Comments on: నాకు నచ్చిన పద్యం - తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన

by: Kameswara Rao
శ్రీనివాస్ గారు,

“ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు.”

ఈ పద్యం ఆకట్టుకోవడం కోసం రాసిన పద్యం కాదు. మీరు చెప్పిన “వరమున బుట్టితిన్” పద్యంలో ద్రౌపది ఆత్మప్రత్యయం ఉంది. దానికి తగినట్టు పద్యం నడక ఠీవిగా సాగింది. మరి ఈ పద్యంలో ఏముంది? ద్రౌపదిలో చాలా రోజులుగా అణిగి ఉన్న విద్వేష జ్వాల ఉబకడం ఉంది. అందులో ఠీవీలేదు, ఔద్ధత్యం లేదు. తీరూ తెన్నూ లేకుండా, లోపల ఉన్న కసి ఉన్నదున్నట్టుగా కట్టలు తెంచుకోవడమే  ఉంది. అది ఎవరినీ ఆకట్టుకోలేదు కదా!

ఇక మీకిది మంచినీళ్ళ కోసం ఆడవాళ్ళ తిట్టుకోవడంలా కనిపించడానికి కారణం ఈ పద్యాన్ని ఇలా విడిగా చదవడం అని ఊహిస్తున్నాను. ఇలాటి పద్యాల గురించి విడిగా రాయడంలో ఉన్న ఇబ్బంది ఇది. వీలైతే తిక్కన భారతంలో ఈ సన్నివేశాన్ని ఏకబిగిన చదవండి. అందులో ద్రౌపది “రక్కెస తాల్మి”తో మదిలో అణచుకున్న ఈ చిచ్చుని మీరు అనుభవించ గలిగితే, ఈ మాటల్లో మీకు ఆవేశం కనిపించదు, మనిషి లోలోతు పొరల్లో  దాగి ఉన్న ఒక జాంతవమైన కసి నగ్నంగా సాక్షాత్కరిస్తుంది.

మరి ఇట్లాంటి అనుభూతిని ఎందుకిలా సీస పద్యంలో రాయాలి, వచనంలో రాయవచ్చు కదా, మరింత శక్తివంతంగా అని సందేహం. దీనికి కచ్చితమైన సమాధానం అంటూ ఏదీ ఉండదనుకుంటాను. నాకు తోచినది, ద్రౌపది వ్యక్తిత్వంలో సహజమైన ఒక ఠీవీ హుందాతనం ఉన్నాయి, సీస పద్యానికున్న సహజమైన నడకలాగే. దాన్ని తోసిరాజని కసి కట్టలు తెంచుకుంది. సీసమూ అలాగే కట్టలుతెంచుకుంది. “సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు, యతులు ఈ పద్యంలో ఎంత అద్భుతంగా ఒదిగిపోయాయో” అనడంలో బృందావనరావుగారి ఉద్దేశం ఇదే అనుకుంటాను.

by: mOhana
తెలుగు కావ్యాలలో సామాన్యముగా వాడబడే ఛందస్సులలో  చంద్రగణములు లేవు. అలా ఉన్న అక్కరలను గానీ, షట్పదలను గాని తెలుగు కవులు ఉపయోగించ లేదు (ఇటీవలి

సత్యనారాయణగారు తప్ప). నచ్చుతాయో లేవో కానీ మంచి పద్యాలు ప్రాచీన సాహిత్యంలో ఉన్నాయని ఈ కాలపువారికి విడమరచి చెప్పడం బృందావవనరావుగారు చేస్తుండే

గొప్ప సేవ. అది ఎంతో ప్రశంసనీయం.  ఒక పద్యంలో ధార ఉందో లేదో అన్నది వారివారి ఇష్టాయిష్టాలపై ఆధారపడినది. నావరకు నాకు సీసం లాటి దేశి ఛందస్సులో పదాలను గణాలకు సరిపోయేటట్లు వాడితే బాగుంటుంది. పదాలను (అర్ధ)పాదాలకు వంతెనగా పెట్టితే పాడటానికి (చదవడానికి) కష్టం అనే అభిప్రాయము గల వాడిని నేను.

విధేయుడు - మోహన

by: Srinivas Nagulapalli
పాణిని గారు

నిజమే. పద్యం నచ్చడం, నచ్చకపోవడం నాకైనా, వ్యాసకర్త కైనా ఒక్క మాటలో చెప్పడం ప్రధానం కాదు, అవసరం లేదు. ఎందుకు నచ్చిందో, నచ్చలేదో అని సాహిత్య పరంగా స్పర్శించడానికి, పంచుకోవడానికి, చర్చించడానికి మాత్రమే వ్యాసాల ఉపయోగం, అభిప్రాయాలను వ్రాయడం, ప్రచురించడం, పాఠకులు చదవడం _ పడే శ్రమ అంతానూ.

“సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు, యతులు ఈ పద్యంలో ఎంత అద్భుతంగా

ఒదిగిపోయాయో” అన్నారు వ్యాసకర్త.  అవి సాయపడే helpful, may be even necessary అంశాలు అయినా, అంత మాత్రంచేత గొప్ప పద్యానికి అవి ఏ మాత్రం అవసరమయ్యే, sufficient conditions కావేమో అని అనిపిస్తుంది.

సోదాహరణంగా చెప్పాలంటే,  మన సామెత, (ఎన్నో సామెతల పుస్తకాలలో అచ్చేసింది కూడా),  ఇట్లా వ్రాస్తే

“జగడమె ట్లావచ్చు జంగమ య్యాయంటె

బిచ్చము పెట్టవే బొచ్చు ముంX”  అన్నదాన్ని,

సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు, యతులు, ప్రాసయతులు అద్భుతంగా ఒదిగిపోయిన గొప్ప, సీస పద్య పాదం అది అని అంటామా, అనుకుంటామా!

అయ్యో, తిక్కన గారి కవిత్వాన్ని ఎత్తి చూపడానికి మనకు ఈ పద్యమే దొరికిందా అని గింజుకుంటూ వ్రాసింది మాత్రమే ఇది.

I change little bit the saying “with friends like this who needs enemies”, to say, “with examples like this, what need for critics” for the poet !

విధేయుడు

Srinivas

by: కొత్తపాళీ
పాణినిగారూ, తెలిసిన పెద్దవాళ్ళు నాకీ ఫలానా పద్యం నచ్చింది అని ఒక వ్యాసం రాయడమూ, దాన్ని ఈమాట వంటి పత్రిక ప్రచురించడమూ జరిగిందంటే ఇది మీక్కూడా నచ్చవలసిన పద్యం నాయనా అని చెప్పక చెప్పినట్లే. అఫ్కోర్సు అన్ని పద్యాలూ అందరికీ నచ్చాలని లేదనుకోండీ.

by: పాణిని శంఖవరం
“ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు.”

అన్నారు శ్రీనివాస్ నాగులపల్లిగారు.

అందుకే కాబోలు, ఈ వ్యాసపరంపరకు శీర్షిక “మీకు నచ్చవలసిన పద్యం: …” అని లేదు!

అన్యధా భావించకండి, మీ అభిప్రాయం చదివాక వచ్చిన చిన్ని ఆలోచన, అంతే.

by: Srinivas Nagulapalli
నమస్కారం.

నేను వ్రాసిందాంట్లో తప్పేమన్నా ఉంటే దయ చేసి క్షమించమని మొదటగా మనవి.  మహా కవి తిక్కన కవిత్వాన్ని గాని, ప్రతిభను గాని విమర్శించే తాహతు కాదు కదా, పూర్తిగా గ్రహించి గుర్తించడం కూడా నాకు మించిన పనే. కేవలం ఈ పద్యం చదివిన తరువాత కలిగిన ఆలోచన మాత్రమే ఇది. తిక్కన రచనను బేరీజు వేసే దుస్సాహసం కాదు.

ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు.  ద్రౌపది కోపంగా దుశ్శాసనుని వొళ్ళు ముక్కలైపోనీ, భీముని బలం,  అర్జునిని గాండీవం తగలబడడానికా, దుర్యోధనుని పీనుగెల్లనీ,  అని వొళ్ళు మండి చెప్పడాన్ని సీస పద్యంలో, సహజత్వానికి దగ్గరగా చెప్పినట్టున్నది.  అంత మాత్రం చెప్పడం న్యాయమూ, అవసరమే కాని గొప్ప విషయంగా  కనిపించడం లేదు. వీధిలో మంచినీళ్ళ కోసమో, ఇంకదేనికోసమో తెలుగులో  కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు ఉన్నట్టుగా అనిపించింది, కాకపోతే  సీసం, ఆటలెదులలో. అట్లా కాదు, అసలు అదే ఆ పద్యం గొప్పతనం అంటే  చెప్పేదేమీ లేదు, విని ఊరుకోవడం మాత్రమే, ఆ వీధిలోని తిట్లు విని  ఊరుకున్నట్లుగా.

అదే తిక్కన గారిదే, “వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి” అన్న పద్యం ఎంతో రసవంతంగా,  పదాల ప్రవాహ ధారతో,  మనకు గుర్తుండే  విధంగా, ఆకట్టుకునే పద్యం ఉంది కదా!

పోనీ, ఈ పద్యం కంటే సహజంగా, సరళంగా, రుసరుస సాగే  ధారతో, “గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకంజెండుచున్నప్పుడొక్కండును నీ మొఱ నాలకింపడు” అని బెదిరించే తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ పద్యాలు కూడా ఉన్నవి కదా!  తిట్లు, బెదిరింపులు,  శపథాలు, ఆవేశపరమైన ఘట్టాలలో ఉన్న పద్యాలెన్నో ఉన్నాయి మనకు. వాటన్నింటి backdrop లో ఈ పద్యం గొప్పగా  ఆకట్టుకుంటూ నిలబడుతుందని మాత్రం అనిపించడంలేదు.

విధేయుడు

Srinivas

by: sivaram
చాలా కృతజ్ఞతలు. ఉద్యోగపర్వము లో ఇంకా చాలా మంచి పద్యాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు వివరిస్తే చదవాలని చాల ఆత్రుతగా ఉంది. దయ ఉంచి వాటిని తెలియచేయగలరు.

ధన్యవాదములు,

శివరామ ప్రతాప్ రవ్వ

by: రానారె
ఈ పద్యము, మీ వ్యాఖ్యానమూ చదివి చాలా ఆనందం కలిగింది. ఏదైనా రాస్తే దానిచుట్టూ ఎన్నివిషయాలను పరిగణలోకి తీసుకోవాలో ఈ ఉదాహరణ మరొక్కసారి గుర్తుచేసింది. ధన్యవాదాలు.

by: C.S.Rao
తిక్కన గారి  గొప్ప పద్యానికి బృందావన రావు గారి వ్యాఖ్యానం చాలా బావుంది.

ద్రౌపది హోమగుండం నుండి ఆవిర్భవించిన అయోనిజ.మహారాణి.ఒక కౄరుడి దుశ్చర్యకి లోనై పరాభవాగ్ని తో ప్రతీకారం కోసం వేచిచూస్తున్న మూర్తీభవించిన పౌరుషాగ్ని.

ఈ దుశ్చర్యకు పాలుబడిన దుశ్శాసనునికి ,చేయే కాదు శరీరం మొత్తం ఖండ ఖండాలుగా ,తుత్తునియలుగా నరకబడి యుధ్ధరంగం మీద పడి ఉండటం చూసినప్పుడే ఆమెకు,ధర్మరాజుకు మనశ్శాంతి.

ఇక భీమార్జునలును,వారి ఆయుధాలను ఒకింత చులకనగా మాట్లాడి వారి పౌరుషాన్ని జాజ్వల్యమానం చేయదలచుకున్నది.

ఆ మహా సాధ్వి దుఃఖావేశంతో,క్రోధావేశంతో ఉన్నప్పుడు దేవతలకు ప్రతీకలైన సూర్య,చంద్రులు,మహర్షులకు ప్రతీకలైన యతీంద్రులు అవనత శిరస్కులై ఉన్నారనడం లో అందమైన శ్లేష ఉన్నది.ద్రౌపది క్రోధావేశానికి తిక్కన కవితాశక్తికి భయపడి సూర్య,చంద్ర,ఇంద్ర,గణాలు,యతిప్రాసలు భయభక్తులతో మెత్తగా ఒదిగిపొయ్యారని శ్లేషార్ధం.

బావుందండీ.అభినందనలు.

by: Aanamdu
ఎంత బాగా చెప్పారండీ.  తిక్కన మహాకవి గురించి మరికొంత చెప్పి మా అజ్ఞానాన్ని తొలగించ ప్రార్థన.

ఆనందు

by: kalidas
మీరు సీస పద్యాన్ని 8 పాదాలుగ విడదీసి వ్రాస్తే  బాగుండేది.