ఈమాట » పక్షులు

Expand to right
Expand to left

పక్షులు

ఎంత ప్రేమించినా ఏముంది
అడుగుల సడికే పక్షులన్నీ
హడావుడిగా ఎగిరిపోతాయి.

వలలై చుట్టుకున్న చూపుల్ని
కలిసి ఎగరేసుకుపోతాయి.

గుమిగూడి గింజలేరుకుంటున్నప్పుడు
కనువిందు కలిగిస్తాయి.
చెదిరిపోయేటప్పుడు వీటి అందానికి
కళ్ళు చెదిరిపోతాయి.

ఒకోసారి ఒకో కొత్త చిత్రాన్ని
ఆకాశానికతికిస్తాయి.

ఆలోచనల తీరు వేరు.
నడక మొదలైతే చాలు
కువ కువలాడుతూ
మనసుకొమ్మ మీద వచ్చివాల్తాయి.

కిల కిలా రావాల్లోంచి
పాటను పట్టుకోమని
ఒకటే మారాం చేస్తాయి.

అడుగులు నిలిచిన మరుక్షణం
సడిలేకుండా ఎగిరిపోతాయి.

గుమిగూడినంతసేపే వీటి అందం.
చెదిరినప్పుడు మాత్రం మనసు
చివుక్కుమనిపిస్తాయి.

 

(2 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Prasad అభిప్రాయం:

    July 31, 2006 9:08 am

    చాలా బావుంది.
    “ఒకోసారి ఒకో కొత్త చిత్రాన్ని
    ఆకాశానికతికిస్తాయి”
    “కువ కువలాడుతూ
    మనసుకొమ్మ మీద వచ్చివాల్తాయి”
    “కిల కిలా రావాల్లోంచి
    పాటను పట్టుకోమని
    ఒకటే మారాం చేస్తాయి.”
    ఇవి భలే నచ్చాయి.
    అయితే
    “గుమిగూడి గింజలేరుకుంటున్నప్పుడు
    కనువిందు కలిగిస్తాయి.
    చెదిరిపోయేటప్పుడు వీటి అందానికి
    కళ్ళు చెదిరిపోతాయి.”
    మరియు
    “గుమిగూడినంతసేపే వీటి అందం.
    చెదిరినప్పుడు మాత్రం మనసు
    చివుక్కుమనిపిస్తాయి. ”
    చెప్పిన విషయమే మళ్ళీ చెప్పినట్లనిపించింది. అలాగే చెదిరిపోయినప్పుడు, ఒకసారి అందానికి కళ్ళు చెదిరిపోతాయనీ, మరొకసారి మనస్సు చివుక్కుమనిపిస్తాయనీ పరస్పరం విరుద్దంగా వున్నాయేమో అనిపించింది.
    – ప్రసాద్
    http://charasala.wordpress.com

  2. Devarapalli Hari Prasad అభిప్రాయం:

    September 13, 2006 7:07 pm

    విన్నకోట రవిశంకర్ గారికి,
    There is duality in nature. It is rare that a person usually gets both the perspective. Seeing other side of the coin is very important for a balanced life. When the Birds flew you could admire the beauty when they sped away, and could also felt that the unity of the group is disturbed.

    I always enjoyed your observation and presentation styles.

    Thanks
    Hari

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a