Comments on: ముగ్గురు ముసలమ్మలు

by: lyla yerneni
కథ చదివాను. ‘ఈ మాట’ లోని కామెంట్లు చదివాను.

ఈ కథలో ముగ్గురు ముసలమ్మలతో పాటు, డాక్టరు సునీత కూడా ఒక పాత్రే.

అరుణా పాణిని - ఈ పై కథను రాసిన రచయిత్రి.

కథలో పాత్రలన్నీ ఈ రచయిత్రి కల్పితాలే. అన్ని పాత్రల మాటలూ రచయిత్రి రాసినవే.

మరి,

ఈ రచయిత్రి డాక్టరు ఐ ఉన్నందున,  కథలో ఉన్న డాక్టరు సునీత మాటలు మాత్రం, రచయిత్రి అభిప్రాయాలుగా పాఠకులు తీర్మానించవచ్చునా?

ఈ కథ  ఒక డాక్టరు కాకుండా ఇంకెవరో రాస్తేనో, లేకుంటే :-) ఏదో మారు పేరుతో రాస్తేనో, అప్పుడు డాక్టరు సునీత  అభిప్రాయాలు  ఎవరి అభిప్రాయాలు అవుతాయి? పాఠకులు  వాటిని ఎవరికి ఆపాదిస్తారు?

లైలా

by: rama bharadwaj
“చావుతో సరియైన సౌఖ్యంబులో తగిలి”..అంటాడు అన్నమయ్య అలాగే…కేన్సర్ తో బాధ పడి పోతున్న దశలో కూడా అంతే చిరునవ్వుతో అంతే శాంతంతో..శ్రీ రమణ మహర్షి ” బాధ లేదా స్వామీ” అని భక్తులు అడిగినప్పుడు ” బాధ శరీరానికి గానీ తనకి కాదు” అని తను తన శరీరం కాదని జవాబు చెప్తారు. వాళ్ళు జ్నానులు.

“అనాయాస మరణం వినా దైన్యేన జీవనమ్ ” అని ఈ దేశపు ఆర్యోక్తి!! అయితే ఇది ఒక ఆదర్శమే గానీ ఇందుకు ప్రాణులు అన్నిసార్లూ అనేక కారణాల వల్ల చాలరు.ఎన్నో కోరికల్లాగే ఈ కోరికా అందరికీ తీరేది కాదు.అందు వల్ల మృత్యువుని గురించి బయటివాళ్ళు చెప్పడం, మంచి చావు ఇలా ఉంతుంది అని చావుని నిర్వచించటం హాస్యాస్పదమే కాదు..అన్యాయమ్ కూడా!ఇది ఒక తరహా వివక్ష. ageism అంటారు.

ageism అన్నదాన్ని racism అంత తీవ్రంగానూ చూడాల్సిందే!! చావు ఉంటుంది. అంతే గానీ అది “హుందా” అయిన చావా?? దిక్కుమాలిన చావా?/ అన్ని ఇన్నిరకాలుండవు. kinship వల్ల ఇలాంటి బాధలూ..ఇలాంటి భావనలూ.. మనుష్యులకుంటాయేమో గానీ సృష్టి లోని ఏ ఇతర ప్రాణులకీ ఉండవు.

అది స్వచ్చంద మరణమైతే తప్ప ఈ పధ్ధతి లో చావాలని ఎవరైనా అనుకుంటే తప్ప..మృత్యువు ఏ రూపంలో వచ్చి పలకరిస్తుందో తెలిసిన వాళ్ళు లేరు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో దరిచేరేదీ డాక్టర్ లతో సహా చెప్పగలిగినవాళ్ళు లేరు.ఏవో కొన్ని వేదాంతాలు ఆ క్షణానికి వల్లించుకోవడం తప్పితే అందులో ఏ సత్యమూ గోచరించదు.

చావుని వీలైనంత దూరం పెట్టడం ఆధునిక వైద్యం వల్ల ఎంతో కొంత మనిషికి సాద్యమైంది గనక గానీ… అదే అడవిలో ఎలుగు, ఆకాశంలో ఎగిరే పక్షి ,ఎలా చావుని స్వీకరిస్తున్నాయో చూసిందెవరూ?? చావు అన్నది ఎవరికైనా ఒకటే కదా!!

ఈ కధ వల్ల “మరణాన్ని” చూడటంలో డాక్టర్ లలో కూడా అసహనాలుంటాయని తెలుస్తోంది.. కానీ వృత్తి ధర్మంగా చావుని “హుందా” చావు గానూ.. నానా చావు గానూ..వర్గీ కరించడం  ఒక డాక్టర్ పాత్ర అలా  భావించడం మాత్రం ఆశ్చర్యమే! విషాదమే!! రవికిరణ్ గొంతులో కోపం ఉందేమో గానీ ఆయన మాటల్లో మాత్రం నిజం కన్పిస్తోంది. ధర్మాగ్రహం అది!  సదుపాయాలు ఉన్నాయి కదా అని అనవసరంగా బతుకుని పొడిగించుకోకండీ..చక్కగా మా తాతయ్య లాగా అలవోకగా అందరికీ ఆదర్శంగా “శివశివా!!” అనుకుంటూ  చప్పున చావండీ !!అని దాక్టర్ సునీత ఇస్తున్న సందేశం ఈ కధలో సుస్పస్టం!! అరుణాపాణిని గారి ఈ సందేశం ఎంతమందికి ఒప్పుదలగా ఉంటుందో మరి??

రమ.

by: బొల్లోజుబాబా
కథనం బాగుంది. కధలోని నేపథ్యం మన తెలుగునాడు కాదు కనుక అన్వయం కొంచెం కష్టంగానే ఉంది.

రవికిరణ్ గారి వాఖ్య కొంచెం పంజెంట్ గాఉంది. కానీ ఒక పరిశీలన ప్రతిఒక్కరూ తనచావు ప్రశాంతంగా శివశివా అనుకొంటూ పోవాలని కోరుకొనేవారే. ఆఖరుకు మంచంపట్టిన వారుకూడా.

కానీ వాస్తవానికి మరణ శయ్యపై ఉన్నవాని ఆలోచన అలా ఉంటుందా? మరికొంత కాలం బతకాలన్న ఆశ ఉండటం సార్వజనీనమేమో.

అలాగని చావును ఈ కథలో మూడో ముసలమ్మ ఎదుర్కొన్నట్టుగా వీరోచితంగా ఎదుర్కోవటం అనేది చాలా డ్రమాటిక్ గా అనిపిస్తోంది.  ఇక్కడ అప్రస్తుతమైనా ఎప్పుడో చదివిన చిన్న కవిత

చిన్నప్పుడు తడబడుతూ రోడ్డు దాటుతున్న

ముసలివానిని చూసి దేముడా నాకు అట్లాంటి దుస్తితి

రాకుండానే తీసుకుపో అని కోరుకొన్నాను.

ఇప్పుడు అంత ముసలివాడినయ్యాక మరలా దేముడిని ప్రార్ధిస్తున్నాను

దేముడా నన్ను ఇప్పుడే తీసుకెళ్లకు ఈ రోడ్డు దాటనీ”

కవి పేరు గుర్తుకులేదు వాక్యాలు కూడా అవే కాకపోవచ్చు.

ప్రతిఒక్కరూ ప్రశాంతంగా శివ శివా అని వెళిపోవాలి అన్న కోరికమీద నిర్మించిన కథ ఇది. దీనిలోని పాత్రలూ, సంఘటనలూ, సంభాషణలూ ఆ సెంట్రల్ డోగ్మా ను అనుసరించి పేర్చుకొంటూ పోయినవే అని నాకనిపిస్తూంది.  అంతకు మించి మరోలా ఉండటం వీలుకాదేమో!

బొల్లోజు బాబా

by: అక్కిరాజు భట్టిప్రోలు
ఈ కథ గురించి నా బ్లాగులో చర్చించాను గమనించండి.

http://after3beers.com/teluguhome/?p=165

అక్కిరాజు

by: Ravikiran Timmireddy
“ఇండియాలో తాతయ్య లాగే ఆమెకు జీవించడంలో హుందా చావులో కూడా వుంది.” ముగ్గురు ముసలమ్మలు, మూడురకాల కోరికలు మరణం గురించి. ఐతే వీటన్నిటి పోలికకి బేస్ లైన్ మాత్రం ఇండియాలో తాతయ్య ప్రశాంతవైన మరణవే. శివ, శివా అనుకుంటూ, చక్కగా ఉయ్యాల బల్ల మీద కళ్ళు మూసుకుని పడుకోని, తేలీకుండానే కన్ను మూసిన తాతయ్య మరణవే. వొక వేళ తాతయ్యకి అత్యవసరవైన వైధ్య సహాయం అందుబాటులో వుండుంటే, అది అందుంటే, బ్రతికి బట్టకట్టుంటే ఆయన ఏ రకవైన చావుని కోరేవారో అరుణగారికి బహుశా వూహకందని విషయం. అలా కాకుండా తాతయ్య గారికి ఏ స్ట్రోకో వచ్చి మాటా, చేతా పడిపోయి, బ్రతుకు పడకకే పరిమితం ఐపోయి, డైనింగ్ నుంచి డెఫికేషన్ దాకా పడకమీదే జరిగే పరిస్తితి వచ్చుంటే, ఇంత జరిగినా, మనసు మాత్రం మామూలుగా సృహలో వుండి, బ్రతకడానికి అప్పుడప్పుడు ఏ వెన్టిలేటర్ సహాయవో అవసరవైతే, డా. సునీత గారికి తాతయ్య మీద ఎలాటి అభిప్రాయం వుండేదో అరుణగారే చెప్పాలి. డా. సునీత మనసులో ఆకాశం ఎత్తున తాతయ్య మీదున్న గౌరవం ఏ పాతాళానికి పడిపోయేదో, లేకపోతే శ్రీమతి. జేమ్సు మీద, బ్రతుకుకోసం ఆవె పడే ఆరాటం మీద గౌరవం ఆకాశం ఎత్తున పెరిగేదో అరుణ గారే చెప్పాలి.

పరిస్థితి వున్నది వున్నట్టు వివరించడం అవసరం. కానీ తన సౌలభ్యంకోసరం చావు బ్రతుకుల నిజాన్ని, తనకనుకూలంగా కొంచం వంచి, భయం కలిగించేలా, భయంకరంగా వివరించడం, వైద్యవృత్తికే కాదు, మనిషి ప్రవృత్తికీ కూడా గౌరవం కలిగించదు. తనకి చేతకాకపోతే ఏ పేలియేటివ్ కేర్ స్పెషలిస్టు సహాయవో తీసుకోవాలి అంతేగానీ అత్యంత అనారోగ్యంగా వున్న అమ్మ (శ్రీమతి. జేమ్సు) గురించి, కుటుంబ సభ్యులతో కటువుగా మాట్లాడటం అనాగరికం, కౄరత్వం. ఐతే ఈ అనాగరిక ప్రవర్తన ఈ వొక్క సంఘటనకే పరిమితం కాదు. డా. సునీత మనసుని చూపించడానికి, ఆ మనసులో ఆలోచనల్ని, వాటిలో వున్న మురికిని చూపించడానికి డా. సునీత చేతనే ఇలా చెప్పించారు “టెక్నాలజీ, అదివాడడానికి మన చేతి డబ్బు పడనక్కరలేదన్న ధీమా లేకపోతే వీళ్ళకి ఈ టెమ్టెషన్ ఉండదేవో!” నిజవే మరి, అందుకే భారద్దేశంలో ఆ టెక్నాలజీ, ఆ సౌలభ్యం చాలా మందికి దక్కకుండా చేయడంలో డా. సునీతలు విజయం సాధించారు. గుండె జబ్బుల లాంటి ప్రాణాంతకవైన వ్యాధులే కాకుండా, అతి సారల్లాంటి అతి సాధారణ వ్యాధులు కూడా జనాన్ని ప్రశాంతంగా శివ, శివ మనిపించే గొప్ప ప్రజారోగ్య శాఖని సృష్టించారు.

ప్రపంచంలో రకరకాలైన విభేదాలున్నయ్. జాతి, రంగు, ప్రాంతం, కులం, ధనం, వీటన్నికితోడు, అరుణ గారు మరో క్రొత్త విభేదాన్ని ప్రచారంలోకి తెస్తున్నరు. అది చావు. మనం ఏరకంగా మరణించావో అనేది మనం ఏరకంగా బ్రతికేవో అనేదాన్ని నిర్వచిస్తుంది అనమాట. డి ఎన్ ఆర్ (DNR – Do Not Resuscitate) అనేది, పరిస్థితులకి, మన ఇష్టాఇష్టాలకీ సంభందం లేనటువంటి, యూనివర్సల్ గుడ్ అనమాట. అరుణ గారి ద్రుష్టిలో అదొక గొప్ప, వీరోచితవైన విషయం, ఎవరికో కోరుకున్న వాళ్ళకి కాదు, అందరికీ.

రవికిరణ్ తిమ్మిరెడ్డి