Comments on: నౌషాద్‌

by: Rohiniprasad
గీతాదత్ నౌషాద్ కు పాడలేదనడం సరికాదు. సన్ ఆఫ్ ఇండియాలో నౌషాద్ గీతాదత్ చేత ముఝే హుజూర్ అనే ఒక పాట పాడించాడు.

by: గుళ్లపూడి శ్రీనివాసకుమార్
నౌషాద్ అంటే హిందీ సినీ సంగీతానికి పర్యాయపదం అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఆయన జీవితంపై చక్కటి విశ్లేషణతో కూడిన అద్భుత వ్యాసరాజమిది. రచయిత నుంచి ఇలాంటి మరెన్నో వ్యాసాల కోసం ఎదురు చూస్తున్నాను.

by: C Rajendra prasad
సంగీతం మీద ఎంతో ప్రేమ,పట్టూ ఉంటే తప్ప ఇంత మంచి వ్యాసం రాయలేరు.హిందూస్థానీ సంగీతం గురించి,తెలుగు పాటల గురించి అథారిటేటివ్ గా రాయటం లో ,శైలి లో కొకు గారు కనిపిస్తున్నారు

by: Rohiniprasad
భవభూతిగారికి నా వ్యాసం నచ్చినందుకు సంతోషం. కానీ అందులో శంకర్ జైకిషన్ మంచి సంగీత దర్శకులు కాదని అనలేదు. రాజ్ కపూర్ సినిమాలు కాకపోయినా పూనమ్, కఠ్ పుత్లీ, రాజ్ హఠ్ మొదలైన పాత సినిమాల్లో వారి పాటలు అద్భుతంగా ఉన్నాయి.  ప్రజాదరణ పొందడానికి ప్రతిసారీ ఎక్కువ శ్రమపడనవసరం లేదని నిరూపించినది మాత్రం వారే. నౌషాద్ మాట కొస్తే అతని పాటలన్నీ హెవీగా ఉన్నాయనే అభిప్రాయం కలగడానికి కారణం క్లాసికల్ పాటలు ఎక్కువగా వినబడడమే కారణం కావచ్చు. దులారీ, దాస్తాన్ మొదలైన సినిమా పాటల్లో ఈ లక్షణాలు తక్కువే. ఏమైనప్పటికీ నౌషాద్ అందరికన్నా పాప్యులర్ సంగీత దర్శకుడని అనలేం. “నువ్వొక్కడంటేనే మాకు భయం” అని శంకర్ ఒక సందర్భంలో తనతో అన్నాడని నయ్యర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

by: BhavabhUti K
సాధికారంగా వ్రాసిన రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం చాలా చాలా బాగుంది. నౌషాద్ గురించి వినని వాళ్ళకి ఒక గొప్ప పరిచయవ్యాసం. సంగీతం అంతగా తెలియని జనాన్నికూడా ఆ సాగరంలో ఓలలాడించడంలో ఆయన సిద్ధహస్తులని నిరూపించారు.

శంకర్_జైకిషన్ గురించి రో.ప్ర. గారి అభిప్రాయం మాత్రం నాకు కొద్దిగా బాధ కల్గించింది (శ_జై లు చవకబారు పాటలు చేసారన్న ధ్వని).

హృదయాల్ని ఊపే సంగీతానికి కావలసినది నిర్మాణక్లిష్టత, పాండితికాదు గదా!

సంగీతం రాని వాళ్ళకి నౌషాద్ సంగీతంలో వైవిధ్యత లేదనిపించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇది నేను 1960 నుంచీ గమనించిన సాంఖ్యక సత్యం.

ఇంత మంచి వ్యాసమిచ్చినందుకు బహుధా కృతఙ్ఞతలు.

by: Mr. D.A.Eswar
రాగాల చేత “అందంగా చాకిరీ చేయించి అద్బుతమైన సంగితాన్ని మనకిచిన నౌషాద్ గారి గురించి మనకు తెలియని interesting విషయాలు , పదాలతొ అందంగా చాకిరీ చెయించి రొహినిప్రసాద్ గరూ మంచి వ్యాసం ఇచ్చారు.

After reading this article, I feel more respect for Sri Naushad.

Thanks to Prasadgaru & Eemaata for this very good essay and also for the rare photographs of ‘the great people’..

by: కొడవళ్ళ హనుమంతరావు
తండ్రిని మించిన తనయుడు

సంగీతం గురించి కనీసపు జ్ఞానం లేకపోయినా నేను రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు చదవడానికి కారణం వారి నిరాడంబర భాషా, శైలీ, క్లిష్టమైన విషయాలను విడమరచి సులభంగా చెప్పే నేర్పూ.

నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇతర రాష్ట్రాలకన్నా తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా వున్నా కూడా సంగీతంలో ప్రవేశం మనవాళ్ళకంటే వేరే రాష్ట్రాలవాళ్ళకే ఎక్కువున్నట్లనిపించేది. ముఖ్యంగా మనప్రక్కవాళ్ళే అయిన తమిళయన్లలో, ప్రతివాళ్ళూ గాత్రమో వాయిద్యమో చిన్నప్పుడే నేర్చుకునేవాళ్ళని విన్నాను. మనవాళ్ళకి ట్యూషన్లు, కోచింగ్లతో సంగీతానికి సమయం మిగులుతున్నట్లు లేదు. (పల్లెటూళ్ళలో, చిన్న పట్టణాలలో, రెండు మూడేళ్ళకోసారి వెళ్ళి పదిరోజులుండి చూసి ఏర్పరచుకున్న అభిప్రాయమిది; వాస్తవం కాకపోవచ్చు.)

చిన్నప్పుడే, 3-7 ఏళ్ళ మధ్య ప్రతిబిడ్డకూ ఏదో ఒక కళమీద గురి కుదురుతుందనీ, ఆ అభినివేశం పెద్దయ్యాక ఏర్పడటం దాదాపు అసంభవమనీ, చిన్నప్పుడే తగిన వాతావరణం కలిగించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళకుందనీ కొకు రాశాడు. పాటల్లోపడితే చదువులు పాడవుతాయని తల్లిదండ్రులకి సహజమైన భయం వుండొచ్చుగాని, దానికి కాస్త మందలింపు సరిపోవచ్చు:

“మా ప్రసాద్ సితార్ తో చదువు పాడు చేసుకోవటం నాకంతగా ఇష్టం లేదు. వాడు పరీక్షలప్పుడు కూడా relax కావటానికి ఓ అరగంట వాయించుకుంటే నేను అభ్యంతరం చెప్పను. కాని social functions లో వాయిస్తే ఇక mind చదువుమీదికి పోదు. ఆమధ్య వాడి స్నేహితులు చిన్న పార్టీ ఏర్పాటు చేసి వాడి చేత రెండున్నర గంటలు సితారు వాయింపించారట. అందులో వున్న ప్రమాదం వాడికీ తెలుసు. అందుకని దాని జోలికిపోక చదువుకోమని రాశాను. డిసెంబరు సెలవుల్లో నెలరోజులూ సితారే వాయిస్తాడు. summer holidays అంతా వాడికి మరోపని వుండదు. వాడికి వ్యక్తిత్వం లేకపోవటమేమిటి? సైన్సులోనూ, సంగీతంలోనూ నాకు వాడు చాలా విషయాలు చెప్పగలడు. నాకున్న వ్యసనాలు కూడా ఆరెండే. అందుచేత వాటిలో నన్ను ఇప్పటికే మించి ముందుకు వెళ్ళాడు.”

– కృష్ణాబాయికి 11-11-1968 న కొకు రాసిన ఉత్తరం నుండి.

కొడవళ్ళ హనుమంతరావు

by: Rao Vemuri
చాలా బాగుంది. రోహిణీ ప్రసాదు సంగీతం మీద రాసిన వ్యాసాలన్నీ అలా మరెవ్వరూ రాయలేరనిపించే విధంగా తనదైన ముద్రని వేసి రాస్తున్నారు. ఇది ముదావహం.

by: Lakshmanna vishnubhotla
అద్భుతంగా రాసారు ఈ వ్యాసాన్ని రోహిణీ ప్రసాద్ గారు. బహుశా తెలుగులో నౌషాద్ గురించి ఇంత వివరంగా రాయగలవారు ఇంకెవరూ వుండరేమో. నౌషాద్ సంగీతపు సాధికారత్వాన్ని ప్రసాద్ గారు చక్కగా విశ్లేషించారు. (ర)సాలూరు రాజేశ్వరరావుతో పోలికలు చక్కగా ఉన్నాయి. రఫీతో పాడించిన పహాడీ రాగంలోని “సుహానీ రాత్ ఢల్ చుకీ .. ” విన్నప్పుడల్లా తెలుగులో “ఆరాధన” సినిమాలో సాలూరు వారు సుశీలతో పాడించిన “నీ చెలిమి నేడె కోరితిని..” అన్న పాట గుర్తొస్తుంది. ఇది కూడా పహాడీ రాగంలోనే కట్టారు సాలూరి వారు.

మంగళంపల్లి బాలమురళి & భీమ్ సేన్ జోషీ మొదటి జుగల్ బందీ 1982 సంవత్సరంలో (?) బొంబాయిలో షన్ముఖానంద ఆడిటోరియంలో జరిగినపుడు. ప్రసాద్ గారితో పక్కనే నడుస్తున్న నేను, నౌషాద్ ని చూసాను! ప్రసాద్ గారు నౌసాద్ ని చూసి, “సంగీత సామ్రాట్టుకి నమస్కారం” అని విష్ చేస్తే, నౌసాద్ సిగ్గుతో తల వంచుకొని ఒక చిరునవ్వుతో సమాధానం ఇచ్చి వెళ్ళిపోటం నాకు బాగా గుర్తు!

నౌషాద్ మరణంతో సంగీత ప్రియులు ఒక గొప్ప జీనియస్ ని కోల్పోయారు.

నా కోరిక మేరకు, ఈమాట సంపాదక వర్గం అనుమతితో, అడగ్గానే ఇంత మంచి వ్యాసం రాసిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు.