకపోతే, పాఠ్య పుస్తకాల్లో వేసుకోవచ్చు. గొప్ప అను వాదం. ముఖ్యంగా పిల్లల కోసం.

  5. Ram Maruri అభిప్రాయం:

    December 13, 2007 12:25 pm

    Website చాలా బాగుంది

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a