Comments on: బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు

by: Rohiniprasad
నా వ్యాసంలో ఉదహరించని పేర్లు చాలానే ఉన్నాయి. 30 ఏళ్ళుగా నిర్వహించిన అనేక సంగీత కార్యక్రమాలల్లో ఔత్సాహికులైన గాత్ర, వాయిద్య కళాకారులెందరితోనో పనిచేసే అవకాశం నాకు కలిగింది. ప్రస్తుతం హ్యూస్టన్ లో ఉంటున్న డా. ఎ.వి.మురళి కవిగా, ప్రయోక్తగా చాలా ప్రతిభ కలిగిన వ్యక్తి. ఆయన మా కార్యక్రమాల్లోనూ, రాజేశ్వరరావు, పెండ్యాల నైట్ వగైరాల్లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. స్వయంగా కవీ, గాయకుడూ అయినప్పటికీ నా “ధాటి”కి గాయకుడుగా ఆయన కాస్త వెనక్కి తగ్గారు! ఆయన భార్య శ్రీమతి విమల ఎన్నో పాటలకు వీణ వాయించారు. ఆయన సోదరి విమల, మేనకోడలు రేణుక కూడా మాతో పాడారు. అలాగే ప్రస్తుతం అట్లాంటాలో చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దువ్వూరి రమేశ్ కుమార్, గుణుపూరు శ్రీనివాస్ (న్యూయార్క్)  పాటలు పాడారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న శ్రీమతి సరిపల్లి బాలాత్రిపురసుందరి మాకు ఉత్తమ గాయని. బొంబాయిలో ఇంతమంది తెలుగువారితో కలిసి మాకిష్టమైన పాత పాటలన్నీ పాడడం, పాడించడం చాలా సరదాగా ఉండేది. సినీగీతాలు కాకుండా కవితా స్రవంతి అనే పేరుతో గురజాడనుంచి చెరబండరాజుదాకా ఆధునిక తెలుగు కవుల గీతాలను ట్యూన్లు కట్టి, పూర్తి ఆర్కెస్ట్రా, కోరస్ వగైరాలతో రక్తి కట్టించగలిగాం. వీరందరిలోకీ రిహార్సల్స్ ని కూడా సీరియస్ గా తీసుకున్న కొద్దిమందిలో లక్ష్మన్న ఒకరు.

మేము నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వచ్చిన ప్రొఫెషనల్ కళాకారుల దగ్గరికి “మొరటు” మనుషులు రాకుండా మర్యాదస్తులైన మా మిత్రులను “కాపలా” పెట్టవలసివచ్చేది. ఎందుకంటే ఇతర సభల్లో ఒక్కొక్కప్పుడు పొరబాట్లు జరిగేవి. నూకలవారు కచేరీ చేస్తున్నప్పుడు ఎవరో మధ్యలో పక్క వాయిద్యం వాయిస్తున్న యెల్లావారిని మృదంగం సోలో వాయించమంటూ చీటీ పంపించారు. దురదృష్టవశాత్తూ అది నూకలవారి దగ్గరకు వెళ్ళింది. అది చూసి ఆయన మైకులో పెట్టిన చివాట్లను అందరం విన్నాం!

కొన్ని సందర్భాల్లో మా సభ్యులందరూ కూర్చుని శ్రవ్య నాటికలు వేసేవారు. ఇది ఖర్చులేని ఉత్తమ ప్రక్రియ అని ఇప్పటికీ నా అభిప్రాయం. సినిమాలే కల్చర్ అనుకోకుండా, మరొకవంక అస్తమానమూ శాస్త్రీయసంగీతం లేదా కూచిపూడితో మొహం మొత్తించకుండా ఇలాంటివి తెలుగు సంఘాలు చేపడితే బావుంటుందని నాకనిపిస్తుంది.

by: Lakshmanna Vishnubhotla
డా. రోహిణీ ప్రసాద్ వ్యాసం చాలా బాగుంది. ఈ వ్యాసంలో కొంత భాగం నాకు ప్రత్యక్ష అనుభవం. నేను బొంబాయి (ముంబాయి) లో రెండు ఏళ్ళు మాస్టర్ డిగ్రీ ఐ.ఐ.టి లో చెయ్యటం వల్ల, ఐదేళ్ళు టి. ఐ.ఎఫ్.ఆర్ (తెలుగులో ఎలా రాయాలో తెలియలా) లో డాక్టరేట్ డిగ్రీ ఫిజిక్స్ లో చెయ్యటం వల్ల, నాకు బొంబాయి తెలుగు వారితో పరిచయం బాగానే ఉంది. ఫిజిక్స్ అనటం ఎందు కంటే, నేను నా రిసెర్చి కోసం అప్పుడప్పుడు, బార్క్ (బిఎఆర్సి) కి వెళ్ళేవాణ్ణి. రోహిణీ ప్రసాద్ తో అంతకు ముందే ఉన్న పరిచయం మరీ ఎక్కువైంది అలానే! నేను 1980లో బొంబాయి రాగానే, అప్పటికే రోహిణీ ప్రసాద్ తో పరిచయం ఉన్న మా అన్నయ్య (ప్రసాద్ విష్ణుభొట్ల) ద్వారా నా సంగీతపు అభిరుచులను కొంతవరకు మెరుగు పెట్టింది రోహిణీ ప్రసాదే! అప్పుడు ప్రత్యక్షంగా తెలుగు సంస్థల కోసం పని చెయ్యాలంటే ఎదురయ్యే కష్టనష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నా. ఎక్కడో కొలాబాకి దగ్గరగా ఉన్న నేను (దక్షిణ బోంబాయి) 30 కిలోమీటర్లు ప్రయాణించి, ఫ్లూట్ ప్రాక్టీసుకు అణు శక్తి నగర్ వచ్చేనన్ను చూసి రోహిణీ ప్రసాద్ మెచ్చుకొనే వారు. రోహిణీ ప్రసాద్ లాంటి వాళ్ళు పడే కష్టాల తో పోలిస్తే నేను పడ్డ కష్టాలు ఎక్కువేమీ కాదు.

బొంబాయిలో కానీ, అమెరికాలో కానీ, మెరెక్కడైనా కానీ, ప్రవాసాంధ్రులు తెలుగు సంస్థల కోసం సేవా భావంతో పని చెయ్యాలంటే కష్టమే! తెలుగు వారు వ్యక్తులుగా ప్రతిభ చూపించగలరు, కానీ సమిష్టిగా విఫలులు అవుతారన్న మాటల్లో కొంత నిజం ఉందన్న విషయం నాకు స్వానుభవం.

మంచి వ్యాసం రాసిన రోహిణీ ప్రసాద్ కు ధన్యవాదాలు.

విష్ణుభొట్ల లక్ష్మన్న