Comments on: ఫాంటసీ — రియాలిటీ

by: Rao Vemuri
“కోర్సును నిర్వహిస్తున్న విభాగం వారు తెలుగు కోర్సుపై వివక్షత చూపకుండా ఆప్రమత్తంగా ఉండాలి. ” అని కృష్ణారావు గారు రాసేరు. కోర్సును నిర్వహిస్తున్న విభాగం వారు తెలుగు కోర్సుపై ఎందుకు వివక్షత చూపుతున్నారో మాలాంటి వారికి తెలిస్తే మా జాగ్రత్తలో మేము ఉంటాము ఇక్కడ బెర్క్లీలో. పత్రికా ముఖంగా చెప్పటం ఇష్టం లేకపోతే ముఖస్థంగానో, మరేదైనా అనుకూలమైన పరోక్ష పద్ధతిలోనో కృష్ణారావు గారు సలహాలు ఇవ్వగలరు.

by: Krishna Rao Maddipati
ఒక చిన్న సవరణ: యూనివర్సిటీ ఆఫ్  మిషిగన్  లో డిట్రాయిట్  తెలుగు వాళ్ళ సహకారంతో ప్రారంభించిన తెలుగు విద్యాబోధనా కార్యక్రమం మూతబడింది!

“కర్ణుడి చావుకి కారణాలనేకం” అన్నట్టు దీనికీ చాలా కారణాలున్నాయి. ఐదు సంవత్సరాలపాటు సగం ఖర్చు మేం భరిస్తాం అన్న యూనివర్సిటీ వాళ్ళు బూసయ్యగారి ప్రభుత్వం డబ్బులివ్వటంలేదని చేతులెత్తేసింది. ఈ కోర్సుని నడుపుతున్న దక్షిణాసియా విభాగం సవతితల్లి చూపుతో తెలుగు కోర్సు ఒకటుందని విద్యార్ధులకు తెలియజేసే ప్రయత్నాలు ఇసుమంతైనా చెయ్యక పోవడంతో, ఎన్రోల్మెంటు తగినంతగా ఉన్న మూడేళ్ళలో ఎప్పుడూ జరగలేదు. ఇహ మా ఊరివాళ్ళు డబ్బులిచ్చి చేతులు దులుపుకున్నారు గాని కోర్సులో ఎన్రోల్మెంటు పెంచే ప్రయత్నాలేవీ చెయ్యలేదు. చివరిగా ఒక మిలియన్  డాలర్లు ఇస్తే తెలుగు కోర్సును నిరాటంకంగా నడుపుతాం అని యూనివర్సిటీ వాళ్ళంటే, ఆ డబ్బును సమకూర్చడానికి చేసిన ప్రయత్నాలూ పురిట్లోనే సంధికొట్టాయి. తలుచుకుంటే దీనికి కావలసినంత డబ్బు ఇవ్వగలిగిన కోటీశ్వరులు మా ఊళ్ళో లేకకాదు. పిల్లి మెడలో గంట కట్టే పని ప్రతి ఎలుకా ప్రక్కనున్న ఎలుక మీద పెట్టి తప్పుకోవడమే దీనిక్కారణం!

డిట్రాయిట్ అనుభవంతో మిగిలిన ప్రాంతాలవాళ్ళు ఈ క్రింది జాగ్రత్తలు వహిస్తారని ఆశిస్తాను:

1. బోధనా కార్యక్రమం ఉన్నచోట తెలుగు వారి పిల్లల్నందరినీ సమాయత్త పరిచి, బ్రతిమాలో, బామాలో, బెదిరించో, కాళ్ళమీద పడో, లేకపోతే వాళ్ళ సెంటిమెంటును వాడుకునో, ఎన్రోల్మెంటు తగినంతగా ఉండేటట్టు చూడాలి.

2. యూనివర్సిటీతో గాని, ప్రభుత్వంతోగాని సంబంధం లేకుండా కోర్సునో పరిశోధనా విభాగాన్నో నిరంతరంగా నడపగలిగే ధన సముపార్జన  ముందుగానే జరగాలి.

3. కోర్సును నిర్వహిస్తున్న విభాగం వారు తెలుగు కోర్సుపై వివక్షత చూపకుండా ఆప్రమత్తంగా ఉండాలి.

by: Rohiniprasad
పొరుగు ప్రాంతాల్లోని తెలుగును గురించి పరిచయం చేసే అద్భుతమైన వ్యాసాలను రాస్తున్న రమేశ్ గారు ఎన్నెన్నో తెలియని విషయాలను గురించి వివరిస్తున్నారు.

by: Kameswara Rao
తెలుగు భాషా బోధన వల్ల భాషాభివృద్ధి జరుగుతుందన్నది అందరికీ సులువుగా అర్థమయ్యే విషయమే. అలానే సాహిత్య అనువాదాల ద్వారా భాషకి కలిగే వ్యాప్తికూడా అందరికీ తెలిసినదే.

కాని విశ్వవిద్యాలయాల్లో పరిశోధన భాషాభివృద్ధికి ఎంతవరకూ దారితీస్తుందన్నది సామాన్య ప్రజలకి (అంటే నాలాంటి వాళ్ళకి) చప్పున బోధపడే విషయం కాదు. కాబట్టి, తెలుగు భాషా సాహిత్యాల గురించి విదేశాలలో జరుగుతున్న పరిశోధన, అది తెలుగు భాషాభివృద్ధికి ఎట్లా దోహదం చేస్తోందీ అనే విషయాలపై “ప్రవాసంలో తెలుగు పరిశోధన” వంటి వ్యాసం ఒకటి తెలుసున్న వారిచేత రాయించి ప్రచురిస్తే బాగుంటుంది.