ఈమాట » సఖియ

Expand to right
Expand to left

సఖియ

సఖియ

రావోయి చందమామ
నీ వెన్నెల కౌగిట్లో మద్యం సేవిస్తాను
చంద్ర కిరణాల వేళ్ళని ఇలా ఇవ్వు
వెచ్చని వూపిరుల హుక్కా అందిస్తాను
నీ మచ్చల చెంపని చూపించవోయ్
నిప్పు రవ్వల చిటికెలు వేస్తాను
ముద్దెట్టు నా మెడ వొంపులో-
నిన్ను సెగలు కక్కే సూర్యుణ్ణి చేస్తాను.

కవిత రాయి 

మబ్బులని పేర్చి
లిఖించు ఏవో కొండగాలులలో
అవి చినుకులై రాలి
లోతైన లోయలలో
మొలకలై లేస్తాయి.

ఆ సడి లేని అడవి దారుల్లో
అందుకో ఇక
ఏదో ఒక గాలి పాటని-

పచ్చని చెట్లు మబ్బులని తాకి
నిద్ర మత్తు నేల గుండెల మీద
రంగు రంగుల పూలు రాల్చి
తడి ముద్దులు కానుకిస్తాయి

 

(2 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Prasad అభిప్రాయం:

    July 31, 2006 9:13 am

    “ముద్దెట్టు నా మెడ వొంపులో-
    నిన్ను సెగలు కక్కే సూర్యుణ్ణి చేస్తాను”
    ఇది చాలా బాగుంది. కానీ ఎందుకో “సఖియ” వెన్నెల కౌగిట్లో మద్యం సేవించడమే అంత బాగా లేదు.
    – ప్రసాద్
    http://charasala.wordpress.com

  2. Indrani Palaparthy అభిప్రాయం:

    August 6, 2006 10:21 pm

    సఖియ కి మద్యం అంటే ఇష్టం. :)

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a