Comments on: ప్రాచీనత గురించే మరోసారి!

by: ravikiran timmireddy
శాస్త్ర పరిఙ్ఞానం గురించి నేను మాట్లాడటం సరికాదు, కానీ ప్రాచీనత మీద మీరిచ్చిన లింకుల్లో వున్నటువంటి కుమారి. సంయుక్త కూనయ్య  వ్యాసం చదివిన తర్వాత, ఆ వ్యాసంలో ఏ మాత్రం కనపడని వొక శాస్త్రీయ పద్దతి, పరిశీలనా గమనించాక, వో మని వుషారొచ్చి మనం కూడా మనకున్న మిడిమిడి ఙ్ఞానంతో, శాస్త్రీయ పరిశీలన, పరిశోధనా పద్దతులతో సంబంధం లేకుండా ఏదో వొకటి వ్రాసి పడేస్తే పోలా అనుకుని ఇది వ్రాస్తున్నాను.

కుమారి సంయుక్తా కూనయ్య గారు మొత్తానికి కమకూరు కి సుమేరుకి పెద్ద లంకే పెట్టేరు. అంతటితో వొదిలెయ్యకుండా గాజుల బలిజల్ని బైబిల్ కి ఎక్కించేసేరు. పెన్నా నదికి హీబ్రూ భాషకి లంకెపెట్టేసేరు. తెలుగు భాషా, తెలుగు జాతికి కొంచం మాత్రవే తెగులెక్కించారు. ఆ తెగులుని ఇంకోంచం పెంచే ప్రయత్నవే ఇది.

ఈ మద్య బ్రిటీష్ మ్యుజియం లో అక్కాడియన్ కాలంనాటి నగ వొకటి చూడటం తటస్తించింది. ఆ నగ అక్కాడియన్ 2250బి.సి, ఉర్ లోని పి.జి 559 సమాధి నుంచి. మన దక్షణ భారతదేశంలో వివాహవైన అందరి హిందూ ఆడవాళ్ళ మెడల్లో కనిపించేదే అది, మంగళ సూత్రం బొట్టు. దీని ఆధారంగా సుమేరు, మెసపుటోనియా నాగరికతల ఆనవాళ్ళు మన దక్షిన భారతంలోనే వున్నయని నేను ప్రకటిస్తే, పి. హెచ. డి విద్యార్థి సంయుక్త గారు వ్రాసిన పేపర్  “తెల్‌మున్‌ భాష తెలుగు” కంటే బలవైన ఆధారాన్నే చూపించిన వాడినౌతానేవో.

కుమారి సంయుక్తగారు మరో ముఖ్య విషయం మరచిపోయేరు, నెల్లూరు జిల్లాలో  బహుళంగా కనిపించే యానాదుల జాతి గురించి వ్రాయడం. వీరిలో అక్కడక్కడా కనిపించే నీగ్రోయిడ్ పోలికల్ని బట్టీ, యానాదులు అనగా అనాదులు అనగా ప్రాచీనులు, మొట్ట మొదటి మనుషులు అని వాదించి అసలు మానవ జాతికి జన్మస్థానం నెల్లూరు జిల్లానే అని మరొక వాదాన్ని కుమారి గారికంటే, అందరి కంటే ముందు నేనే తీసుకొస్తున్నందుకు చాలా ఆనందిస్తునాను. ఈ క్రొత్త సిద్దాంతం నాచే కనుగొనబడిందని, మరొకరు దీన్ని వాడుకోదలచుకుంటే నా పేరు మాత్రం చెప్పొద్దని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇదిచూసి కోస్తా కాదు అసలు మొదటి మనిషి సంచరించింది మా తెలంగాణాలో అని, మా రతనాల సీమలో అని కొట్లాడుకోకుండా మనందరం  మన గొప్పని డప్పు కొట్టటంలో మొదటి మనుషుల స్థాయిని దాటలేదేవోనని మనవి చేసుకుంటున్నాను.

by: mohanraokotari
తెలుగు దేశం లో తెలుగు లెస్సు, విదేశాల్లో తెలుగుకి ఆదరణ, మళ్ళా అట్నుంచే నరుక్కు రావాల్సి వచ్చేట్లుంది.