తెలుగు నవలలో అస్తిత్వ వాదం
“తెలుగు నవలలో అస్తిత్వ వాదం”
అస్తిత్వ వాద (Existentialism) ప్రభావంతో రచనలు చేసిన బుచ్చిబాబు, నవీన్, ఆర్. ఎస్. సుదర్శనం, వడ్డెర చండీదాస్ గార్ల నవలను విశ్లేషిస్తూ అంపశయ్య నవీన్ గారు అట్లాంటాలో చేసిన ప్రసంగం ఇది.
[ఈ ఉపన్యాసం వినడానికి అడోబీ ఫ్లాష్ ప్లేయర్ (Adobe Flash Player) అవసరం. మీకు ఈ వ్యాసంలో కుడివైపున “ప్లే” బటన్ బొమ్మ కనిపించకపోతే, అడోబీ వారి డౌన్‌లోడ్ సెంటర్ నుండి ఫ్లాష్ ప్లేయర్ పొందవలసిందిగా మనవి. - సంపాదకులు.]

రచయిత అంపశయ్య నవీన్ గురించి: నవీన్ 1969 లో రాసిన అంపశయ్య ఒక క్లాసిక్. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత అయిన అంపశయ్య నవీన్ కథలు, విమర్శలు కూడ వ్రాసారు. ... పూర్తిగా »
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
September 1, 2006 11:24 pm
నవీన్ గారు తమ ప్రసంగ ప్రారంభంలో అస్తిత్వవాదాన్ని పరిచయం చేసి అది అమెరికా జీవితానికి ఎలా సరిపడుతుందో వివరించారు. అమెరికాలో సామాజిక నియమాలు, కట్టుబాట్లు పెద్దగా పనిచెయ్యవు, వ్యక్తి పూర్తిగా స్వతంత్రుడు, అనుకున్నది సాధించగలడు, భారతదేశపు సమాజం అందుకు విరుద్ధంగా ఉంది అని అభిప్రాయపడ్డారు.
అస్తిత్వవాది Sartre అన్న మాటలని - “మానవుడు సర్వ స్వతంత్రుడు. అంతేకాదు. మానవుడు స్వేచ్ఛా శాపగ్రస్తుడు. స్వతంత్రుడుగా తప్ప మరొకలా ఉండలేడు” - నవీన్ విపులీకరించారు.
నవీన్ గారు అమెరికా రావడం ఇదే మొదటిసారి. వారు ఇక్కడి జీవితాన్ని చూసి చేసిన వ్యాఖ్యానాన్ని విన్న వెంటనే నాకు Sartre ఏమనేవాడో అనే కుతూహలం కలిగింది. వెతికితే, 1946లో Sartre మొదటిసారి అమెరికా సందర్శించి రాసిన వ్యాసం కనబడింది. అది కొందరికన్నా ఆసక్తిదాయకంగా ఉండొచ్చని ఇస్తున్నాను.
కొడవళ్ళ హనుమంతరావు
R.Vasundhara Devi అభిప్రాయం:
November 15, 2006 6:16 pm
Sartre’s article is interesting. He stresses the New Culture/Old Culture perceptions of America of the early twentieth century. As he says, Americans continually attempt to escape “Americanism” and that activity is their existential ethos, their freedom to be. Just another way of expressing what Sri Naveen felt about America - his American experience. Right?