Comments on: రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు

by: Sai Brahmanandam Gorti
వ్యాసకర్త గారూ, ఈ క్రింది లింకు చదివితే నేను ప్రస్తావించిన విషయాలు కొన్ని తెలుస్తాయని అనుకుంటున్నాను.

http://www.eenadu.net/archives/archive-11-3-2007/htm/weekpanel1.asp

by: Sai Brahmanandam Gorti
వ్యాస కర్త గారి వివరణ కాస్త దురుసుగా ఉన్నట్లుగా అనిపించిందని నా అభిప్రాయం. ఏ వ్యాసమైనా, కథ అయినా, కవిత అయినా విమర్శ ఉన్నప్పుడే దాని బాగోగులు తేలేది! రచయితలకి తమ తమ రచనలనీ, అభిప్రాయాలనీ, విశ్లేషణనీ,  ప్రజల్లోకి తీసుకెళ్ళే స్వేచ్ఛ ఎలా ఉంటుందో, పాఠకులకీ విమర్శంచే స్వాతంత్ర్యం ఉంటుది కూడా!  ఈ వ్యాసం బాగోలేదని ఎవరూ ఉటంకించ లేదు. అక్కడక్కడ కాస్త తప్పులు దొర్లాయంతే ! దానికే సవాళ్ళు చేస్తే ఎవరూ ఏమీ చేయలేరు.

by: ravikiran timmireddy
సర్వజ్ఞత ఎవరికుంటుంది? ఎవరికీ వుండదు. అందువలన తప్పులుండతం ఎంత సహజవో, తప్పులెన్నటం అంత సహజవే. మన ఆలోచనలు మనలో వున్నంతవరకూ మనవే, ఎవరికీ విమర్శంచే హక్కు లేదు, కానీ అవే బయటకొస్తే, విన్న వాళ్ళకీ చదివిన వాళ్ళకీ అందరికీ తప్పులెతికే హక్కుంది. అందువలన దాంట్లో బలాబలాలు తేల్చుకోవటం ఎందుకండీ? మీరు వ్రాశారు, నచ్చిన మాలాటి నలుగురం చదివి, ఆహా, వోహొ అనుకున్నాం. నచ్చని నలుగురు, ఏవి నచ్చలేదో చెప్పేరు, అంతే కదా, దానికే బాలా బలాలు తేల్చుకునే సవాళ్ళేందుకు సార్.

రవికిరణ్ తిమ్మిరెడ్డి

by: sreeram murthy
The entire tone of the author in the original article was that of a scholar and comes off as an authority of the subject. Though I am not as knowledgable as the author is, still I do not  entirely agree with the opinion of the author on the musical styles of Tygaraja, Dikshitar and Shyama Sastry. I cannot comment about the western music since I am completely a novice and my opinion does not matter much. Overall an average aricle!

regards

sreeram murthy

by: Nagaraju Pappu
అందరి అభిప్రాయాలూ చదివేక, ఈ వ్యాస కర్త గా నేను కొంత వివరణ ఇవ్వవలిసిన ఆగత్యం నాకుందనిపించింది. ఈ వ్యాసం రాయడం వెనకాల రెండు ముఖ్యమైన ఉద్దేశ్యాలున్నాయి:

౧. చాలమంది మన వాళ్ళే - పాశ్చాత్య సంగీతంలో ఏముందండీ - అంతా రణగొణి ధ్వనులు తప్ప అంటూ ఉంటారు. అలాటి వ్యాఖ్యలు విన్నప్పుడల్లా చాలా బాధగాను, కోపంగాను ఉంటుంది. మన సొంతడబ్బా కొట్టుకోడానికి ఇంకొకర్ని నిందించనక్కరలేదు. పాశ్చాత్య సంప్రదాయం కూడా మహోన్నతమైనదే అని నాకు వీలయినంతలో వివరించడం ఈ వ్యాసం యొక్క ప్రథమోద్దేశ్యం. మన సంగీతంతో కొన్ని సారూప్యతలు చూపడం కూడా అందుకే.

౨. ఈ రచయితకి పదిహేను సంవత్సరాల క్రితం “కూనిరాగం” తప్పితే ఇంకే రాగమూ తెలీదు, కాని కర్ణాట సంగీతం గురించి తెలుసుకోవాలని, విని ఆస్వాదించాలని చాల ఉబలాటంగా ఉండేది. కాని ఎక్కడ ప్రారంభించాలో తెలిసేది కాదు. ఇప్పుడైతే ఇంటర్నెట్ నిండా చాలా సమాచారం ఉంది, ఆ రోజుల్లో ఇంత సమాచారం లేదు. ఎవర్ని అడిగినా - స్వర జ్ఞానం ఉండాలనేవారు, లేకపోతే రాగాల గురించి, వాగ్గేయకారుల రచనల్లో ఉన్న ఆధ్యాత్మికత గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేవారు.  ఇప్పుడు కూడా చాలమంది, ముందు సినిమా సంగీతం వినండి, కీ-బోర్డు కొనుక్కొని కొంత స్వర సాధన చెయ్యండి అంటుంటారు. మెత్తం మీద శాస్త్రీయ సంగీతం, అందులోనూ, కర్ణాట సంగీతం చాలా క్లిష్టమైన దనే అభిప్రాయం సామాన్యుడనుకొనే పరీస్థితి ఉంది ఈ నాటికీ. ఈ రాగాలు, తాళాలు - వీటిల్లో అంత పెద్ద “సీనేం” లేదని చెప్పాలని రెండో ఉద్దేశ్యం. పాడేవాడికి నాదోపాసన ఉండాలేమోగాని, వినేవాడికి “కర్ణోపాసన” ఉంటే చాలు.  నేను కర్ణాటసంగీతం వినడం ప్రారంభించిన కొత్తలో, నా అదృష్టంకొద్దీ ఆదిభట్ల నారాయణ దాసు గారి దగ్గర శిష్యరికం చేసిన ఒక మహానుభావుడి సాంగత్యం దొరికింది. ఆయన్ని - “గురువుగారు - నా లాటి చెవులపిల్లి గాళ్ళకి కర్ణాట సంగీతం విని ఆనందించే భాగ్యం లేదా, ఎవరిని అడిగినా స్వరజ్ఞానం కావాలంటారు - మరది ఎలా సిద్ధిస్తుంది” అని అడిగేను. దానికాయన - “పాడేవాడికుండాలయ్యా స్వరజ్ఞానం, వినేవాడికెందుకూ” అన్నారు. అని, ఒక అరగంటలో ఈ స్వరాల రహస్యాలన్నీ చెప్పి, చివరగా - “నువ్వు, ఒక సంవత్సరం పాటు దీక్షితార్ గారితో చెలిమి చెయ్యి. ఆ తర్వాత, ప్రపంచంలో ఏ సంగీతమైనా నీకు వెంటనే అర్థం అయిపోతుంది” అన్నారు. నా విషయంలో ఆయన మాటలు అక్షర సత్యాలు. నాకిప్పటికీ రాగాల పేర్లు తెలియవు. కాని, రెండు పాటలు ఒక రాగంలో ఉంటే నేను అవి ఒక రాగంలోనివే అని చెప్పగలను. అలాగే ప్రపంచంలో ఏ సంగీతమైనా విని - నాకున్న “చెవులపిల్లి” భాషలో అర్ధం చేసుకోగలను. నాకు అనుభవం అయ్యినంతలో దీక్షితార్ తో చెలిమి ఎలా చెయ్యాలో, త్యాగయ్యతో చెలిమి ఎలా చెయ్యాలో, ఏ స్వర జ్ఞానమూ అక్కర్లేకుండానే సంగీతాన్ని - అందులోనూ శాస్త్రీయ సంగీతాన్ని - విని ఆనందించవచ్చునని, దానికి ముప్పై సంవత్సరాలు ఎదో సాధన చెయ్యవలిసిన అవసరంలేదనీ, శాస్త్రీయ సంగీతం దరికి చేరడానికి - సినిమా సంగీతము, లలిత సంగీతము లాటి కవచాలు, కుండలాల అవసరం కూడా ఎదీ లేదనిన్నీ చెప్పడం మరో ఉద్దేశ్యం.

ఈ వ్యాసంలో నేను “కాస్పిరసీ-థియరీ” ఏదీ ప్రతిపాదించలేదు. ఇది ఒక గొప్ప పరిశోధన వ్యాసం అని కూడా నేనెక్కడా చెప్పలేదు. ఇది కేవలం సాహిత్య వ్యాసం - పొయటిక్-రెఠోరిక్ ఉపయోగించి, పాఠకుడిని త్యాగయ్య ముందు, దీక్షితార్ ముందు కూచోబెట్టడానికి,  మిమ్మల్నోసారి నా వీపున కట్టుకొని వియన్నా నగరం అంతా తిప్పితీసుకొని రావడానికి చేసిన ఓ చిన్న ప్రయత్నం - అంతే. నేనందుకే, వ్యాసం ప్రారంభంలోనే - అష్టదిగ్గజాల కథ చెప్తానన్నానుగాని, వారి గురించిన చారిత్రక సత్యాలు మీముందు ఆవిష్కరిస్తానని చెప్పలేదు. ఈ పోపులడబ్బాతో ఒక ఇడ్లీ-సాంబారు వండిపెట్టే ప్రయత్నం చేసేసు. వీలైతే ఇడ్లీని సాంబారులో ముంచుకొని ఆస్వాదించండి. దీక్షితార్ గారికి ఓ పాట రాయడానికి పదిరోజులు పట్టేదేమో అనంటే - ఆయన పాటతో నాకున్న అనుభూతి అలాటిది, నా అనుభూతిని మాటల్లో చెప్పడానికి చేసిన ప్రయత్నం - అంతేకాని, అది ఆయనకు అవమానం ఎలా అవుతుంది? ఆశువుగా ఆయనో నాలుగు కృతులు చెప్పలేరూ? ఎందుకు చెప్పలేరూ? తప్పకుండా  చెప్పగలరు. ఆయన చేతికి గండపెండేరాలేసుకొన్నారో లేదో నేనేమైనా చూసేనా? దానికి, చారిత్రక ఆధారాలు తెమ్మంటే నేనెక్కడనుంచి తేగలను?

ఈ వ్యాసానికి  లేని “శాస్త్ర” స్థాయిని మీరే దీనికి ఆపాదించేసి, మీరే దీన్ని దుయ్యబట్టనక్కరలేదు. అది సమంజసం కాదు. పరిశోధన వ్యాసాలు, పాండిత్య చర్చలకి ఈ పత్రిక వేదిక  కాదేమో కూడా. పరిశోధన వ్యాసాలని - నిష్ణాతులు, పండితులూ చదివే “సైంటిఫిక్-జర్నల్స్”లో ప్రచురించుకోవాలి.  అక్కడ పండితులందరూ మనం ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఒప్పుకొంటే, అప్పుడు - సామాన్య పాఠకుడిముందుకి రావొచ్చు.

ఇక, ఒకరు - ఈ వ్యాసంలోవన్నీ యాధృచ్చికాలేగాని, నిజమైన సారూప్యతలు కావన్నారు. ఒక రకంగా చూస్తే నిజమే. నేను చూపించిన సారుప్యతలన్నీ - స్ట్రక్చురల్-సారూప్యతలు. ఎక్కడైనా, ఏ శాస్త్రమైనా - పరిణామం చెందే దశలు ఒక్కలాగే ఉంటాయి. ఎవరో ఒక మహానుభావుడు ఒక విత్తనం పాతుతాడు, ఇంకొకాయన, దానికి కంచెవేసి, నీరుపోసి మొక్కగా ఎదగడానికి తోడ్పడతాడు, దానికి వేర్లు పాతుకుపోయేక, కాండం బలపడేక - అది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఇందులో యాధృచ్చికమేం లేదు, అలాగని ప్రత్యేకమైన, చెప్పుకోదగ్గ సారూప్యతాలేదు. అయితే, ఇలా తోలు తిత్తిలోంచి గాలి తీసేసినట్టు చెప్తే అందులో మజా ఏముంది? దానికే, కొన్ని రంగులు, రెక్కలు అదిమి - ఓ మధురమైన కథగా చెప్తే రంజుగా ఉంటుంది. చదివేవాడి మదిలో ఒక అందమైన ముద్ర పడే అవకాశం ఉంది.

గ్రీకుదేశంలో సంగీతం గురించీ, మధ్యప్రాచ్యదేశాలాలో సంగీతం గురించీ ఒక మాట. పారిస్ లో ఒక మ్యూజియం వాళ్ళకోసం యాంటీక్ మ్యూసికల్ ఇంస్ట్రుమెంట్స్ సంపాదించటంకోసం ఒక మిత్రుడితో కలసి - టర్కీ, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ లాటి దేశాల్లో పర్యటించి, అక్కడ కళాకారులతోనూ, పండితులతోనూ స్నేహ సంబంధాలు కలుపుకొని, వాళ్ళ సంగీతం గురించి కొంత నేనూ తెలుసుకొన్నాను. నాకు తెలిసినంత వరకూ - ఈ రాగాల గొడవలు అందరికీ ఉన్నాయి, సుమారుగా అటూ-ఇటూ కొద్ది తేడాలతో ఉంటాయి. వీటిలో స్థూలంగా - నిర్మాణాత్మక సారూప్యతలు చూపించటం చాలా సుళువే, కాని సిమాంటిక్-సారూప్యతలు, భేదాలూ చూపించటం - అదీ సామాన్య పాఠకుడికర్థమయ్యే రీతిలో చెప్పడం చాలా కష్టం. అలా చెప్పడానికి, ముందు మన సంగీత శాస్త్రానికో ఒంటాలిజీ కావాలి, ఇంకో సంప్రదాయానికి ఒంటాలిజీ కావాలి. రెండు కాన్సెప్ట్స్ మధ్యనుండే సిమాంటిక్-రిలేషన్స్ పట్టుకోగలగాలి. అయతే, దీనిలో ఓ చిక్కుంది:

కూలంకుషంగా ఇలాటి పరిశోధన చెయ్యాలంటే - శాస్త్రాలనీ, విజ్ఞానాన్ని క్రోడికరించిచిన పద్దతులు మనకి తెలియాలి. రెండు శాస్త్రాల్లో క్రోడీకరించడానికుపయోగించిన పద్దతుల్లో మౌలికమైన తేడాలుండొచ్చుకదా? రెండురకాల ఒంటాలజీ పద్దతులున్నాయనిన్నీ -  అరిస్టాటిల్ ప్రతిపాదించిన ఒంటాలిజికల్ పద్దతి - ఎనలిటికల్ మెథడ్ ఆధారంగా ఉంటుందని, అదే, మన ఫిలాసిఫీలో వైశేషిక దర్శనంలో ప్రతిపాదించిన ఒంటాలిజీ దానికి చాలా భిన్నంగా ఉంటుదనిన్నీ ఈ మధ్యనే కంప్యూటింగ్ శాస్త్రజ్ఞులూ, భాషా శాస్త్రవేత్తలూ ప్రతిపాదిస్తున్నారు. ఒంటాలజీ తయరు చేసే పద్దతులని “శాస్త్రీకరిస్తే” - ఎవైనా నిర్వచనాల మధ్య అన్యోన్యాశ్రయ దోషాలాటి సమస్యలని చాలా తేలికగా పరిష్కరించుకోవచ్చని అంటున్నారు. అయితే, ఈ చర్చలన్నీ ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి. వీటిమీద పరిశోధన వ్యాసాలు ఇంకా రావలసి ఉంది. అవి ప్రచురితమైన తర్వాత - ఆ రంగాల్లో నిపుణులూ, పండితులూ చర్చలూ, చెడుగుడాటలూ, యుద్దాలూ ఇంకా చెయ్యవలసి ఉంది. అవన్నీ అయ్యి, వీటిని సిద్దాంతీకరించడానికి చాలా సమయం పడుతుంది. అది అయితే, ఏ రెండు శాస్త్రాల్లో ఉన్న సిమంటిక్-సారూప్యతలూ, విభేదాలు అర్ధం చేసుకోవటంగాని, సమన్వయించడం గాని చాలా సుళువైపోతుంది. (ఉదాహరణకి, ఈ మధ్యనే - మెత్తం వేదాంతంలోని కాన్సెప్టన్నింటీనీ, వాటి మధ్యనున్న సిమంటిక్-రిలేషన్సుని ఒకే పేజీలో పట్టేటంత ఒక చిత్రపటం తయారు చేసేం. ఎవరికైనా కావాలంటే - నాకు ఈమైల్ చేస్తే - మీకు అందచేస్తాను.) ఇదంతా ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే - రెండు సంప్రదాయల్లో సారూప్యతలూ, తేడాలూ చూడాలంటే - దానికో శాస్త్రీయమైన ఆధారం కావాలి కదా? నాకు తెలిసినంత వరకూ - అది సిమాంటిక్సుకి సంభందించిన విషయం. ఈ రాగాలూ అవీ - ఒంటాలజి, సిమాంటిక్స్ పరంగా చూస్తే - కోడెడ్-ఇన్-ఫర్మేషన్-స్ట్రక్చర్స్ - విభిన్నమైన సంగీత రీతుల మధ్య  సిమాంటిక్-స్టడీస్ చేసి,  వాటి గుట్టు విప్పాలంటే మరి ఒంటాలజి లాటి శాస్త్రాల సహాయం కావాలి. ఇప్పటిదాకా - వీటికి థియరిటికల్-బేసిస్ ఇంకా లేదనుకుంటాను. భాషా శాస్త్రానికి ఎలాగైతే ఒక థియరిటికల్-ఫ్రేమ్-వర్క్ ఉందో అలాటి బేసిస్, క్రోడికరించిన ఎటువంటి విజ్ఞానాన్నైనా విశ్లేషించడానికి కూడా కావాలి కదా? అది ఒంటాలజి, సిమాంటిక్స్ ద్వారా సాధ్యపడుతుందని ఈ రచయిత విశ్వాసం.

అది కుదిరేదాకా - ఇలాటి పోపుల డబ్బా వ్యాసాలు రాసుకోవడమే. ఎవరు రాసినా అంతే.

ఇకపోతే - ఈ వ్యాసం ప్రేరణతో ఎవైనా శాస్త్ర చర్చలు ఈ పత్రికలో జరిగితే మంచిదే, కాని వాటిని ఈ వ్యాసానికి గాని, దీన్ని రచించిన రచయితకి గాని అంటగట్టకండి. ఇది కేవలం సాహిత్య వ్యాసం - ఇందులో చాలావరకూ పొయటిక్ -రెఠోరిక్ తప్ప ఇంకేం లేదు. దీనిలోంచి గుడ్డుమీద వెంట్రుకలు పీకటం అనవసరం. ఎవరో ఇండో-యూరోపియన్ భాషలదాకా వెళ్ళిపోయేరు. సురేష్ గారు చెప్పినట్టు - పిడుక్కీ, తద్దినానికి ఒకే మంత్రం వేస్తే ఎలాగ? లేనిపోని “కాస్పిరెసి-థియరీలు” ప్రతిపాదించి పాఠకులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం నేను చెయ్యలేదు. సైంటిఫిక్ విలువలు వేటికీ నేను తిలోదాకాలివ్వలేదు, అలాగే సాహిత్య విలువలు వేటికీ ద్రోహమూ చెయ్యలేదు. తులనాత్మక పరిశీలనలాటి వాటి ఛాయలకి కూడా నేను పోలేదు.

త్యాగయ్య సంగీతంలోనూ, దీక్షితార్ సంగీతంలోనూ ఉన్న ‘స్టైలిస్టిక్’ తేడాలు కూడా - వారిద్దరి సంగీతం విన్నప్పుడు నాలో కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పే ప్రయత్నమేగాని, అందులో వేరే “శాస్త్రీయ”మైన అధారమేమీలేదు. అందరికీ అలా అనిపించకపోవచ్చు - ఇలాటివి మీరు కేవలం వ్యక్తిగతమైన అనుభవంగానే పరిగణించాలని నా మనవి. ఎవరికైనా అవి ఉపయోగపడితే అంతకన్నా కావల్సిందేముంది?

ఆఖరుగా - ఏ రచనలోనైనా కొన్ని తప్పులుంటాయి. షేక్సిపియర్ అంతటి వాడి నాటకాల్లోనే - వెతికితే వ్యాకరణ దోషాలుంటాయి. సర్వజ్ఞత ఎవరికుంటుంది? స్వరసాహిత్యం అనే మాట నాకు సమయానికందలేదు. అది ఆధారంగా చేసుకొని, మెత్తం రచనంతా తప్పులతడకలంటూ ఎండగట్టటం, రచయితకేం తెలీదనటం - అంత సమంజసం కాదు. ఒక రచన ఆధారంగా రచయిత పాండిత్యాన్ని అంచనా వెయ్యగలరా? నిజంగా ఇది పరిశోధనావ్యాసమే అయ్యుంటే, ఈ పత్రిక “సైంటిఫిక్-జర్నల్” అయ్యుంటే - ఇలాటి వ్యాఖ్యలని చీల్చి చెండాడడం ఎలాగో నాకూ బాగానే తెలుసు. ఎప్పుడైనా అలాటి అవకాశం వస్తే తప్పకుండా మన బలాబలాలేపాటివో తేల్చుకొందాం. అప్పటిదాకా మరి సెలవు.

by: Vaidehi Sasidhar
చక్కని  వ్యాసం! సంగీతాన్ని ఆనందించటం  తప్ప విశ్లేషించటం తెలియని  వారిని,సంగీతం పై అపారమైన అభిమానమే తప్ప అధికారం,విజ్ఞానం లేని వారిని కూడా ఆసక్తి కరంగా చదివించిన వ్యాసం. ప్రాక్పశ్చిమ సంప్రదాయాలలోని దిగ్గజాల జీవిత  విశేషాలను,విభిన్న సంగీత రీతుల లోని కొన్ని విశేషాలను   వివరించిన తీరు బావుంది.ఆకట్టు కునే శైలి వచనంలో దాగిన కవిత్వంలా ఉంది.

by: సురేశ్ కొలిచాల
నాకు ఎందుకో ఇండో-యూరోపియను భాషలు ఎలాగో, అలాగే ఈ సంగీతము కూడా అయి ఉండవచ్చు అనిపిస్తుంది.

చావా గారు: అన్ని విషయాలను ఇండో-యూరోపియన్ అద్దం లోంచి చూస్తే ఎలాగండీ? :-) ఇండో-యూరోపియన్ భాషల మధ్య జన్మ సంబంధం నిరూపించే భాషాశాస్త్ర ఆధారాలు కోకొల్లలు. గత అయిదారు వందల ఏండ్లలోనే బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య కర్ణాటక సంగీత సంప్రదాయాలకు,  సుమారు అయిదు వేల యేండ్ల కింద విడిపోయిన ఇండో-యూరోపియన్ భాషలకు లంకె లేదు. ఈ వ్యాసంలో సంగీత సంప్రదాయాల మధ్య సారూప్యం ఎత్తిచూపడానికి ప్రయత్నించిన నాగరాజు గారు సైతం ఆ పోలికలకు కారణం మానవుని ఆలోచనల్లో నిగూఢమైన ఏకత్వమనే వాదించాడే గాని వాటి మధ్య ఏ రకమైన జన్మ సంబంధం అంటగట్టలేదు.  ఏవో కొన్ని యాదృచ్ఛిక సారూప్యాలను (chance similarities) ఆధారం చేసుకొని తయారు చేసిన సజాతిత్వ సిద్ధాంతాలు శాస్త్ర విమర్శకు నిలవలేవని మీకు తెలుసు కదా?

రిగార్డులతో,

సురేశ్.

by: chavakiran
ఈ రెండు విభిన్న సంప్రదాయాల మధ్య పోలికలేవైనా ఉంటే గింటే అవి యాదృచ్ఛికమే.

నాకు ఎందుకో ఇండో-యూరోపియను భాషలు ఎలాగో, అలాగే ఈ సంగీతము కూడా అయి ఉండవచ్చు అనిపిస్తుంది. కానీ బొత్తిగా సంగీత జ్ఞానము లేని వాడిని అంతకంటె ఏమీ చెప్పలేని వాడిని.

by: J K Mohana Rao
వ్యాసము బాగుంది. బాఖ్ కాలములో పియానో లేదనుకొంటాను. అప్పుడు హార్ప్సికార్డ్ ఉండేది. క్రింద ముత్తుస్వామి దీక్షితులపై కొన్ని వివరాలు. శ్రీ ముత్తుస్వామి దీక్షితులు మూడు సంగీత పద్ధతులలో ఆరితేరినవారు. వారి తండ్రి రామస్వామి దీక్షితులు కూడ సంగీత విద్వాంసులే. వీరు హంసధ్వని రాగమును కనుగొన్నారు. ముత్తుస్వామి గాత్ర సంగీతమును మాత్రమే గాక వీణను కూడ నేర్చుకొన్నారు. వారు పాడునప్పుడు వీణను కూడ వాయించెడివారు. వీణతో కలిపి పాడుచుండుటచే వారు చౌక (లేక విలంబిత) కాలమును ఎక్కువగా వారి కీర్తనలలో వాడెడివారు. చివర మధ్యమకాలము సామాన్యముగా కీర్తనలలో నుండును. వీరు ఐదారు ఏళ్ళు కాశీలో గడిపినారు. కావున వీరికి హిందూస్తానీ సంగీతముతో బాగుగా పరిచయము. హిందూస్తానీ రాగములను తన కీర్తనలలో వాడియున్నారు (జంఝూటి, జయజయవంతి, యమన్, సారంగ, బృందావనసారంగ, ఇత్యాదులు). వీరు వీరి తండ్రిగారితో మదరాసు సమీపమున నున్న మణలిలో కొన్ని సంవత్సరములు ఉన్నారు. మణలికి నాయకుడు వేంకటకృష్ణ ముదలియార్. వీరు దుబాసి, సెయింట్ జార్జ్ కోటలో పని చేసెడివారు. అప్పుడప్పుడు ముత్తుస్వామిని, వారి తమ్ముడైన బాలాస్వామిని కోటకు తీసికొని వెళ్ళేవారు. ఆ సమయములో అక్కడ పాశ్చిమాత్య బ్యాండ్ మేళమును వినేవారు. సి మేజర్‌కు సరిపోయే

శంకరాభరణములో నోటు(ట్టు) స్వరములను వ్రాసినారు. సుమారు నలభైకు పైన సంస్కృతములో వ్రాసినారు. నేడు కూడ ఇట్టి నోటుస్వరాలు కచేరీల చివరలో తుకడలుగా పాడుతారు. ఇంగ్లాండ్ రాష్ట్రగీతమైన గాడ్ సేవ్ ది కింగ్ మెట్టులో సంస్కృతములో వ్రాసినారు! వీరి తమ్ముడు బాలాస్వామి ఒక ఆంగ్లేయునిచేత ఫిడేల్ నేర్చుకొన్నారు. వారి తండ్రిగారి సలహా ననుసరించి ముత్తుస్వామి కచేరీలలో వయలిన్ వాయించేవారు. ఇదే కర్ణాటక సంగీతములో మొట్టమొదట వయలిన్‌ను పక్కవాద్యముగా ఉపయోగించుట. అంతకు ముందు వీణను ఉపయోగించేవారు. మూడు సంగీత సంప్రదాయాలను అవగాహన చేసికొని అందులో ఘనతను సాధించారు దీక్షితులవారు.

వీరి సంస్కృత కృతులలో ప్రాస, అనుప్రాస, అంత్యప్రాస, యతి, గోపుచ్ఛయతి, బీజాక్షరములు, ముద్రాలంకరము (రాగము పేరు పాటలో వచ్చుట), ఇత్యాదులు ఎక్కువ. వీరికి భక్తి మాత్రమే కాదు, విభక్తి అంటే కూడ ఇష్టమే. వీరి విభక్తి పాటలు ఒక ప్రత్యేకత. ఒక్కొక్క పాటను ఒక విభక్తిలో వ్రాయుట ఇందులోని విశేషము. ఎనిమిది విభక్తులలో వీరు ఎన్నియో పాటలను వ్రాసియున్నారు. పాటలలో ఉదాహరణ లనవచ్చును వీటిని.

మాత్రుష్కా బొమ్మలాగు పదములలో పదములుంచి వ్రాయుట వీరి కృతులలోని మరొక విశేషము. శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం, వసుప్రదే, శ్రీ సారసపదే, రసపదే, సపదే, పదే పదే, ఇత్యాదులు. దీనికి గోపుచ్ఛయతి అని పేరు.

ఇవన్నీ రచయితకు తెలిసియుండవచ్చు. స్థలాభావమువల్ల వ్రాసియుండక పోవచ్చు. కాని అందరికీ ఇవి తెలిసిన మంచిదని నేను తెలియజేయుచున్నాను.

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

by: Lyla Yerneni
సుభాన్ అల్లా! బ్రావో!

ఈ వ్యాసం ఎంత చదివినా తనివి తీరలేదు. వ్యాసకర్త ముందుకు వెడదాం రమ్మన్నా మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆనందాన్నిపెంచుకున్నాను.ముగింపు అని ముందే చెప్పటం ఈ చదువరికి తీరని ద్రోహం. గుండె జారి పోయింది.  ఆ దుఃఖంనుండి బయటపడటానికి వెంటనే వ్యాసం మొత్తం రెండోసారి చదువుకున్నాను.

వియన్నాలో ప్రజలంతా ఒక   ఉద్వేగపు, ఉద్రేకపు, ఉజ్జ్వల స్థాయిలో జీవించేట్లు చేసిన కళాకారులున్న సమయంలో, నేను అప్పుడు జీవించి ఉండి ఉంటానా అని ఊహించుకునే నాకు -ఎన్నోసమయాల్లోని సంగీతకారుల గొప్ప సంగీతం ఒకేసారిగా విన్న ఈ భ్రాంతి , కలిగిన ఈ పట్టరాని సంతోషము - ఏమని చెప్పేది. ఎన్నిసార్లు నిట్టూర్పులు విడిచానో! ఎన్నిసార్లు తల ఊపానో!

ఓహో! గొప్ప వ్యాసం! ధన్యవాదాలు.

లైలా

by: Rohiniprasad
వివిధ సంగీతకారులని పరిచయం చేసేందుకు ఈ వ్యాసం బాగా ఉపయోగపడుతుంది. అలాగే వారి బొమ్మలను కూడా చూపడం మంచి ఆలోచన.

ఎటొచ్చీ ఈ సంగీతకారుల మధ్య పోలికలనూ, సామ్యాలనూ వెతకడం అనవసరమేమో అనిపిస్తుంది. వివిధ దేశాల్లో, రకరకాల పరిస్థితుల్లో, వేరువేరు ప్రేరణలకు లోనై జీవించిన ఈ ప్రతిభావంతులు తమ ప్రాంతాల సంగీతానికి ప్రభావితులయిన మాట నిజమే కాని ఈ రెండు విభిన్న సంప్రదాయాల మధ్య పోలికలేవైనా ఉంటే గింటే అవి యాదృచ్ఛికమే.

ఒక చారిత్రక నేపథ్యంలో, ఒక ఆర్థిక, సామాజిక పునాది రూపొందిన తరుణంలో ఒక్కొక్క సంస్కృతి విలసిల్లుతుందనేది తెలిసినదే. రాజులూ, నవాబుల ప్రాపకం ఉన్న రోజుల్లో కొన్ని రకాల లలితకళలూ, సాహిత్యమూ వర్ధిల్లుతాయి.

ఆసక్తికరమైన సంగతేమిటంటే పదిహేడో శతాబ్దం అంతం నుంచి పంతొమ్మిదో శతాబ్దం మొదలైన నాటి దాకా కర్ణాటక, పాశ్చాత్య సంగీతంలోనే కాక హిందూస్తానీ పద్ధతిలో కూడా విప్లవాత్మకమైన మార్పులు జరిగాయి. (సమకాలీన సంఘటనలుగా వీటిని ప్రస్తావించవచ్చు గాని సామ్యాలను వెతకడం వ్యర్థ ప్రయత్నమని నా అభిప్రాయం)

1719-1748 మధ్య కాలంలో రాజ్యం చేసిన మహమ్మద షా రంగీలే అనే ముగల్ చక్రవర్తి ఆస్థానంలో నియామత్ ఖాన్, ఫిరోజ్ ఖాన్ అనే ఇద్దరు ప్రసిద్ధ సంగీతకారులు (వీణ, గాత్రం) సదారంగ్, అదారంగ్ అనే కలం పేర్లతో కొత్త ఒరవడి సృష్టించారు. అప్పటిదాకా జనాదరణ పొందిన ద్రుపద్ శైలికి భిన్నంగా వీరు ఖయాల్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈనాటికీ అదే కొనసాగుతోంది.

మొత్తం మీద ప్రపంచంలోని మూడు సుదూర ప్రాంతాల్లో ఒకే యుగంలో మూడు ముఖ్య శాస్త్రీయ పద్ధతుల్లో కొత్త పోకడలు మొదలవడం, ప్రఖ్యాత సంగీత రచయితలు ఆవిర్భవించడం ఆసక్తికరమైన విషయం.

తక్కిన సాంస్కృతిక అంశాల్లాగే కళల చరిత్రలో కొన్నిటిని విస్మరించడం జరుగుతుంది. టర్కీ, మధ్యధరా ప్రాంతాలూ, చైనావంటి తూర్పు దేశాలూ అన్ని చోట్లా సంగీతం ఉంటూనే ఉంది. ప్రతిచోటా గొప్ప సంగీతకారులు ఉండే ఉంటారు. అయితే వారి గురించి చెప్పుకోవడం తక్కువగా జరుగుతుంది. ఇదొకరకమైన కల్చరల్ ఇంపీరియలిజం అనిపిస్తుంది. దీన్ని గురించి ప్రత్యేకంగా పరిశోధన చేసి వ్యాసాలు రాయవచ్చు.

ఈ మధ్య నేను గ్రీక్ సంగీతంలో సరిగ్గా కర్ణాటక సంగీతాన్ని పోలిన రాగాలున్నాయని తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోవడం జరిగింది. వాటిని గురించి మరికాస్త తెలుసుకుని ఒక చిన్న వ్యాసం రాసే ఆలోచన కూడా ఉంది. నిజమైన పోలికలంటే ఇటువంటివే.

by: Sai Brahmanandam Gorti
అన్నమయ్య గురించి మీరు ప్రస్తావించిన కొన్ని విషయాలు సరియైనవి కావని నా అభిప్రాయం.

1. “అన్నమయ్య పద సాహిత్యమంతా మనకి కేవలం పాటల రూపంలోనే లభ్యమవుతోంది గాని, ఆ పాటలకి ఆయన కూర్చిన రాగాలు, వరుసలు, స్వరాలు, లయలు, తాళాలు మనకి తెలియవు. ఈ మహానుభావుడు తన పాటలని ఏ రాగంలో, ఏ స్వరాలతో పాడేడో మనకి తెలియక పోవడం మన దురదృష్టం.”  అని రాసారు. అన్నమయ్య రాసిన ప్రతీ పదం క్రిందా రాగం పేరు ఉంది. కానీ అప్పటికి మేళ కర్త రాగాల విభజన జరగలేదు. అంతే కాదు కొన్ని రాగాలు పేర్లు మారాయి కూడా. నేను ప్రత్యక్షంగా అన్నమయ్య పదాల రాగిరేకులు చూసాను. అందులో ప్రతీ పదానికి రాగం ఉంది. కావాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన అన్నమయ్య  పుస్తకాలు చదవితే వాస్తవం తెలుస్తుంది.

2. ‘జో అచ్యుతానంద, జో జో ముకుందా’ అని పాడితేనే గాని ఏ తెలుగు పాపాయి నిదురా పోదు” . ఇది కూడా నిజం కాదు. జో అచ్యుతానందా అన్నమయ్య రాయలేదు. కానీ అన్నమయ్య రాసినట్లు గా చెలామణీ అవుతూ వస్తోంది. వేరే ఇంకెవరో రాసారు. ఇది అన్నమయ్య రాయలేదనడానికి అనేక అధారాలు ఉన్నాయి.  అవన్నీ రాస్తే ఇంకో పెద్ద వ్యాసం అవుతుంది. కావాలంటే మొత్తం పాట చూడండి. అన్నమయ్య పేరు ఉంటుంది కానీ ఆయన ముద్రలు ” వేంక టేశ “, “తిరువేంకటేశ” కానీ ఏమీ ఉండవు. కేవలం అన్న మయ్య పేరు ఒక చరణంలో వస్తుందంతే! దీనికి నా వద్ద ఆధారాలతో కూడిన విషయాలు చాలా ఉన్నాయి.  కీరిశేషులు రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు కూడా అన్నమయ్య రాసింది కాదు అన్న విషయం మీద ఒక వ్యాసంలో ప్రస్తావించారు.

మీ వ్యాసం చదివేక మీరు అన్నమయ్య గురించి, మిగిలిన వారిగురించి, ఇంకాస్త లోతుగా పరిశోధించి రాస్తే బాగుండేదనిపించింది.

- సాయి బ్రహ్మానందం గొర్తి