ఈమాట » కిటికీ

Expand to right
Expand to left

కిటికీ

సన్న జాజి తీగ
జోరు వానకి చలిస్తోంది
తడి పిచుక ఒకటి
కమ్మీల మీద రెక్కలార్చుతోంది
మేజా మీది టీ కప్పు
చలి గాలితో పోరాడుతోంది.
జల్లు దూకి వస్తోన్నా
కిటికీ మూయలేను.

షికారు

ఈ వేళప్పుడు ఈ వైపుకి ఎవరూ రారు
అయితే-
గొల్లభామలు తిరుగుతూ ఉంటాయి
స్వేచ్ఛగా.
గడ్డి దుబ్బులు
అలలు అలలుగా కదులుతున్నాయి
నల్ల మబ్బుల ఆకాశం కింద
తూనీగలు లక్ష్య రహితంగా ఎగురుతున్నాయి
షికారుకి పోవడానికి మనకిది సరైన సమయం.

 

(7 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Subrahmanyam Mula అభిప్రాయం:

    January 1, 2007 9:51 am

    చాలా బావున్నాయి…. ముఖ్యంగా “కిటికీ” చాలా నచ్చింది.

  2. pavan dunna అభిప్రాయం:

    January 4, 2007 3:32 pm

    మీ కవిత చదివిన తరువాత … నా కాలెజీ హస్టల్ కిటికి గుర్తుకొచ్చింది…

  3. vaidehi sasidhar అభిప్రాయం:

    January 4, 2007 6:38 pm

    చక్కని దృశ్యభావాలు!!!

  4. Seetha Kumari అభిప్రాయం:

    January 9, 2007 10:46 pm

    కిటికీ చాలా చక్కగా ఉంది…మనసుపై మంచి ముద్ర వెసింది….

  5. Raghothama Rao C అభిప్రాయం:

    January 14, 2007 4:23 am

    బావున్నాయి. నాకు షికారు నచ్చింది.

  6. Sudheer Kumar Kothuri అభిప్రాయం:

    January 20, 2007 5:05 pm

    చాలా బావున్నాయి

  7. viswamitrudu అభిప్రాయం:

    January 24, 2007 10:18 am

    మొదటి కవిత కిటికి బాగుంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a