Comments on: వాన-పాట

by: C.S.Rao
అలోక్ గారూ,

అసలు  “వాన-పాట” కు సంబంధించి కవి లో గాని,కవితలో గానీ అస్పష్టత (ambiguity) ఉన్నదని నేను అనలేదు కదా!

ఒక వేళ ఒకానొక కవితలో అస్పష్టత ఉంటే, దాని లో అస్పష్టత ఉన్నదని అనవచ్చును. కానీ, దాని నాధారం చేసికొని,ఆ కవి యొక్క, దాదాపు అన్ని కవితలనీ  సాధ్యమైనంత సమగ్రంగా అధ్యయనం చేయకుండా  ఆ కవి లో

అస్పష్టత ఉన్నదనటం  Rash and Irresponsible Comment  అవుతుంది.

“వాన -పాట” కవిత చాలా స్పష్టం గా ఉంది. సందేహం లేదు. పైన  నా అభిప్రాయం లో చెప్పినది దీనిలోని అననుసంధానుభూతి,రసవైరుధ్యం గురించి. అవి Contradictions  క్రిందికి వస్తవి. వాటిని గురించి చెప్పవలసింది నా అభిప్రాయం లో చెప్పాను కాబట్టి ,మరలా చెప్పటం చర్విత చర్వణం అవుతుంది.

ఇంతకుముందు నేను వ్రాసిన అభిప్రాయం కేవలం ఈ కవితకు మాత్రమే పరిమితమైనది. కవికి కాదు.

C.S.Rao

by: Kameswara Rao
వానా, పాటా రెండూ ఆనందాన్నిచ్చేవే! అప్పుడప్పుడూ రెండూ బాధపెట్టేవే కూడానూ. అలాటి వాన గురించి, పాట గురించి, వానలాంటి పాట గురించీ చెప్పే కవిత…ఎంత బావుంది!

ఒక్క వానగురించో, లేదా పాట గురించో మాత్రమే కవిత రాస్తే, అందులో ఎన్ని అందమైన, కొత్తవైన పదచిత్రాలున్నా, అది ఒక స్థాయిలో ఆగిపోతుంది. ఈ రెంటినీ పెనవేసి చెప్పడం ఒక గొప్ప కవితకి ఉండే లోతును కలిగించింది.

వాన ఒక ప్రాకృతిక సంఘటన. పాట, మనిషి లోంచి పుట్టుకొచేది. కాబట్టి అవి కలిగించే అనుభూతిలో కొంత తేడా ఉంటుంది. పాట కలిగించే అనుభూతి మరి  కొంత గాఢమైనదీ, మరికొంత ఎక్కువ కాలం నిలిచేదీనూ. అదే ఈ కవితలో మనకి కనిపించేది. ఇది మనసుకి హత్తుకోవాలంటే, కేవలం పాటని వానతో పోల్చే symbolism సరిపోదు. వానని వర్ణించి పాటగురించి కూడా ఇలాగే ఊహించుకోమని పాఠకులకి వదిలేస్తే, ఆ అనుభూతిలోని తారతమ్యం పాఠకులకి అందదు. అందికే ఈ కవిత “నీ పాట కూడా అంతే.” అన్న వాక్యంతో ఆగిపోదు. వానగా మొదలై పాటగా మిగిలిపోతుంది.

ఇక శిల్పదృష్టితో చూస్తే:

మొదటి చరణం ప్రాతిపదిక.

రెండవ చరణంలో ప్రధానంగా కనిపించేది వాన. వాన ద్వారా పాట గురించిన ఊహ.

మూడవ చరణంలో వాన-పాట సమాంతరంగా అవి కలిగించే అనుభూతుల చిత్రణ-సాదృశ్యం.

నాల్గవ చరణంలో చివరకి మిగిలిపోయేది పాట.

వానా, పాటా రెండు చిత్రాలైతే. మొదట వాన మీద focus చేసిన లైటు, క్రమేపీ, పాటమీదకి మారడం ఈ కవితలో శిల్పం సాధించిన విశేషం.

ఈ కవిత నిజానికి ఆ పాట గురించే!

by: Alok
మొదటగా సి.ఎస్.రావు గారికి

రావుగారూ, కవిలోను, కవితలోనూ అస్పష్టత లేదు గనక రవిశంకర్ గారి కవితలో రసవైరుధ్యము, అననుసంధానభూతులు లేవు. మీరు లోపాలుగా చెప్పిన వాటినే తీసుకొందాం. మొదటి స్టాంజాలో కురుస్తున్న వాన తనలో యే భావాన్ని రేపిందో చెప్పడం జరిగింది. రెండవ స్టాంజా మొదటి మూడు లైన్లు వాన గురించిన వర్ణన. మిగతా లైన్లలో మళ్ళీ వాన పై కవి భావం. ఈ రెండో భావం మొదటి భావంతో పోలివుండడం వల్ల రసవైరుధ్యమేవీ లేదు.చెట్ల ఆకులు వానా నీళ్ళని ఆనందంతో పట్టుకోడమన్న భావం కవిలోని దు:ఖాన్ని ఎత్తి చూపించేది.

ఇహ జ్ఞాపకాల గురించి మీరిచ్చిన లోతైన వివరణ పెద్దగా వుపయోగపడేది గాదు.

కొత్తపాళీ గారికి

పునరుక్తి వేరు.విస్తరణ వేరు.ఈ విషయం మీకు తెలిసేవుంటుంది.చెప్పిందె చెప్పడం పునరుక్తి. వుదాహరణకి ప్రజాకళ కొత్త సంచికలోని శివారెడ్డిగారి కవిత.

http://prajakala.org/mag/2007/09/sivareddy_poem2#more-436

ఇక్కడ వున్నది విస్తరణ.చెప్పాల్సిన దానికంటే ఎక్కవగా చెప్పడం.

1) అందంగా,

స్వచ్చంగా,

అప్రయత్నంగా కురుస్తుంది వాన

2) జలజలమంటూ కురిసే వాన

3) వెలిసిన వాన

వాన వచ్చింది, కురిసింది, వెళ్ళిపోయింది అన్న గొలుసును కవి అనుసరించినట్టు తెలుస్తోంది. ఆ గొలుసును పేనడానికి గతాన్ని, జ్ఞాపకాల్ని, తన అనుభూతుల్ని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కవి చెప్పదల్చుకొన్న అసలు విషయమేమంటే వానని చూడగానే పాత పాట సలుపుతున్న గాయం గురించి. ఆ విషయం “నీపాట కూడా అంతే” అన్న చోటనే ఆగిపోతుంది. మిగిలిన రెండు స్తాంజాలు నే ఇందాక చెప్పిన గొలుసును కొనసాగించే ప్రయత్నమే.

by: కొత్తపాళీ
రావు గారు, పద్యంలో అసలు పాయింటుని మిస్సయ్యారేమోననిపిస్తోంది. మీరన్న అననుసంధానానుభూతి, రసవైరుధ్యమూ ఏమీ లేదు. కవి భావాలు self-consistentగానే ఉన్నయ్యి.

ఇంకో చర్చలో అలోక్ గారనుకుంటా ఈ పద్యంలో విస్తరణ దోషముందన్నారు. అదీ కనపడదు నాకు. “నీ పాట కూడా అంతే”  తరవాత వచ్చిన రెండు చరణాల్లో పునరుక్తి ఏమీ లేదే? పైగా చివరి చరణం పద్యభావానికి తగిన ముక్తాయింపు అని కూడా నేననుకున్నాను.

by: Sivasankar
రవి శంకర్ గారు,

మీ కవిత చాలా బాగుంది.

రాధా విరహం లా అనిపించింది.

కృష్ణుడి పాటలకి/రాక కోసం ఆమె విలపించినట్టు ఉంది.

శివ

by: C.S.Rao
రవిశంకర్ గారి “వాన-పాట” కవితలో ఒక   fluency of style  ఉంది.కాబట్టి చదివిస్తుంది. చదివేప్పుడు బాగున్నట్లు అనిపిస్తుంది.అంచేత మరలా చదివిస్తుంది. అలా చదివినప్పుడు వాన,పాటలకు కవి స్పందించిన రీతి లేదా వాటికి సంబంధించి ఆయన పొందిన అనుభూతిని కవిత్వీకరించటం లో ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంది.ఈ అసంతృప్తి కి కారణమేమై ఉంటుందని ఆలోచించినప్పుడు  కవితలో అంతర్గత మైన అననుసంధానానుభూతి (Ununified emotional responses ) అని నాకు అనిపించింది.అసలు కవిత ప్రారంభమే ,”వాన లో తడిసినప్పుడు/పాతగాయాలేవో సలపరించినట్లు.”ఆ పైన తన “మెత్తబడ్డ మనసుని/నిర్దయ గా మరింతగా…….” కోసే వాన అందంగా ,స్వచ్ఛంగా కురుస్తుందనటం రసవైరుధ్యానికి దారి తీసి,పాఠకుడి స్పందన లో ఒక  చిన్న గందరగోళం సృష్టిస్తుంది.

మనల  బాధ పెట్టే  జ్ఞాపకాలు రెండు రకాలు.

మొదటివి: ఒకప్పుడు మనకు గొప్ప ఆనందాన్ని కలిగించిన వ్యక్తో ,లేదా పరిస్థితో ఇప్పుడు లేకపోవటం అనే  వాస్తవం తాలూకు జ్ఞాపకాలు .ఈ రకమైన జ్ఞాపకాలు మరువలేనివి,మరిచిపోతే బాగుండునని అనుకోనివి, నెమరువేసుకుంటూ బాధ పడేవి,బాధ పడుతూ నెమరువేసుకుండేవి.వీనికొక  శాశ్వతత్వం ఉంటుంది. ఇవి వీడనివి.

రెండవవి: ఒకప్పుడు మనకు దారుణమైన దు:ఖాన్ని  కలిగించిన వ్యక్తో ,పరిస్థితో మనకు జ్ఞాపకం వచ్చినపుడు బాధపెట్టేవి ,భయపెట్టేవి ,పీడకలలాంటివి;జ్ఞాపకం రాకుండా ఉంటే బాగుండునని అనిపించేవి.

కవితలోని జ్ఞాపకాలు మొదటి రకమైన జ్ఞాపకాలు గా “నీ పాట” అనడం ద్వారా సూచింపబడుతున్నట్లు నేను భావిస్తున్నాను.కాబట్టి తన కంటిమీద కన్నీటి తెరలు దించే ఆ పాట ,ఒకప్పుడు తనకు గొప్ప ఆనందాన్ని కలిగించిన అనుభవమై ఇప్పుడు ఒక గాఢమైన శాశ్వతమైన శోకానుభూతిని  మిగిల్చినదై ఉండాలి.

మరి ,నీ పాట లో “తడిసినప్పుడు”  అనడం,”ముగిసిన ” నీ పాటమాత్రం అనడం,”కొన్నాళ్ళ వరకు  తలపుల్లో గూడు కట్టుకుని ” అనడం,  కవి మీద వేదనా ప్రగాఢతను వీడని దిగులు గొలిపే  బలీయమైన శాశ్వతమైన బంధాన్ని సూచించకపోవటం వల్ల పాఠకుడి మీద కవిత బలీయమైన ముద్ర వేయలేకపోతుంది.”పాట లో తడిసినప్పుడు” అనడం ,పాట లో తడవక పోవటం అనే స్థితి ఉందని,పాట లో తడవటం ఒక శాశ్వతమైన,నిరంతరమైన మానసిక స్థితి కాదని  స్ఫురింప చేస్తుంది.మరలా ఇక్కడ కూడా  పైన పేర్కొనబడినటువంటి రసవైరుధ్యమే ఉత్పన్నమవుతుంది.అలాకాక,పాట ముగియటం శ్రవణ సంబంధి మాత్రమే నని, మనసు ,పాట లో శాశ్వతం గా అనుక్షణం తడుస్తూనే ఉంటుందనే భావాన్ని వైరుధ్యాలు లేని విధంగా కవిత్వీకరిస్తే ,ఈ కవిత చాలా బాగుండేది.

ఈ కవిత లో   impressive imagery  లేకపోలేదు. కానీ ,ఆ ఇమేజరీ వైరుధ్యాలు లేని కవి యొక్క అనుభూతుల సమూహాలను ప్రతిబింబించకపోతే, దాని నిగనిగలు మాసిపోయినట్లు కనిపిస్తవి.

అయినా,ఈ కవిత లో ఆకర్షణ  లేకపోలేదు.

C.S.Rao

by: Alok
ఇందులో అద్భుతమైన చిత్రాలేవీ కనపడ్డంలేదు. “నీ పాట కూడా అంతే” అన్న చోటనే కవిత ఆగిపోయింది.

by: Vaidehi Sasidhar
Nice poem with beautiful imagery!!

by: Srinivas Vuruputuri
“జలజలమంటూ కురిసే వాన

కిటికీ పై నీటిపరదాలు జార్చినట్టు

నీ పాట నా కంటిమీద

కన్నీటి తెరలు దించుతుంది.”

ఎంత బాగా రాసారు! మీ కవిత చాలా హాంటింగ్ గా ఉంది, మీరు విన్న పాట లాగే!

by: krishna
అద్భుతమైన చిత్రాన్ని చూపి మరచిపోలేకుండా మనసుపై ముద్ర వేశారు.

by: Sai Brahmanandam Gorti
కవితా వర్షం వెలిసినా

పాట తడి ఇంకా అంటిపెట్టుకునే ఉంది.