Comments on: “పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్

by: Vaidehi Sasidhar
సమీక్ష బావుంది.ఈ సంపుటి లో నాకు నచ్చిన కవిత “బనలతాసేన్”.

రచయిత చెప్పినట్లు  ఈ కవిత లో ఇస్మాయిల్ గారి స్వంత ముద్ర,ఆయన సొత్తైన పదాల పొదుపు లేకపోవటమే కాక ఆయన సాధారణంగా వాడని గ్రాంధిక పదాలు కూడా ఉన్నాయి.అయితే మూలకవిత లో ఉన్న భావగాఢతకు ,ధారకు అనుగుణమైన  అనువాదం అనిపిస్తుంది. మూల కవిత లోని mystic beauty ని  ఇస్మాయిల్ గారు చాలా అందం గా పట్టుకున్నారు. మంచి అనువాదం లక్షణం కూడా అదే కదా!

ఈ కవిత రచనా కాలం  గురించి పుస్తకం లో లేదు.ఇస్మాయిల్ గారు చెప్పుకున్నట్లు మొదట్లో ఆయన పైన కృష్ణశాస్త్రి తదితర భావకవుల ప్రభావం ఉండేది.ఈ కవిత ఆయన తనదైన”ఇస్మాయిల్ బాణీ”  ని ఏర్పరచుకొనక ముందు వ్రాశారో తర్వాత వ్రాశారో తెలియదు.తర్వాతే వ్రాసి ఉంటే అది ఆయన కవిత్వం లోనే ఓ ఆసక్తికరమైన పరిణామం అయిఉండ వచ్చేమో!

దీర్ఘకవితైనా,మినీకవితైనా,సరళమైనా,గ్రాంధికమైనా,వచనమైనా,పద్యమైనా,ఏ మాండలికంలో వ్రాసినా హృదయాన్ని తాకే కవిత్వం పదికాలాలు నిలబడుతుంది.

మూలకవితల గురించి,కవుల గురించి వివరాలు లేకపోవటం రచయిత చెప్పినట్లు పెద్ద లోపం.మూలకవితలపై అవగాహన లేనిదే అనువాదకవితలని

ఆనందించగలమేమో కానీ అంచనా వేయటం కష్టమేమో అనిపిస్తుంది.

by: Sowmya
బాగుందండీ మీ సమీక్ష.  “అనువాదకవులగురించి ఏ విధమైన వివరణా ఇవ్వకపోవడం…. ” - మీ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తాను. ఇదే అభిప్రాయం వేరే పుస్తకం గురించి మరో సైటు లో నేను చెప్పినప్పుడు అక్కడ ఒకరేమో - అవన్నీ మీరే తెలుసుకోవాలి అని చెప్పారు నాకు!

“పాత స్మృతుల్ని రాల్చి

కొత్తవి తొడిగితే బాగుణ్ణు:

చెట్టు లా.”

- బాగుంది ఈ హైకు.

by: ప్రద్యుమ్న
ఈమాటలో అప్పట్లో చాలా కామెంట్లు ” ఈ కథ బాగుందనో, ఈ కథ బాగోలేదనో వచ్చేవి. మన సంపాదకులు గారే ఇలాంటివి బదులు, బాగుంటే ఎందుకు బాగుందో, బాగోలేకపోతే ఎందుకు బాగోలేదో సవివరంగా సెలవిస్తే మిగిలిన వారికి బాగుంటుందని సెలవిచ్చారు.

ఈ వ్యాసంలో మాత్రం సంపాదకులు అలాంటి తప్పేచేసినట్టు నాకు అనిపించింది. ముఖ్యంగా రెండు విషయాల్లో.

1.ఇస్మాయిల్ గారే ఈ సంకలనం అచ్చువేసుకొనివుంటే, దీనిలో చాలా భాగం అచ్చయేది కాదు, అని నా దృఢ నమ్మకం. (ఏ కవితలు/హైకూలు ఇస్మాయిల్ గారి తరహాలో లేవో, వ్యాసకర్త పై అభిప్రాయాన్ని corroborate చేయడమో, కొంతచర్చ చేయడమో చేస్తే బాగుండేది.)

2. ఇస్మాయిల్ గారి భక్తులు నామీద విరుచుక పడ్డా, ఈ సంకలనం గురించి నేను చెప్ప దలచుకున్నది (చర్వితచర్వణం అని ఆరోపించినా సరే!) చెప్పి తీరాలి. ఇస్మాయిల్ గారే బ్రతికి ఉంటే ఈ సంకలనం ఇంతకన్నా ఎక్కువశ్రద్ధతో చదువరికి సులువుగా ఉండేట్టు ప్రచురించి ఉండేవారనుకుంటాను! (ఇదీ అంతే. చదువరికి పుస్తకంలో ఏం సులువుగా లేదో నాకైతే అర్థం కాలేదు. సరైన చర్చ లేకపోవడం వల్ల “ఇస్మాయిల్ గారి భక్తుల్ని” ఏదో ఒకటి అనడం కోసం రాసినట్టనిపించింది. అలాగే తెలుగులో ఎవరైనా ఒక విషయాన్ని ప్రతిపాదిస్తేనో, ఎవర్నో ఒకరిని మెచ్చుకుంటేనో, వాళ్ళందరిని ఒకగాటన కట్టి ఒక లేబిల్ అంటించే దురాచారం రొచ్చులో సంపాదకులు పడడం ఆశ్చర్యంగా ఉంది. అన్ని తెలుగు సంప్రదాయాలతో బాటు దీనినీ తు.చ. తప్పకుండా పాటించినట్టున్నారు. ఇస్మాయిల్ గారే ఈ లేబిల్స్ అంటించే సంప్రాదాయాన్ని తీవ్రంగా గర్హించినట్టు గుర్తు.

ఇక వ్యాసకర్తతో నేనీకభవించిన ఒక సూచన తెలుగులో వచ్చిన చాలా అనువాదపుస్తకాలకు వర్తిస్తుంది. అనువాద కవితతో బాటు, original write name, poem name ఆంగ్లంలో రాస్తే చాలా మందికి original చదివే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇంటర్నెట రోజుల్లో. ఉదా: జోర్గె లూయిస బోర్గెస కవితలు అని రాస్తే ఆయనెవరో కనుక్కోవడానికి మరో పరిశోధన మొదలెట్టాలి.

పుస్తకం చదివిన తరువాత నాకు తోచిన మరో విషయం. ఒక పుస్తకం మరణాంతరం ప్రచురించేటప్పుడు, ప్రచురణ కర్తలు, ఆ కవితల్ని ఎలా సేకరించిందీ? (రచయిత ఎవరికైనా ప్రచురించమని ఇచ్చారా? లేక డైరీలో, చిత్తు కాగితాలో వెతికి సంపాదకులే ప్రచురించారా? ఇక ఈ సంపాదకవర్గం ఎవరు? ఈ ప్రక్రియలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? ఇలాంటివి ముందుమాటలో రాస్తే బాగుండేది.

ప్రద్యుమ్న

(ఆచార్యుల, పీఠాధిపతుల, రకరకాల రసాల -భక్తుల -బాధితుడు).

by: Narayanaswamy
సమీక్ష బాగుంది. ఇస్మాయిల్ గారి ఈ సంకలనం లోని కొన్ని  పారడాక్సెస్ ని బాగా పట్టుకున్నారు. అయితే ఒక చిన్న సమాచారం - జీవ(బ)నానంద దాస్ మీద కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఒక పుస్తకం తెచ్చారు. భారతీయ సాహిత్యకారులు అన్న సిరీస్ లో అనుకుంటా! దాన్ని కుందుర్తి గారు రాసారు. అందులో జీవనానందదాస్ కవితలని చాలా అనువాదం చేసారాయన. వాటిల్లో  “వనలతా సేన్” ఉంది. చాలా సాఫీగా , అచ్చతెలుగు పదాలతో అద్భుతంగా సాగుతుందా అనువాదం.

by: Sai Brahmanandam Gorti
భావ కవిత్వం రాసే ప్రతీ కవీ, రాద్దమనుకొనే వర్థమాన కవులు తప్పక చదవాల్సిన పుస్తకం.  కేవలం వస్తు విమర్శ లేదా సమీక్ష తప్ప ఎక్కడా అతి స్తుతి లేని సమీక్ష ఇది. ఆకులు, పూలు, చెట్ల మీదే కవిత్వం రాసే కవులు

చదవాల్సిన పుస్తకం.  సమీక్ష చదివితే ఖచ్చితంగా  పుస్తకం చదవాలి అన్నట్లుగా రాసారు.