బతుకు
స్వప్నించే కవి రాలిపోతాడు
స్వపించబడినవాళ్ళూ నిష్క్రమిస్తారు
స్వప్నాలు మాత్రం …
సుస్మితించిన మోవి వాడిపోతుంది
విస్మయించిన చూపు ఇంకిపోతుంది
సుస్మితలు మాత్రం …
పరిమళించిన పువ్వు వాడిపోతుంది
ఆఘ్రాణించిన నాసిక కృశిస్తుంది
పరిమళాలు మాత్రం …
బలివితర్ది పై అతడు అంతమౌతాడు
విలపించే గుండె అవిసిపోతుంది
వేదనలు మాత్రం …
పచ్చని వసంతం నిష్క్రమిస్తుంది
పాడిన కోకిల ఎగిరిపోతుంది
మాధుర్యాలు మాత్రం …
రంగస్థలం మీద తెరవాలుతుంది
నటీనటులు వేషం విప్పుతారు
నటనానుభూతులు మాత్రం …
యుద్ధరంగం రక్తసిక్తమౌతుంది
యోధులు వీరస్వర్గాలు అలంకరిస్తారు
వీరోచితగాధలు మాత్రం …
ఒక్కో శకం ఒక్కో ఇతిహాసం
ఒక్కో నాగరికత ఒక్కో షాన్
బతుకు మాత్రం
telugu అభిప్రాయం:
May 1, 2006 7:24 am
ఏవిటిది? స్వప్నించడాలూ, సుస్మితించడాలూ.. ఎందుకీ బలవంతపు ప్రయోగాలు?
కలలు కనే కవి రాలిపోతాడు అంటే ఏ లోపము జరుగుతుంది?
అప్పు తచ్చులు చూసుకోవాలి.. నటనానుభూతులు లో నతనానుబూతులు అని
పడింది. నతన కి సర్దుకున్నా బూతులకి మాత్రము సర్దుకోడము కష్టంగా ఉన్నది.
కవిత బాగానే ఉంది. బలవంతపు ప్రయోగ పదాలు తప్ప.
సురేశ్ కొలిచాల అభిప్రాయం:
May 1, 2006 11:05 am
అచ్చు తప్పులు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు.
K Kiran అభిప్రాయం:
May 22, 2006 4:50 am
స్వప్నాలు మాత్రం
సుస్మితలు మాత్రం
…
…
నటనానుభూతులు మాత్రం
వీరోచిత కధలు మాత్రం
బతుకులు మాత్రం
మాత్రలింకేమీ మిగల్లేదా విద్యార్ధి గారు.
Praveen అభిప్రాయం:
June 14, 2006 1:53 am
మనస్సుకు హత్తుకునేలా ఉంది… ఎన్నో జ్నాపకల్ని తరచి చూసినట్టయ్యింది.
Raghuram అభిప్రాయం:
June 21, 2006 3:19 am
అద్భుతంగా వుంది. చాలా బాగా నచ్చింది.