Comments on: తెలుగు సాహిత్యం లో విమర్శ

by: Veluri Venkateswara Rao
విప్లవ్ గారి ఒక అక్షేపణ చాలా సమంజసమైనదే అని ఒప్పుకోక తప్పదు. అది:  కేంబ్రిడ్జ్ లో క్రికెట్ ఆట గురించి బ్రాకెట్లలో  నేను చేర్చిన వాక్యం. ఆ వాక్యం అనవసరమైనదే! Guilty as charged!

అయితే, “కవిత్వతత్త్వవిచారము” లో నిండుగా ఉన్న అవహేళన, అపహాస్యాలతో పోల్చిచూస్తే నా పొరపాటు క్షమార్హమనే  అనుకుంటాను. అయినా తప్పు తప్పే! మరోసారి Guilty as charged.

మరొక విషయం: ఉమాకాంతంగారి పై మంచి విమర్శ-సమీక్ష ఇంతవరకూ రాకపోవడం క్షమార్హం కాదు. ఆ పని ఎవరైనా సహృదయులు తలపెడితే మంచిది.

అల్లాగే,  మార్క్సిస్టు దృక్పథం అన్న పేరుతో ప్రస్తుతం పత్రికల్లో వచ్చిన  సాహిత్య విమర్శలపై ఒక సమీక్షా వ్యాసం ఎవరైనా రాస్తే బాగుంటుందేమో!

And the field is open, I suppose!

అభివాదాలతో,

వేలూరి వేంకటేశ్వర రావు.

by: విప్లవ్
కామేశ్వరరావు గారూ మీరు చెప్పింది, నాకు అర్ధమైంది జోడించి నా ఆలోచన కొంత ఇక్కడ:

“విమర్శ సిద్ధాంతానికున్న విస్తృతి, పరిమితీ బట్టి అది ఎలాంటి కవిత్వానికి వర్తింపచెయ్యవచ్చు, ఎలాటి విశ్లేషణకి ఉపయోగించవచ్చు అన్న విషయం ఆధారపడి ఉంటుంది.  … ఇది దృష్టిలో ఉంచుకొని దానికి తగిన విశ్లేషణ చెయ్యడానికి, ఏ కవిత్వానికైనా, మార్క్సిస్టు విమర్శ పనికివస్తుంది.”

అంటే “విమర్శ” ఏ ప్రాతిపదిక పైన చేస్తున్నారో దానికి లోబడి ఉన్నంత వరకూ ఆ సిద్ధాంతాన్ని ఎటువంటి కవిత్వ (ప్రబంధాలనుండి దిగంబరాల దాకా, ఎటువంటి కవిత్వం అయినా..) ప్రక్రియ పైన అయినా ఉపయోగించ వచ్చు.. అని అర్ధం చేసుకుంటున్నాం.

వల్లంపాటి చెప్పిందీ ఇదే అనిపిస్తుంది.

మరోలా చెప్పాలంటే  “మార్క్సిస్టు విమర్శ” చేయతలచిన వాళ్ళు అలంకారాల వైపు, శైలి వైపు, శిల్పం వైపు దృష్టి పెట్టాలనుకోవటం అత్యాశే.

ఇక్కడొక చిన్న detour:

పై మాట దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఈ వ్యాసం తాను ఉదహరించిన కట్టమంచి చేసిన విమర్శ నేపధ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే తానూ (అంటే వేలూరి) అదే మూసలో చేసిన ప్రసంగ పాఠంలా తోచింది.

కట్టమంచి చేసిన విమర్శ ఒక కోవలోకి (satire కావచ్చు) వస్తే వేలూరి ప్రసంగం అదే దోవలోకి వస్తుంది.  satire (తెలుగు పదం నాకు తెలవదు) కూడా ఒక ఆర్టే.  దానిక్కావలసిన లక్షణాలు చూపెట్టి కట్టమంచి వారి విమర్శ ఎందుకు ఫెయిలయిందో చెబితే వేలూరి గారన్న ప్రయోజనం  {“అపూర్వకథాసంవిధాన వైచిత్రి, శృంగార ప్రాయత, పుణ్యవస్తు వర్ణనాకర్ణనీయత. “ఇవి సాధించాడా లేదా అన్నది ప్రప్రధమంగా ఏ విమర్శకుడైనా చూడాలి.} నెరవేరేది.

వేలూరివారి ప్రసంగం కూడా {అవహేళన, అపహాస్యం!} అదే లక్షణాలు కలిగిందిగా కనిపించే అవకాశం ఎక్కువ {ఉదా: (కేంబ్రిడ్జ్ లో క్రికెట్ గురించి చెప్పి పొగడడానికి రెడ్డిగారికి ఇక్కడ అవకాశం దొరకలేదు కాబోలు!)}.  అది ఆయన రాతలనెరిగిన వారు (his writing style) ఆయన లెవెలుకు సరిపోయే రీతిలో వాతలు పెట్టారా లేదా అన్నది తేల్చగలరు.

ప్రబంధాలను ఒక రకమైన విమర్శా పరిధినుండి మినహాయించమంటే అది కుదరని పని; ఆ విమర్శ సహేతుకమా కాదా అన్నది ఆ విమర్శ కే చెందిన లక్షణాలను బట్టి ఉంటుంది అన్నవిశయం పైన మార్క్సిస్టు విమర్శ పరిధి నుండి తెలుసుకున్నాం.

వేలూరి గారు చేసిన విమర్శ మీద నాకు complaint లేదు.  దానికున్న పరిధిలో ఆయన చెప్పింది చేసారా లేదా అన్నదే కావాలి.  On the space that he provided, he may have criticized CR Reddy but he seemed to have taken off off from the same origin.  That truly in my opinion is a meeting place for a contradiction.  It is full circle that way & this is a good writing for that reason.  Had he written in any other way (without the satirical element, he would have fallen flat).

end of detour.

మళ్ళీ మొదటికొస్తే:

వేలూరి రాసింది:

కళాపూర్ణోదయ కావ్య రచనలో సూరన్న మూడు ప్రధాన లక్షణాలు సాధిస్తానని ముందుగా అన్నాడు. ఇవీ ఆ లక్షణాలు: “అపూర్వకథాసంవిధాన వైచిత్రి, శృంగార ప్రాయత, పుణ్యవస్తు వర్ణనాకర్ణనీయత. “ఇవి సాధించాడా లేదా అన్నది ప్రప్రధమంగా ఏ విమర్శకుడైనా చూడాలి.

ఒక రచయిత లేక కవి తన ఉద్దేశం ముందే చెప్పి ఈ పరిధిలోనే నా కృతిని విమర్శించండి అనడం కరెక్టేనా?  నా మటుకు నేను ఒక చెట్టును వేస్ట్ చేయటం, కొన్ని ఠావులు ఖరాబు చెయ్యటం మాత్రమే నా రచనల లక్షణం,  అంతవరకే ఏ విమర్శకుడైనా పరిమితం కావాలి అని ఇప్పటినుండీ ఒక  disclaimer తగిలించాలిక.

విప్లవ్

by: Kameswara Rao
విప్లవ్ గారు మంచి ప్రశ్నే వేసారు. విమర్శ సిద్ధాంతానికున్న విస్తృతి, పరిమితీ బట్టి అది ఎలాంటి కవిత్వానికి వర్తింపచెయ్యవచ్చు, ఎలాటి విశ్లేషణకి ఉపయోగించవచ్చు అన్న విషయం ఆధారపడి ఉంటుంది. కాలంతో పెద్ద సంబంధం లేదు. మార్క్సిస్టు విమర్శ నాజు తెలిసీ కవిత్వ ఆవిర్భావానికి వెనకనున్న సామాజిక పరిస్థితులు, దాని ప్రభావమూ విశ్లేషించడానికి ఉపయోగపడినంతగా కవిత్వాన్ని విలువకట్టడానికి ఉపయోగపడదు. ఇది దృష్టిలో ఉంచుకొని దానికి తగిన విశ్లేషణ చెయ్యడానికి, ఏ కవిత్వానికైనా, మార్క్సిస్టు విమర్శ పనికివస్తుంది. దీనిని వల్లంపాటివారు “విమర్శా శిల్పం”లో చక్కగా వివరించారు:

“ఉదాహరణకు మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం సాహిత్య వస్తువుకూ, సమాజానికీ ఉన్న సంబంధాన్ని నిర్వచించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వస్తువుకూ రచయిత అంతరంగానికీ ఉన్న సంబంధాన్ని తీవ్రంగా పట్టించుకోదు. అలాగే ఆ వస్తువుకు రచయిత ఇచ్చిన రూపాన్ని విశ్లేషించటానికి మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం తగిన కొలబద్దలను ి రూపొందించలేదు. శిల్పాన్ని గురించీ, శైలిని గురించీ శాస్త్రీయమైన విశ్లేషణ చేయటానికి కూడా ఇది ప్రయత్నించదు. ప్రక్రియలు మారినప్పుడు సాహిత్య వస్తువు తీసుకొనే విభిన్న రూపాలను గురించి కూడా మార్క్సిస్టు సిద్ధాంతం దాదాపు నిశ్శబ్దంగానే ఉంటుంది. కానీ సాహిత్య ప్రక్రియల పుట్టుకకూ, అవి పుట్టిన సామాజిక సందర్భాలకూ మధ్య ఉన్న సంబంధాన్ని లేదా వైరుధ్యాన్ని మార్క్సిస్టు సాహిత్య విమర్శ మాత్రమే వివరించగలదు. శైలీ, దృష్టికోణం, కంఠస్వరం, పదచిత్రాలు, కవిత్వ ఛందస్సు మొదలైన శిల్పాంశాల విశ్లేషణకు ప్రత్యేకంగా మార్క్సిస్టు సాహిత్య దృక్పథం అంటూ ఏమీ లేదు. మార్క్సిస్టు సాహిత్య విమర్శకున్న బలమూ, బలహీనతా కూడా పునాదీ - ఉపరితలమూ సిద్ధాంతమే. ఈ సిద్ధాంతం యొక్క పరిమితుల్ని అర్థం చేసుకొని ఉపయోగిస్తే ఇది సాహిత్య వస్తువుకూ, ప్రక్రియకూ చెందిన ఎన్నీ చిక్కుముడుల్ని విప్పగలుగుతుంది. ఆర్థిక నియతి వాదాన్ని దుర్వినియోగం చేస్తే ముతక సిద్ధాంతంగా తయారౌతుంది.”

by: Srinivas Nagulapalli
ఉమాకాంతం గారి “నేటి కాలపు కవిత్వం” చదివిన తరువాత నాకైతే అతనికి ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము లోపించాయని అనిపించలేదు. మరి కృష్ణశాస్త్రిగారికి అనిపించింది. ఏది నిజం ఏది కాదు అంటే ఎవరు చెప్పాలి? అయినా ఇవి కావేమో విమర్శకుడికి ఉండల్సిన ముఖ్యార్హతలు.

ఆర్ద్ర దృష్టి కవితా హృదయము కన్నా వేలూరి గారన్నట్లు నిష్పక్షపాత దృష్టి, నిజాయితీ హృదయమే విమర్శకు ఎక్కువగా కావలసిన సామగ్రి అనుకుంటాను.

చదవగానే వినగానే మైమరిచి కరిగిపోయే ఆర్ద్రదృష్టి, భావాల వెల్లువలో తూలిపోయే కవితా హృదయం, భావ సమాధికి తన్మయత్వానికి సాయపడుతాయి కాని, పలు దృక్కోణాలనుంచి సమగ్రంగా అవగాహన పొందడానికి, సంయమనంతో విశేషంగా విశ్లేషించడానికి సాయపడడం కన్నా, అవి కొంత అడ్డుగానే నిలబడతాయని అనుకుంటాను.

రచనలు పలు రకాలైనప్పుడు విమర్శలు కూడా పలు రకాలుగా ఉండడం సహజమూ అనివార్యమూ కూడా. అయితే రకాలు ఎన్నైనా, విషయం పాఠకునికి అందించడమే రచనలన్నింటి ఉద్దేశం. ఆ ఒక్కటి నెరవేర్చడంలోనే ఎన్నో ప్రక్రియలు, మార్గాలు, వైవిధ్యాలూ, సొగసులు, సృజనాత్మకమైన ప్రయోగాలు అన్నీనూ.

అట్లే విమర్శలు ఎన్నో రకాలున్నా విమర్శించే రచన గురించి విశేషమైన అవగాహనను అందించే వరకూ అవి అన్నీ విమర్శలే, ఖచ్చితంగా. అయితే విశేషమైన అవగాహన కలిగించడం సుళువైన పని కాదు, కొన్ని సార్లు రచన కన్నా కష్టతరమైనది కూడా.

మరి సమగ్ర విమర్శకు ఏమి కావాలి ? విమర్శకునికి రచనలో ఉన్న లోతులను చూసే నిశితమైన దృష్టి, అది వ్యక్తపరచే భావాలను అందుకునే హృదయ వైశాల్యం, సోంత ఇష్ట అయిష్టాలకు అందనట్టి ఎత్తులో ఉన్న నిష్పక్షపాతం - ఇవ్వన్నీ ఉంటేనే సమగ్రమైన అవగాహన పొందడానికి కానీ, ఇతరులకు అందించడానికి కాని సాధ్యం కాదనుకుంటాను. ఇక అవగాహన పెరుగే కొద్దీ విమర్శ యొక్క అభివ్యక్తీకరణలో స్పష్టత, క్లుప్తత వస్తుంది, సహజంగా. సూటిదనం కూడా ఉండి పాఠకున్ని విసిగించదు.

మరి విమర్శ చేయడానికి ప్రేరణ, శిక్షణ అవసరమా అంటే తప్పకుండా అవసరమే. అయితే ప్రేరణ అందుకునేదే కాని అందించేది కాదు. ఇక శిక్షణా పద్ధతులు మాత్రం చర్చనీయాంశం.

చివరగా ఒక్క మాట. తెలుగు భాష యొక్క వెలుగే తగ్గుతున్న రోజుల్లో తెలుగు సాహిత్యం పై చేసే విమర్శలో శిక్షణకు ఎంత priority ఉందో, ఉండాలో తెలియదు. తెల్లటి బట్టపై చిన్న మరక పడితే వేలెత్తి చూపిస్తారు కాని, పూర్తిగా మాయకపోయినా తెలె తెల బోయే బట్టపై మరకలను ఎవరు వెతికి చూపిస్తారు! రచనలు ఎక్కువగా నిస్సారమైనప్పుడు గొప్ప విమర్శలు మాత్రం ఎక్కడినుంచి వస్తాయి అని అనుకుంటాను.

విధేయుడు

-Srinivas

by: విప్లవ్
వేలూరి గారు రెండు ఉద్దేశాలు చెప్పారు మొదట్లోనే, అందులో ఒకటి:

“సాహిత్య విమర్శలో ఈ పక్షపాతం అనావశ్యకమైన ఆవేశం గా మారితే, ఆ విమర్శ ల వల్ల సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ వచ్చే నష్టాల వివరణ ఈ ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.”

ఇందులో కొంతైనా నెరవేరినట్టుంది.  ఆయన రెండవ ముఖ్యోద్దేశం గా చెప్పినది (”ఈ స్థితినుంచి తేరుకోవడానికి (విముక్తికి) మార్గాలేమయినా ఉన్నాయా”) కొద్దిగా నైనా జరగాలంటే పై మొదటిది విమర్శకులు దాటుకుని వెళ్ళాలి.

నాకు చాలా డౌట్లు ఉన్నయి, వాటికి తొందర లేదు.

కామేశ్వర రావు గారన్న మాట:

“రకరకాల కవిత్వాలకి ఒకే విమర్శసిద్ధాంతాన్ని వర్తింపచెయ్యడం తప్పు.”

ఈ మాట మీద కొంచెం వివరణ అవసరం అనుకుంటాను.  నా ప్రశ్న: మనం మార్క్సిస్టు విమర్శ అనే సిద్ధాంతకోణం లోనించి ఒక శతాబ్దం లేక దశాబ్దం లో వచ్చిన సాహిత్యాన్ని critic చేయటం తప్పంటారా?  (”మార్కిస్టు విమర్శ” మీద అభ్యంతరాలు ఉంటే దాని బదులు మోరలిస్ట్ విమర్శ కాకపోతే మరొకటి అనుకోండి ఇప్పటి మటుకు).

విప్లవ్

by: Alok Vastav
కామేశ్వరరావు గారు పొరబడ్డారు.అక్కిరాజుగారు తమ గ్రంధంలో ఎక్కడా “ఇది నా అభిప్రాయం, “ఈ కవిత నా అభిప్రాయానికి అనుగుణంగా లేదు”, “లేదు కాబట్టి ఇది కవిత గాదు” అని ఎక్కడా అనలేదు.అల్లా అనడం బుద్ధితక్కువదనమని మనకే తెలిసినపుడు వ్యాకరణ, తర్క నిష్ణాతుడైన ఆయనకు తెలియకపోవడమేంటి?

తాను మండన జేసిన ప్రతి సిద్ధాంతానికీ వేద, పురాణ, ఇతిహాస, అలంకారశాస్త్రం వంటి ప్రామాణికగ్రంధాలను ఉదహరించారు.అక్కడే కట్టమంచివారికీ అక్కిరాజుగారికీ తేడా కనపడేది. ఎవరైతే ప్రత్యక్ష, అనుమాన, ఆగమాలను వాడకండా వాదిస్తాడో అది సిద్ధాంతమవదు రాద్ధాంతమౌతుంది.

అల్లా ప్రామాణికంగా రాసిన విమర్శని నిరుపయోగమైన సెంటిమెంటులతో తోసిపుచ్చడం పరిణితి చెందని మనసులకే సాధ్యం.

by: Kameswara Rao
ఇక్కడ కృష్ణశాస్త్రిగారన్న “ఆర్ద్రత”, “కవితాహృదయం” అన్న పదాలని కొంత స్పష్టపరచాలి. వేలూరి వారీ వ్యాసంలో చెప్పినట్టు, రకరకాల కవిత్వాలకి ఒకే విమర్శసిద్ధాంతాన్ని వర్తింపచెయ్యడం తప్పు. ఒకో రకం కవిత్వానికి ఒకో రకమైన రూపం, వస్తువు, పాఠకవర్గం, ప్రత్యేక ప్రయోజనాలూ ఉంటయి. వాటికి తగట్టు ఆ కవిత్వానికి ప్రమాణాలు ఏర్పడతాయి. వాటిని అర్థం చేసికొని దానికి తగినట్టు విమర్శ చేస్తే అది సహృదయ విమర్శ అనిపించుకుంటుంది. లేకపోతే, ఎంత మంది ఎంతగా ఇష్టపడితే నాకేంటి, నేను మెచ్చిందే కవిత్వం అన్నట్టుంటుంది. సహృదయ విమర్శ అంటే ఊరికే రాసిన వాళ్ళను పొగడటం కాదు. వాళ్ళ కవిత్వాన్ని సరిగా అంచనా వేసి (పైన పేర్కొన్నట్టు), దానికి తగట్టు విమర్శించడం. అక్కిరాజు వారీ పని చెయ్యలేకపోయారు.

by: Alok Vastav
వేలూరిగారూ, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు తెలిసేవుంటుంది.ఐనా వుదహరిస్తాను.ఉమాకాంతంగారు గురజాడవారిని మద్రాసు నగరంలో కలిసినప్పుడు జయంతిరామయ్య మొదలైనవారి గ్రాంధికభాషా సమర్థనను ప్రస్తావిస్తూ అక్కిరాజుగారు గ్రాంధికభాషను సమర్ధించారు.ఐతే అందుకు సమాధానంగా గురజాడ “వారు పెద్దవారు అంచేత వారికి నా వాదన అర్థంకాలేదు.మీరు యువకులు మీకూ అర్థమవడంలేదు” అని చెప్పారు.వెనక్కి వచ్చిన ఉమాకాంతంగారు మరి యేమీ ఆలోచించక తమ గ్రంధాన్ని వ్యావహారికంలోనే రాసారు. ఉమాకాంతంగారి సున్నితత్వం కూడా కృష్ణశాస్త్రిగారంత సున్నితమే.

తల్లికి బిడ్డడి మీద వున్నట్టుగానే కవులకు తాము రాసిన రాతల పట్ల మమకారం వుండడం అత్యంత సహజం.ఎవరైనా బిడ్డని అనాకారియని తిట్టితే తల్లికి ఖేదమవడంలో సహజత వుంది. గానీ ఎవరైనా బిడ్డని దుష్టుడని నింద వేస్తే తల్లి కోపగించక ఆరోపణలోని నిజానిజాలను విచారించుకోవాలి. బిడ్డ నిజంగానే దుష్టుడైతే ఆ ఆరోపణ జేసిన వ్యక్తికి కృతజ్ఞత తెలియజెప్పాలి. అంతేగానీ గుడ్డినమ్మికతో ఆరోపించిన వ్యక్తిని నిందించడమో, ఆ ఆరోపణను తృణీకరించడమో జేస్తే అది ఆత్మహత్యాసదృశమే. కట్టమంచివారు మొదటి చర్యకు పాల్పడితే, ఉమాకాంతం గారు రెండవదాన్ని జేసారు. అనగా కృతులలోని దుష్టాలను ఖండించారు. రూపాన్ని అవహేళన జేయడం నీచమేగానీ గుణ లోపాలను ఎత్తి చూపడం నేరం గాదు. అంచాత అక్కిరాజుపైని అక్కసు అర్థరహితం. అక్కిరాజుగారికి అర్ర్ద హృదయం కొరవడలేదుగానీ కవులకు అర్థజ్ఞానం కొరవడిందన్నది నిర్వివాదం.

by: Rohiniprasad
విమర్శల్లో తెగనాడినవి గుర్తున్నంతగా తక్కినవి గుర్తుండవేమో! తెలుగులో మంచి విమర్శలు చాలానే వెలువడ్డాయి. కాని వేలూరివారు చెప్పినట్టుగా కొన్ని విమర్శల ద్వారా రచన గురించే కాక విమర్శకుడి సంగతి కూడా మనకు తెలుస్తుంది.

పాత సాహిత్యంలో “అమలినం” కాని శృంగారాన్ని పద్ధెనిమిదో శతాబ్దం నుంచీ విమర్శకులు ఈసడించుకోవడం కనిపిస్తుంది. ఆ తరవాతి కాలంలో కూడా ముద్దుపళనివంటివారి రచనలు తీవ్ర విమర్శకు లోనవడం గురించి ఆరుద్ర ప్రస్తావించారు. వాటిలో కొన్ని శృంగారాన్ని గురించిన స్త్రీల దృక్పథాన్ని తెలుపుతాయనీ, వాటిని తరవాతి కాలంలో అణచకుండా ఉన్నట్టయితే అదొక ఆధునిక స్త్రీవాద సాహిత్యానికి దారి తీసి ఉండగలదనీ ఆయన భావించారు.

వ్యాసంలో ప్రస్తావించిన రచనలోనే కృష్ణశాస్త్రిగారు తనకన్నా సీనియర్లనూ, జూనియర్లనూ కూడా పేర్కొంటూ, విమర్శ కాకపోయినా సమీక్ష చేశారు. కె.వి.రమణారెడ్డి అనేకుల రచనలను వివరంగా విమర్శించారు. “ఋణ” దృక్పథంతో చేసిన విమర్శల్లో రాచమల్లు రామచంద్రారెడ్డిగారు దిగంబర కవులను గురించి రాసినది కూడా ఒకటి. త్రిపురనేని మధుసూదనరావు విశ్వనాథ రచనలను విశ్లేషించి మరీ చెండాడాడు.

ఈ మధ్య ద్వానాశాస్త్రి తదితరులు విప్లవ, స్త్రీ వాద, దళితవాద, మైనారిటీ వాద రచనలను సహృదయతతో విమర్శ చేస్తున్నారు. ఇవి అంతగా గుర్తుండకపోవటానికి కారణం ఇవన్నీ దిన, వార, మాసపత్రికల్లో ఏదో ఒక మూల కాస్తకాస్తగా కనిపిస్తూ ఉండడమే. సాహిత్యానికే దిక్కులేని ఈ రోజుల్లో విమర్శలను పట్టించుకునేవారే తక్కువ.

మంచి సాహిత్యాన్నిగాని, ఉన్న సాహిత్యంలో మంచినిగాని పరిచయం చేస్తే అది కూడా ఉపయోగకరమే. 1969లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వెల్చేరు నారాయణరావుగారు వెన్నెల రాత్రి వేళ హాస్టలు డాబామీద తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితను విద్యార్థులకు చదివి వినిపించడం గుర్తుంది.

విమర్శకులూ, సమీక్షకులూ సామాన్య పాఠకులకన్నా కాస్త లోతుగా పరిశీలించి, రచనలను గురించి వ్యాఖ్యానం చేస్తారు కనక సాహిత్యాభిమానులకు అది ఉపయోగపడుతుంది. అయితే వారికి కూడా తప్పనిసరిగా కొన్ని పరిమితులుంటాయి. వేలూరివారి వ్యాసంవల్ల నాకు అర్థమయినదిదే.

by: Veluri Venkateswara Rao
Alok Vastav గారు కృష్ణశాస్త్రి గారి మూల వ్యాసం చదివి ఉంటే, ఉమాపతి గారి గురించి నేను అన్నమాటలకి అక్షేపణ చేసేవారు కాదనుకొంటాను.

కృష్ణశాస్త్రి గారి “పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము” అన్న 1948 భారతి పత్రికలోని వ్యాసం 1923 నుంచి 1948 వరకూ వచ్చిన కవిత్వంపై, నాటి కవితా ఉద్యమాలపై చక్కని విమర్శనా వ్యాసం అని నిస్సంశయంగా చెప్పవచ్చు.

ఓరియంట్ లాంగ్మన్ వారు 1993 లో ప్రచురించిన “అప్పుడే పుట్టి ఉంటే” అన్న కృష్ణశాస్త్రి గారి వ్యాస సంపుటి లో ఈ వ్యాసం తిరిగి అచ్చయ్యింది. 1/8 డెమీ సైజులో 34 పేజీల సుదీర్ఘ వ్యాసం ఇది.   ఆ వ్యాసంనుంచి ఈ కింది వాక్యాలు (చూ: 29 వ పేజీ):

“… కృష్ణపక్షం ప్రచురించాను. స్ఫుటంగా నా మనస్సులో నాటుకొపోయిన మరి రెండు మూడు ఘట్టాలు ఉన్నాయి. 1925 లో నేమో అక్కిరాజు ఉమాకాంతం గారు వ్రాసిన “నేటి కాలపు కవిత్వము” అనే గ్రంథం వచ్చింది. ఆశనిపాతమంత తీవ్రధాటితో వచ్చింది. రాకేం జేస్తుంది? ఎప్పుడయితే నిజమైన ఒక ఉద్యమం బయలుదేరిందో, అప్పుడే దాని గుణదోషవిమర్శన కూడా వస్తుంది. ఆయన తీవ్ర విమర్శననుంచి నావంటి కవులు నేర్చుకోవలసినది లేకపోనూ లేదు; కాని కొంత ఆర్ద్ర దృష్టితో కవితాహృదయముతో ఆ విమర్శన సాగితే, నేటికాలపు కవిత్వంలో వారు చక్కదనమూ కవిత్వగుణమూ గ్రహించి ఉండేవారు. ఊపిరాడనీయనంత కోపంతో ఆ గ్రంథం దాడిచేసినట్లనిపించింది నావంటి వారికి. దానికి జవాబు వ్రాద్దామా అన్నారు కొందరు మిత్రులు. ఏమి జవాబు మేము వ్రాయగలం? కొత్త పద్యాలు వ్రాయడమే జవాబనిపించింది. వ్రాయకుండా ఎలాగుండగలం? ఈ సంకల్పం 1925 లో మదరాసులో మరీ దృఢపడింది.”

ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము ఉమాకాంతపండితులకు లోపించిందని ఇంతకన్నా మృదువుగా, కృష్ణశాస్త్రిగారి కన్నా చక్కగా ఇంకెవరు చెప్పగలరు?

అభివాదాలతో,

వేలూరి వేంకటేశ్వర రావు.

by: Ananth B. Shastry
మీ వ్యాసం కాస్త ఓపిగ్గా చదవ వలసి వచ్చింది.

సుమారుగా 100 ఏళ్ళ క్రితం వ్రాసిన విమర్శ గురించి సోదాహరణంగా విపరీతంగా చర్చించారు. 40/50 ఏళ్ళ క్రితం వ్రాయబడ్డ (నాకు ఉమాకాంతం గారు ఏ సంవత్సరంలో వ్రాసారో గుర్తులేదు) విమర్శ గురించి ఒక్క ముక్క చెప్పి, దానిపై మీ అభిప్రాయం వ్రాసారు.  ప్రస్తుత విమర్శనా ధోరణి పై మీ అభిప్రాయాల్ని  వెలిబుచ్చారు. అంత వరకూ బాగుంది. కాని, కొత్త విమర్శలకు ఉదారణలు ఇచ్చి ఉండవలసింది. కనీసం నలుగురి పేర్లు, వారి రచనల పేర్లిచ్చినా బాగుండేది.

విమర్శ ఎలా ఉండకూడదో చెప్పారు బాగానే ఉంది. ఎలా ఉండాలో చెప్పే విమర్శలు తెలుగులో లేవనుకోవాలా? అనే సంశయాన్ని కలిగించారు. మంచి విమర్శల గురించి కనీస ప్రస్తావన చేస్తే బాగుండేది.

వ్యాసంలో ఋణ విద్యుచ్ఛక్తి దండిగా ఉంది. మీ ఆశయం దాన్ని చదువరులకు తెలియజెప్పడం కాదు గదా!  వారి దృష్టి ధనాత్మకత వైపు మళ్ళించడానికి అది ఒక వేదిక మాత్రమే.

ఇది ఒక సాహితీ సభలో కీలకోపన్యాసంగా ఇవ్వబడిందని చెప్పుకున్నారు గాబట్టి ఒక మనవి. కీలకోపన్యాసాలు ఋణాత్మకంగా మొదలవడంలో తప్పులేదుగాని, ఉపన్యాసం పూర్తయేసరికి ధనాత్మకత హృదయాల్లో ప్రతిష్ఠించాలి. ఈ వ్యాసం ఆ పని చెయ్యగలదని అనిపించలేదు నాకు.

పైన చెప్పిందంతా కేవలం నాకొక్కడికే అనిపిస్తే అది నాలోపమే.

విధేయుడు

అనంత్

by: Alok Vastav
అక్కిరాజు ఉమాకాంతం గారిది హద్దుమీరిన అవహేళన అన్న మీ మాటలు అంతగా నచ్చలేదు. యే కొంచెం సూటిగావున్నా అది హద్దులు మీరిందనా కొలబద్ద? కట్టమంచివారికంటే అక్కిరాజుగారిలో నాకు నిజాయితీ, ఆవేదనా కనపడుతుంది. శ్రీశ్రీ మాటల బట్టి జూస్తే కవులకు అక్కిరాజుగారి పాండిత్య భయమేగానీ ఆయన ఆవేదన కనబడలేదులా వుంది. అంటే ఆయా కవులకి కవిత్వవీరత్వం, పాండిత్యభీరుత్వమని తీర్మానించవొచ్చుగదా! లేదూ ఆయన చేత విమర్శింపబడ్డవారందరూ కవిపండితులే అనుకొంటే ఆయన విమర్శలని దీటుగా ఎదుర్కొంటూ యేల గ్రంధాలు, వ్యాసాలు వెలయించలేదు? “ఆ మహాపండితుడి ఆక్షేపణలకు సమాధానమ ఎవరేం చెప్పగలరు? మరింత ఉత్సాహంతో, పట్టుదలతో నవ్యకవితారీతులను ప్రచారం చేయడమే ఆయనకు చెప్పగల సమాధానమని మేమనుకొన్నాం” అని కృష్ణశాస్త్రిగారు భారతి రజతోత్సవ సంచికలో రాసినట్టు శ్రీ పేర్వారం జగన్నాధం గారు రాసారు. “మేమనుకొన్నాం” అన్న పదం నాకెందుకో “మూక మనస్తత్త్వా”న్ని గుర్తుకుతెచ్చింది.వొక్క పండితుడి “అవహేళన”కి మూక ప్రచారం స్థాయిలో సమాధానమివ్వాలని అంతమంది కలిసి తీర్మానించడమే సాక్షి అక్కిరాజుగారిది అవహేళనతో కూడిన విమర్శ కాదని. సంపూర్ణంగా భారతీయతత్వ చింతనతో విమర్శించిన అక్కిరాజుగారిని కట్టమంచివారి సరసన కట్టివేయడం మనసుకి కష్టంగా వుంది.