ఈమాట » ఉద్యోగం

Expand to right
Expand to left

ఉద్యోగం

ఆ సాయంత్రం. అందరూ ఇంటికి వెళ్ళే వేళ అయింది. డాన్, నిసీ షామల్ దగ్గరకు వచ్చి “నేను ఇంటికి పోబోతున్నా. నీకు ఇంకేమన్నా కావాల్సినవి ఉన్నయ్యా ” అని అడిగింది.

ఏం లేదంది నిసీ.

ఇంకా దగ్గరకు వచ్చి డాన్ “డాక్టర్ బ్రాఫ్ నిన్ను చూడాలని అడుగుతున్నాడు. నేనేమో, నువ్వు రేపు వాషింగ్టన్ లో లెక్చర్ ఇవ్వాలి. తొందరగ ఇంటికి వెళ్ళక పోతే ప్లేన్ మిస్సవుతావ”ని చెప్పానంది.

ఆమె కళ్ళు -చూడమాకు నిసీ. నువ్వెందుకు చూడాలి . ఆ పాల్ ని ఇంత చేశాక - అంటున్నాయి.

నిసీకి నవ్వొచ్చింది ఆమె కోపాన్ని చూసి. ఈ పిల్లకెందుకూ తన మీద ఇంత ప్రేమ. ఈ కుర్ర పిల్లకున్న విశ్వాసం తోటి డాక్టర్లకు లేక పోయింది గదా అనుకుంది.

“రానివ్వమ్మా తల్లీ! అతని పెళ్ళానికి ప్రోబ్లమ్ ఏమైనా ఉందని తెలిసిందేమో. ”

డాన్ కళ్ళల్లో కసి తీరిన తృప్తి. ఆనందం. ఆమెకు గూఢచారులన్నిచోట్లా ఉన్నారు. పాల్ బ్రాఫ్ పెళ్ళాం మరిస్సా బ్రాఫ్ కి మళ్ళీ ఎక్స్ రేలు తియ్యటం అయిపోయింది. నిసీ చెప్పిందే రైటు. కాన్సర్ లేదూ పాడూ లేదు.

“సరే డాక్టర్ షామల్. నేను పోతూ పోతూ, నువ్వు రమ్మన్నావని డాక్టర్. బ్రాఫ్ తో చెప్పి పోతాలే. నీ స్లైడుల బాక్స్, అదిగో అక్కడ ఉంది ” అని చెప్పి వెళ్ళి పోయింది.

కొంచెంసేపట్లో పాల్ చేతిలో ఒక ఛాకలెట్ బాక్సు తో ఆఫీసులోకి వచ్చాడు. కొంచెం సిగ్గుపడుతూ అది నిసీకు అందించాడు. ఆమె అది వెనక బల్ల మీద పెట్టి బల్ల కానుకుని ఏం మాట్లాడకుండా నుంచుంది.

ఈసారి అతను కొంచెం సందేహిస్తూ, కొంచెం ధైర్యం చేసి , ఆమెను కావిలించుకుని రెండు బుగ్గల మీదా ముద్దులు పెట్టాడు.

“నువ్వు చెప్పిందే రైటు. కంగ్రాచ్యులేషన్స్ . చాలా థేంక్సు కూడా . మరిస్సా తర్వాత స్వయంగా వచ్చి నీకు ధన్యవాదాలు చెపుతుంది. మాకు చాలా ఆదుర్దా తప్పించావు. ”

నిసీ షామల్ ” రోజూ చేసే పనేగా పాల్ ! ఈ కేసులో ప్రత్యేకత ఏమి ఉందని? మీ దిగులు తీరినందుకు సంతోషం. నే వెళ్ళాలోయ్!” అని ఏ సమాధానానికి సందివ్వకుండా తన వస్తువులు తీసుకుని, తలెత్తుకుని దర్జాగా బైటికి నడిచింది.

ముందరి పేజీ(లు) 1 2 3 4 5
 

(6 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. ప్రసాద్ అభిప్రాయం:

    November 1, 2006 2:09 pm

    చాలా బాగుంది. మీరు డాక్టరై వుండాలి. ఇలాంటి వుద్యోగంలో సంక్షోభాల్ని దగ్గరుండి చూసినట్లుగా రాశారు. AIMS లో వేణుగోపాల్ గుర్తుకొచ్చారు.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. chavakiran అభిప్రాయం:

    November 2, 2006 8:04 pm

    చాలా బాగుంది

    మీరు డాక్టరు అని నాకు తెలుసు కదా:)

    ఒకవేళ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయితే ఎలా వ్రాసేవారు ?

  3. Sowmya అభిప్రాయం:

    November 3, 2006 2:12 am

    కథ వెరైటీ గా ఉంది కానీ…. ఎందుకో సడెన్ గా ముగిసిపోయినట్లు అనిపించింది.

    ఈమాట వారికి ఒక చిన్న విఙప్తి - ఇలా పెద్ద గా ఉన్న కథలను పేజీలు గా పెట్టొచ్చు కదా?
    అంటే - అందులో ఏమన్నా సమస్య లు ఉన్నవేమో నాకు తెలీదు కానీ…. ఎందుకో పేజీల్లో పెడితే బాగుండు అనిపించింది.

  4. Akkiraju Bhattiprolu అభిప్రాయం:

    November 6, 2006 4:24 am

    కథ, కథనం రెండూ బాగున్నాయి. కథ చదివాక నాకు కల్గిన ఆలోచనలు… విమర్శలు కావు..
    1. ఈ కథ తెలుగులో నే ఎందుకు రాయాలి? నాలాంటి వాడయితే ఇంగ్లీషు రాక అని టక్కున చెప్పచ్చు. ఇంగ్లీషు, తెలుగు రెండూ వచ్చిన వాళ్ళు దీన్ని ఏభాష లో రాయాలి? నా ఉద్దేశం ఏదో తప్పు జరిగిందని కాదు. ఇలాంటి కథని తెలుగులో రాయాలి అనే నిర్ణయానికి రావడానికి ఏ ప్రాతిపదిక అవసరం అని సందేహం. ఇందులో డాక్టరు ఇండియనే కానక్కర లేదు. రచయిత/త్రి ఇలాంటి విషయాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలీ అనే ఉద్దేశం ఒక్కటే నాకు స్ఫురిస్తోంది. అదే నిజమయితే, రచయిత్రి కి నా అభినందనలు… ఎన్ని కొత్త వస్తువులు తెలుగులోకి వస్తే తెలుగు సాహిత్యం అంత విస్తృత మవుతుంది.

    2. కథలో చాలా డ్రామా ఉంది. ఆ పాల్ భార్యకి ఆ సమస్య రాక పోయుంటే ఏమయ్యేది? అవసరమయిన కారెక్టర్లకి అవసర మయినప్పుడు అవసర మయిన జబ్బులు రావటం తెలుగు సినిమా టెక్నిక :) (ఇందులో తప్పేం లేదు… ఎంతో కొంత డ్రామా కథ నడిపించడానికి అవసరమే)

    అక్కిరాజు

  5. vaidehi sasidhar అభిప్రాయం:

    November 11, 2006 6:28 am

    రెసిడెన్సీ రోజుల్లోని Morbidity &Mortality conferences,Grand Rounds, ప్రతిభ ,అధికారం ముసుగులలో జరిగే ప్రచ్చన్న యుద్ధాలు వెరసి
    typical university hospital వాతావరణం మళ్ళీ గుర్తు చేసారు.బాగుంది.

  6. Rama Nalam అభిప్రాయం:

    December 3, 2006 8:06 am

    తెలుగు లొ చక్కని కథ వ్రాసారు. బాగుంది. మీకు thanks.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a