ఈమాట » ఒక చలిపొద్దు

Expand to right
Expand to left

ఒక చలిపొద్దు

ఎండగానే ఉంటుంది గాని
ఎక్కడా వేడి పుట్టదు
సూర్యుడు కూడా చలితో
గజగజ వణుకుతాడు.

రాత్రి గడిచిందన్న ఆనందం
ఎంతో సేపు నిలవదు
పగలు - చీర మార్చుకువచ్చిన
చలి మంత్రగత్తెలా ఉంటుంది.

ఆకాశం ఒక పక్షి నీడకోసం
ఆశగా ఎదురుచూస్తుంది
ఆకులు రాలని చెట్టు
తన నీడను తానే
భారంగా మోస్తుంది.

దిగులు దిగులుగా ఉంటుంది
పాత జ్ఞాపకాల ఈదురుగాలి
ఉండుండి సన్నగా కోస్తుంది.

ముడుచుకుపోవాలనుంటుంది
లోపలికి
వెనక్కి
ఏకాకి శరీరంలోనుంచి
ఏకకణంలోకి.

 

(5 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Tulasimohan అభిప్రాయం:

    March 3, 2007 2:12 am

    ….అచ్చంగా చలిపొద్దులాగానే వుంది…..చాలా బాగుందండి
    4వ ఖండిక నిజంగా నేననుభవించిన ఎన్నో చలిపొద్దుల మాదిరే వుంది

  2. ఫణి డొక్కా అభిప్రాయం:

    March 6, 2007 11:15 am

    చాలా బాగా రాసారు.

    ఆకులు రాల్చే చెట్టైనా, ఆకులు రాలని చెట్టైనా, మీ కవితలో ఎంతో అందంగా వొదిగిపోతుంది. చూడగలిగిన వారికి మీకవితల్లో మనోహర దృశ్యాలు కనిపిస్తాయి.

    నా మట్టుకు నేను మీ కవితలకోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ వుంటాను, ఆసక్తిగా..

    మీ ఫణి డొక్కా.

  3. Balu అభిప్రాయం:

    March 7, 2007 12:46 am

    చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది

  4. Raghothama Rao C అభిప్రాయం:

    March 7, 2007 6:52 am

    చాలా బావుందండీ. కానీ ఆకాశం ఒక పక్షి “నీడ”కోసం అన్నచోట ఆకాశానికి, నీడకు సమన్వయం దొరకలేదు !

  5. rajasankar kasinadhuni అభిప్రాయం:

    March 31, 2007 8:32 am

    కవిత చాలా బావుంది. ఎంచుకున్న కవితావస్తువు కూడా చాలా బావుంది. పదాలు పొదుపుగా వాడి ఉంటే కవితాసౌందర్యం మరింతగా ఆవిష్కరింపబడి ఉండేది.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a