ఈమాట » ఓ శాంతీ

Expand to right
Expand to left

ఓ శాంతీ

ఓ శాంతీ
నీ కాంతి
ధవళిమను
అవనిపయి
ప్రసరించి
మురిపించు

సంగ్రామము సంఘర్షణ
సంక్షోభము వలదు మాకు
సంతోషము సంరక్షణ
సహజీవన మవసరము
కష్టాలకు అంతమెప్పుడో
జన నష్టాలకు అంతమెప్పుడో

ఓ శాంతీ
నీ కాంతి
విమలిమను
వసుధపయి
ప్రసరించి
మురిపించు

సమరభూమియగు ప్రపంచ
మమరభూమి కావలయును
విషకలుషితమగు విశ్వము
అమృతమయము కావలయును
ఆ శుభోదయ మ్మదెప్పుడో
ఆ నవోదయ మ్మదెప్పుడో

ఓ శాంతీ
నీ కాంతి
కరుణిమను
ధరణిపయి
ప్రసరించి
మురిపించు

ఆకలితో అనారోగ్య
మారాటము వలదు మాకు
అన్నపూర్ణ నృత్యమ్ముల
ఆనందము కావలయును
ఈ నిరాశ కంతమెప్పుడో
ఆ మహాశ తీరుటెప్పుడో

ఓ శాంతీ
నీ కాంతి
మధురిమను
మహిపయిన
ప్రసరించి
మురిపించు

ముక్కారుల వర్షముతో
ఎక్కువైన పంటలతో
చక్కనైన ఉత్పత్తుల
మక్కువగా బ్రదకాలి
ఆ దినాల కాది యెప్పుడో
ఆ దినాల సాధ నెప్పుడో

ఓ శాంతీ
నీ కాంతి
పూర్ణిమను
ధాత్రిపయి
ప్రసరించి
మురిపించు

 

(ఒక అభిప్రాయం) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. viswamitrudu అభిప్రాయం:

    January 24, 2007 10:15 am

    మధ్యమధ్య ప్రాసకోసం ప్రాకులాడినా, కవిత బాగుంది.
    ముగింపు చాలాబాగుంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a