Comments on: భాషా సంబంధ నిరూపణ - భాషాశాస్త్రం 101

by: ప్రసాద్
కనక దుర్గ వ్యాసాలు, ఇంకా నాలాంటి సాధారణ వ్యక్తి తర్కానికే నిలవని వ్యాసాలు ఎందుకు ప్రముఖ పత్రికలలో ప్రచురిస్తారో అర్థం కాదు.

మొత్తానికి గడ్డి బాగా పెట్టారు. అలాంటి వాదన ఎక్కడ తలెత్తినా ఇదిగో అంటూ చూపించడానికి మంచి వ్యాసం రాశారు. ధన్య వాదాలు.

వ్యాసానికి మరిన్ని హంగులు దిద్దిన, శోభ చేకూర్చిన ఈ అభిప్రాయమాలకు అభినందనలు.

–ప్రసాద్

http://blog.charasala.com

by: hareesh
This is really a thought provoking and excellent article written with an indepth research and my congrats to Mr.Suresh.  We look forward for many more such articles.  With my limited knowledge of Telugu literature, I feel that Telugu is the greatest language considering the rich literature we have and as such it deserves the recognition notwithstanding the fact whether it is 1000 years old or not.  I request an article from this author depitcting therein the “Prathyekatha” of Telugu in the world of languages describing all the features that are unique to Telugu (like Avadhana Prakriya)

Hareesh

by: Rohiniprasad
మనుషుల్లో వివిధ వ్యక్తులకి వివిధ విషయాల్లో ఆసక్తి ఉండడం సహజంగా అనిపిస్తుంది. ఎవరి కిష్టమైన సబ్జెక్ట్ వారు చదువుకుంటే సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలా ప్రతీ సబ్జక్ట్ లోనూ నిష్ణాతులు తయారవుతారు. అలా కాకుండా మంచి మార్కులొచ్చాయి కదా అని మనలో చాలా మంది తోసినట్టుగా ఇంజనీరింగో, మెడిసినో చదివి, “విధిలేక” అదే రంగంలో జీవితమంతా కొనసాగుతారు. “ఎందుకూ పనికిరాని” ఏ తెలుగు సాహిత్యంలోనో ఆసక్తి ఉన్నప్పటికీ అది ఔత్సాహిక దశలోనే ఆగిపోతుంది.

సురేశ్ వంటి వారు తెలుగు భాష, సాహిత్యం తదితర విషయాల్లో తమకున్న గాఢమైన ఆసక్తిని చంపుకోలేక మరేదో ఉద్యోగం చేస్తూ, ఇటువంటి విషయాల గురించి ఉన్న పరిమిత సమయంలోనే చదివి, తమ ఉత్సాహాన్ని నలుగురితోనూ వ్యాసాల ద్వారా పంచుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యాసాలను విమర్శించకూడదని అనలేముగాని, రచయిత ఎటువంటి ఒత్తిళ్ళకు లోనయి ఇటువంటి ప్రయత్నం చేస్తాడో పాఠకులు కాస్త గుర్తుంచుకోవాలని నాకనిపిస్తుంది.

యూనివర్సిటీల్లో జరిపే రిసెర్చ్ మరింత నిర్దుష్టంగా ఉండవచ్చు గాని ఔత్సాహికుల రచనల్లాగా అవి చదువరులను ఎక్సయిట్ చేసి ఆసక్తి కలిగించలేకపోవచ్చు.  ఈ వ్యాసానికి లభించిన, లభిస్తున్న స్పందనే అందుకు ఉదాహరణ.

ఈమాట, తదితర వెబ్ పత్రికలలో ఇతర ప్రొఫెషన్లలో ఉన్నవారు ఎన్నో విషయాల గురించి ఆసక్తికరమైన వ్యాసాలు రాస్తున్నారనేది గమనించాలి. వీరిలో ప్రసిద్ధ రచయితలుగాని, మహా పండితులుగాని ఎక్కువగా లేకపోవచ్చు. తెలుగు గురించి విశేష పరిశోధనలు చేసిన ఒక చేరాగారో, బూదరాజువారో, వెల్చేరువారో అరుదుగా కనిపిస్తారుగాని తెలుగు రచనల్లో వైవిధ్యాన్నీ, విస్తృతినీ కలిగించటానికి ప్రయత్నిస్తున్న ఇతర “చిన్న” రచయితల ప్రయత్నాలు ఎంతో మెచ్చుకోదగ్గవి.

సురేశ్ గారికి అభినందనలు.

by: ravikiran timmireddy
సురేష్,

వొక అద్భుతవైన రచన, పాఠకుల్ని ఎంత ప్రభావితం చేస్తుందో మీ వ్యాసం మీద వెల్లువెత్తిన అభిప్రాయాలే వొక వుదాహరణ. శ్రీశ్రీ కవిత్వం చాలా మంది సాధారణ పాఠకుల్ని కవులుగా మార్చింది అన్నది వొక అభిప్రాయం. మీ వ్యాసం కుడా కొందరు పాఠకుల్ని భాషాశాస్త్ర దిశలో ప్రయాణం కట్టిస్తుందని నా అబిప్రాయం.

పత్రికలు చదివే చాలామంది పాఠకులు నాలాగే, ప్రత్యేకవైన భాషా, సాహిత్య పరిఙ్ఞానంలేని సాధారణ పాఠకులే. సాధారణ జీవితం ఇచ్చిన కొద్దిపాటి లోకఙ్ఞానం, పాఠశాలల్లోనో, కళాశాలల్లోనో నేర్చుకున్న కొద్దిపాటి శాస్త్ర పరిశీలనా పరిఙ్ఞానం, ఈ రెండిటి కలబోతలోంచి అలవరచుకున్న కొద్దిపాటి తర్కఙ్ఞానం ఇవే మాకున్న అతి సరళవైన logical skills, నిజాన్నిఅబద్దంలోంచి వేరుచైడానికి, తప్పుని వొప్పులోంచి చెరిపేయడానికి. ఐతే ఈ nascent rational attitude lives along with irrational emotional beliefs about race, language, nationality in our minds. తెలుగు ప్రాచీనత మీద ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఆ నాలుగు వ్యాసాలు చదివేక మనసుకెంత ఆనందవేసిందంటే, ఎక్కడో కుర్చోని ఎదో చదువుకుంటున్న నా ఏడో తరగతి కుతుర్ని పిలిచి, చదివి వినిపించి, చుశావా, మన తెలుగు జాతి, తెలుగు భాష గొప్పదనం, ఎప్పుడో సుమేరియన్ నాగరికత కాలంలోనే మన roots వున్నయ్ అని డబ్బా కొట్టి మరీ చెప్పెటంత ఆనందం. తర్వాత మళ్ళా నా కుతురుతో కుర్చోని అ తప్పుని సరి చేసుకోవటం సురేష్ రచన చదివేకే సాధ్యపడింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సురేష్ గారి వ్యాసం ఇంతకుముందు వచ్చిన వ్యాసాలమీద విమర్స లేకుండా వొక్క భాషా శాస్త్రం 101 కే పరిమితవైయ్యుంటే బావుండేది అనే అభిప్రాయం ఈమాట అభిప్రాయాల్లో వ్యక్తం కావటం వలనే. మేవు అతి సాధారణ పాఠకులం, మా బుర్రలో వుండే సవాలక్ష తర్కానికి నిలవని నమ్మకాల్ని తొలగించుకొని, ఎక్కడో, మనసులో ఏ ములో నక్కి నిద్రపోతున్న శాస్త్రియ పరిశీలనని నిద్రలేపాలంటే సురేష్ వ్యాసంలో వున్నటువంటి juxtaposition అవసరవని నా ఉద్దేశం.

విప్లవ్ చెప్పినట్టు ఏ కళ్ళంలో గింజలు ఆ కళ్ళంలో నే నూర్చుకోవటం సహజవే. చేనైతే చాలానే వుంది. కానీ అదేం యదకొచ్చిన చేనేం కాదు. నిదర్శనం కావాలంటే మన ఘనత కెక్కిన విశ్వవిధ్యాలయాల భాషాశాస్త్ర శాఖల వెబ్ సైట్లకెళ్ళి వొకసారి చూడండి. పెట్టుబడైతే చాలానే పెడ్తున్నరు గాని, చేన్ని మాత్రం చవుడు నేల చేస్తున్నారు. కాబట్టి దుక్కి దున్ని, నారేతలేసి, కోసి, నూర్పులు చేసే మెళుకువలు, వోపికలు లేని నాలాటి పాఠకులకి శాస్త్రం తో పాటు, అశాస్త్రియతని వేలెత్తి చూపే సురేష్ గారు వ్రాసిన వ్యాసాలే ఉపయోగకరం.

రవికిరణ్ తిమ్మిరెడ్డి

by: కొడవళ్ళ హనుమంతరావు
“శాస్తవేత్తలకే గోచరించని Kuhn శాస్త్రీయ స్వరూపం!”

”The Structure of Scientific Revolutions” అంటే “శాస్త్రీయ విప్లవాల స్వరూపం” అన్నది నచ్చింది. ”Paradigm Shift” అంటే “రూపావళి మార్పు” అన్నది శ్రావ్యంగా ఉంది గాని, మాట వివరిస్తే తప్ప మనసుకి తట్టదు. ప్రతిమానం అంటే పరవాలేదేమో. ఆలోచించే తీరు, దృక్పథం అంటే సులభంగా అర్థమవుతుంది నాకు. ”Post-positivist” అంటే “ప్రత్యక్ష్యోత్తర” అన్నది మాత్రం ఇంగ్లీషులోనూ అంతకంటే మిన్నగా తెలుగులోనూ కర్ణకఠోరంగా ఉంది. ఆధునికోత్తర వాదం లాంటిదా ఇది? ఇవి పంటికింద పడిన రాళ్ళలా బాధిస్తాయి.

ఇంతకీ నేను చెప్పదలచుకున్నది అనువాదాల గురించి కాదు. సురేష్ తన వ్యాసంలో అన్న మాట:

ఒక శాస్త్రవేత్త తయారు చేసిన సిద్ధాంతానికి తరువాతి తరం శాస్త్రవేత్తలు మెరుగులు దిద్దటం కానీ, లోపాలు సవరించడం గాని శాస్త్రపరిశోధనారంగంలో ఎల్ల కాలాల్లోను జరుగుతున్న పని.

దానికేననుకుంటాను, బాపారావు గారు కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు:

Kuhn పండితుడు Structure of Scientific Revolutions వెలయించి అరశతాబ్దం కావస్తోంది. “Paradigm Shift” అని ఇప్పుడు కాకపోతే కాసేపటికి అనేసేవాడే ప్రతివాడూనూ. ఇప్పటికైనా శాస్త్రీయ పరిశోధన అనేది క్రమపద్ధతిలో, మునుపటి తప్పులని దిద్దుకుంటూ అలాగ్గా పురోగమిస్తుందనే అపప్రథని ప్రచారం చెయ్యడాన్ని నిషేధిస్తే మంచిది. స్థూల స్థాయిలో చూస్తే సైన్సు తన సిద్ధాంతాల్ని ఒక పట్టాన మార్చుకోదనీ, వస్తేగిస్తే అలాంటి సైద్ధాంతి పరిణామం విలయానికేమీ తక్కువకాదనీ ఒప్పుకుతీరాలి. కుశాస్త్ర తరీఖాలని చెండే వ్యాసంలో శాస్త్రగతి తీరుగురించి పాతరోజుల పడికట్టురాళ్లనే తిరగదోడటం అభ్యంతరకరం. .

వారిద్దరి రాతల్ని బట్టి వాళ్ళు నాకన్నా ఈవిషయాల్లో బాగా తెలిసినవాళ్ళని తెలిసినా, బాపారావు గారు అన్నదానికి అభ్యంతరం తెలపక తప్పడం లేదు. వారు Kuhn గురించి అన్న నాలుగు మాటలకి నేనింత చాటభారతం రాయడం అసందర్భం అనిపించవచ్చు. కాని శాస్త్రీయ పద్ధతులూ స్వరూపం ఈ వ్యాసానికీ జరుతున్న సంభాషణకీ ముఖ్యమనిపించి, మిడిమిడి జ్ఞానంతోనే  సాహసిస్తున్నాను. ఎందుకంటే:

శాస్త్ర చరిత్రకారుడైన Thomas Kuhn సైన్సు స్వరూపాన్నీ స్థితిగతుల్నీ బట్టబయలు చేసి శాస్త్రీయ అవగాహనలో ఓ నూతనోధ్యాయాన్ని సృష్టించాడంటారు కొందరు. సైన్సు “వాస్తవికత”కి దగ్గరగా రావడమన్నదాంట్లో అర్థం లేదనీ, ఓ ప్రతిమానాన్ని నమ్మిన శాస్త్రవేత్తలు దానికి లోబడి వున్న సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారనీ, కాని కొన్ని చిక్కువిడని సమస్యల్ని తీర్చడానికి కొత్త ప్రతిమానాన్ని ప్రతిపాదిస్తారనీ, కొన్నాళ్ళకి దాంట్లోనూ తీర్చలేని సమస్యలుండి, మరో కొత్త ప్రతిమానాన్ని ప్రవేశపెడతారనీ, అది పాతదాన్ని స్థానభ్రంశం చేస్తుందనీ, ఇదే శాస్త్ర స్వరూపం - ఇది Kuhn సారాంశం అనుకుంటాను.

ఒక ప్రతిమానం మరొకదానికంటె మిన్న అని చెప్పడానికి వాస్తవమైన ఆధారమేమీ లేదు, మిగిలిన శాస్త్రవేత్తలని నమ్మించగలిగితే చాలు అదే నెగ్గుతుంది, అన్నది ఆయన భావన అని అర్థం చేసుకున్నాను. సైన్సు, శాస్త్రవేత్తలు చేసే వ్యాఖ్యానం మాత్రమే, అదొక రకమైన “భాషా క్రీడ”; అంతేగాని కాలం గడిచేకొలదీ సైన్సు “సత్యానికి” దగ్గరగా వస్తుందనటంలో అర్థం లేదన్నది Kuhn వాదన.

అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే Kuhn తో అంగీకరించరు [1]. Structure లో చెప్పిన ప్రతిమానాల చిత్రీకరణతో ఒప్పుకునే శాస్త్రజ్ఞుల పేర్లివ్వమని బాపారావు గారిని కోరుతున్నాను.

శాస్త్రవేత్తల కన్నా Kuhn ప్రభావితం చేసింది ఓ తరహా తత్వవేత్తలనీ, సాహిత్యకారులనీ. వాళ్ళకీ శాస్త్రవేత్తలకీ చుక్కెదురు! ఒక తత్వవేత్త అయితే, భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రైజేకాదు, ఆశాస్త్రంలో వాళ్ళ పేరుమీద కొన్ని సూత్రాలున్నా కూడా, వాళ్ళకి జ్ఞానమీమాంస (epistemology) గురించి ఏమీ తెలియనప్పుడు నోటికొచ్చినట్లు వాగకూడదని Kuhn ని విమర్శించినందుకు కొందరు శాస్త్రవేత్తలని అమర్యాదగా తిట్టిపోశాడు [2].

నా ఉద్దేశంలో శాస్త్రవేత్తలు కాని వాళ్ళు సైన్సు గురించి రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. Quantum Mechanics మూలంగా సైన్సు సత్యాన్ని నిశ్చయంగా తెలుసుకోలేదని రుజువయింది కనుక సైన్సుకి ఆధునికాంతర కాలంలో వేరే అర్థం, ప్రాముఖ్యతా ఇవ్వాలనే వాళ్ళు వాళ్ళ పరిథిని దాటి పోతున్నారని నా అనుమానం [3].

నామటుకి నాకు ఇవన్నీ అర్థమయానని అనలేను కాని, ఇవి చదవడం వలన ఎవరికీ ఎలాంటి హానీ కలిగిందనుకోను. ఈ భిన్నాభిప్రాయాలలో వేటినీ నిషేధించాల్సిన అవసరం కనబడటం లేదు. నిజం చెప్పాలంటే, Kuhn భావనలని వక్రీకరించి కుశాస్త్రానికి దోహదం చేస్తున్న వాళ్ళు మిక్కిలి హానికరమనుకుంటాను [4].

బాపారావు గారు, తిరుపతిరావు గారు, Thomas Kuhn, Richard Rorty - వీళ్ళనెవరినీ నేను హానికరమైన వాళ్ళ జాబితాలో చేర్చడం లేదని మనవి.

కొడవళ్ళ హనుమంతరావు

నోట్స్:

1. “The Revolution That Didn’t Happen,” Steven Weinberg, The New York Review of Books, Volume 45, Number 15, October 8, 1998. ఈయన University of Texas at Austin లో Physics professor. చాలా పేరున్న శాస్త్రవేత్త, 1979 ఫిజిక్స్ నోబెల్ గ్రహీత. తన నలభై-ఏభై ఏళ్ళ శాస్త్ర పరిశోధనా జీవితంలో ఎన్నో విప్లవాత్మకైన మార్పుల్ని చూసినా, సిద్ధాంతం సరైనదా కాదా అని పరిశీలించే తీరులో పెద్ద మార్పేమీ లేదనీ, Kuhn ప్రకటించిన Paradigm Shift లాంటివేమీ జరగలేదనీ వాదించాడు.

2. ”Thomas Kuhn, Rocks and the Laws of Physics,” an essay in “Philosophy and Social Hope,” by Richard Rorty. ఈయన సాహిత్యం, ఫిలాసఫీలో Stanford లో Emeritus professor. Kuhn ని మార్గదర్శకుడిగా గుర్తించిన సమకాలీన తత్వవేత్తలలో ముఖ్యుడు.

3. “పోస్ట్ మోడర్నిజం,” బి. తిరుపతిరావు. ఈయన విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులు. క్వాంటం సిద్ధాంతం ఎలక్ట్రాన్ స్థలమూ వేగమూ ఒకేసారి నిశ్చయంగా తెలుసుకోలేమని నిరూపించింది గదా. అణుప్రపంచంలో సాధ్యం కానిది స్థూల ప్రపంచంలో ఎలా సాధ్యమవుతుందంటూ, సైన్సులోకానీ సామాజిక శాస్త్రంలోగానీ నియతివాదానికి చోటులేదనీ, ఇదే ఆధునికాంతర సైన్సు ప్రాముఖ్యత అనీ, అందుకు Kuhn రచనల్ని ఆధారంగా చూపెట్టారు. శాస్త్రవేత్తలు వీటికి ఒప్పుకున్న దాఖలాల్లేవు. వీరి అభిప్రాయాలతో అంగీకరించినా లేకపోయినా, తెలుగులో ఆధునికోత్తర వాదాన్ని పరిచయం చేస్తూ ఈ పుస్తకం రాసినందుకు వీరిని మెచ్చుకోవాలి.

4.  “Pseudoscience and Postmodernism: Antagonists or Fellow-Travelers?”  by Alan D. Sokal. ఈయన New York University లో Physics professor. పోస్ట్ మోడర్నిజం పేరుతో అన్ని రకాల మూఢత్వమూ సైన్సులోకీ చరిత్రలోకీ జొరబడిందనీ, దురదృష్టవశాత్తూ జాతీయవాదులేకాక వామపక్షవాదులూ దీనికి దోహదం చేస్తున్నారనీ, భారతదేశంలో ఈమధ్యకాలంలో సాగుతున్న శాస్త్రీయ అవగాహనని ఉదాహరణలతో విశ్లేషించి ఖండించాడు.

by: సురేశ్ కొలిచాల
కామేశ్వరరావు గారు,

అనవసరంగా విశ్వనాథను ఈ చర్చలోకి లాగినందుకు నాకు సరైన చురకలే అంటించారు. మీరు చెప్పింది నిజమే: ఆయన భాషా చరిత్ర లపై తనకున్న అభిప్రాయాలను వ్యాసాల రూపంలో రాయలేదు. అయితే ఆయన రాసిన “పురాణ వైర గ్రంధమాల (12 నవలలు)”, “నేపాల రాజ చరిత్ర (ఆరు నవలలు) “, “కాశ్మీర రాజ చరిత్ర (ఆరు నవలలు)” లోని చారిత్రక అంశాలన్నీ తాను చిలుకూరు వీరభద్రరావు మొదలైన చరిత్ర పరిశోధకుల నుండి నేర్చుకొన్నవి లేదా తను స్వయంగా శ్రమపడి పరిశోధించినవేనని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. యువభారతి వారు 1972లో ప్రచురించిన “మహతి” లో “నేనూ నా సాహిత్య రచనలు” అన్న అంశం మీద ఆయన రాసిన వ్యాసంలోని ఈ పంక్తులను గమనించండి:

“ఈ ఇరువది నాల్గు నవలలలో మన పురాణములలో ఆయా చరిత్రములలో నున్న యంశములు తారీఖుల ప్రకారము కాలమును చూపించితిని, సందర్భములను వివరించితిని. చరిత్రలోని ప్రధానాంశములను వదలి పెట్టలేదు. … అందరునూ నేను పడ్డ శ్రమ పడరు …”

“మన చరిత్ర విస్పష్టముగా నున్నది. మన పురాణములయందలి మగధరాజ వంశాదుల యందలి యధార్థ చరిత్ర ననుసంధించి నేను పురాణవైర గ్రంధమాలను పండ్రెండు నవలలను వ్రాసితిని. అందులో చంద్రగుప్తుని స్వప్న మన్న నవల గుప్త చంద్రగుప్త, మౌర్య చంద్రగుప్తుల భేదమును చెప్పునది.”

“ఆంధ్ర చరిత్ర త్రవ్వి త్రవ్వి పరమ రహస్యములు కొన్ని “ఆంధ్రప్రశస్తి” లో, కొన్ని నవలలుగా “స్నేహ ఫలము” “చందవోలు రాణి”ముదలైన గ్రంధములలో వ్రాసితిని”

“నేను నిద్రాహారములు లేకుండ సంపాదించిన విజ్ఞానమంతా నా నవలలలో, పుస్తకములలో ఉంటుంది.”

అయితే భారతీయు చరిత్ర గురించీ, తెలుగు భాషా చరిత్ర గురించి ఆయన రాసిన విశ్లేషణలను పరికిస్తే, ఈ మధ్య భాషా వ్యాసాలు రాసే కొంతమంది రచయితలకు స్ఫూర్తి ఎక్కడిదో అర్థమవుతుంది. అందులో మచ్చుకు కొన్ని:

“”ఫిలిప్పైన్ ద్వీపము కింద మాండెనో అని ఒక ద్వీపమున్నది… అక్కడ ఆదిమ వాసులు తివోలిజాతి. వాళ్ళ ఆచారములు ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ ఆచారములు. వాళ్ళ భాష పేరు తెగలాగ్ - తెలుగు అన్నమాట.”

“”కాల్డ్వెల్ ఆఫ్గాన్ స్థానములో బ్రహూయీ అను ఒక భాష యున్నదనీ, ఆ భాషకూ మన తెలుగు భాషకూ పలు విషయాలందు సామ్యమున్నదని వ్రాసినాడు. శాతవాహను లాంధ్రులు - వారు భారత సామ్రాజ్యమును పాలించునప్పుడు ఆయా ప్రాంతములందలి అధిపతులందరు నాంధ్రులై యుందురు. ఆనాటి ఆఫ్గాన్ స్థానములో నెవడో ఆంధ్రుడు అధిపతియై ఆ ఆటవికులచేత మన భాష చదివించియుండును. దీని లక్షణములక్కడ పాతుకుపోయినవి”

by: Kameswara Rao
సురేశ్ గారూ,

విశ్వనాథ వారు భాషా చరిత్రపై రాసిన వ్యాసాలు గురించిన వివరాలు కొంచెం ఇస్తారా? అతని వ్యాసాలలో అక్కడక్కడ కొన్ని భాషా చరిత్రకి సంబంధించిన విషయాలు ప్రస్తావనకి రావడం తెలుసుకాని, భాషా చరిత్ర గురించిన వ్యాసాలు నాకు తెలీదు. అతన్ని భాషా శాస్త్రవేత్తగా ఎవరూ పరిగణించినట్టుగా కూడా నాకు తెలీదు. భారత దేశ చరిత్రగురించి అతను పాశ్చాత్యులతో విభేదించడం తెలుసు. అదికూడా అతను శాస్త్ర పద్ధతిలో కాక, తన అభిప్రాయాలను నవలల రూపంలోనే ప్రకటించారు. అంచేత విశ్వనాథ కూడా తనకి తాను చరిత్రకారుడినని భావించలేదనే అనుకోవాలి. మరి మీకా అనుమానం ఎందుకొచ్చింది?

విప్లవ్ గారు నా మొదటి అభిప్రాయంలో అన్న మాటలని కొంత అపార్థం చేసుకున్నారేమో అనిపించింది. సురేష్ గారన్న దాంట్లో “చాలా మంది” సాహిత్య కారులు అన్న దానితోనే నేను విభేదిస్తున్నాను కానీ ఒక్కరూ సాహిత్య కారులు కాదు అన్నది నా ఉద్దేశం కాదు. పైగా ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కాబట్టి దీని గురించి చర్చ కొనసాగించడం అనవసరం.

by: G. Anand
ఈ వ్యాసం చాలా ఉపయోగకరంగా ఉంది.

“భాషాశాస్త్రం 101 వల్ల కొత్త విషయం తెలుసుకున్నామన్న ఆనందానికీ, కుశాస్త్రబుద్ధులని వాయించే తీవ్రతకీ పొంతన లేదు.”

“భాషాశాస్త్రం 101 లో కొత్త విషయాలను పాఠకులను అనందింపజేసేలా తెలియచెప్పిన తీరుకూ, కుశాస్త్రబుద్ధులను వాయించే తీవ్రతకూ పొంతన లేదు” అన్నది బాపారావుగారి ఉద్దేశమయి ఉండాలి.

(భాషాశాస్త్రం పై చర్చలో వ్యాకరణ దోషం చూడలేక).

by: సురేశ్ కొలిచాల
భాషా చరిత్రల పై నాకున్న ఆసక్తి వ్యాపకంగా మారటానికి ప్రేరకులు, కారకులైన కొద్ది మంది వ్యక్తులలో బాపారావు గారొకరు :-]. గత కొంత కాలంగా తెలుగు చర్చావేదికలకు దూరంగా అజ్ఞాతంలో ఉంటున్న బాపారావు గారు ఈ వ్యాసం కారణంగానైనా మరుగుదాటి తెర ముందుకు రావడం నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది.  ఇక ముందు కూడా ఈమాటలోనూ, మిగిలిన చర్చావేదికలలోనూ ఆయన తన విలక్షణమైన విశ్లేషణా శైలిని ప్రదర్శిస్తూ తిరిగి వ్యాసాలు రాయాలని, రాస్తారని నా ఆశ.

ఇక ఈ వ్యాసాన్ని మెరుగు పరచడానికి ఆయన చేసిన సూచనలు:

1. భాషాశాస్త్రం 101 కి పరిమితం చేసి ఉంటే బాగుండేది.

నిజానికి ఈ వ్యాసంలో “తెలుగు పత్రికల్లో భాషావ్యాసాల తీరు” అన్న విభాగం ఆఖరి నిమిషంలో కూర్చిందే.  కుతర్క వాదాల గురించి కొంతైనా విపులంగా  ప్రస్తావించక పోతే, తెలుగు పత్రికలు అంతగా చదవని పాఠకులకు భాషాశాస్త్రం-101 యొక్క ఆవశ్యకత అర్థం కాక ఈ వ్యాసం పరమ బోర్ గా తయారవుతుందని ఒక సమీక్షకుడు చేసిన సూచన, నాకు కూడా సబబే అనిపించి ఆ విభాగం చేర్చాను.

2a. కూన్ పండితుని “శాస్త్రీయ విప్లవాల స్వరూపం” గురించి, సామాజిక-విజ్ఞాన (Social Sciences) రంగాలలో ప్రత్యక్ష్యోత్తర  (అంటే Post-Positivist:-)) వాదం గురించి గానీ ప్రస్తావించడానికి భాషాశాస్త్రం-101 సరైన చోటు కాదేమో. అయినా ఒక విప్లవాత్మకమైన కొత్త ఆలోచనా-రూపావళి (Paradigm) ద్వారా ఇప్పుడు అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలకైనా పరిష్కారం చూపించేంత వరకూ ప్రస్తుత రూపావళి చట్రంలోనే (within the frame of the current paradigm కి వచ్చిన తిప్పలు) ఇతర పరిశోధనలను విమర్శంచడం కద్దు. అంతేగాక, శాస్త్రగతిలో రూపావళి మార్పు (Paradigm-shift) ని ప్రస్తావిస్తూ భాషాశాస్త్రం-301 రాయడానికి అవసరమైన శిక్షణా, సామర్థ్యాలు నాకు లేవు.

2b. భారతీయ భాషలపై పరిశోధన చేసిన పాశ్చాత్య పండితులందరూ ఏ రకమైన జాత్యంకారము, దురభిమానాలు లేని మహానుభావులని కీర్తించడం నా ఉద్దేశ్యం కాదు. మానవ సహజమైన అభిజాత్యం అందరిలోను ఉండి ఉండవచ్చు. అదీకాక, వారు ప్రతిపాదించిన ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలను అప్పుటి ఆంగ్ల ప్రభువులు, క్రిస్టియన్ మిషినరీలు, స్వాతంత్ర్యానంతరం మన తమిళ నాయకులు, తమ తమ ప్రయోజనాలకోసం వాడుకోని ఉంటే ఉండవచ్చు. కాని పాశ్చాత్య శాస్త్రజ్ఞులందరూ ఎంత దురభిమానులైనా వారి పరిశోధనల్లో శాస్త్ర ప్రమాణాలను పాటించడంలో ఒక రకమైన చిత్తశుద్ధి, నిబద్ధతా చూపించారని నాకనిపిస్తోంది.

3. పాండిత్యం రాణించాలంటే ప్రతిభతో పాటు వ్యుత్పత్తి, అభ్యాసాలు అవసరమని మన లాక్షణికులు చెప్పారు కదా. వనరులు అంటే నా దృష్టిలో training and infrastructure: అత్యుత్తమ స్థాయిలో పరిశోధనలు చేయడానికి తగిన శిక్షణ, ప్రోత్సాహం (grants, సంఘంలో గుర్తింపు), వాతావరణం (నిరుపహతి స్థలంబు, తప్పు మెప్పరయు లేఖక పాఠకోత్తముల్ వగైరాలు మాత్రమే కాదు) లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా అది మట్టిలో మాణిక్యమే. నా దృష్టిలో భద్రిరాజు, చేకూరి గార్లు భాషా శాస్త్రజ్ఞులుగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందడానికి వారు అమెరికా విశ్వవిద్యాలయాల్లో పొందిన శిక్షణే కారణం (ఎమెనో గారి వద్ద శిష్యరికం వల్లే తను ఇంతవాడయ్యాడన్న భద్రిరాజు గారి మాటల్లో అతిశయోక్తి లేదు). అద్వితీయమైన ప్రతిభ ఉండీ కూడా బూదరాజు గారు అంతగా శాస్త్ర పరిశోధనలు చేయ(లే)కపోవడానికి కూడా ఈ శిక్షణ లేమి కారణమని నా అనుమానం.

4. ఆశ్చరకరమైన విషయం ఏమిటంటే భాషా సంబంధ నిరూపణకు ధ్వనులు (phonemes), శబ్దాలు (morphemes), పదజాలం (vocabulary) తోడ్పడినంతగా వేరే వ్యాకరణాంశాలు ఉపయోగపడవు. కాలగతిలో ఒక భాషలో  లింగ (gender), కాల (tense), వాక్య నిర్మాణాది (syntax) వ్యాకరణాంశాలలో ఎన్నో మార్పులు సంభవించినప్పటికీ ప్రాథమిక శబ్దాలు మాత్రం అంతగా మార్పు చెందవన్న అంశం తులనాత్మక పద్ధతి (Comparative Method) కి మూలాధారం. అందుకే అంతకు ముందు పద్ధతులైన Comparative Philology, Comparative Grammar లను తోసిరాజని గత శతాబ్దంలో చారిత్రాత్మక భాషా పరిశోధకుల అమ్ముల పొదిలో  బ్రహ్మాస్త్రంగా మారిన ఉపకరణం ఈ Comparative Method. Agglutinative భాషలైన తెలుగు, తమిళాదులలో సంధుల గురించి నాకు వేరే అభిప్రాయాలున్నాయి. వాటి గురించి వేరే ఎప్పుడైనా ముచ్చటిద్దాం.

5, 6. తదుపరి వ్యాసాల్లో మీ సూచనలను  పాటించడానికి ప్రయత్నిస్తాను.

ఇకపోతే విప్లవ్, కామేశ్వర రావు గార్లు “సాహిత్యకారుల” గురించి చెప్పింది కొంతవరకు కరెక్టే. కానీ ఈ వ్యాసాలు రాసిన వారందరికీ తెలుగు సాహిత్యంతో పరిచయమున్నంతగా విజ్ఞానశాస్త్ర రంగంలో పరిశోధనకు కావల్సిన అవగాహన, శిక్షణ లేవనే నా అభిప్రాయం. అదీ కాక నేను ఆ వాక్యం రాస్తున్నప్పుడు మనసులో అనుకున్న మాట చెప్పేస్తున్నాను: “నాటి కవి సామ్రాట్టు నుండి నేటి నవలా చక్రవర్తి వరకూ భాషా చరిత్రలపై వ్యాసాలు రాస్తున్న చాలామంది ప్రధానంగా సాహిత్యకారులు.” సాహితీ క్షేత్రంలో విశ్వనాథ సత్యనారాయణ గారు సామ్రాట్టులే గాని, చరిత్ర అధ్యయనం లో కాదని నా చిన్ని అభిప్రాయం.

“ఏ కల్లంలో గింజలు అక్కడే తూర్పార పట్టాలి” అన్న విప్లవ్ కోరిక ప్రకారమే నా వ్యాసాన్ని తెలుగుదేశంలోని ఓ పత్రికకు పంపించాను. ఈ కోణానికి మెయిన్ స్ట్రీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.

by: విప్లవ్
“భాషాశాస్త్రం 101 వల్ల కొత్త విషయం తెలుసుకున్నామన్న ఆనందానికీ, కుశాస్త్రబుద్ధులని వాయించే తీవ్రతకీ పొంతన లేదు.”

నేను రాద్దామనుకున్న ముచ్చటను బాపారావు గారు చెప్పేశారు, కానీ ఆయన ఒకప్పటి “ఆంధ్ర పత్రిక” భాషలో చెప్పారేమో అనిపించి నేను చెప్పాలనుకున్నది నాకు తోచినట్టు రాస్తున్నాను.

పట్టపగలు నాలుగు రోడ్లు కలిసే బజార్లో, చీకటి వేశ్యాగృహాల్లో, తెలుగు పత్రికల్లో జరిగే చర్చలను ఆధునిక దేవాలయాల్లో మళ్ళీ చర్చించడం వాటికి కొంత లెజిటిమసీ ఇవ్వటమే.  (”ఈ మాట” ను దేవాలయంతో పోల్చే ఉద్దేశం నాకు లేదు.  కానీ ఆ ప్రమాణాలు, విలువలకుండే తేడాను చూపించటానికి ఆ మాత్రం contrast చూపించాలనున్నాను.)

ఏ కల్లంలో గింజలు అక్కడే తూర్పార పట్టాలి అని నేనకుంటాను.

ఒక వేళ వేరే ఒక వ్యంగ్య చిత్రమేదైనా గీయదలచుకుంటే వ్యధ సిరీస్ మీద మాధవ్ రాసినట్టు ఒకట్రెండు ఎపిసోడ్స్ రాసుకోవచ్చు.

సురేశ్ రాసిన మిగతా విషయాలు అవి చెప్పిన కోణం ఇప్పట్లో మెయిన్ స్ట్రీం తలకెక్కవు — వాటికి పాట్రొనేజ్ తక్కువ.  సుమేరియన్లు మనకు వేలు విడిచిన మేనమామ పినతండ్రి అక్క ఆడపడుచుకు దూరపు చుట్టాలేమో అనుకునే భావన, వాళ్ళ భాషకూ మన దానికీ ఉన్న లింకు అంతకంటే దగ్గరిదే అయి ఉండొచ్చు అనే వాదనకున్న పస శాస్త్రానికి అందదు, ఉండదు.

ఇక తెలుగు, ఆంధ్రం ప్రస్తావన రాజకీయమైనది, దానికీ భాషకూ సంబంధమే లేదు.  “ఆంధ్రం పేరుతో ఆంధ్ర భాష లేక భావనను ఒక కొత్త జాతిగా మలిచి విస్తరించడం పాత కొలోనియల్ ఇచ్చులు కచ్చకాయలను చూపెడుతుంది” అన్నది ఇప్పటి తెలంగాణ భాషా, జాతి రాజకీయ సమీకరణాల నేపధ్యం.  దేని బలం, పస ఎంత అన్నది రాజకీయపు నాలుగు రోడ్ల బజార్లో మాత్రమే తేలవలసింది.  “చెప్పిండు” “వచ్చిండు” వంటి వాడుకలు మార్జినలైజ్ చేసి భాష పేరుతో గుండు గుత్తకు ఆధిపత్యాన్ని ప్రకటించడాన్ని నిరసించడానికి ఎటువంటి అస్త్రం అయినా ప్రస్తుతం సమర్ధనీయమే అన్నది తెలంగాణలో మెజారిటీ నమ్మే విశయం.  “మెజారిటీ” “ప్రాతినిధ్య భావన” లాంటివి రాజకీయమే తప్ప మరొకటి కాదు, ఇదే నాణానికి వేరొకవైపు, ఇన్నాళ్ళూ మెజారిటీ పేరుతో చెలామణీ అయిన ఆంధ్ర భావన, భాష.

ఇవన్నీ ఇక్కడ కాక తెలుగు పత్రికల్లో తేల్చుకోవటమే మంచిదని నా నమ్మకం కాబట్టి ఇక నా డిస్కషన్ ఉండదు ఇక్కడ వీటి మీద.

ఇకపోతే కామేశ్వర రావు గారు “సాహిత్యకారులు” మీద చెప్పింది కరెక్ట్.  సురేష్: ప్రస్తుతం బ్రతికున్న ఆ సాహిత్యకారులెవరో (లేక చర్తిరకారులెవరో) ఒక లిస్టు ఉంటే రాయండి, వల్లంపాటి పోయాక ఆ లిస్టు మరీ చిన్నదై పోయిందనుకుంటాను.  అయినా, ఈ మధ్య (ఈ వంద కోట్ల ట్రెజర్ హంట్ మొదలైనంక) భాషా చరిత్ర మీద రాసిన పై లిస్టులో చేర్చవలసిన చరిత్ర కారులు లేక సాహిత్య కారుల వ్యాసాలు కానసలు ఏవైనా ఉన్నాయా?  అవి లేకపోతే కామేశ్వర రావు గారు చెప్పిన వాక్యం ఇందులోనుండి ఎడిట్ చేయాల్సిందే.  If I were a reviewer I would insist.

విప్లవ్

by: Bapa Rao
చక్కటిదీ, చదివించేదీ, ఆలోచింపజేసేదీ ఈ వ్యాసం. ఇంతకు మించిన మెచ్చికోళ్లు పలువురి వంతపాడటం మినహా మరో ప్రయోజనాన్నివ్వవు. అందుకే, ఈ రచనని ఇంకా మెరుగు పరచడానికి నాకు తోచిన సూచనలనిచ్చి ఊరుకుంటాను.

1. భాషాశాస్త్రం 101 కి పరిమితం చేసి ఉంటే బాగుండేది.

ఈ వ్యాసానివి రెండు ముఖ్య విషయాలు (1) తులనాత్మక భాషాశాస్త్రాన్ని తెలుగుకి అన్వయించడాన్ని పరిచయం చెయ్యడం (2) దుష్తర్కభూయిష్టాలై, చదివేవాళ్లని సిగ్గిలజేసే వాదాలతో తెలుగుభాషకి ఉన్నాయో లేవో తెలియని గుణాలని అంటగట్టే రచనల్ని దుయ్యబట్టడం.

(1) మీద కేంద్రికరించి, దాంతోపాటు భాషావిశ్లేషణ తరీఖాల్లో తగిలే జారుడుమెట్లని ఉల్లేఖించి, అంతటితో కట్టిపెడితే ఈ వ్యాసానికి మరింత సమగ్రతా, చక్కదనం చేకూరేవి. నిజమే, చెత్త విశ్లేషణలు చూస్తే చిర్రెత్తుకొస్తుంది. ఆ చిరాకే రచయితనకేఈ వ్యాసానికి పురిగొల్పిందన్న మాట కూడా నిజమే. చెత్తని నిరోధించవల్సిన ఎడిటర్లు, ప్రొఫెసర్లూ కొందరు స్వయంగా ఈ చెత్తకి పాల్పడటం మరీ దారుణం.

అయినప్పటికిన్నీ, భాషాశాస్త్రం 101 వల్ల కొత్త విషయం తెలుసుకున్నామన్న ఆనందానికీ, కుశాస్త్రబుద్ధులని వాయించే తీవ్రతకీ పొంతన లేదు. రసాభాస విషయం అటుంచితే, ఈ రెండు విషయాలని కలబోయడం వల్ల వాటిల్లే పెద్ద ముప్పు మరొకటి ఉంది.

ఈ చెత్త పుట్టుపూర్వోత్తరాలూ, స్థితిగతులూ పరిశీలించాలంటే, “మన వాళ్లు ఉట్టి వెధవాలోయి” అనేసి పబ్బం గడుపుకునే రోజులు చెల్లిపోయాయి. ఇలాంటి చెత్త “క్రియేషనిజం” లాంటి “అనిజాల” రూపంలో అమెరికాలోనూ ఉంది. కనుగొంటే అంతటా ఉంది. ఊరికే చెత్తని తిట్టేసి ఊరుకుంటే మజాగానే ఉంటుందిగానీ, ఆ తాత్కాలికానందం చెత్తకీ చరిత్రకీ ఉండే సంబంధాన్ని విడమర్చాల్సిన అవసరాన్ని విస్మరింపజేస్తుంది. ఈ చెత్త దానంతట అదే అధ్యయనీయ విషయం.

2. రెండు విషయాల్ని కలబోస్తే ఒకదానికి అన్యాయం జరగచ్చు.

a.  Kuhn పండితుడు Structure of Scientific Revolutions వెలయించి అరశతాబ్దం కావస్తోంది. “Paradigm Shift”  అని ఇప్పుడు కాకపోతే కాసేపటికి అనేసేవాడే ప్రతివాడూనూ. ఇప్పటికైనా శాస్త్రీయ పరిశోధన అనేది క్రమపద్ధతిలో, మునుపటి తప్పులని దిద్దుకుంటూ అలాగ్గా పురోగమిస్తుందనే అపప్రథని ప్రచారం చెయ్యడాన్ని నిషేధిస్తే మంచిది. స్థూల స్థాయిలో చూస్తే సైన్సు తన సిద్ధాంతాల్ని ఒక పట్టాన మార్చుకోదనీ, వస్తేగిస్తే అలాంటి సైద్ధాంతి పరిణామం  విలయానికేమీ తక్కువకాదనీ ఒప్పుకుతీరాలి. కుశాస్త్ర తరీఖాలని చెండే వ్యాసంలో శాస్త్రగతి తీరుగురించి పాతరోజుల పడికట్టురాళ్లనే తిరగదోడటం అభ్యంతరకరం. .

b. పాశ్చాత్య పాలకులు మనల్ని చిన్నబుచ్చడానికి పన్నిన వెధవ పన్నాగమే ఈ సైన్సంతా అనే వాళ్లది తెలిసీ తెలియని వాదమే కావచ్చు. కానీ అటువంటి అజ్ఞానాన్నీ, అమాయకత్వాన్నీ  ఖండించబూనుకున్న వ్యాసంలో కేవలం విలియం జోన్సులాంటి దిట్టల పేర్లు ఉటంకించి, దాంతో పూర్వపక్షం పని పూర్తయిపోయిందనిపిస్తే ఏమన్నట్టు? తెల్లవాడు నిన్నగాక మొన్నటి దాకా మానవశాస్త్రం పేరుతో పుర్రెల ప్రమాణాలు కొలిచి తెల్లజాతి ఎక్కువా, నల్లజాతి తక్కువా అని నిరూపించడానికి నానా తిప్పలూ పడ్డాడు. బుద్ధిపూర్వకంగా కొంతా, అసంకల్పిత దురభిప్రాయాల వల్ల కొంతా, సాంఘికశాస్త్రాల్లో నానా కంగాళీ చేసారు పాశ్చాత్యులు. సూక్ష్మంగా ఎందరో మహానుభావులుండినా, స్థూలంగా తెల్లవాడి సైన్సుని అనుమానంగా చూసేవాడు ప్రతివాడినీ దురభిమానమే నెడుతోందనేయడం  చరిత్ర వాస్తవాలని విస్మరించడమే అవుతుంది.

ఇక్కడ అసలు సమస్య ఇంత విషయాన్ని మరో అంత విషయంతో ఒకే వ్యాసంలో కూరితే వచ్చిపడే అనర్థం.

3.  ఈ దురవస్థకి వనరుల లేమే కారణమా?

ఈ రంగంలోని తెలుగువాళ్లల్లో భద్రిరాజు, బూదరాజు తదితరులవంటి మహనీయులు ఉన్నారని రచయిత ప్రస్తావించారు. వనరుల లేమి వీరికేమీ అడ్డంకి కాలేదు. భాషాశాస్త్రం కణభౌతికశాస్త్రం లాంటిది కాదు–దీనికి పెద్ద ఎత్తున యంత్రాలూ, దినుసులూ అవసరం లేదు. మేధస్సులూ, పుస్తకాలూ, ఇంటర్నెట్టూతో చాలా దూరమే పోవచ్చును. ఉన్నతస్థాయి పండితుల ప్రభావపంకిందిస్థాయి వారిమీద ప్రసరించలేదంటే అందుకు సంస్థాగత కారణాలుంటాయి. కుసంస్థకి డబ్బుపోస్తే ఫలితాల్నిస్తుందా? అన్న విషయం అలోచించాలి. అదిన్నీ భాషాశాస్త్రం 101 తో కాకుండా విడిగా.

4. భాషాశాస్త్రం 101 ని మరికాస్త దూరం తీసుకెళ్లాలి

పదజాలమే కాకుండా వ్యాకరణ నిర్మాణం కూడా తులనాత్మక అధ్యనానికి ఉపకరిస్తుందా? ఉదాహరణకి తెలుగు సంధులూ, తమిళ సంధులూ, సంస్కృత సంధులూ పరస్పరం పోలిస్తే తెలిసేది ఏమిటి? అలాగే సమాసాల విషయంలో.

5. ఈ ప్రయత్నాన్ని (భాషాశాస్త్రం 101) ముందుకు తప్పక తీసుకెళ్లాలి. ఇతరత్రా ప్రచురించిన పక్షంలో తదుపరి అధ్యనానికి ఉపకరించే విధంగా annotated references and links అందిస్తే ధన్యులం.

6. ఇక మీద దయచేసి spell checker వాడి Correspondance వంటి నిష్కారణమైన మీటపాట్లని తప్పించి మమ్మల్ని రక్షించాలి.

సద్భావనలతో,

కొచ్చెర్లకోట బాపా రావు