ఈమాట » ఒంటరి విహంగం

Expand to right
Expand to left

ఒంటరి విహంగం

కొంతకాలం తర్వాత….

ఓ రోజు హరి ఆఫీసులో ఉండగా బ్రూస్ వచ్చాడు.

“హరీ ! యూ గాట్ ఎ మైల్. బై మిస్టేక్, దే కెప్ట్ ఇన్ మై ఫోల్డర్. బై ద వే, ఐ ఫర్గాట్ టు టెల్ల్ యు. మరీనా ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎ బేబీ ఇన్ 5 మంత్స్ !”

” ఒహ్ ! ఐ సీ ! కంగ్రాట్యులేషన్స్ ! ” అంటూ హరి అభినందించాడు. పని ఉందని బ్రూస్ అక్కడనుండి వెళిపోయాడు. ఎవరి దగ్గరనుండా అని ఆత్రంగా ఉత్తరం చించాడు హరి. అది తండ్రి రాజారావు దగ్గరనుండి..

విప్పి చూసి, చదవడం మొదలు పెట్టాడు.

ప్రియమైన హరికీ, దివ్యకీ,

నేను మీ డాడీ ని.. ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు.

ఎప్పటి నుండో నా మనసుని మీ ముందు విప్పాలని చాలాసార్లు అనుకున్నాను. ఫోన్ లో మాట్లాడు దామనుకున్నాను. కానీ నే చెప్పబోయే విషయాలకి అందరి ప్రశ్నలు అడ్డు వస్తే నేను చెప్పబోయేదీ, నా మనసులో ఉన్న అనిశ్చిత పరిస్థితి మీకు అర్థంకాదన్న ఇదితోనే మీతో ఫోన్ లో మాట్లాడ లేక పోయాను. నేను చేసిన పని మీరిద్దరూ హర్షించరు అన్న విషయం నాకు తెలుసు. అందుకే మీకు చెప్పకుండా నేను పెళ్ళి నిర్ణయం తీసుకున్నాను. చాలా మంది దృష్టిలో నా నిర్ణయం తప్పుగా అనిపించవచ్చు. కానీ నేనేమీ తప్పు చేయలేదనే నా దృఢ నమ్మకం.

మీ అమ్మ, నేనూ ప్రేమించి పెళ్ళి జేసుకున్నాం. అందర్నీ కాదని ఎదురించి జీవించాం. మీరిద్దరూ మాకు పుట్టారు. మీ అమ్మ మరణంతో నేను సగం చచ్చిపోయాను. కానీ నా ముందు మీరిద్దరూ ఉన్నారు. మీ భవిష్యత్తు ఉంది. అది తీర్చి దిద్దడానికే నేను నా బాధని దిగమింగి మిమ్మల్ని ఏ లోటూ రాకుండా పెంచాననే అనుకుంటున్నాను. మీకు పెళ్ళిళ్ళు అయ్యాయి. మీరిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. మీ ఇద్దర్నీ చూసి నేను చాలా గర్వ పడుతూ ఉండే వాడ్ని. మీ కోసం రెండు సార్లు అమెరికాకి కూడా వచ్చాను. మీ జీవితం చూసాను. క్షణం తీరికలేని మీ జీవితాలు చూసాక ఎందుకొచ్చిన ఈ తాపత్రయం అనిపించింది. మీరున్నారు, నేను మీ దగ్గరగా ఉన్నాననే భావన తప్ప, నాకు తోడుగా ఒంటరితనమే కనిపించింది. నాకు నా వయసు వాళ్ళ స్నేహం లేదు. ఒకవేళ ఉన్నా అది పరిమితమే! మీ దగ్గర ఉన్నన్నాళ్ళూ బాగానే ఉన్నా, మనసులో వెలితిగానే ఉండేది. ఇది నేనెప్పుడూ మీకు తెలియకుండానే ప్రవర్తించాను. అమెరికా నుండి వచ్చాక నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. మీరిద్దరూ మీ మీ జీవితాల ఒత్తిళ్ళ వల్ల, మీకున్న సమస్యల వల్లా రాలేకపోయారు. నాకు అనారోగ్యం చింత కంటే మీరిద్దరూ రాలేకపోయారన్న బాధే ఎక్కువగా ఉండేది. మీరు రాలేకపోవడాని మీకున్న కారణాలు మీకున్నాయి. కాదనను. కానీ నా పరిస్థితి ఏమిటి? రోజుకొక సారి ఫోన్ లో మాట్లాడేసి, నాకు డబ్బు పంపింస్తే నాకు అనందం వస్తుందునుకున్నారా?

ఒకరకంగా మీరు నన్ను చూడడానికి రాలేదన్న బాధే నన్ను రోజూ దహించివేసేది. మిమ్మల్ని ఎంతో ప్రేమగానే చూసాను కదా..మరి నా పెంపకంలో లోపమా అన్న వ్యాకులత నన్ను దొలిచివేసింది. నాకు మీరిద్దరూ ఉన్నారు అన్న భావన నా మనసుకి దూరం అయ్యింది.
నాకు ఎటాక్ వచ్చి ఆరు నెలలు దాటినా మీరు రాలేదు. నేనూ కోలుకున్నాను కదా ఎందుకు రావడం అనుకున్నారేమో అని నేననుకున్నాను. నేనా ప్రయాణం చేసి అక్కడకి వచ్చి ఆ ఒంటరితనంతో స్నేహం చేసే కన్నా, ఇక్కడే ఉండడం నాకు శ్రేయస్కరం అనిపించింది. ఏడాది దాటింది. మీరిద్దరూ వస్తారన్న ఆశ పోయింది. ఈ వయసులో ఒంటరి తనం నన్ను బాధించింది. నాకూ ఒక తోడు లేదా ఒక మనిషి అవసరం అనిపించింది. అదే సమయం లో మన ఇంట్లో అద్దెకు దిగిన లక్ష్మి పరిచయమయ్యింది. ఆవిడ భర్త చనిపోయాడు. ఆవిడ టీచర్ ఉద్యోగం చేసుకుంటూ పిల్లాడిని పోషిస్తూ జీవితం వెళ్ళ బుచ్చుకుంటోంది.

నేను ఒక్కడినే ఉంటూ, వండుకు తింటున్నానని తెలిసి ఆవిడ రోజూ కూరలు పంపేది. మీ పిన్ని వాళ్ళూ నేను ఆసుపత్రిలో ఉండగా వచ్చి వెళ్ళారు. ఆ తరువాత వాళ్ళెవరూ మళ్ళీ రాలేదు. డాక్టర్ అంకుల్ నాకు చాలా సాయం చేసారు. ఓ నెల తరువాత వాళ్ళమ్మాయి దగ్గరకి ఆస్ట్రేలియా వెళ్ళారు. నేనొక్కణ్ణే అయ్యాను. నానుంచి ఏమీ ఆశించకుండా నాకు సేవలు చేసింది లక్ష్మి. ఆవిడకి చెయ్యాల్సిన అవసరం లేదు. నేను మీ అమ్మని ఎంతగా ప్రేమించానో, మిమ్మల్ని ఎలా పెంచి పెద్ద జేసానో అన్నీ డాక్టర్ అంకుల్ ద్వారా తెలుసుకుంది. నాకు కుంటుంబం మీదున్న మమకారమే ఆమెకు నా పైన ఏర్పడిన గౌరవానికి కారణం. లక్ష్మి భర్త అమెను ఎన్నో చిత్ర హింసలు పెట్టేవాడట. ఏనాడూ ప్రేమగా చూసిన పాపాన పోలేదని చెప్పింది. ఏదైయితేనే నా మీద లక్ష్మి కి గౌరవం నాకు ఆవిడంటే సదభిప్రాయం కలిగాయి.

ఒక సారి అనారోగ్యం చేస్తే పరిచర్యలు చేసింది. అదే చివరకి పెళ్ళికి దారి తీసింది. ఈ అనారోగ్య సమయంలో పెళ్ళి చేసుకుంటే నా అవసరం కోసమని అందరూ భావిస్తారనీ లోకం అనుకుంటుందని ముందు భావించాను. ఒకరకంగా అవసరం కంటే నా కోసం ఒక మనిషి తాపత్రయ పడుతుంది అన్న భావనే నీ ఈ నిర్ణయానికి కారణం. ఇన్నాళ్ళూ ఎప్పుడూ ఆ అవసరం రాలేదు. నా పని నేను చేసుకొని బ్రతికాను. ఇప్పుడు ఓపిక లేదు. కావాలంటే ఏ వృద్ధాశ్రమం లోనో చేరచ్చు. అక్కడైనా ఇదే ఒంటరితనం కదా ! ఈ వయసులో నా పక్కన ఒక మనిషి ఉంది అన్న భావనే నాకు శక్తి నిచ్చింది. అదే నా నిర్ణయానికి కారణం.

ఈ వయసులో పెళ్ళేమిటని మీరనుకోవచ్చు. నాకూ ఒక తోడు కావాలి. మీకు నేను కావాలి అన్న భావన నాకు పోయింది. ఎందుకంటారా, అనారోగ్యం చేస్తే మీ దగ్గరకొచ్చి ఉండమంటారు. నేను అక్కడకొచ్చి, ఆ ఒంటరి తనం భరించలేను. మిమ్మల్నీ మీ భవిష్యత్తుని తాకట్టు పెట్టి నాకోసం ఇక్కడకి రమ్మనమని అర్థించడం న్యాయం కాదు. అలా అని ఒక్కడినీ ఇక్కడ ఉండ లేను. వృద్ధాప్యంలో ఒక మనిషి తోడు లేకుండా ఇంకో మనిషి జీవించడం కష్టమని మెల్ల మెల్లగా అర్థమయ్యింది. మీతో నా మనసులో మాట చెబుదామనుకున్నాను. కానీ డాక్టర్ అంకులే వద్దన్నారు. మీరు నీ నిర్ణయం మెచ్చరనీ, అది ఇష్టమైతే తను లక్ష్మిని పెళ్ళి చేసుకోమని చెప్పాడు. అంతా అలా ఊహించని విధంగా జరిగిపోయింది.

మీకు నా మనసులో మాట వెంటనే చెబుదామనుకున్నాను. నా పెళ్ళి వార్త తెలిసి మీరిద్దరూ డాక్టర్ అంకుల్ దగ్గర నన్ను అస హ్యిం చుకున్నట్లు మాట్లాడారన్న విషయం తెలిసింది. మీ మావగారు వచ్చి నేనేదో నేరం చేసినట్లు మాటలని వెళిపోయాడు.

పెళ్ళెందుకు చేసుకోవడం కలిసే ఉండచ్చు కదా అని నువ్వడగొచ్చు. నాకూ, లక్ష్మి కీ ఒకరకంగా మనందరికీ సమాజపరం గా మంచిదని పెళ్ళి చేసుకున్నాను.

మీరు అసహ్యించుకునే పని నేను ఏమీ చేయ లేదనే అనుకుంటున్నాను. అయినా ఆవేశం లో ఉన్న మీకు నా మనసు అర్థం కావని మీతో మాట్లాడానికి కూడా ప్రయత్నించ లేదు. మీరు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదా అని బాధ పడ్డాను.

హరీ, నీకు గుర్తుందా, నీ కంపెనీ సి యి ఓ పెళ్ళి కి తీసుకెళ్ళావు. అతని పేరు బ్రూస్ అనుకుంటా సరిగా గుర్తు లేదు. అతని భార్య విడాకులిచ్చి వెళిపోతే, అతను ఒంటరి తనంతో పిచ్చివాడయ్యాడనీ, పెళ్ళి జేసుకోమని నువ్వే సలహా ఇచ్చావనీ నాకు చెప్పావు. అప్పుడు నాకు ఆ పెళ్ళీ, ఆ తంతూ, అంతా అయోమయంగానూ, వింత గానూ అనిపించాయి. ఇదేం కల్చర్ రా బాబూ అనుకున్నాను. కానీ నేనూ బ్రూస్ లాగే ఇంకో పెళ్ళి చేసుకోవల్సి వస్తుందని ఆరోజు ఊహించలేదు. బ్రూస్ మేరేజ్ ని సమర్థించిన నువ్వు, నా వరకూ వచ్చే సరికి ఎందుకింత కఠినంగా మారావో నా కిప్పటికీ అర్థం కాలేదు. బహుశా నువ్వు అమెరికాలో జీవిస్తున్నా, నీకు సంబంధించనంత వరకూ అంటే నీకు నొప్పి కలగనంత దాకా వాళ్ళ ఆచారాలూ, వ్యవహారాలూ అన్నీ లాజికల్ గానే అనిపిస్తున్నాయి. కానీ నీ వాళ్ళ విషయం వచ్చే సరికి నీ లాజిక్ నీ వాళ్ళకి అన్వయించలేక పోతున్నావు. నా నిర్ణయాన్ని ఒప్పుకోలేక పోతున్నావు. ఇదే - నాకు అర్థం కానీ, జవాబు లేనీ ప్రశ్న… తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఇహ నేనుగా నా శేష జీవితం జీవించే హక్కు నాకుంది. నా నిర్ణయాలూ, నా ఒడంబడికలూ, నా స్నేహాలూ అన్నీ నా ఇష్ట ప్రకారంగా నిర్ణయించుకునే అధికారం నాకుందని అనుకుంటున్నాను.

చూసినా, చూడకపోయినా - పెట్టినా, పెట్టక పోయినా తల్లితండ్రులు పిల్లల్ని ప్రేమించడం మానరు. ఎందుకంటే వారి ప్రతి రూపాలే పిల్లలు ! అందుకే ప్రియమైన అని సంబోధించాను.

ఇప్పుడు నా మనసు తేలిక పడింది. ఎందుకంటే ఏమో, చెప్పలేను…

మీరు నన్ను నన్నుగా చూడాలనిపిస్తే ఈ ఇంటి తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయి.

- నాన్న

హరి ఒక్కసారి బరువుగా కళ్ళు మూసుకున్నాడు. సంజాయిషీ ఉత్తరంలా అనిపించింది.

ఎందుకో తండ్రి నిర్ణయాన్ని అంగీకరించ లేక పోతోంది అతని మనసు.

ముందరి పేజీ(లు) 1 2 3 4 5
 

(11 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. bhaskar అభిప్రాయం:

    September 2, 2007 2:22 am

    This story is really nice.It gives simple touch of human life i quite a few pages.now a days things are going in the same way described in the story.
    After earning these material assets and other luxuries what is the meaning of life if we cannot stay closer to the heart of near and dear.The day may come for all ppl like HARI when they will know what they have lost in the life.But by that time they won’t have anyone beside them to share a shoulder of support.
    We are humans. let’s not tamper the pages of a book called life with unnecessary materialism.Upto me i support what rajarao has done because everybody has the right to live their life to their accord until it is legal.

  2. teresa అభిప్రాయం:

    September 4, 2007 10:53 am

    ఇతివృత్తం మంచిదెన్నుకున్నారు. రచనాశైలి కూడ బాగుంది గానీ కథ నిడివి కొంత తగ్గింఛి మూడు పెజీల్లో ముగించి ఉండొచ్చునన్పించింది.

  3. riveiv అభిప్రాయం:

    September 4, 2007 1:13 pm

    ఇదేదొ దాసరినారాయణరావు సినిమా లా వుంది. అన్ని రోజులు అమెరికాలో వుండి , లోకాన్నిచూసిన వాళ్ళు (హరి ..దివ్య) రియల్ గా అలా ప్రవర్తించరు పిరియడ్.

  4. Pandali అభిప్రాయం:

    September 7, 2007 10:44 am

    I think people who live in America, and support American culture (falsely) will behave exactly this way. As long as it does not hurt you or your money, it is OK. Many Indian have this mentality, and it is horrible.

    I like the story. A better ending would have been a change in the guy’s mentality- an optimistic ending

  5. Sujatha Srinivas అభిప్రాయం:

    September 11, 2007 2:55 am

    అమెరికా జీవితాన్ని చూశాక రాజారావు empty గా ఫీలవడం సహజమే గాని, వివాహం చేసుకోవడం కొంచెం అసహజంగానే వుందనిపించింది. ఇవాళ India లో old age homes (డబ్బుండాలే గానీ) ఎంత సౌకర్యంగా , హాయిగా ఉంటున్నాయో ఒకసారి వచ్చి చూడండి. అంటే , పిల్లలు విదేశాల్లో ఉన్న parents అందరూ homesలో చేరాలని నా ఉద్దేశం కాదు. తోడు కావాలంటే, పెళ్ళే అక్కర్లేదని నా ఉద్డేశం. Hyd లోని Bombay Highway లో ఒక homeలో ఎంతో మంది retired doctors, class 1 Govt servants, హాయిగా ఉన్నారు. వాళ్ళ పిల్లల్లో చాలా మంది విదేశాల్లోనే ఉన్నారు. 24 గంటలూ doctors availability, good library, big garden (I ‘ve seen old people staying in the home are cultivating vegetables, and flowers for the home. We live nearby this home) good friends, bank nearby ….! (mobile Andhra Bank ATM comes to the home every week) పిల్లలు దూరాన ఉన్నప్పుడు, వాళ్ళతో ఉండడం కుదరక , ఒంటరిగా కుమిలేకంటే, చేతిలో డబ్బు ఉన్నప్పుడు, ఇలాంటి ఆశ్రమాల్లో ఉండటం హాయి. తీరిక లేని యవ్వనంలో, చేయలేని పనులెన్నో ఈ వయసులో చేయవచ్చు. హరి తల్లే అయితే 60+ వయసులో ఈ పని చేయగలదా? పిల్లల కోసం, అన్ని త్యాగాలు చేసిన రాజారావుకి చివరికి ఈ పెళ్ళి వల్ల మిగిలినదేమిట్ట? వాళ్ళ నిష్టూరాలు, చీదరింపులూ! పిల్లల్ని ప్రేమిం చడం తల్లి దండ్రులు మానరని రాజారావే చెప్పాడు. ఇటువంటి నిర్నయాలు తీసుకునే ముందు పిల్లలు తనను కాదనుకున్నా , పరవాలేదనుకోగలిగే గుండె నిబ్బరంఉండాలి మరి.

    రాజారావు ఉత్తరంలో ఆయన వ్యధ బాగా వర్ణించారు. కానీ, ముగింపు నిజంగానే దాసరి నారాయణ రావు సినిమా లాగానే వుందండీ!

  6. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    September 11, 2007 9:19 am

    ఈ కథ యథాతధంగా జరిగింది. ఇందులో కల్పితమేమీ లేదు.
    తండ్రి వివాహాన్ని కొడుకులు మెచ్చ లేదు సరికదా, పూర్తిగా మాట్లాడడం మానేసారు. అమెరికాలో ఉన్నంత మాత్రాన కొడుకులు అలా ఉండరన్నదేమీ లేదు. నాణేనికి రెండు వైపులూ ఉంటాయి.
    దాసరి నారాయణ రావు సినిమా అయితే కొడుకు వేంటనే మారి తండ్రి కాళ్ళ మీద పడతాడు. కానీ కథలో హరి తండ్రి వివాహాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడన్నదే ఆఖరి వాక్యాలలో ఉంది.

  7. Mohan Krishna అభిప్రాయం:

    September 13, 2007 6:51 am

    వాస్తవమెల్లా వాంఛనీయం కాదు.
    ప్రేమ లేకుండా ఓంటరితనం పోగొట్టుకోవడం కోసం పెళ్ళి చేసుకోవడం సమంజసమంటారా? ఇదేదో యంటీఆర్, లక్ష్మీపార్వతిల విషయం గుర్తుకు తెస్తోంది.

  8. Srujana P అభిప్రాయం:

    September 19, 2007 12:48 pm

    వయసు మల్లినాక వొంటరితనంతో పెల్లాడ్డం ఆ ఆడమనిషి చేత సాకిరీ సేయించుకోడానికే సచ్చేదాకా. మెల్లో ఓ పసుపు (పలుపు) తాడు పడేస్తే, జీవితాంతం ఎద్దులా పని చేసును కద ఆ ఆడది. ఇట్టాంటి మర్మాలు మనసులో ఎట్టుకుని, పైకి వొంటరితనం అంటూ పోసికోలు కబుర్లు సెబుతారు ఈ ముసిలోల్లు. అయినా నాకు తెలవక అడుగుతానూ, అమిరకా పోయిన పిల్లగాల్లు జబ్బు సేసినప్పుడు ఓ పాలి వచ్చి సూసినా, ఈ ముసలోడి వొంటరితనం పోతాదా ఏటీ? అనోసరంగా ఆ పిల్లగాల్ని సెడ్డ మనుసుల్లా సూపిత్తే ఏం ఒరుగుద్ది? ఆల్లొచ్చి సూసి పోయినా, ఈ ముసిలోయన పెల్లి సేసుకుని తీరేవాడే కద. ఇట్టాంటి మనుసులుండ బట్టే గద కన్నాసుల్కాలుండేవి పాత రోజుల్లో. ఆ ఆడమనిసి గనక నాకు అగుపడితే ఈ పెల్లి సేసుకోద్దని సెబుతాను. ఆల్లూ ఈల్లూ సెప్పినట్టు ముసిలోయన ఏరే పనేదో సేసుకోకూడదా వొంటరితనం పోడానికి. పెల్లే గావల్సి వొచ్చిందా. అందులోనూ అంత సెడ్డ జబ్బు సేసినాక. ఓ పాలు మొగుడు పోయిన మనిసికి జబ్బు మనిసిని పెల్లి సేత్తే, కూసింత సేపు పోయాక ఈ జబ్బు మనిసి పోతే, మల్లీ విదవరికం సేసెయ్యరా ఆ ఆడమనిసికి. మీరేటంతారు. ఇట్టాంటి ముసిలోల్లని సూత్తే రోత పుట్టదా ఏటి. ఆడదాని కట్టం సాటి ఆడదానికే తెలుత్తది.

  9. aanDaalu అభిప్రాయం:

    September 27, 2007 6:36 am

    నేను కూడా సుజాత గారి తో ఏకీభవిస్తున్నాను. ఇదే ఆడవాళ్ళైతే ఈ సలహా ఇచ్చేవారా రెండో పెళ్ళి చేసుకొమ్మని??
    మగవాడు కాబట్టి ముసలివాడైనా పెళ్ళి చేసుకోవచ్చు అంతేగా!

  10. Gowri Kirubanandan అభిప్రాయం:

    October 21, 2007 12:16 pm

    కథ చాలా బాగా ఉంది. కాక పోతే ending కాస్త drama లాగా అనిపించింది.
    want to translate this story into tamil with the permission of the author. can i have email id of the author?
    Gowri Kirubanandan

  11. Subha అభిప్రాయం:

    November 9, 2007 12:48 pm

    I liked the story. It is the personal opinion of the father. He could not have married without the approval of the woman. The woman never experienced love in her marital life. May be she too wanted to gain something from this marriage and it is not one way opinion of the father. If the decision of the old man was not appreciated by his sons, how her son appreciated it? Living in oldage home is not a solution completely. It takes care of the physical needs but not the desire of emotional needs of being wanted. Srujana gaari comment is very one sided and narrow minded. In future, India will see many such marriages I think.

    In one of the family I know, the father married his aid and explained to his sons that he wanted to help her by letting her enjoy his pension after his death as the girl is a destitute. The sons appreciated it. Each case is different and we can not make judgement for others.

    Subha

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a