Comments on: వానా పూలు ఇంద్రాణి కవిత్వం

by: తమ్మినేని యదుకుల భూషణ్.
కనక ప్రసాద్ గారు ..

Wagoner చెప్పినది నిజం..గుడిలో కుక్క చెప్పులు వెదికినట్టు..బుద్ధి

తప్పులు వెదుకుతుంది ..కాబట్టి ప్రపంచం ముక్కలు ముక్కలైన అద్దంలో

కనిపించే ప్రతిబింబంలా దర్శనమిస్తుంది..ఏకత్వాన్ని కోల్పోయి..కళలకు

తలమానికమైన కవిత్వం..బుద్ధి బులపాటాలకు దూరంగా తీసుకుపోయి ..

మన హృదయంలో ఏకత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తుంది..తన ప్రేమైక దృష్టితో..

దానివల్ల ప్రపంచం..ఉన్నదున్నట్టు, బాల్యంలో మనం చూసినట్టు

అనుభూతమై ఎంతో హాయి గొలుపుతుంది.

కల్పవృక్షాన్ని బొగ్గులకోసం తగులబెట్టినట్టు,మన వాళ్ళు

విప్లవాలు ,వీరంగాలు..వాదాలు..సిద్ధాంతాలు ,భక్తీ వేదాంతం

అంటూ కవిత్వాన్ని అంతరించి పోయే స్థాయికి తీసుకువచ్చారు.

కవులే కాదు ..కవిత్వాన్ని నిర్మల హృదయంతో చదివే జాతి

కూడా కృష్ణజింకల్లా అంతరించిపోతున్న అరుదైన జీవుల పట్టికలో

చేరింది.

కవయిత్రిని ఒక పది కాపీలు పంపమని చెప్పాను..ప్రస్తుతానికి

మీకు నా దగ్గర ఉన్న ఏకైక కాపీని పంపుతాను.మీ చిరునామా

thammineni@lycos.com పంపించండి.

తమ్మినేని యదుకుల భూషణ్.

by: s. kanaka prasad
ఇంద్రజాలం

ఇంద్రాణి గారి కవితల ఇంద్రజాలంలో ఏడాదిగా పడి కొట్టుకుంటున్నాను.  జనవరిలో ఎన్నో చోట్ల వెతికినా వస్తుందన్న కవితల పుస్తకం దొరకలేదు.  నెట్ లో దొరికిన కాసిన్ని కవితలనే మళ్ళీ మళ్ళీ అబ్బురంగా సంబరంగా చదువుతున్నాను.  గుప్తనిధి అని ముకుందరామారావు గారన్నమాట, ప్రతిభ గల కవయిత్రి అని యదుకుల భూషణ్ గారన్నమాట ముమ్మాటికీ నిజం.  ఈ కవితలకి ఇంతటి లాలిత్యం ఈ సమ్మోహక శక్తి ఎలా వచ్చి ఉంటాయా అని నాలో నేనే కులికి చస్తున్నాను.  ఇది చాల జటిలమైన ప్రశ్న;  దీనికి సమాధానాలు మాత్రం ఈ కవితలలానే చాల సున్నితమైనవి, మేధస్సుకు అతీతమైనవి అయి ఉండాలి.  ఎంతో ఇష్టంగా అవి వెదుకుతున్నాను; కాని మొత్తం పుస్తకం నాకు దొరకలేదు.  పరిచయంలో ముకుందరామా రావు గారు చూపినటువంటి సంయమనం, ఏ నిరాశకు గురి కాకుండా ఉండాలన్న ఆకాంక్ష, ఈ ఐంద్రజాలికి చేయతగిన కనీస గౌరవాలు.  దొరికిన కవితలు చదినప్పుడల్లా నేను అలాగే అనుకున్నాను.

నిద్రపోతున్న పిల్లలు, సైకిలు మీద తమ్ముడితో వెళ్ళడం, నీళ్ళు తాగే పిట్ట, వానకు తడిసిన పువ్వూ ఇవి సర్వ సాధారణమైన దృశ్యాలూ, అనుభవాలూ కదా!  వీటిని చూసి, రాస్తే అవి అంత చక్కదనాలుగా ఎలా, ఎందుకుంటాయో? ఈ ఒక్క ప్రశ్నDavid Wagoner అని నాకు చాల ఇష్టమైన కవి ఒకరిని అడిగేను.  ఆయన ఇది చాల చిక్కు ప్రశ్న అని అంటూనే నాకు నచ్చిన జవాబు చెప్పేరు.  నిత్య జీవితంలో మంచి చెడ్డల బేరీజులు, నిర్ణయాలతోనూ సతమతమౌతుంటుండే మన అంతరంగాన్ని మంచి కవిత తన పదాలు, నడకలు, చిత్రాలు, ఉపమలతో ఊరడించి, సర్వ సాధారణమైన దృశ్యాల్ని, మనుషుల్ని, ప్రపంచాన్నే మరింత ఉదారంగా లోతుగానూ దర్శింపచేస్తుంది.  (I have no good way to answer your very difficult question.  But a partial answer would be that the sounds and rhythms and metaphors of poetry sometimes make us suspend our ordinary judgments and help us see the material world and its people, ordinary actions, and commonplace events more openly and deeply.)  ఇందుకే ఇంద్రాణి గారి కవితలలో ఏమేం ఉన్నాయి అని కాకుండా ఏమేం లేవు అని, వేటిని ఒదులుకోవటం వలన వాటికి ఆ శక్తి అనీ ఇంకా అడుగుతున్నాను నన్ను నేనే.  తప్పకుండా రాసి తీరాలి అని గిలగిల్లాడుతున్నది రాసినందుకు ముకుంద రామారావు గారికి అభినందనలు.