ఈమాట » ద్వంద్వాలు

Expand to right
Expand to left

ద్వంద్వాలు

గాలి రమ్మంటుంది,
కొమ్మ వదలకుంది!
మధ్యలో-
ఆకులు అల్లాడుతున్నాయి…

సుడి రేగి కుదిపేస్తోంది,
వేరు వదలకుంది!
మధ్యలో-
చెట్లు విరిగిపోతున్నాయి…

అరుణోదయం కావస్తోంది,
చీకటే వదలకుంది!
మధ్యలో-
సందేహాలు అలుముకున్నాయి…

స్వేచ్ఛ ఉదయించింది,
గదిలోకి రాలేకుంది!
మధ్యలో…
కిటికీ ఊసల మెరుపులో-
బందీ విలపిస్తున్నాడు…

దేహం అలసిపోయింది,
ప్రాణం విసిగిపోయింది,
కోరికే తీరకుంది!
ఈ ఆగని పయనం-
ఆది, అంతం మధ్యలో, మిధ్య లో…
చిక్కుకు పోయింది…

10-03-05

ఆఖరి చరణంలో: మధ్య లో, మిధ్యలో అన్న వాడుక నేను “అన్వేషి” అనే ఒక రచయిత బ్లాగు లో చదివా…

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a