లింఫోమా - ఒక ‘నిసి షామల్’ కథ
మరుసటి రోజు శనివారం. సాయంత్రం నాలుగింటికి నిసి అపార్ట్మెంట్ డోర్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఒక షోఫర్ నుంచుని ఉన్నాడు. చేతిలో ఎర్రగులాబీ గుఛ్చం ఉంది. “మీ కోసం కుమార్ పంపారు.”
ఆశ్చర్య పోయింది నిసి , లోపల్ వేస్లో పూలు సర్ది ఉంచి, ప్రీతితో వాటిని వాసన చూసింది. ఓహ్! ఎందుకీ గులాబీలు!
షోఫర్ తో కిందికి వెడితే అక్కడ ఒక పెద్ద నల్ల లిమోసీన్ ఉంది. కంగారు పడింది నిసి. కుమార్ ఇంటికేగా అని అడిగింది ఎక్కేముందు.
“అవును మేడం” అన్నాడతను కారు తలుపు వేస్తూ.
లిమో మన్‌హాటన్ లో విచ్చలవిడిగా పరిగెత్తే పసుపు టాక్సీలు, కార్లు, బస్సులు మధ్యగా నిదానంగా వెళ్ళి యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్ దగ్గర్లో రివర్ పక్కగా ఉన్న ఒక హైరైజ్ భవంతి గరాజ్లో ఆగింది. షోఫర్ అమెను ఎలివేటర్లో పై అంతస్తుల్లొ ఉన్న ఒక పెంట్ హౌస్ లో విడిచి వెళ్ళి పోయాడు. ఎలివేటర్ తిన్నగా, నున్నగా పాలరాయి చేసిన ఎంట్రీ ఫోయెర్ లోకి తెరుచుకుంది. ఎదురుగా గుండ్రని బల్ల మీద ఇంత పెద్ద వాటర్ ఫోర్డ్ వేస్ లో తనకు పంపిన లాటివే గులాబీలు. దాని మీదుగా చూస్తే ఈస్ట్ రివర్. నదిలో పడవలు. గోడలమీద టేపెస్ట్రీలు , అక్కడక్కడా పెడెస్టల్స్ మీద కంచు శిల్పాలు. నేల మీద పర్షియన్ రగ్గులు.
ఎటు నుండి వచ్చాడో కుమార్: “హలో! వచ్చినందుకు ధన్యవాదాలు.” అన్నాడు. సిల్క్ పేంట్స్. కష్మీర్ స్వెటర్ ! నవ్వు ముఖం!
“ఓ మి గాడ్” అని తనను సంబాళించుకోడమే పని ఐపోయింది నిసికి.
” మా అమ్మ గారు లోపల ఉన్నారు, రండి ” అని తీసుకు వెళ్ళాడు. సిల్క్ సోఫాలొ మెత్తని చిన్న దిండ్ల మీద రాణి లాగా ఆని ఉన్నదామె.
నిసిని ఆప్యాయంగా పక్కన కూర్చో పెట్టుకుంది. పక్కగా ఉన్నచిన్న ఆకులలాటి వెండిపళ్ళెరాల్లో బాదం పిస్టేషియో, మేకెడేమియాలు, రకరకాల రంగులు సైజుల్లో ద్రాక్షగుత్తులు ఉన్నాయి. గాజు కూజాల్లో ఐస్ వేసి నీరు, ఇతర పానీయాలు. వెడల్పాటి గాజు అద్దాల్లోనుండి బయటి రంగులు మారిన చెట్ల ఆకులు వాటి అనంత ప్రతిబింబాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి.
కుమార్ గురించి నిసితో అన్ని విషయాలు అంతా సవిస్తరంగా చెప్పించుకుందామె. అప్పుడప్పుడూ కన్నీళ్ళు పెట్టుకుంటూ, నిసి చేతులు పట్టుకుని, చెంపలకు నుదుటికి ఆనించుకుంటూ ఆవేదన పడింది.
పక్కనే కుర్చీలో కూర్చుని, నవ్వుతూ, అమ్మా! ఖంగారు పడమాకు! అని మధ్య మధ్య ధైర్యం చెప్పాడు కుమార్.
అప్పుడప్పుడు నిసి వైపు చూసి తలపంకిస్తూ ఆమెకు నవ్వు తెప్పిస్తున్నాడు.
ఇంతలో ఫోన్ మోగింది.
కుమార్ ఎత్తాడు. “ఎస్! డాక్టర్ గోల్డ్‌బెర్గ్ ! ష్యూర్! నన్ను చూసినందుకు చాలా థేంక్స్.” నిసి ఫోన్ తన కోసమేమో అని లేవబోతుంటే కాదన్నట్లు చెయ్యి ఆడించి, కూర్చోమని సూచిస్తూ, నిసి వంక చూస్తూ పెదిమల మీద వేలు ఉంచాడు. నిసి సర్దుకుంది. అసలు తను ఇక్కడ ఉన్నట్లు గోల్డ్‌బెర్గ్ కి తెలియదు కదా! తనకెందుకు వస్తుంది ఫోన్.
“ఏమిటి విశెషం. డాక్టర్ గోల్డ్‌బెర్గ్ ! వీకెండ్ పిలుస్తున్నారు. నన్ను గురించి కొత్త విషయాలేమైనా తెలిశాయా!” కొంచెం సేపు మధ్య మధ్యలో ఆహా, ఊహు అంటూ అవతలి వైపు సంభాషణ విన్నాడు
“ఓ! పిల్లల లుకీమియా వింగ్! నేను స్టూడెంట్ ని. ఏదో నా చదువుకు సరిపడా డబ్బు ఉంది ట్రస్ట్ ఫండ్స్ లో. మా ఫాదర్ వస్తారు న్యూయార్క్ త్వరలో. మీరు మాట్లాడుదురు కాని.
నా ట్రీట్మెంట్ ఎక్కడ, అని నెను ఇంకా ఆలోచించుకోవాలి. లండన్ క్రిస్టీ లో కావచ్చు. మీ దగ్గర కావచ్చు. నా వైద్యం ఎక్కడయితేనేం. మెమోరియల్ హాస్పిటల్ కి డొనేషన్ ఇవ్వటానికి. మీకు తెలుసు కదా ప్రపంచంలో మా ఫేమిలీ పేరుతో ఎన్ని హాస్పిటళ్ళలో భవంతులున్నదీ! నా వైద్యానికీ మీకిచ్చే డొనేషన్ కీ ఏం సంబంధం ఉండదు. మనం మళ్ళీ కలుద్దాం. థేంక్యూ.”
నవ్వుతూ, నిసి వంక చూశాడు ఫోన్ పెట్టేసి.
నిసి కళ్ళింత చేసుకుని అతని కేసి చూస్తున్నది.
డాక్టర్ గోల్డ్‌బెర్గ్ ఆత్రుతంతా కుమార్ - కుమార్ అద్వానీ, ప్రపంచంలో కల్లా ధనవంతుల్లో, ఫోర్బ్స్ 400 లిస్ట్ లో ఉన్న, లండన్ లో ఉండే ఇండియన్ ఫేమిలీ - అద్వానీ. హోలీ క్రైస్ట్ !
“అవును నిసీ! హాస్పిటల్లొ అందరికీ నిమిషాలమీద తెలిసింది నేనెవరో . మీకు ఒక్కరికి తెలియలేదు. కాని నా జబ్బుకి తగిన వైద్యం మాత్రం మీకు తెలిసింది. హాట్స్ ఆఫ్ టు యు! “అని నవ్వుతూ నెత్తి మీద లేని టోపీ తీసి అమె నెత్తిన పెట్టినట్లుగా నటించాడు కుమార్ అద్వానీ.
“అందరూ డబ్బులున్న వాళ్ళకి మంచి వైద్యం జరుగుతుంది అనుకుంటారు కదా! అది తప్పు నిసీ. సరిగ్గా పరీక్షలు జరగవు. ఎక్స్‌రేలు అక్కడా ఇక్కడా పోతాయ్. స్లైడ్లు పారేస్తారు. చెయ్యాల్సిన వాటికన్నా ఎక్కువ పరీక్షలు చేస్తారు. కబుర్లాట్టం. కాళ్ళు విరగ తొక్కుకోటం. వెళ్ళిన ప్రతి చోటా మొదటి వారంలోనే డొనేషన్ గురించి ఫోన్లు వస్తాయి. ఎంతో అభిమానం చూపించినట్లు ఉంటారు కాని, అసలు నా మీద ధ్యాసే ఉండదు.”
కుమార్ పక్కనే వచ్చి కూర్చుని చెపుతున్నాడు.
నిసి ఎక్కడ వింటున్నది. ఆమె నిర్ఘాంతపోయి కూర్చుండిపోయింది. కుమార్ ఆద్వానీ ! ఐనా తనకు తెలియ లేదు. మొహమ్మద్ రెజా పహ్లావి - షా ఆఫ్ ఇరాన్ గనక కుమార్ ని కలిస్తే వాళ్ళకు ఒకళ్ళకొకళ్ళు వెంటనే తెలిసి పోతారు. తనకి ఎవరూ తెలియరు. అవును. లాస్లో అదే అంటాడు తనను - ‘తెలివిగల అజ్ఞాని’ అని.
teresa అభిప్రాయం:
September 4, 2007 5:19 pm
నిసీ షామల్ ఓ యభయ్యెళ్ళు పైబడి రిటైరయిన రేడియాలజిస్టని గుర్తు క్రితం కథలోంచి!! … కథ ముగింపు బాగుంది.
on a sidenote, యద్దనపూడి సులోచనారాణి స్టైలుని తలపించింది.
mohanraokotari అభిప్రాయం:
September 12, 2007 8:13 pm
లింఫొమా కథ ఎంతో అద్భుథంగా ఉంది, ఈ మద్య కాలం లో ఇంత మంచి కథ రాలేదు . హృదయాన్ని సుతిగా తాకిన మానవత్వపు విలువలున్నయి, ఇలాంతి నిజాయితి పరమైన మేధవులు, కారుణ్య మూర్తులు ఉన్నారు, వారికి సరైన గౌరవము, గుర్తింపు ఆంధ్ర దేశం లో చాలా వరకు లేనే లేవు. మా మంచి రచయిత్రి నుండి మరిన్ని హృద్యమైన కథలను demand చేస్తూ……
poorna chand అభిప్రాయం:
September 15, 2007 5:35 am
మంచి కథ..
చక్కటి వర్ణన..
Padmaja అభిప్రాయం:
September 28, 2007 8:56 am
Fabulous. Nisi Shamal is flawless. Can’t wait to read more about her.
Thank you so much.