ఈమాట » లోపలికి

Expand to right
Expand to left

లోపలికి

లోపలికి

చెట్టుకి గమనం లేదని
జాలి పడకు
దాని ప్రయాణమెప్పుడూ
లోపలికే..


పచ్చజెండా

ఎన్నో రైళ్ళొచ్చాయి
ఎన్నో రైళ్ళు వెళ్ళాయి
కేబిన్లోంచి పచ్చ జెండా
ఎప్పటిలాగే రెపరెపలాడుతోంది


పగుళ్ళ లిపి

చెరువులో నీళ్ళన్నీ తాగేసి
వేసవి సూర్యుడు
అడుగున చిత్తడి నేలపై
పగుళ్ళ లిపిలో ఏదో రాసాడు.


ఏరు-చెట్టు

ఎక్కడకీ కదలని చెట్టు మెల్లగా
ఒక్కొక్క ఆకునే రాలుస్తుంటే
ఒక్క క్షణం ఆగని ఏరు వాటిని
ఎక్కడి తీరాలకో చేరుస్తోంది!


పాత టైరు

ఏ వాహనాన్ని
ఎన్నాళ్ళు మోసిందో
రోడ్డు పక్కన గడ్డిలో
నిశ్చలంగా నిద్రపోతోంది!


రెండు అనంతాల మధ్య..

మీద అనంతంగా విస్తరించిన ఆకాశం
కింద అనంతంగా పరుచుకున్న సముద్రం
మధ్యలో కదులుతోందో లేదో తెలీని విమానంలో నేను
చీకటి వెలుగులు మాటి మాటికీ దోబూచులాడుతున్నాయి


మూలా సుబ్రహ్మణ్యం

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు.  ...

 

(6 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. ప్రద్యుమ్న అభిప్రాయం:

    May 4, 2007 5:41 am

    పాత టైరు, పగుళ్ళ లిపి రెండూ చాలా బాగున్నాయి.

  2. Prasuna అభిప్రాయం:

    May 13, 2007 10:41 pm

    చాలా బాగున్నాయి. చిరు మంచు జల్లుల్లా.

  3. jayasimha అభిప్రాయం:

    May 18, 2007 3:14 am

      కల
    అలసి ఉన్న నన్ను చూసి అమ్మ జోల పాడినట్లు
    చందమామ చెంతకొచ్చి వెన్నెలంత ఇచ్చినట్లు
    పూవులన్ని రేకులిప్పి నన్నుచూసి విచ్చినట్లు
    మబ్బులోన నీటిచ్చుక్క బుగ్గమీద రాలినట్లు
    పిల్లగాలి పక్కనుంచి పలకరించి పోయినట్లు
    కొమ్మమీది కోయిలమ్మ గొంతుఎత్తి పాడినట్లు
    సామన్యులు చెయ్యలేని సాహసాలు చేసినట్లు
    తరాలన్ని తరలివచ్చి తలనిమిరీ వేసినట్లు
    కైలాసం కరిగివచ్చి నాదేశం కడిగినట్లు
    పరబ్రహ్మే పరుగునొచ్చి ఈరాతలు రాసినట్లు
    జయ

  4. Lyla Yerneni అభిప్రాయం:

    May 20, 2007 4:08 pm

    ఒహో! కవిత్వంపై కవిత్వం. అన్నీ బాగున్నాయ్ .
    బాగా రాసారు జయ గారు!

  5. Vamshidhar Kudikala అభిప్రాయం:

    May 31, 2007 4:38 am

    అన్నీ బాగున్నాయి. నాకు ‘లోపలికి’ కవిత చాలా బాగా నచ్చింది.

  6. Lalitha Sravanthi అభిప్రాయం:

    June 5, 2007 9:12 pm

    “రెండు అంతరాల మథ్య “బాగుంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a