Comments on: న త్వం శోచితుమర్హసి

by: sandhya
నిజంగా చాలా బాగుంది

by: C.S.Rao
రానారె గారు,

చిత్తశుద్ధితో చేసిన సూచనలను సహృదయంతో ,ఔదార్యం తో   స్వీకరించిన మీ దొడ్డ మనసుకు నేను చాలా సంతోషిస్తున్నాను.

కరుణ రసం మీ స్వభావానికి, మీ రచనాపాటవానికి తగిన   creative channel గా నేను భావిస్తున్నాను.వాస్తవానికి కరుణ ను మించిన రసం వేరొకటి లేదు.

రచయితగా మీకు ఉజ్జ్వలమైన భవిష్యత్తు  నిస్సందేహంగా ఉంది.

అభినందనలతో

C.S.Rao

by: రానారె
సీ.యస్‌.రావుగారికి, మీ సూచనలు చాలా ముఖ్యమైనవి. ఇవే సూచనలను ఈ కథ ప్రచురింపబడే ముందు కొందరు పెద్దలు ఇచ్చియున్నారు. కానీ వాటిలోని క్లుప్తత, వారుపయోగించిన భాష వలన అవి నాకు ఎంతమాత్రమూ రుచించలేదు. మీ వ్యాఖ్యలో ముఖ్యంగా “మెసేజ్ లేదా ప్రబోధం - సాహిత్యప్రక్రియ కలిగించే రసానుభూతి లో అంతర్లీనమై పాఠకుడి ఉపచైతన్య స్థితి లోకి లేదా చైతన్యస్థితి లోకి మెల్లగా ప్రవేశించాలి.” అన్న మాటలను శిరసావహిస్తున్నాను. మీకు ధన్యవాదాలు.

దిలీప్, మీరు మీ నేపథ్యానికి సంబంధించిన అనుభవాలతో మంచి రచనలు చేయగలరు. ప్రయత్నించి చూడండి.

by: C.S.Rao
రానారె గారి కధ మీద దిలీప్ గారి అభిప్రాయం బావుంది.కధలా విస్తరించి హృదయాన్ని జాలిగా తాకింది.మాండలిక పదాల సోయగం తో అలరించింది.

కారణాంతరాలవల్ల నైనా కూడా ,రానారె గారి కధ ను ఇప్పటి దనకా  miss అయినందుకు ఒకింత  regret అయ్యాను.వెంటనే చదివాను.కడప మాండలిక భాషా సౌందర్యం తో,గుండెల్ని పిండే జాలితో కధలాగా కాక,అకస్మాత్తుగా ఎదురైన జీవితానుభవం లా సాగింది రానారె గారి రచన.రైతులకు ఎడ్లు ,వ్యవసాయానికి ఉపయోగపడే సాధనాలు,మూగజీవాలు మాత్రమే కాకుండా ,కుటుంబసభ్యులుగా వారి జీవితాలతో పరస్పర ప్రేమానుబంధం కలిగి ఉంటవి.రైతులకు ఎడ్లు బహిప్రాణాలుగా ఉండటం భారతీయ గ్రామీణ  సంస్కృతి లో ఒక కమనీయమైన  సత్యం.యాంత్రికపరమైన పురోగతిని తిరస్కరించలేకపోయినా ,హుందాగా నడుస్తూ పొలం దున్నే కోడెల సౌందర్యం ట్రాక్టర్ల రాకతో క్రమక్రమంగా  కనుమరుగైపోవటం మనసులో ఎక్కడో ఒకింత బాధాకరంగా ఉంటుంది.

రైతులకు ,ఎడ్లకు మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని రానారె గారు వారి కధ ద్వారా కండ్లు చెమ్మగిల్లేలా ,గుండె కుత్తుకలో పూడుకునిపోయినట్లుగా  feel  అయ్యే విధంగా చక్కగా చెప్పారు,చూపించారు.ఎద్దు చనిపోయిన తర్వాత కూడా తన

యజమానిని గురించి బాధ పడటంతో ,మనసు పై జాలి మేఘాలు ఆవరిస్తవి.

కాకపోతే ,ఇంతటి రసస్ఫోరక స్థితి ని పాఠకుడు చేరుకున్న తరవాత ,చనిపోయిన ఎద్దు చర్మం వల్ల వచ్చే డబ్బు కోసం యజమాని చేసే ప్రయత్నం కసుక్కున ముల్లులా గుచ్చుకుంటుంది.అది ఒక యదార్ధమైన విషయమే అయినా ,దానిని  focus చెయ్యడం కధ సాధించిన రసానుభూతిని దెబ్బ తీస్తుంది.

మరొకవిషయం: జీవన్మరణ విషయాలమీద ఊర్ధ్వ లోకాలవైపు సాగించే మహాభినిష్క్రమణం లో ఎద్దు ఆత్మ  అంత వేదాంత ధోరణి లో ఆలోచించటం కధ సాధించిన  రసౌచితికి ప్రతీఘాతంగా ఉంటుందనుకుంటున్నాను.ఎద్దు ఆత్మ అయినంతమాత్రంచేత ఇలా అనడం లేదు:ఎద్దు ఆత్మ,ఆదిశంకరులవారి ఆత్మ,మనందరి ఆత్మ,విశ్వాత్మ అంతా ఒకటే అని మన వేదంతం ద్వారా  మనందరికీ తెలుసు.కాకపోతే ,సృజనాత్మక సాహితీ ప్రక్రియలలో  బట్ట బయలుగా ప్రబోధపరంగా ఏమి చెప్పినా  వాటి కళావైశిష్ట్యాన్ని అది దెబ్బతీస్తుంది.మెసేజ్ లేదా ప్రబోధం సాహిత్యప్రక్రియ కలిగించే రసానుభూతి  లో అంతర్లీనమై పాఠకుడి ఉపచైతన్య స్థితి లోకి లేదా చైతన్యస్థితి లోకి మెల్లగా ప్రవేశించాలి.కధలో సాధించిన రసజ్ఞతను మానవీయ విలువలను పదిలపరచుకుంటూనే ఏదైనా ఒక జనన మరణాతీతమైన విషయాన్ని ప్రదిపాదించదలచుకుంటే  ఎద్దు ఆత్మను తీసుకపోవటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల అర్ధవంతమైన మందహాసాన్ని చాలా క్లుప్తంగా,సజెస్టివ్ గా విశదీకరిస్తే సరిపోను.

అయినా  రానారె  గారిది నిస్సందేహంగా మంచి కధ,గొప్ప కధ,ఎప్పటికీ గుర్తుండే కధ.

అభినందనలు.

C.S.Rao

by: Dileep
ఏమి చెప్పావుబ్బా భలే చెప్పావు, ఈ కథకు కథలోని పాత్రకు అలాగే నా నిజ జీవితంలోని సంఘటనకు చాలా దగ్గరి సంబంధం వుండాది. ఇది చదివినంత సేపు నాకు మావాడు కళ్లలోనే కనిపించాడు. మాకు వందపైనే అవులు వుండేవి కాని వాటికి పుట్టిన వాటిని నాటు గిత్తలు అనేవారు. వాటికంటే దేశపు ఎద్దులు బాగా నాజుకుగా వుంటాయి. అలాగే పనికూడా బాగ తొందరగా చేస్తాయి. అందుకని మా నాన్న ఒక కాడి అవి ఒక కాడి నాటు గిత్తలు పెట్టేవాడు. అందరి అలోచన కూడా అదే. అందుకే వ్యాపారము చేసే వాళ్ళు మా పక్క ఊరైన నీలకంఠరావు పేటకు ఈ దేశపు దూడలను తెచ్చి అమ్మేవారు, మా అమ్మ నాన్న కూడా ఉదయాన్నే పాలు పోయడానికి ఆ ఊరు వెళ్ళేవారు. అక్కడ మావాడి అందం, కాళ్ళు, కొమ్ములు, రంగు నచ్చి తీసుకొచ్చారు. మావాడు అన్నిటితో పాటే చాలా తెలివైన వాడు, చలాకి గాడు. మా ఇంటి కొచ్చిన కొన్ని రోజుల్లోనే మాతో బాగా కలిసి పొయాడు.  వీడిని చిన్న పిల్ల వాడిలా చూసుకొనే వాళ్ళు. అన్ని అవులున్నా వాటితో పాటు మందలో తోలేవాళ్ళు కాదు, మా అమ్మ దుల్ల కు గరిక తేవడానికి మా గదగుండ్లబావి దగ్గరికి వెళ్ళేటపుడు వీడిని కూడా తీసుకెళ్ళి  మేపుకొచ్చేవాళ్ళు. అలా అల్లారు ముద్దుగా పెంచాము. వీడిని మా గదగుండ్ల బావి దగ్గరికి తీసుకొని పోవడానికి పగ్గము అవసరము లేదు బుద్ధిగా మా వెనకాలే వచ్చేవాడు. నాక్కూడా తెగ నచ్చాడు.  నన్ను చూస్తే అలా  మెడ  పైకి ఎత్తుకొని దగ్గరికి వచ్చేవాడు, ఎందుకంటే మెడ కింద నెమరించుకొవడము చాలా ఇష్టం వాడికి.

నేను కూడా అల్లరే, చదువు అంతగా ఎక్కేది కాదు, పొలం దగ్గరకు వెళ్ళడము మహా ఇష్టం. అందులొ ఆ మధ్యే మా లెక్కల్ మాస్టారును తిట్టానని మా నాన్న చెవిలో పడింది. నేను ఏమి తిట్టలేదండి - మా మాస్టారు రెండు మూడు గైడులు ముందరెట్టుకొని  బోర్డు పైన అన్ని విధాల సమాధానాలు వ్రాసేవాడు. అందులో ఆ రోజు అతను ఏదో తికమక పడ్డాడు, అందుకే మార్చి మార్చి సమాధానాలు చెప్పాడు. సరే అని నేను వూరుకోకుండా నా పక్క వాడితో  “ఈ గుడ్డి సారుకు కనిపించి సావలేదు అందుకే మార్చి మార్చి సమాధానాలు చెపుతున్నాడు” అన్నా నా పక్క వాడితో. అంతే, ఇంక వాడు మంచిగా చేతులు కట్టుకొని నేను అన్నమాటలు మాస్టారుకు చెప్పెసాడు. మనకు వల్లు వాగింది, విషయం ఇంటిదాక తెలిసింది. ఇంక లాభం లేదని చదువు మానిపించారు.

అప్పుడు  మావాడు మంచి రంజుమీదున్నాడు, ఆ నడక ఆ ధీమా, ఎకర పొలం ఇరసాలు ఏమిటి, నాలుగు సాల్లు ముల్లు కర్ర లేకుండానే దున్నేస్తా అనేటట్టుగా. అయితే మాది రాళ్ళ చేను (అందుకే దాని పేరే “రాళ్ళచేను “).  అందుకే పని ఎక్కువ అవడంతో మనవాడికి ఒక తెల్లదొర గాడిని జత తెచ్చారు. వీడు కూడా మంచి ఆరు అడుగుల అందగాడు, నాకు వీళ్ళంటే ఎంతో ఇష్టం. ఆ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. మావాడికి, ఈతెల్లదొరగాడికి, నాకు బాగా షాడకేసే పని వచ్చి పడింది. మా నాన్న సామాన్యంగా ఒప్పుకోడు. బాగా పొలం దుక్కి పట్టాలంటాడు. ఆవిధంగా ఒక నెల రోజులు రోజూ బురదలో  పనే.  వరి నాట్లు వేసారు. పని అయితే అయింది కాని మా వాడు బాగా మెత్తపడ్డాడు (”మెత్త కాళ్ళు పడ్డాయి”). మామూలుగా అలా బుడదలో పని వస్తే ముందే లాలాలు (కాళ్ళకు కిందా ఇనుప ముక్కలు) కొడతారు చెప్పులు లాగా.  అవిలేకపొవడం వల్ల గట్టలు బాగ మెత్తపడ్డయి. ఇద్దరు నడవలేక పొతున్నారు, నాకు చాలా బాధేసింది. సరే అని ఎవరికి చెప్పకుండా నాతో వున్న డబ్బులతో మా ఊరికొచ్చిన సాయిబు దగ్గర లాలాలు కొట్టించడానికి తీసుకెళ్ళాను.

మా అమ్మ ఒక వైపు చెపుతూనే వుంది (వాటికి లాలాలు కొట్టాలంటే బలవంతంగా కింద పడుకోబెట్టాలి) ఇంతకు  ముందు అవి ఎప్పుడు లాలాలు తొడిగించుకోలేదు, వద్దు నాయనా అని. కాని అప్పుడు మా అమ్మ చెప్పేదానికంటే నాకు వాటిమీద ఉన్న ప్రేమతో లేదు ఎలాగయినా కొట్టించాలని తీసుకెళ్ళాను. మన వాడు బుద్ధిగా తొడిగించుకున్నాడు. ఇంకా తెల్లదొరగారికి కొంచం భయం ఎక్కువ, పడుకోలేదు. సాయిబు, మాఊరిలో వేమయ్య ఇద్దరు కలిసి బలవంతంగా పడుకోబెట్టారు. అంతా అయిపోయింది. లేపితే లేచి ముందు కాళ్ళపైనే నిల్చుకుంది. నాకు తెలియలేదు ఎమి అయిందో. ఇంటికి తీసుకెళ్ళాను. అందరు చూశారు కాలు బెసికింది అన్నారు.  మా రామయ్య పెద్దనాన్న ఏవో పసుర్లు పూసాడు. ఏమి లాభం లేదు. ఇంక ఎవరిసలహాతోనో కలిపైన వాత పెట్టారు. అయినా బాగా కాలేదు. జోడు తప్పింది.  ఇద్దరినీ విడదీసారు. మా వాడిని అమ్మేసారు ఎవరికో. చాలారోజులు నేను బాధపడ్డాను, నా మూలంగానే కాలు పోయిందని. చాలాకాలం వరకూ ఇవి నా కలల్లో  ఎక్కువగా కనిపించేవి. మీరు మీ కథ తో మళ్ళీ వాటిని గుర్తు తెచ్చి నా కళ్ళలోకి  నీళ్ళు తెప్పించారు.

దిలీప్.

by: రానారె
వ్యాఖ్యలు రాసి అభిప్రాయాలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెప్పడం సంప్రదాయం. అయితే, ఈ కృతజ్ఞతలు ఒక వారం ముందు చెప్పి ఉండాల్సింది. కొత్త సంచిక వచ్చి, ప్రస్తుతం నా మాటలను అసందర్భం అనిపింపజేస్తుండవచ్చు, క్షమించాలి. ఈ కథకు మూలం ఇక్కడ మొదటి వ్యాఖ్య రాసిన వ్యక్తి. ఆరోజు ఆ గిత్తను కట్టేసింది ఆయనే. విహారి, నేనుసైతం, మురళీకృష్ణ, నవీన్‌గార్లకు ధన్యవాదాలు. ప్రసాదుగారు, మీరన్నది నిజమే కావచ్చు. కానీ పెద్దగా కదిలించి కన్నీళ్లు పెట్టించడం మాత్రమే కాదు ఈ కథ ప్రధాన ఉద్దేశం. వైదేహిగారి అభిప్రాయం ఈ కథ ఉద్దేశానికి అద్దంపట్టింది: “జీవన విధానాన్ని,జీవన్మరణాల మధ్యలో నిర్వికారం గా సాగిపోయే లోకవ్యవహారాన్ని చిత్రీకరించడం”. వేంకటరత్నంబాబుగారు, కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. “ములకనాటీ మాండలికం” అంటే ఏమిటో నాకు తెలీదు. మీకు తెలిస్తే దయచేసి చెప్పండి.

by: Nalini
చాలా చక్కని కథ!! బీభత్సంగా రాయగలిగిన ఇతివృత్తాన్ని ఎంతో సున్నితంగా రాశారు. అందుకనే కాబోలు హృదయానికి హత్తుకుంది. మీరు మరిన్ని మంచి కథలు యిలా అందంగా రాయాలని నా కోరిక.

by: నవీన్ గార్ల
రానారె…మొత్తానికి నేను చెప్పినది చేశావన్న మాట!!! సంతోషం. ఇంకో విషయం ఏమిటంటే చాన్నాళ్ళ ముందు నేనూ సరిగ్గా ఇటువంటి కథ వ్రాశాను. కాకుంటే అందులో దూడ కాకుండా వీధి కుక్క ఉంటుంది.. పోలిక కథలో మాత్రమే, కథనం లో కాదు. అద్భుతంగా వ్రాశావు. ఇలాగే వ్రాస్రూ మమ్మల్ని అలరిస్తూ ఉండు.

by: Vaidehi Sasidhar
చక్కటి మాండలికంలో అద్భుతం గా ఒదిగిన భాష,ఆర్ద్రత నిండిన కధనం.  ఒక జంతువు స్వగతంగా కధ నడపటం కొత్త ప్రక్రియే కాక పెంపుడు జంతువులకి తమ యజమానులతో ఉండే లేదా ఉండటానికి సాధ్యమయ్యే అనుబంధాన్ని eloquent గా ,ఉదాత్తంగా సూచించటం జరిగింది.గ్రామీణ వాతావరణాన్ని ,జీవన విధానాన్ని,జీవన్మరణాల మధ్యలో నిర్వికారం గా సాగిపోయే  లోకవ్యవహారాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.

మంచి కధ!!!

by: kari venkataratnam babu
రానారె గారి ములకనాటీ మాండలికపు కధ చాల బాగుంది.పంచతంత్రము లో యెద్దు మాట్లాడినట్లు రాసినారు అనుకుంటున్న. యెద్దు బదులు పాలేరుతో కధ నడిపితే కొత్తదనం వుండదు.ఇది ఒక నూతన ప్రక్రియ.కొంత కాలం క్రితం  RADIO 4 UK లో ఒక నాటిక విన్న.ఆ నాటిక లొ అంతా జట్ఖా గుర్రం మాట్లాడుతూ LONDON వీధుల గురించి విక్టోరియా కాలం నాటి సామాజిక పరీస్తితులు వర్ణిస్తూ రానారె కథ లొయెద్దు లా ఏకరువు పెడుతుంది తన భాధలన్ని. ఈ గుర్రము స్వగతము ఆంతా london eastend మాండలికములో సాగుతుంది.రానారె యెద్దు లా గుర్రం అంత్యదశ తో కథ అంతమవుతుంది.

by: మురళీకృష్ణ కూనపరెడ్డి
“నా బొంది ఆణ్ణేబెట్టుకోని వారంరోజులు ఏడిస్తే నాకేమొస్సాది! నా తోలుగూడా పనికిరాకండాబోతాది గదా!? ”

ఎంత నిజం!

మంచికథ రానారే!

by: JUBV Prasad
ఈ కధలో వాడిన భాషా, కధ చెప్పిన తీరూ, మాటలూ, విషయాలూ చాలా బాగున్నాయి. ఎటొచ్చీ, జంతువు బదులు ఏ పాలేరు లాంటీ మనిషినో తీసుకుంటే, ఇంకా అద్భుతంగా వుండేదనిపించింది. కడప జిల్లా మాండలీకం లోని పదాలకి అర్ధాలు ఇచ్చి వుండకపోతే, కధ అందరికీ ఇంత చక్కగా అర్థం అయి వుండేది కాదు. ఈ పద్ధతి బాగుంది. జంతువు ఘోష అనేసరికి, అంతా వూహే నన్నమాట అని అనిపించి, వుసూరుమనిపిస్తుంది. మనుషుల కష్టాలు అయితే ఇంకా హృదయాన్ని కదిలిస్తాయి. మొత్తానికి కధ బాగుంది.

ప్రసాద్

by: నేనుసైతం
రానారె,

కళ్ళముందు కదలాడే లా చెప్పావు.

-నేనుసైతం

by: విహారి
రానారె,

ఎలా వర్ణించాలో తెలియడం లేదు. చాలా చాలా బాగుంది. సంపేసినావ్ బో. కళ్ళంబడి బొట బొటా నీళ్ళు కారిపోయినాయ్ బో.

- విహారి

by: Gopinadha Reddy.Y.
కధ చాలా బాగొచ్చింది. రాముని పెళ్ళాం లాగే నాకు కూడా చదువుతుంటే కళ్ళలో నీళ్ళు కదిలి అవిరైపొయె. A very beautiful presentation dear.