వసంతభామిని
వచ్చెనదె వాసంతిక
సుధాపూర్ణ విపంచిక
చారు సుందర సీమలందున
చైత్ర భామిని ప్రభవించగ
వనములందున మనములందున
పుష్ప సంచయ ప్రహేళిక
త్వరితగతినీ తలలనూచీ
మోసులెత్తును పసరిక
రెమ్మరెమ్మకు ఆకులతికే
కొమ్మ కోరిక మీరగా
వేప గంధముతనువుసోకీ
మొగ్గదాల్చిన మల్లిక
మావి చివురులు తీరమెసవీ
కుహుకళించెను కోయిలా
తోటలందున బాటలందున
విరులు దాల్చిన తరువులై
పూవుపూవును స్పృశించు వేడుక
పరిభ్రమించే భ్రమర రవమై
మించు వేడుక నుద్యమించే
హొయల పులుగుల వేకువై
భువన మోహన
యమున విహరణ
మధుర కామన
గురుతు లెరిగిన సమయమై
జగతి కంతకు జననితానై
ఇలను జీవము నింపగా
కొత్తపాళీ అభిప్రాయం:
November 5, 2007 4:30 am
బాగుందండీ.
sujatha kotamraju అభిప్రాయం:
November 5, 2007 5:43 am
jhansi lakshmi garu,
your poem is beautiful. i really enjoyed it.
sujatha.
phaneendra అభిప్రాయం:
November 13, 2007 11:10 pm
Jhansi Garu,
అదిరింది.. కానీ నేటి సమాజం కోసం, యువత motivations కోసం, ఏదైనా వ్రాస్తే బాగుంటుంది..
Phaneendra.
lakshmikant అభిప్రాయం:
November 28, 2007 5:26 am
ఝాన్సీ లక్ష్మి గారు,
కవిత్వం అమోఘంగా వుందంది. చక్కటి తెలుగు. మీలాంటి రచయితలు వున్నంతవరకు తెలుగు భాషకు డోఖా లేదు.
Subbarao Bhimani అభిప్రాయం:
December 10, 2007 1:02 pm
చాలా బాగున్నది.
మళ్లి మళ్లి చదవాలనిపించింది