ఈమాట » వలసపోతున్న మందహాసం

Expand to right
Expand to left

వలసపోతున్న మందహాసం

మరోమజిలీకి ముందు
ఆ ఏటి ఒడ్డున
కాసేపు సేదదీరాం

సముద్రమంటే ఏంటో
చూపిస్తా రమ్మంటూ..

అలల గుడ్డతో
కడలి కళ్ళుకప్పి
ఏవో లోతుల్లోకి
తీసుకుపోయేవారు

రెండు తీరాల మధ్య
కవిత్వానికి మించిన
వారధి లేదని తెలిసింది
ఆయన్ని కలిసాకే

ఎన్నో అనుభవాలతో నిండిన
ఒక పుస్తకన్నిచ్చి
ఎవరున్నా లేకున్నా
చదువుకుంటూ ఉండమని
ఇక శెలవంటూ
ఆయన లేచారు

సంధ్య మసక వెలుగులో
మందహాసం
వలసపోతోంది
నిజంగానే…

( రిటైరై బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్న ముకుంద రామా రావు గారికి….)


మూలా సుబ్రహ్మణ్యం

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు.  ...

 

(7 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Jagadish అభిప్రాయం:

    January 2, 2007 12:35 am

    Sir,

    Being a poet you have rightly expressed your feeling about the great poet Sri Mukunda Rama Rao.

  2. Kameswara Rao అభిప్రాయం:

    January 2, 2007 11:33 am

    శీర్షిక చూసి ఏదేదో అపార్థం చేసుకున్నాను. ఇంత సున్నితమైన విషయం గురించని కవిత చదివాక తెలిసింది. బాగుంది. మధ్యలో “అలల గుడ్డతో” అన్న పదం మాత్రం ఎందుకో, పాయసంలో బెడ్డలా తగిలింది.

  3. Seetha Kumari అభిప్రాయం:

    January 9, 2007 10:43 pm

    వీడ్కొలుని చాలా సున్నితంగా అందంగా చెప్పారు…

  4. Raghothama Rao C అభిప్రాయం:

    January 14, 2007 4:16 am

    చాలా బావుంది సుబ్బూ….నిజమే రామారావుగారిని కలిసాకే కవిత్వం లోతు తెలిసింది. మందహాసం వలసపోయినా వారధి ఉందిగా :)

  5. PrasUna అభిప్రాయం:

    January 17, 2007 2:03 am

    చాలా చక్కగా చెప్పారు.

  6. rajay అభిప్రాయం:

    February 10, 2007 8:21 pm

    Dear sir.

    Yes ‘Alala Andam to’ leka ‘Alala vastram to’ anna padam baaguntundemo.

    regards.
    rajay
    http://www.tirumala-hills.blogspot.com

  7. ravi kumar అభిప్రాయం:

    April 18, 2007 4:20 am

    హెల్లొ !
    ఈ పత్రిక చాల బాగుంది. It is really fantastic. eemaata is of great value to me. everyday I spend atleast 20 minutes with eemaata.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a