Comments on: చంపకోత్పలమాలల కథ

by: M.S.Prasad
లైలా గారికి

అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-

త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్

రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-

ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్

పై పద్యంలో ధార, భావం అన్నీ బాగా వున్నాయనే నేను కూడా అనుకుంటున్నాను.  మీకీ పద్యం అవగతం కాలేదన్నారు లేదా భావోత్కృష్టత అంత ప్రశంసనీయం గా మీ కనిపించలేదన్నారు కనుక, నా అల్ప మేధస్సుకి అది ఎందుకు అనర్ఘంగా తోచిందో వివరింప ప్రయత్నిస్తాను.

ధనము శాశ్వతము కాదు.  శరీరం క్షణ భంగురము. జీవనము తత్వార్ధముల వలె (అహమ్ బ్రహ్మస్మి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి వగైరా) నిత్యము కాదు. కాల పాశానికి ఏ నిముషమైనా చిక్కవచ్చు.  కావున మనుషులైన వారు దీని వ్యావృతిని నమ్మక, మహాత్ముడైన అమ్మెన ప్రెగ్గడ వలె పేర్మితో వరార్ధము (భగవచ్చింతన), ఎన్నడునూ చేటు లేని ధర్మార్ధము (ధర్మ నిరతి) చేయవలయును.

ఈ పద్యంలో ఛందో భంగమే కాక సమన్వయానికి లొంగని ఒకటి-రెండు పదాలున్నట్లు ( రెండవ మరియు మూడవ పాదారంభంలో) తోస్తుంది.  అవి తప్పక వ్రాయసకాని లోపమో, పురాతనమై అనేక వాతావరణ మార్పులకు లోనై వ్యగ్రమై పఠన యోగ్యం కానీ శిలాక్షరాల వలననో, ప్రాచీన లిపి ఐ వుండడం వలననో సంభవించివుండవచ్చు. మిగిలిన పదాలు, ధార అవధరిస్తే కవి అసమర్ధుడుగా భాసించడు. ఆ లోపాలు  సమ్యగ్రీతిని సంస్కరిస్తే  ఈ పద్యం మీకు కూడా హృద్యంగానే వుంటుందని అనుకుంటాను.  ఆ విధంగా సంస్కరింపబడినా కూడా అది అంత మంచి పద్యం అని మీకనిపించక పోతే అది మీ అభిరుచి.  లోకో భిన్న రుచిః నాలాంటి కొందరికి నచ్చిన దాన్నే ఉత్తమ సాహిత్యమని పలకడం దుస్సాహసమౌతుంది గదా.

by: M.S.Prasad
ఈ వ్యాసం ఎంతో బాగుంది. నాకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడానికే గాక, ఇది వరకే తెలిసిన విషయాలలో అవగాహన ఇంకా పెరగడానికి దోహదపడింది.  వ్యాసకర్తకీ రంగంలో వున్న అభినివేశం, అభిరుచి, సాధికారత, ప్రామాణికత్వం శ్లాఘనీయమైనది.  లక్షణాలకు లక్ష్యాలను స్వయంగా సమకూర్చడంలో (సర్వ) జన వేద్యమైన సరళ సంస్కృత భాషా పద ప్రయోగం అమోఘం. ఆదిలోనే ఉదహరించిన శ్లేషాలంకార సహితమైన మాఘుని సంస్కృత చంపకమాల ఆకట్టుకుంది.  చంపకమాల, ఉత్పలమాల, కందం, తేటగీతి, మధ్యాక్కర, సీసం వగైరా వృత్తాల సంబంధ బాంధవ్యాలను వివరిస్తూ  సృష్టించిన (చిత్ర విస్తర కవిత్వాలలో ఒకటిగా చెప్పబడిన) గర్భ కవిత్వం ప్రశంసార్హం.  ఈ గర్భిత వృత్తాలలో భిన్న వృత్తాలలో భిన్న భావాలు ప్రదర్శించే అద్భుత నైపుణ్యాన్ని ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలిపివుండాలనిపించింది.  ఉదాహరణకి ఈ క్రింది పద్యాన్ని చూడండి

శ్రీరామ స్తుతి

గురు కరుణాకరా! సమద కుంజర దానవ శక్తి హార సం

భరిత మనా! త్రయీ భువన పావన! ఈశ! ప్రబుద్ధ జ్ఞాన! ఈ

శ్వర గురు ధర్మ భంజన! నిశాచర వర్ధన శస్త శూల! క్ష్మా

ధర వర! జానకీ సతి హృదంతర మందిర! సర్వ పాలకా!

దేవీ స్తుతి

కరుణాకరా! సమద కుం                                                          జర దానవ శక్తి హార సంభరిత మనా!

గురు ధర్మ భంజన! నిశా

చర వర్ధన శస్త శూల! క్ష్మాధర వరజా!

శివ స్తుతి

సమద కుంజర దానవ శక్తి హార

భువన పావన! ఈశ! ప్రబుద్ధ జ్ఞాన!

జన! నిశాచర వర్ధన శస్త శూల!

సతి హృదంతర మందిర! సర్వ పాల!

తరువాత అగ్ని ర గణం అని, సూర్య జ గణం అని, చంద్ర భగణం అని, ఇంద్ర నగణం అని తెలిపారు.   మిగిలిన గణాలు అంటే య, మా, తా, స, వ, లఘు గురువులకు ఏవి వర్తిస్తాయో తెలుపవలసినదిగా ప్రార్ధన.

చివరగా

అనుపమ మద్భుతావహ మనన్య జనాచరితం బమోఘమున్

అనితర మన్య దుర్లభ మనంత మనోజ్ఞ రసాభిరామమై

దనరెడు మీ వచో నిపుణతా, కవితాతుల రీతి మెత్తు, మో

హన కవితా వశీకృత దిగంత సుధీజన! కృష్ణ మోహనా!

భవదీయుడు

by: Srinivas Nagulapalli
“అర్థమశాశ్వతమ్ము” అనే ఉత్పలమాల వెయ్యేళ్ళ కింద శిలాశాసనం లో కాక, మూడేళ్ళ కింద “ఈ మాట” లోనో ఇంకో చోటనో ఎవరైనా వ్రాసివుంటే దానికి ఏ మాత్రం ప్రాముఖ్యం వచ్చేది అని సందేహం. శిలపైన కాబట్టి నిలిచింది కాని, జనాల నాలుకపై అది ఇంత పాతది అని చెప్పినా కూడా నిలుస్తుందా అని చెడ్డ అనుమానం. ఏదో మనకూ పాత పద్యాలున్నాయి, vintage wine లాగా అని చెప్పుకోవడానికి తప్ప, ఒక్కరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా దీనిని ఉదహరించి ఉటంకించే అవకాశం ఉంటుందా అని కూడా అనుమానమే.

ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. అటువంటి సందర్భమే వస్తే, పద్యమే చెప్పవలసి వస్తే దీన్ని వదిలి “కారే రాజులు రాజ్యముల్ గెలువరే.. వారేరీ సిరి మూటాగట్టుకొని పోవంజాలిరే..” లాంటి వెన్నో రసవంతమైన, బలవంతమైన వి స్ఫురిస్తాయి కాని ఇది తట్టుతుంది అనే ఆశ మాత్రం లేదు. కాదంటారా?

విధేయుడు

-Srinivas

by: lyla yerneni
“చాలా మంది ప్రస్తుతం తెలుగు “కవులు” ‘తెలియని వన్ని తప్పులని…” చెప్పడం పరిపాటి అయ్యింది. మీరలా కాదనుకొన్నాను. ” -గరికపాటి

‘అర్ధ మశాశ్వతమ్ము…’  పద్యం అర్థం తెలుపమంటే,   మీరు  ఎందుకో నన్ను గురించి ఆలోచిస్తున్నారే. :-)  మీ పై మాటలు ఈ పద్యం అర్థం తెలుసుకోటానికి, ఎవరికీ  (నాతో సహా)   ఉపకరించవు. మీకు పద్యం అర్థం తెలిస్తే ఇప్పటికీ చెప్పవచ్చు. మరి నాకిప్పటికీ ఈ ఉత్పలమాలకు అర్థం లేదనే అనిపిసున్నది.

“(మోహన గారి వివరణ తర్వాత అసలు ఈ పద్యానికి ఇంకా వివరణ అనవసరమనుకున్నాను. )”-గరికపాటి

ఈ రచయిత వ్యాసం నేను చదివాను. చదువుతున్నాను. ఎన్నో విషయాలు తెలిసికుంటున్నాను. తరువాత అభిప్రాయాల్లో - ఈ పద్యం, తొలి ఉత్పలమాలల్లో ఒకటి ఐవుండవచ్చునని చారిత్రక పరమైన కుతూహలంతో  దీన్ని మనకు ఇప్పుడు తెలిపారు.  చరిత్ర మీద దృష్టితో కొందరు చర్చ సాగించుకోవచ్చు. ఈ సందర్భంలో పద్యానికి వివరణ ఇవ్వటం వ్యాస రచయిత ఉద్దేశం కాదనుకుంటాను.  వారు, పద్యం లో ఉన్న మాటలను వచనంలో పేర్చారు. వాడిన కొన్ని మాటలు పద్యం లో ఉన్న మాటలంత కఠినంగానూ ఉన్నాయి.  ఈ వచనము పద్యభావాన్ని తెలుసుకోటానికి పనికి రాలేదు.

కుతూహలంతో, వేమన శతకం తీసి మొదటి పేజీ చూశాను.  అందులో మొదటి పద్యము :-)

ఆ. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు

తళ్కుబెళ్కు రాళ్ళు తట్టెడేల?

చదువు పద్యమరయ జాలదా యొకటైన

విశ్వదాభిరామ వినురవేమ.

ఈ పద్యానికి నా వద్దనున్న పుస్తకం లో ముందు టీక ఇచ్చారు. అందువల్ల పద్యములోని ప్రతి పదమునకు గల అర్థము తెలిసినది. తర్వాత ఈ కింది విధంగా తాత్పర్యము ఇచ్చారు.

తా. అన్నియును ఇచ్చునట్టి పరమాత్మ యందు ఒప్పిన వేమన్నా వినుము. ఏ రీతిగా వట్టి రంగులు కల మట్టిరాళ్ళు గంపెడయినను ఇంద్రనీలమణితో సాటిగావో ఆ రీతిగానే, మంచిపద్యము ఒక్కటి యయినను చాలును అని భావము.

ఈ  వేమన పద్యపు భావము నాకు తెలిసినది. మరి ఇప్పుడు మనము చర్చిస్తున్న పద్యము ఒక పాత ఉత్పలమాల. ఆ పాత దనానికి  “antique value” ఉందేమో. ఉండొచ్చు. కాని ఇది గులక రాయా? ఇంద్రనీలమణియా ? అని నేను అడుగుతున్నాను.

“లైలా గారు అప్పుడప్పుడు కొంచెం భారతీయ సాహిత్యం చదువుతూ ఉండండి నిదానంగా అదే అర్దమవటం మొదలవుతుంది.”-గరికపాటి

చిత్తము. నేను ఇక్కడ చేస్తున్న పనే అది. ఈ ఉత్పలమాల పద్యము భారతీయ సాహిత్యము లోనిదే గదా. ఈ పద్యం తెలుసుకుంటే కొంత చదివినట్లే. మరి నా అనుమానం ఈ పద్యానికి అర్థం లేదని. అర్థరహితమైన పద్యము ఎప్పుడైనా కాని గణనీయమెలా అవుతుంది?

ఈ ఉత్పలమాల పద్యానికి టికా తాత్పర్యాలు ఇచ్చి, పద్య చర్చకు దోహదం చెయ్యండి. చక్కని భావమున్నదా  పలువురు ఆనందిస్తాను. లేదా ఈ పద్యం అందంగా వినవస్తుంది కాని, అసలు అర్థం పర్థం లేదు అన్న విజం నిరూపించబడుతుంది. నిదానంగానే చదువుకుంటాను సాహిత్యాన్ని. నాకు తొందరేం లేదు. ఒకవేళ నాలో ఉన్న దోషాల వల్ల నాకు తెలియక పోయినా - పద్యానికి అర్థమంటూ ఉంటే, వేరే కొందరికైనా తెలుస్తుంది కాదా.

లైలా

by: Garikapati
అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-

త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్

రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-

ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్

ఈ పై పద్యం గురించే మీరు చెప్పేది! ఈ పద్యం ఉత్పల మాల ఐతే అవునేమో గాని పద్యం స్ఫుట బలోక్తితో మాత్రం పిటపిట లాడిపోటల్లేదు. మొత్తం కలిపి చదివితే ఈ పద్యానికి అసలు అర్థమే లేదు అనిపిస్తున్నది. The conclusion (or rather the advice given ) is incongruous.

Care to explain?

-లైలా యెర్నేని

ఈ పద్యానికి అర్థమే లేదన్నారు. మొదట మీరు వ్రాసింది అదేనా అని ఒక రెండు సార్లు చదివాను. తర్వాత. వ్యంగ్య ప్రయోగమా అని సరి చూసాను. అదీ కాదు. అంటే నిజంగా మీకు అర్థం కాలేదు.

ఒక పద్యానికి అర్థమే లేదు అని చెప్పాలంటే కొంత మీమాంస అవసరమే. మీరు ఎంత ఆలోచించారొ తెలియదు. చాలా మంది ప్రస్తుతం తెలుగు “కవులు” ‘తెలియని వన్ని తప్పులని…” చెప్పడం పరిపాటి అయ్యింది. మీరలా కాదనుకొన్నాను. ఇక పద్యం లోకి వస్తే

ఇది చాలా సూటిగా దూసుకు పోయే పద్యం - భారతీయ తత్వంలో కర్మ ఫలానికి ఉన్న గొప్ప దనం కాస్తో కూస్తో పూర్వ రచనలతో పరిచయమున్న ప్రతి వారికి తెలుసు. జీవితంలో ఏది అశాశ్వతం , ఏది శాశ్వతం అనేది నిక్కచ్చి పదాలతో బలంగా చెపుతోందీ పద్యం. అర్థం అశాశ్వతం అనే బలమైన ఎత్తుగడతో మొదలై (కవి కాలాన్ని గమనించండి). శరీరం అశాశ్వతం అని ఆ తర్వాత ఏది శాశ్వతం అని చెపుతోందీ పద్యం. (మోహన గారి వివరణ తర్వాత అసలు ఈ పద్యానికి ఇంకా వివరణ అనవసరమనుకున్నాను. )

లైలా గారు అప్పుడప్పుడు కొంచెం భారతీయ సాహిత్యం చదువుతూ ఉండండి నిదానంగా అదే అర్దమవటం మొదలవుతుంది.

భవదీయుడు

గరికపాటి

by: lyla yerneni
“బలమైన ఎత్తుగడ,స్ఫుటబలోక్తి , సూటిగా దూసుకు పోయే శైలీవిన్యాసాలతో అలరారుతున్నపద్యం నిస్సందే్హంగా ఎన్నదగిన పద్యాల్లో ఒకటి.” -తమ్మినేని యదుకుల భూషణ్.

అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-

త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్

రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-

ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్

ఈ పై పద్యం గురించే మీరు చెప్పేది! ఈ పద్యం ఉత్పల మాల ఐతే అవునేమో గాని పద్యం  స్ఫుట బలోక్తితో మాత్రం పిటపిట లాడిపోటల్లేదు. మొత్తం కలిపి చదివితే ఈ పద్యానికి అసలు  అర్థమే లేదు అనిపిస్తున్నది.  The conclusion (or rather the advice given ) is incongruous.

Care to explain?

లైలా

by: తమ్మినేని యదుకుల భూషణ్.
చాలా కాలం కిందట ఆదినారాయణ శాస్త్రి గారి పుస్తకం తిరగేస్తూ ఈ పద్యాన్ని చదివి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను.ఆ తర్వాత ఎంతోమంది కవితాభిమానులతో ఈ పద్యం గురించి ముచ్చటించాను. కానీ,ఎవరూ ఎరిగినట్టులేరు ఈ తొలినాటి్ ఉత్పలమాలిక గురించి .అద్దంకి శాసనపద్యం (తరువోజ) మీద కొందరు శ్రద్ధ తీసుకుని చిరు పొత్తాన్ని ప్రకటించి ఉన్నారు. అలాగే,ఈ పద్యం గురించి కొంచెం చర్చ జరిపి  విస్తృత ప్రచారంలోకి తీసుకు రావలసిన అవసరం ఉంది.నన్నయకు ముందు కవిత్వం లేదు అన్నఅపప్రధను తొలగించవలసి ఉంది.కారణం ,మొన్న ప్రాచీన భాష చర్చల్లో తమిళ పండితులు భద్రిరాజు గారి వ్యాసాన్ని ఉటంకించి నన్నయకు ముందు మీరే తెలుగులో కవులెవరూ లేరని సిద్ధాంతీకరించి ఉన్నారు,మరి ఇదెలా సాధ్యం అన్నట్టు పత్రికల్లో చదివాము.మొత్తానికి ప్రాచీన భాష (లేదా శ్రేష్ఠ భాష) హోదా లభించింది. అది వేరే విషయం.

ముక్కలు ముక్కలైన శాఫో పద్యాలను ప్రకటించటంలో ముందుంటారు పాశ్చాత్య పండితులు.మనం కూడా అజ్ఞాతకవి రచనగా కొట్టిపారేయకుండా ,చదిపిరాళ్ళ కవిగా ప్రచారంలోకి తీసుకురావలసి ఉంది.బలమైన ఎత్తుగడ,స్ఫుటబలోక్తి , సూటిగా దూసుకు పోయే శైలీవిన్యాసాలతో అలరారుతున్నపద్యం నిస్సందే్హంగా ఎన్నదగిన పద్యాల్లో ఒకటి.

తమ్మినేని యదుకుల భూషణ్.

by: mOhana
పుస్తకాలను తిరగవేస్తుంటే క్రింది పద్యము కనబడింది. ఇది కడప జిల్లా చదిపిరాళ్ళ గ్రామంలో క్రీస్తుశకం 9 - 10 శతాబ్దాల మధ్య కాలపు శాసనంలోని ఉత్పలమాల.

ఈ పద్యాన్ని ఆదినారాయణ శాస్త్రి వ్రాసిన రాయలసీమ తెలుగు శాసనాల సాంస్కృతిక అధ్యయనం అనే పుస్తకంలో చూచాను.

అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది  తక్షణభంగురమ్ము, త-

త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్

రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-

ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్

ధనము శాశ్వతమైనది కాదు. శరీరము నశ్వరమైనది. జీవము తత్వార్థము కాదు. యమునిచే దండనార్హమైనది. దీనిని నమ్మరాదు. పరార్థానికై, ఎన్నడు మాసిపోని ధర్మార్థమును అందఱు అమ్మన ప్రెగ్గడలా గొప్పగా చేయండి.

ఈ ఉత్పలమాల బహుశా తెలుగులో మొదటి ఉత్పలమాలలలో ఒకటి అనుకొంటాను. విధేయుడు - మోహన

by: J K Mohana Rao
ఆ సూచన రెండవ పుటలోని క్రింది వాక్యమునకు

వర్తిస్తుంది -  “పెద్ద వృత్తాలు చిన్న వృత్తాలను పొడిగించి,

ఇతర వృత్తాలతో చేర్చి, తరువాత మార్చి సృష్టించారు. ఇది

మనము చదివే జెనెటిక్స్ లాంటిదే. జెనెటిక్స్‌లో కూడ

జీన్ డూప్లికేషన్, జీన్ ఫ్యూషన్ వంటివి ఉన్నాయి.”

అదియునుకాక చంపకమాలతో సీసము, కందము,

ఆటవెలది, తేటగీతి, మధ్యాక్కరల గర్భితము చేయు రీతి

proteins మరియు nucleic acids లోని sequence

alignment ను బోలినదే. అందులో amino acids మరియు

nucleotides ఉంటాయి. ఇక్కడ గురులఘువులు ఉన్నాయి,

అంతే. - మోహన

by: Rao Vemuri
గ్రంధసూచిలో చూపించిన   Principles of Protein Structure  ఈ వ్యాసంలో ఎక్కడ, ఎలా వాడబడిందో?