Comments on: పద్యాలు - వాడుకభాష

by: Kameswara Rao
>>ఇప్పుడు గ్రంధాల్లో వున్న భాష గ్రాంధిక భాషా? ఇవి గ్రంధాలు కావా? గ్రాంధిక భాష కాలమహిమవల్ల ఎలా మారిపోతుంది?

“గ్రంధాలలో ఉండేది గ్రాంధికభాష” అన్న నిర్వచనం తీసుకుంటే ఇప్పుడు గ్రంధాలలో వాడే భాషకూడా గ్రాంధికభాషే అవుతుంది. అందులో సందేహం ఏవుంది? కానీ నేను నా వ్యాసంలో ఉద్దేశించింది అది కాదు. అందుకే ఆ పదాన్ని ఏ ఉద్దేశంలో వాడేనో వ్యాసంలోనే పేర్కొన్నాను.

>>తెలుగు గ్రాంధిక భాష ఎలా పుట్టింది? ఆ మాటకొస్తే ఏ భాషలోనైనా గ్రాంధిక భాష గ్రాంధిక భాష ఎలా తయారవుతుంది? ఎవరూ “వాడని” భాషని ఎవరైనా ఎలా తయారుచెయ్యగలరు?

నాకు భాషాశాస్త్రంతో పెద్దగా పరిచయం లేదు కాని, నాకు తెలిసినంతవరకూ తెలుగులో గ్రాంధిక భాష సంస్కృత భాషా సాహిత్య ప్రభావంతో రూపొందిందని అనుకోవచ్చు. ఇది నన్నయ్యో మరే ఒక్కరో కూర్చుని చేసిన పని అనుకోవడం సరికాదు. నన్నయ్యకి ముందున్న తెలుగుశాసనాలలోనూ, కన్నడ సాహిత్యంలోనూ కూడా ఈ భాష కనిపిస్తుంది. ఎలా అయితే వ్యవహారంలోని భాషని ఒకరు సృష్టించరో, అలానే గ్రాంధికభాషాను. ఎలా అయితే వాడుకభాష మారుతూ వస్తుందో అలానే గ్రాంధిక భాష (అంటే గ్రంధాలలో వాడే భాష) కూడా మార్పుచెందుతూనే ఉంటుంది. గ్రాంధిక వాడుక భాషలు ఒకదాన్ని మరొకటి ప్రభావితం కూడా చేసుకుంటూ ఉంటాయి. పూర్వం సాహిత్యమూ, గ్రందాలూ కొన్ని వర్గాలకి పరిమితమవ్వడం వల్ల వాళ్ళకి నచ్చిన, వాళ్ళు వాడడానికి ఇష్టపడిన భాషలో గ్రంధాలు వెలువడ్డాయి. నిత్య వ్యవహారంలో భాషకీ ఆ భాషకీ కొంత స్పష్టమైన భేదం కనిపించేది. ఇప్పుడు మారిన పరిస్థితులలో సాహిత్యం, గ్రంధరచన అన్ని వర్గాల ప్రజలూ చేస్తునారు కాబట్టి, దానికి ఇంతకు ముందున్నంత నిర్దిష్టమైన రూపం లేదు. వ్యవహార గ్రాంధిక భాషల మధ్య తేడా ఇంచుమించు చెరిగిపోయింది.

>>కాలమహిమవల్ల మారిపోయే గ్రాంధిక భాషకి ఈ ధూపదీపనైవేద్యాలెందుకు?

తమకి ఇష్టదైవానికి పూజ చేసుకొనే హక్కు ఈ సెక్యులర్ దేశంలో ప్రతివాడికీ ఉందికదండీ :) నాస్తికుల చెవి మెలిపెట్టి మీరుకూడా పూజ చెయ్యాల్సిందే అనే హక్కు ఆస్తికులకి లేదు. అలానే ఆస్తికులని పూజలు మానుకోండనే హక్కు నాస్తికులకీ లేదు, ఏవంటారు? ఇంతకీ నా వ్యాసంలో నేనెలాంటి పూజా కార్యక్రమమూ పెట్టలేదే!

>>అందులో పచనం కాని పద్యాలైనా, వచనాలైనా పట్టించుకోడం ఎందుకు?

పైన నేను చెప్పినట్టు, ప్రస్తుతం గ్రంధాలలో వాడే భాషకి ఒక నిర్దిష్ట రూపం అంటూ నాకు తెలిసి ఏవీ లేదు. ప్రాచీన కావ్యభాష కావచ్చు, అందరికీ అర్థమయ్యే సామాన్య వాడుకభాష కావచ్చు, ప్రాంతీయ/మాండలిక భాష కావచ్చు, జానపదభాష కావచ్చు ఇలా ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళా భాషలో రాస్తున్నారు. దాన్ని ఇష్టపడే వాళ్ళు చదువుతున్నారు. ఒకో రకమైన భాషలో ఒకో అందం ఉంది, ఒకో శక్తి ఉంది. కాబట్టి ప్రాచీన కావ్యభాష ఇష్టమైన వాళ్ళు, దాని శక్తి తెలిసినవాళ్ళు ఆ భాషలో సాహిత్యం వెలువరించడంలో తప్పేముంది? దాన్నిష్టపడి చదివే వర్గమే దాన్ని పట్టించుకుంటుంది.  అలాటి వర్గం అంతరించిననాడు అది సహజ మరణం పొందుతుంది. అది సమాజానికి హాని చెయ్యనంత కాలం దాన్ని బతికించుకోవాలనుకోవడంలో తప్పులేదు, హత్య చెయ్యాలనుకోవడం అన్యాయం.

>>మీరేమో వాడుక భాషలో ఉత్పలమాల, చంపకమాల, పులులూ, ఏనుగులూ కుదరవంటారు. అవును కాబోలు అనుకునే లోపునే, మరో గురు తుల్యులు, కృష్ణమోహన్ గారు వాడుక భాషలో పద్యాలు అంటారు. ఏం దారి?

మేవిద్దరం రెండు కోణాలని చూపించే ప్రయత్నం చేసేమనే నేననుకుంటున్నాను కాని తగువులాడుకోటం లేదు. మీరు మా మధ్య లేని తగువుని సృష్టించకండి :) పద్యాలలో వాడుకబాష వాడకంలోని పరిమితులని నేను విశ్లేషించేను. అంతేకాని వాడుకభాషలో పద్యాలు రాయలేమని కాని, రాయకూడదని కానీ నేననలేదు. పద్యాలలో వాడుక భాషని ఎలా వాడవచ్చో కూడా నేను నా వ్యాసంలో ప్రస్తావించాను. అలానే వాడుకభాషలో పద్యాలు ఎలా రాయవచ్చో మోహనగారు మరో రకంగా వివరించారు.

by: baabjeelu
కావేఁశ్వరరావు గారికి,

తెలుగు గ్రాంధిక భాష ఎలా పుట్టింది? ఆ మాటకొస్తే ఏ భాషలోనైనా గ్రాంధిక భాష గ్రాంధిక భాష ఎలా తయారవుతుంది? ఎవరూ “వాడని” భాషని ఎవరైనా ఎలా తయారుచెయ్యగలరు?

నన్నెచోడుడో, నన్నయో ఆదికవి ఎవరెనే గొడవ వద్దు (ప్రాచీన/క్లాసికల్ భాష స్థాయి తెలుగుకి వచ్చీసింది కాబట్టి) వీళ్ళైనా గ్రాంధిక భాషని ఎలా తయారుచేశేరు? అసలు గ్రాంధికాన్ని ఎందుకు తయారు చెయ్యవలసి వచ్చింది?

ఇప్పుడు గ్రంధాల్లో వున్న భాష గ్రాంధిక భాషా? ఇవి గ్రంధాలు కావా? గ్రాంధిక భాష కాలమహిమవల్ల ఎలా మారిపోతుంది? కాలమహిమవల్ల మారిపోయే గ్రాంధిక భాషకి ఈ ధూపదీపనైవేద్యాలెందుకు? అందులో పచనం కాని పద్యాలైనా, వచనాలైనా పట్టించుకోడం ఎందుకు? వ్యాకరణం భాషని శాసించదు, “రికార్డ్” చేస్తుంది. కాదా? రేపు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ “అమ్మ వొచ్చేడు, నాన్న వొచ్చింది” అని వాడితే భాషా శాస్త్రవేత్తలు/వ్యాకరణ పండితులు - ఆ పుంజీడు మందీ - అదే “రికార్డ్” చేస్తారు తప్ప ఇంకేం చేస్తారు?

ఇన్ని “కొశ్చిన్ మార్కులా?” అని అనుకోవచ్చు. అవును “ప్రశ్నార్ధకాలే?”

“తెవికీ” సభ్యులకి: అయ్యలారా! అమ్మలారా! తెవికీ అంటే తెలీదు నాకు. కానీ ఇదేదో తెలుగు భాషనుధ్ధరించడానికి చేసే పనని అనిపిస్తోంది. అయితే ఈ విషయంలో తెలుగు భాషా శాస్త్రవేత్తల్నీ, తెలుగు భాషా పండితుల్నీ సంప్రదించకండి. తెలుగు మాట్లాడే ప్రజల్ని సంప్రదించండి. మీ శ్రమకి ఫలితం, మీ శ్రమకి కృతజ్నత, మీ శ్రమకి తెలుగు ప్రజల జేజేలు అందుకోవచ్చు. మీకవక్కర్లేదని అందరికీ తెలుసు. అయినా సరే.

కావేఁశ్వరరావు గారికి: మీరేమో వాడుక భాషలో ఉత్పలమాల, చంపకమాల, పులులూ, ఏనుగులూ కుదరవంటారు. మీరు గురు తుల్యులు. అవును కాబోలు అనుకునే లోపునే, మరో గురు తుల్యులు, కృష్ణమోహన్ గారు వాడుక భాషలో పద్యాలు అంటారు. ఏం దారి?

అందరికీ “అమ్మ(భాష)” రాణెమ్మలా బతకాలనే దుగ్ధ. అయితే అది సమకూర్చడానికి పిల్లలు తగవులాడుకున్నట్టు లేదూ ఇదంతా?

చందోబధ్ధమైన పద్యము వ్రాయగల్గిన కుర్రాళ్ళూ, నియమాలేవీఁ లేని శ్రీశ్రీ “తిలకా”లూ, ఆయమ్మకి మనకాడ పూసిన పూలనే “ఒట్టుకెళ్ళిచ్చి, ఇయెట్టుకో కొప్పులో, ఎంత బాగుంటావో తెల్చా” అనే చాత్రిబాబులూ, అన్నీ తెలిసిన రవఁణలూ, ఏవీఁ తెలీని నామినులూ, తెలిసీ తెలీనట్టుండే శ్రీశ్రీరవఁణలూ, అన్నీ తెలుసు మాకన్నీ తెలుసు అని “రికార్డింగ్ డేంచు కట్టే” నాలాటి వాళ్ళూ  వీళ్ళందర్నీ “బజ్జో, మళ్ళీ పొద్దున్నే లెగాల” అని దెబ్బలాడతాదాయమ్మ్మ. కాదా?

by: Dr.tadepalli patanjali
విశ్వనాథ  పలుకు ‘బడి’లో నిలబడి రచయిత మంచి క్లాసు తీసుకొన్నారు. అభినందనలు.

-డా.తాడేపల్లి పతంజలి

by: Kameswara Rao
Hanumantha Rao garu,

Thanks for the references. Will try to get my hands at them..

I could just see a few poems from Cherakalam in “Varada Smriti” published by abburi Chayadevi. All of them are kaMda padyalu,.

by: కొడవళ్ళ హనుమంతరావు
“ఛందస్సు లేకుండా కవిత్వం లేదు” - వరద

కామేశ్వరరావు గారూ,

కందకీ గీతకీ తేడా తెలియని ‘విద్యావంతుణ్ణి’ నేను. అదేదో గొప్పగా చెప్పుకోడం లేదు; ఉన్న విషయం చెప్తున్నా. అయినా మీ వ్యాసం నాకు బాగా నచ్చింది.

విశ్వనాథ కవిత్వంలోని తెలుగు వెలుగులు చూపినందుకు సంతోషం. మీరు చెప్పింతర్వాత కొన్ని పద్యాలు చదివి “ఓహో” అనుకున్నాను – “ప్రొద్దుననే లేచి పులికాపు పెట్టును” అంటూ మొదలైన సీసం!

మధ్యాక్కర వాడుకభాషకు వీలుగా ఉంటుందన్నారుగాని “విశ్వనాథ మధ్యాక్కరల” నీ ఆరుద్ర “శుద్ధ మధ్యాక్కరల”నీ ప్రస్తావించలేదు. ఆరుద్ర రాసినది వాడుక భాషగానే కనపడుతుంది.

అబ్బూరి ‘చెరకాలం’ రాస్తున్నప్పుడే శ్రీశ్రీ ‘కలకాలం’ తలపెట్టి, ‘చెరకాలం’ కోసం ఉపోద్ఘాతం రాస్తూ,

“కలకాలం చెరకాలం

సిలువై తుదికావ్యమై స్పృశించెను వరదా!”

అని అన్నాడట. అని ‘చెరకాలం’ వ్రాతప్రతిని పట్టుకెళ్ళి పోగొట్టుకున్నాడు! అబ్బూరి దగ్గర మరో కాపీ లేదు! ‘తెలుగు స్వతంత్ర’ లోనూ “అందాకా” లోనూ ప్రచురితమైనవీ, అముద్రితమైనవీ, దొరికినంతవరకు వీళ్ళదగ్గరా వాళ్ళ దగ్గరా సేకరించి, లండన్ వాస్తవ్యులైన పరకాల ప్రభాకర్ 1993లో “కవితా సంచిక” గా ప్రచురించారు. దాంట్లో దాదాపు డెబ్భై పేజీలు ‘చెరకాలా’ నివే! దాని చివర్లో అబ్బూరితో “కవిత్వం అంటే…” అన్న పేరుతో పరకాల జరిపిన ఆసక్తికరమైన ఇంటర్వ్యూ కూడ వుంది.

విశ్వనాథ వారు అబ్బూరి ప్రయోగాలని చూసి, “నీ స్నేహితులంతా ఛందస్సు మీద విరుచుకు పడతారేం? వాళ్ళకి చాతకావాలి కాని అందులో రాయటానికేం బాధ? నువ్వు రాసి చూపించావు కదా – యింకా యేం కావాలి వాళ్ళకి?” అని మెచ్చుకున్నాడు.

చెదురుమదురుగా వున్న మరికొన్ని అబ్బూరి రచనల్ని ఒకచోట చేర్చి, వారి కుటుంబసభ్యులు 1995లో “సామిధేని” పేరిట మరో పుస్తకాన్ని ప్రచురించారు. దాంట్లో చేకూరి రామారావు గారి వ్యాసం, “నిరంతరాన్వేషి, నిత్యప్రయోగశీలి వరద,” కోవెల సంపత్కుమారాచార్య గారి వ్యాసం, “ఛందో వరదస్మృతి,” వున్నాయి. నిజం చెప్పాలంటే, ఆ పండితుల వ్యాసాల్లో కన్నా మీ వ్యాసంలో “ప్రవాహ గుణం” బాగుంది.

ఈ పుస్తకాలు నేను గత రెండేళ్ళ లోపునే కొన్నాను కనుక ఇంకా దొరుకుతున్నాయనుకుంటాను. మీ వ్యాసానికి అవి ఉపయోగపడొచ్చు.

కొడవళ్ళ హనుమంతరావు

by: రానారె
సురేశ్ గారు, ధన్యవాదాలు. మీ సూచన తెవికీ సభ్యులకు చేరింది. మీ సహాయాన్నర్థించడంకోసం “ఈమాట”ను  వేదికగా చేసుకొనవలసిరావడం కాస్త  ఇబ్బంది కలిగించే విషయమే (క్షమించాలి) అయినా మన భాషకు సంబంధించినంతవరకూ తెవికీ ఒక  మహావిజ్ఞానసర్వస్వం కానున్నందున  వారికిది మోదము, అమోదమూ అయుంటుందని  భావిస్తున్నాను. పద్యాలను, వాడుకభాషను రెంటినీ తెవికీలో భద్రపరచి మనందరికీ అందుబాటులోకి తెస్తున్నాం.  ఇప్పటికే ఆంధ్రమహాభారతములోని కొన్ని పర్వాలు అందులో వున్నాయి. ఐతే, తెవికీకి మాత్రుక ఆంగ్లవికీపీడియా. అందువలన తెలుగు భాషాపండితులకన్నా, భాషాశాస్త్రవేత్తల సహాయం తెవికీని కాంతివంతం చేయగలదేమో అని నా అభిప్రాయం. మీకు వీలైనప్పుడల్లా మీ సూచనలు, సలహాలు అందించగలిగితే సంతోషం. ఈ దిశగా మీ సూచనలను teluguwiki@googlegroups.com కు పంపగలిగితే మహదానందం.

by: సురేశ్ కొలిచాల
రానారె గారు: ఏ ఒక్కరిద్దరి ఉచ్చారణ బేధంవల్ల భాషాపరిణామం రాదు. ఏ ఒక్క వికీపీడియా లేబుల్ మార్చడం వల్ల రాబోయే భాషా పరిణామాలు ఆగిపోవు! ఈ సమాచార విప్లవ శకంలో, ప్రపంచమే కుంచించుకుపోయి ఒక కుగ్రామంగా మారిపోయే ఈ సంధియుగంలో ఎన్నో భాషామహావృక్షాలే కూకటివేళ్ళతో సహా పెళ్ళగింపబడుతున్నాయి. ప్రపంచం నలుమూలల ప్రస్తుతం మాట్లాడబడుతున్న ఆరువేల పైచిలుకు భాషలలో 90% పైగా భాషలు ఈ శతాబ్దాంతానికి లుప్తమైపోతాయని భాషాశాస్త్రజ్ఞుల అభిప్రాయం (Cf. Language Death - David Crystal). అప్పటికి తెలుగు సజీవ భాషగానే ఉంటుందని నా నమ్మకం, ఆశ. అయితే, అప్పటి తెలుగు భాష మనం గుర్తు పట్టలేనంతగా మారిపోతుందని మనం ఊహించుకోవచ్చు. ఉదాహరణకు, దంత్యాక్షరాలకు (Dentals), మూర్ధన్యాక్షరాలకు (Retroflexes) తేడా నశించి అవి ఆంగ్లంలోని దంతమూలీయాలు (Alveolars) గా మారిపోవచ్చు. మహాప్రాణాల స్థానంలో ఊనిక (Stress - Primary and Seconary) ప్రాధాన్యతను సంతరించుకోవచ్చు. ఆంగ్లంలో లేని ద్విత్వాక్షర ఉచ్చారణ తెలుగులో కూడా నశించిపోవచ్చు.  ఈ నేపథ్యంలోనే తెలుగు భాష agglutination లక్షణాన్ని కోల్పోయి isolating భాషగా మారుతుందేమోనన్న నా అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఏ ఒక్క వికీపీడియా లేబుల్ ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు.

అయితే, తెలుగు వికీపీడియా లేబుల్స్ అనువాదాల విషయంలో ఒకరకమైన consistency ని, ప్రామాణికతను సాధించడం కోసం, ఎవరైనా తెలుగు భాషాపండితుల సాయాన్ని అర్థించడం మంచిదని నా అభిప్రాయం. ఇంగ్లీష్ వికీతో పోల్చి చూసుకునేంతవరకు అర్థాలు స్ఫురించని సముదాయ పందిరి (దు.స.), వీక్షణ జాబితా (దు.స.), ఇసుకపెట్టె వంటి పదాలు, -ము కారాంత పదాల, బిందు పూర్వక (సున్నతో అంతమయ్యే) పదాల వాడకంలో consistency మొదలైన విషయాల్లో ఉపయోగంగా పండితుల సాయంతో ఒక శైలి నియమావళిని రూపొందించడం కూడా అవసరమేమో. ఏది ఏమైనా, ఇప్పటికే తెలుగువికీ కోసం ఎంతో కృషి చేస్తూ, దీనిని భారతీయ భాషలలో ఎన్నదగిన వికీపీడియాగా తయారు చేసిన మీ బృందానికి అభినందనలు.

మంచి వ్యాసాన్ని, మంచి చర్చను అందించినందుకు కామేశ్వరరావుగారికి అభివందనాలతో,

సురేశ్.

దు.స. = దుష్ట సమాసము

by: krishnareddy kapireddy
ఒక మంచి వ్యాసము. విషయములను అతి చక్కగ వివరించారు. భాషా ప్రయూగములో సరి కొ్త్త రచనల కి ఎంతో ఉపయోగ పదుతుంది. మన తెలుగు భాష విస్తరించాలి. మీ ఈ వ్యాసము ఎంతొమందికి స్ఫూర్తి దాయకము. అభినందనలతో

కృష్ణారెడ్డి కాపిరెడ్డి

by: రానారె
“ఈ వారపు సమైక్య కృషి” అంటే అది agglutination అవుతుందా? సురేశ్ గారూ మీ సూచనతో తెవికీ లేబుల్ ను సరిదిద్దుదాం. దయచేసి తెలియజేయండి.

by: Kameswara Rao
భాషకి అనువుగా ఛందస్సు మారాలని మొదట గుర్తించింది గురజాడ. అతని అడుగుజాడలో నడిచిన వాడు శ్రీ శ్రీ (ఆ విషయంలో). గురజాడ, శ్రీ శ్రీ సాంప్రదాయిక ఛందస్సులలో రాసిన పద్యాలలో భాషనీ, మాత్రా ఛందస్సుల్లో రాసిన పద్యాలలోని భాషనీ గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అప్పటికున్న కవితత్వం ప్రథానంగా పద్యరూపం కావడం మూలానా, పద్యాలకి వ్యవహార భాష తగదని తెలుసున్న కారణానా, ఆనాటి వ్యావహారిక భాషా వాదులు వచన సాహిత్యం గురించే పోరాడారుగాని పద్యాలజోలికి, కవిత్వం జోలికీ పెద్దగా పోలేదు. గురజాడ ఒకడుగు ముందుకు వేసి కవిత్వంలో కూడా వ్యవహార భాష తెచ్చే ఉద్దేశంతోనే మాత్రా ఛందస్సులని స్వీకరించాడు. ఐతే మాత్రా/దేశి ఛందస్సులలో  కథా కావ్యాలని సృష్టించగలమా, సృష్టించినా అవి ఎంత వరకూ జన రంజకం అవుతాయీ అన్నది పరిశీలించాల్సిన విషయం. పాల్కురికి సోమనాథుని ద్విపద కావ్యాలుకాని, రంగనాథ రామాయణం కానీ అంతగా ప్రసిద్ధి చెందకపోవడానికి కారణం కేవలం రాజకీయమనో, పండితుల నిరాదరణ అనో కొట్టి పారేశాం కానీ, వాటిని ఒక పోతన భాగవతం తోనో, మొల్ల రామాయణంతోనో పోల్చి వాటి అనాదరణకి కారణాలు వెతికే ప్రయత్నం జరగలేదు.

భాషా శాస్త్ర పారిభాషిక పదాలపై నాకు పెద్ద అధికారం లేదు కాని, agglutination, inflection, vowel harmony మొదలైన లక్షణాలన్నీ కలిసి తెలుగు భాషకి ఆ ప్రవాహగుణాన్ని స్తున్నాయి, బహుశా.

“జ”కి “శో” కి హల్ మైత్రి కుదిరినా అచ్చుల మైత్రి కుదరదు (”అ”కి “ఒ”కి). కాబట్టి ఆ రెండక్షరాల మధ్య యతి సాధ్యం కాదు. అలాగే “వ”కి “వి”కి కూడా కుదరదు. కొంత అరుదైనా నన్నయ్య “ప”కి “వ”కి, “బ”కి “వ”కి యతి వేసాడు. ఉదా:

“నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూరిటికంటె నొక్క స

త్క్రతువది మేలు…”

“ప్రల్లదుడైన యొక్క కులపాంసను జేసిన దాన దత్కులం

బెల్లను దూషితంబగుట యేమి యపూర్వము గావునన్ మహీ

వల్లభ! తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలో

by: సురేశ్ కొలిచాల
Morphological typology లో నేను అర్థం చేసుకున్నది తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకే పదంలో ఎన్నో శబ్దాలు (morphemes) ప్రత్యయాల (affix) సాయంతో అల్లుకుపోయి ఉండే భాషలను agglutinative భాషలనీ, ఒక పదంలో దాదాపుగా ఒక శబ్దం మాత్రమే కనిపించే భాషలని isolating భాషలని చెప్పవచ్చు. ఈ రెంటికి మధ్యస్థంగా ఒక పదంలో శబ్దాలు (సంధి) సూత్ర నియతంగా,  శబ్దాలు తమ స్వ-రూపం మార్చుకొనే విధంగా సంలీనం చెందే భాషలను fusional/inflectional భాషలని స్థూలంగా చెప్పవచ్చు. తెలుగు, తమిళాదులు  agglutinative భాషలనీ, సంస్కృత-లాటిన్ భాషలు fusional భాషలనీ, చైనీస్, ఇంగ్లీష్ భాషలు isolating భాషలనీ చెప్పుకోవచ్చు.  “ఇంటిపైనుండి” అన్న తెలుగు పదాన్ని ఇంగ్లీషులో “over the top of the house” అన్న ఆరు విడి విడి పదాలుగా రాయాలి. అనుష్టుప్ ఛందస్సు, విరామయతి, పాదాంత విరామం fusional భాష అయిన సంస్కృతానికి ఒప్పినట్టుగా agglutinative భాష అయిన తెలుగుకు ఒప్పదనే నన్నయాదులు వృత్త ఛందస్సును విరామ నియమాలు లేకుండా అక్షరమైత్రితో స్వీకరించారని కామేశ్వర రావు గారు చెబుతున్నారని నా interpretation!

by: chavakiran
agglutinative మరియు isolating  అంటే ఏమిటో ఎవరన్నా చెపుతారా?

కొన్ని ఉదాహరణలతో

by: సురేశ్ కొలిచాల
కామేశ్వరరావుగారు,

“-‌న్”, “-ల్” వంటి ప్రత్యయాలు మొదలైనవి లేకుండా నేటి కాలపు భాషలో పద్యాలు రాయాలంటే ఛందస్సు (వృత్తాలు) మారాలి  అన్న విశ్వనాథ అభిప్రాయం సబబే అని తోస్తోంది.  ఒక విధంగా చూస్తే, ఆధునిక భాషలో అద్భుతమైన శబ్దసౌందర్యాన్ని, ప్రవాహగుణాన్ని ప్రదర్శిస్తూ దేశీ ఛందస్సులతో (మాత్రా ఛందస్సులతో)  కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ ఇత్యాదులు సృష్టించిన కవితలే మారిన ఛందస్సుకు ఉదాహరణలని నాకనిపిస్తోంది. ఈ ఆధునిక కవులు వాడిన భాష నిజంగా వాడుక భాషేనా అని కొంతమంది వేసే ప్రశ్నకు సమాధానం మీరు చర్చించకుండా వదిలేసిన “కవిత్వ భాష”. కొన్ని పదాలూ, లక్షణాలూ ఎప్పటికీ వ్యవహారంలోకి రానివీ, వ్యవహార దూరమైనవీ కవిత్వ భాషలోనే ఉంటాయి. “పరిమళపు తుఫానుల్ని రేపి, మహారణ్యాల సౌందర్యాన్ని చూపి, మౌనంగా ఉన్న ద్వీపాల్ని ఊపి” అన్న మాటలు కవిత్వంలోనే తప్ప మనం సాధారణంగా మాట్లాడే వాక్యాల్లో వినిపించవు కదా!

ఇంకో విషయం. “తెలుగు పద్యాలకి ఉండే మరొక ప్రత్యేకమైన లక్షణం ప్రవాహ గుణం, లేక ధార …  ఈ నాదం తెలుగు భాష సొత్తు.” అని అన్నారు. ఇక్కడ మీరు తెలుగు భాష agglutinative స్వభావాన్ని వివరిస్తున్నారని నా సొంత అభిప్రాయం ! అయితే,  ప్రపంచీకరణ వల్ల, అన్యభాషాప్రభావాల వల్ల తెలుగు agglutinative స్వభావాన్ని కోల్పోయి ఇంగ్లీష్ భాష లాగే isolating భాషగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. “ఈ వారము సమైక్య కృషి” అన్న తెలుగు వికీపీడియా లేబుల్ ఇందుకు ఒక ఉదాహరణ :)

కృతజ్ఞతలతో,

సురేశ్.

- “శోకింపంగన్” అన్నప్పుడు యతిభంగం కాలేదు. నన్నయ్య “జ”-కారానికి  “శ”-కార యతి వాడిన సందర్భాలు ఆది పర్వంలోనే కనిపిస్తాయి.

- నన్నయ్య “వ”-కారానికి “ప”-కార యతి వాడాడో లేదో నాకు తెలియదు. “వారిజ కాంతల్” కు బదులుగా “వికచ కుసుమముల్” వాడొచ్చని అది పోస్టు చేసిన కాసేపట్లోనే అనుకున్నాను.

by: Kameswara Rao
నిజమే, గ్రాంధిక భాషకీ వాడుకభాషకీ మధ్యనున్న  భేదాన్ని వివరించడం శ్రమతో కూడుకున్న పనే.  అసలు గ్రాంధిక భాషనీ, వ్యావహారిక భాషనీ సరిగ్గా నిర్వచించాలంటేనే అనేక సమస్యలున్నాయి. వాడుక  భాషకి ఒక కాలపరిమితిలోనే లక్షణాలు చెప్పుకోగలం, అది నిత్యం మారుతూ ఉంటుంది కాబట్టి. గ్రాంధిక భాష అంటే, గ్రంథస్థమైన భాష అన్న నిర్వచనం చెప్పుకుంటే, అదీ కాలంతోపాటు మారుతూ ఉంటుంది. గాంధిక  వ్యావహారిక భాషా వాదాలు నడచిన కాలంలో, గ్రాంధిక భాషంటే ప్రాచీన కావ్యాల ఆధారంగా రూపొందించిన కొన్ని వ్యాకరణాలకి బద్ధమైన భాష అనీ, వ్యావహారిక భాష అంటే ఆ వ్యాకరణాలకి బద్ధం కానిదనీ నిర్వచించుకున్నారు. ఐతే అటువంటి వ్యాకరణాలకి విరుద్ధమైన ప్రయోగాలు కావ్యాలలో ఉండడం అటు గ్రాంధిక భాషా వాదులు, ఇటు వ్యావహారిక భాషా వాదులూ కూడా గుర్తించారు. ఐతే గ్రాంధిక భాషంటే కేవలం సంస్కృత పదభూయిష్టమైన రచనే కాదన్నది నిర్వివాదం.  శివుడిని “అరపదిమోముల దయ్య”మనడం వ్యవహార దూరమే కదా, అంచేత అది గ్రాంధిక భాషే అవుతుంది.  ఒక రకంగా ఆలోచిస్తే వాడుకభాష ఎప్పుడైనా గ్రాంధిక భాష కావచ్చు. కానీ గ్రాంధిక భాషలో కొన్ని పదాలూ, లక్షణాలూ ఎప్పటికీ వ్యవహారంలోకి రానివీ, వ్యవహార దూరమైనవీ ఉంటాయి.

గ్రాంధికభాష అంటే గ్రంథస్థమైన భాష అని చెప్పుకుంటే, అది వ్రాసే భాష అవుతుంది. అప్పుడు వాడుకభాషంటే మాట్లాడుకునే భాష అని నిర్వచించుకోవాలి. ఐతే ప్రాచీన కాలంలోని కావ్యేతరమైన లిఖిత సాహిత్యాన్ని పరిశీలిస్తే, అది కావ్య భాషకి భిన్నంగా కనిపిస్తుంది.

ఈ రకంగా గ్రాంధిక, వ్యవహార భాషల నిర్వచనాలగురించే చాలా చర్చ చెయ్యవచ్చు. భాషా శాస్త్ర అభిమాన్లు  గ్రాంధిక, వ్యవహార భాషల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులని పరిశీలించ వచ్చు.

ఇవన్నీ నా వ్యాసానికి ముఖ్యం కాదని నేననుకోవడం వల్ల ఈ విషయాల్లోకి వెళ్ళలేదు. నేను ప్రథానంగా  చర్చించాలనుకున్నది - ఈ కాలంలో పద్య కవిత్వం రాయాలంటే, ఇప్పటి వాడుకభాషను ఎంతమేరకు ఉపయోగించ వీలవుతుంది? ప్రాచీన కావ్య భాష అనువైనంతగా నేటి వాడుక భాష పద్యాలకి తగుతుందా? దీనికోసమే వాడుక భాష అంటే గత వంద సంవత్సరాలుగా వాడుకలో ఉన్న భాష అని అన్నాను. గ్రాంధిక  భాషకి తాత్కాలిక నిర్వచనం (ఇది చేరాగారి దగ్గరనుండి నేనరువుతీసుకున్న పదం) మాత్రమే ఇచ్చి, ఆ భాషలో కనిపించే లక్షణాలని ప్రస్తావించాను. ప్రాచీన కావ్య  భాష కూడా నన్నయ్య నుండి, విశ్వనాథ వరకూ మార్పులు పొందుతూ వచ్చినా కొన్ని ప్రధానమైన లక్షణాలను మాత్రం కోల్పోలేదు. వాటినే నా వ్యాసంలో ఉపయోగించుకున్నాను. అధికమైన పద సంపద, “-‌న్”, “-ల్” వంటి ప్రత్యయాలు మొదలైనవి. అలాగే వాడుక భాషలోని ప్రధానమైన లక్షణాలని ప్రస్తావించాను - నామవాచకాలలోని “ము” సున్నాగా మారడం, విసంధి మొదలైనవి.

ఆధునిక పద్య కవిత్వాన్ని పరిశీలించి, వాడుక భాష పద్య కావిత్వంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అన్న విషయమ్మీద ఇంకా పరిశోధన చెయ్యవచ్చు.

“నేనొక పూలమొక్క….” పద్యం మనసుకి హత్తుకోవడం వెనుక వాడుకభాష సహాయం తగినంత ఉందని తెలుస్తుంది - “చివాలున” కొమ్మ వంచడం, “జాలిగ నోళ్ళు”విప్పడం, “బావురు”మనడం వంటి పదాలని గమనిస్తే.

సురేశ్ గారూ, “అడవికి బువ్వులు దేరగ వడి నరిగిన కచుని జంపి…” అన్న నన్నయ్య గారి పద్యాన్ని బాగానే పట్టుకున్నారండీ!

వారిజములంటే తామరపువ్వులుకాబట్టి ఆ పదం సరిపోదు. “ప్రసవమ్ములొగిన్” అంటే సరిపోతుంది:-)

అలాగే చివరి పాదంలో యతిభగం జరిగింది, “జాలింబడగన్”  అని మార్చుకోవచ్చు.

by: Raja Sankar Kasinadhuni
కామేశ్వరరావుగారి వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది.  అయితే, గ్రాంథికానికి వాడుక భాషకి తేడా చెప్పడం ఒక పరిథి దాటిన తరువాత చాలా కష్టం అని నాకనిపిస్తుంది.

ఉదాహరణకు ఒక పద్యంలో “అరపది మోముల దయ్యము” (ఐదు ముఖముల దైవము, అనగా శివుడు) అని అచ్చ తెలుగులోని మాటలతో ఈశ్వరుడిని వర్ణిస్తాడు కవీశ్వరుడు. ఈ పద్యం ఏ కోవలోకి వస్తుంది?

సంస్కృత పద భూయిష్టమైన రచనలే గ్రాంథికమని రచయత అభిప్రాయామా?

ఏది ఏమైనా రచయత విషయాన్ని చెప్పిన శైలి చాలా బాగుంది.  కామేశ్వరరావుగారి కలంనుంచి మరిన్ని మంచి వ్యాసాలు రావాలని కోరుతున్నాను.

కొలిచాలగారి క్రింది అభిప్రాయంలో ఎదో self-contradiction కనిపిస్తోంది:

“పండితుల పట్టుదల వల్ల, లాక్షణీకుల వ్యాకరణ సూత్రాల వల్ల గ్రాంథిక భాష కొంత జడత్వం చూపినా, “ప్రాఁతవడ్డ మాటలను” పరిహరించడంలో, కొత్త మాటలను, ప్రయోగాలను ఉపయోగించడంలో నన్నయ్య, తిక్కనల నుండి విశ్వనాథ వరకూ, మహాకవులెవ్వరూ సందేహించలేదని నాకనిపిస్తుంది.”

1. పూర్వ కవుల ప్రయోగంబులు గ్రాహ్యంబులని కదా వ్యాకరణ సూత్రం? మరి పై ఆక్షేపణ (వ్యాకరణం వలన భాషలో జడత్వం) ఎంత వఱకు సమంజసం?

2. నన్నయ, తిక్కన, విశ్వనాథ ఇత్యాదులంతా పండితులు కారా?

ధన్యవాదాలతో,

కాశీనాథుని రాజాశఙ్కర్

by: సురేశ్ కొలిచాల
లోతైన విశ్లేషణతో ఆలోచింప చేసే చక్కని వ్యాసం! అయితే, “గ్రాంధిక భాష అంటే ఇంతకాలం సాంప్రదాయికంగా లిఖిత పూర్వకంగా వస్తున్న ప్రాచీన కావ్యాలలో వాడబడిన కావ్య భాష.” అని మీరిచ్చిన తాత్కాలిక నిర్వచనాన్ని ఇంకొంత వివరిస్తే బాగుండేదేమో. కాల గతిలో వాడుక భాష మారినట్టుగానే కావ్య భాష కూడా పరిణామం చెందుతూ వస్తోందని, నన్నయ్య, తిక్కనాదులనుండి విశ్వనాథ వరకు వారి వారి కావ్యాల్లో వాడిన కావ్యభాషలన్నీ ఒకే రూపంలో లేవని మీకు తెలుసు. నన్నయ్య కావ్యభాషకు ఎనమిదో శతాబ్దపు భాష ఆధారమైతే, 11వ శతాబ్దపు శాసనాలలో కనిపించే ఇచ్చినాఁడు ( < ఇచ్చినవాడు < ఇచ్చినవాణ్డు) వంటి మాండలిక  ప్రయోగాలు తిక్కన నాటికి కావ్య గౌరవం పొందాయి.  అంటే ఒకనాటి వ్యవహారిక భాషా ప్రయోగాలు మరో నాటికి కావ్యభాషలో భాగాలయ్యాయన్నమాట. ఒకటి, రెండు శతాబ్దాలు ప్రజల నాలుకల్లో నలుగుడు పడ్డ  వాడుక భాషా ప్రయోగాలు ఆ తరువాత గ్రాంథిక భాషలో ఆమోద యోగ్యాలయ్యాయని నా అభిప్రాయం. పండితుల పట్టుదల వల్ల, లాక్షణీకుల వ్యాకరణ సూత్రాల వల్ల గ్రాంథిక భాష కొంత జడత్వం చూపినా, “ప్రాఁతవడ్డ మాటలను” పరిహరించడంలో, కొత్త మాటలను, ప్రయోగాలను ఉపయోగించడంలో నన్నయ్య, తిక్కనల నుండి విశ్వనాథ వరకూ, మహాకవులెవ్వరూ సందేహించలేదని నాకనిపిస్తుంది. మీరేమంటారు?

రిగార్డులతో,

సురేశ్.

“నేనొక పూలమొక్కకడ నిల్చి …” పద్య భావాన్ని నన్నయ్య భాషలోకి ఎవరైనా అనువాదం చేసి రాస్తే చూడాలని ఉంది. నా శుష్క ప్రయత్నం:

అడవికిఁ బువ్వులు దేరఁగ

వడినరిగిన నన్నుఁజూచి వారిజ(?) కాంతల్

పొడవుఁ సెడఁ ద్రుంచి వగవక

జడముడిఁ వడలింతురనుచు శోకింపంగన్

(నన్నయ్య భాషలో పొడవు=రూపము; వగవక=ఆలోచింపక)

by: vaidehi sasidhar
చాలా మంచి వ్యాసం!!ఒకటికి రెండు సార్లు చదివించిన వ్యాసం!!వ్యవహార భాష లో పద్యరచన గురించి చక్కని విశ్లేషణ తో సరళంగా రచయిత ప్రధానాంశాన్ని ప్రతిపాదించారు.ముఖ్యం గా విశ్వనాధ వారి కల్పవృక్షంలోని వ్యవహారభాషా సౌందర్యాన్ని,నుడికారాన్ని చాలా ఆసక్తి దాయకంగా వివరించారు.

వచన కవిత్వం లో ఎక్కువ ధార లేక పోవటానికి రచయిత చెప్పినట్లు తమకు ధారతో అవసరం లేదని వచనకవులు అనుకోవటం ఒక కారణమైతే ఏ నిర్మాణ చట్రపు సౌలభ్యం (చందస్సు,వృత్తాల ద్వారా వచ్చే ఓ సహజ సౌందర్యమైన నడక) లేకపోవటం మరోకారణమేమో అనిపిస్తుంది.ఈ క్లిష్టత వల్ల చక్కని ధార కలిగిన వచన కవిత రాయటం పూర్తిగా కవి ప్రతిభ,భావనాశక్తి,భావావేశం  మీద ఆధారపడుతుందేమో !!!

నాకు పరిచయమున్న స్వల్ప సాహిత్యం లో వచనకవిత్వం అంతటి ధారతో వ్రాసిన కవులలో ప్రముఖులు శ్రీ tilak. వారి “నువ్వు లేవు, నీ పాట ఉంది” కవిత ఒక గొప్ప కళాకారుడు తాదాత్మ్యం తో ఏకబిగిన ఊదిన వేణువు పాట లా సాగుతుంది,ఏ మాత్రం (మాత్రా)  ఛందస్సు సహాయం (కూడా) లేకుండా!! (teluguone.com లో నువ్వు లేవు, నీ పాట ఉంది).

చక్కని వ్యాసాన్ని అందించారు!! ధన్యవాదాలు!!!

by: రానారె
రామాయణ కల్పవృక్షం నాలాంటి పామరుడు కూడా ఆస్వాదించేలా ఇంత బాగుంటుందని తెలిపినందుకు కృకజ్ఞతలు. తెలుగు వికీపీడియాలోకి ఆంధ్రమహాభారతాన్ని యూనీకోడీకరిస్తూ దాదాపు 500 పద్యాలు మూలగ్రంథ ప్రతి చూసి రాసివుంటాను. కొన్నిపద్యాలు రాశాక ఒకో పద్యాన్ని అర్థంచేసుకోవడం సులభమవుతూవచ్చింది. సందర్భాన్నిబట్టి ఒకో సన్నివేశాన్ని కళ్లకుకట్టే ఆ పద్యకర్తల చాతుర్యానికి అబ్బురపడే అదృష్టం అలా దక్కింది. ఇక ఈ వ్యాసం చదివాక విశ్వనాథవారి కావ్యం చదవాలనిపిస్తూంది. మీరుదహరించిన కాళ్లకూరివారి చింతామణి నాటకంలో సుబ్బిశెట్టిపాత్ర చెప్పే పద్యం చూసి ‘ఆహా’ అని ఆనందంతో పైకే అనేశాను. ఇక నాకు ఒక సందేహం -తెలుగు నుడికారమనేది సామెతలు, జాతీయాలు, అలంకారాలకుమల్లే ఒక ప్రత్యేకాంశమా?

by: Srinivas Nagulapalli
మిత్రులు శ్రీ కామేశ్వరరావుగారి వ్యాసం చదివి చాలా ఆనందించాను.

పద్య నిర్మాణంలోని లోతులను వాడుక భాషా ప్రయోగంలో ఉన్న క్లిష్టతలను సవివరంగా సోదాహరణంగా సమర్థవంతంగా చదివింపజేసేలా

వ్రాసినందుకు, ప్రచురించిన “ఈమాట” సంపాదక వర్గానికీ  కృతఙ్ఞతాపూర్వక నమస్సులు. అయితే ఇటువంటివి మీ కలంనుంచి ఇంకా వెలువడాలని ఆశిస్తాను.

విధేయుడు

శ్రీనివాస్ నాగులపల్లి

by: Subrahmanyam Mula
చాలా మంచి వ్యాసం….