ఈమాట » శ్రావణమాఘాలు

Expand to right
Expand to left

శ్రావణమాఘాలు

నేను మాఘమాసాన్ని
నీవు శ్రావణమాసానివి

వర్షించే మేఘాలతో
హర్షాన్ని కలిగించే
శ్రావణమాసానివి
నీ రాకతో నెమళ్లు పురి విప్పుతాయి
రకరకాల రాగాలతో
శుకపికాలు గానము చేస్తాయి
నదులు పొంగుతాయి
మదులు నిండుతాయి
నీ మెరుపులతో
నీ మురిపెముతో
జగత్తే జిగేలు మంటుంది

నీవు శ్రావణమాసానివి
నేను మాఘమాసాన్ని

మెరుపులేని మేఘాలతో
ఉరమలేని మాఘమాసాన్ని
మంచు కురిసే వేళలో
కుంచించుకుపోయిన శారీరములో
రవాలు రావు
జవాలు లేవు
ఈ మానసవీణ
ఆలపించేదల్లా
మూగ రాగాలే
ప్రతిధ్వనించేదల్లా
మౌన తరంగాలే

చైత్రం వచ్చే ముందు
కలహంసలా
హంసధ్వని
నాలాపించాలని ఉంది
ఆ చైత్రరథం
ఆ జైత్రరథం
ఎప్పుడు వస్తుందో

 

(ఒక అభిప్రాయం) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Kishan Devulapally అభిప్రాయం:

    November 12, 2007 1:07 pm

    ఉదయ కళ గారి గేయం బాగుంది. చదువుతూ ఉంటే శ్రీశ్రీ వ్రాసిన అద్వైతం లోని “వాసంత సమీరం నీవై, హేమంత తుషారం నీవై - నీ ఎగిరిన జీవ విహంగం నా పగిలిన మరణ మృదంగం - చిగురించిన తోటలలోనో, చితులుంచిన చోటులలోనో; వలయములై చలించినపుడే, విలయములై జ్వలించినపుడే…”జ్ఞాపకం వచ్చింది.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a