నార్ల వెంకటేశ్వర రావు గారు ప్రసిద్ధులైన ఆధునిక తెలుగు రచయితలకు కొంచెం చిన్నవాడు. రచయితగా కన్నా పత్రికా రంగంలో ఆయనకు ఎక్కువ ప్రఖ్యాతి వుంది. కాని ఆయన రెండు రామాయణ నాటకాలు రాశాడు. ఒకటి జాబాలి (1974), మరొకటి సీత జోస్యం (1979). అన్నిట్లోకి ఎక్కువ ప్రచారం వున్న తెలుగు దినపత్రిక ఆంధ్ర ప్రభకు సంపాదకుడిగా జనాభిప్రాయాన్ని మలచటంలో ప్రముఖ పాత్ర వహించాడు నార్ల. పత్రికా స్వాతంత్య్రపరిరక్షణకు శ్రమించాడు. పరుగులు తీసే శైలిలో ఆయన రాసిన సంపాదకీయాలు ఊరూరా చర్చా విషయాలయ్యాయి. ఆయన దృష్టిలో సంస్కృతం, బ్రాహ్మణ భావాలు ప్రగతికి అడ్డుగోడలు. ఆయనకు పాశ్చాత్య విద్వత్తులో జ్ఞానమార్గం కనిపించింది. ఎన్‌లైటెన్‌మెంట్ భావాలు ఆయనకు భవితవ్యం చూపాయి. వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో కనిపించే జాబాలిని ఒక నిరీశ్వరవాదిగా చిత్రించాడాయన. వెంకటేశ్వర రావు గారి నాటకంలో జాబాలిది చాలా పిరికి పాత్ర. బ్రాహ్మణ పురోహితుడు వశిష్టుణ్ణి ఎదిరించే ధైర్యం లేదతనికి. రాముణ్ణి అడవికి వెళ్ళకుండా ఆపటానికి విఫల ప్రయత్నం చేస్తాడు. అంతలో వశిష్టుడు అక్కడికి రావటం చూసి అదంతా తను రాముడి నిశ్చయాన్ని పరీక్షించటానికే చేస్తున్నానని చెప్పి అక్కణ్ణుంచి పారిపోతాడు. రాముడితో అతని సంభాషణ ద్వారా రాజసభలో బ్రాహ్మణ ఋషుల కుట్రలు, మోసాలు, అసూయలు బయటకు వస్తాయి.
రెండో నాటకం సీత జోస్యం ఇంతకన్నా చాతుర్యంతో రాసింది, ఉత్సుకత కలిగించేది. దీని సుదీర్ఘమైన పీఠికలో ఇలా అంటాడు నార్ల
“రామాయణం, మహాభారతం, అష్టాదశ పురాణాలు వీటన్నిటి ముఖ్య ధ్యేయం వర్ణ ధర్మ పరిరక్షణ. రాచరిక వ్యవస్థ రక్షణ. ఇప్పటి లాగానే వాటిని ముందు ముందు కూడ ప్రచారం చేస్తే కొత్త సాంఘిక నియమం అనేది కంఠశోష గానే మిగుల్తుంది. ఈ గ్రంధాలు దాదాపు పదిహేను వందల ఏళ్ళ పాటు మన మానసిక వికాసానికి సంఘ పురోగతికి అడ్డుగోడలుగా నిలిచాయి. ఇప్పటికైనా ఈ అడ్డంకుల్ని తొలగించక పోతే మనం ఆధునిక యుగం లోకి అడుగు పెట్టలేం; అభ్యుదయ పథం మీద సాగలేం”[26]. (ఇది తెలుగు మూలం కాదు; ఆంగ్లానువాదానికి తెలుగు అనువాదం)
దీన్లో దండకారణ్యంలో ఋషులూ రాక్షసుల మధ్య ఘర్షణని ఆహారోత్పాదకులకూ ఆహార సేకరణ దారులకూ (ఫూడ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఫూడ్ గాదరర్స్) మధ్య సంఘర్షణగా చిత్రిస్తాడు. రఘువంశానికే గొప్ప యుద్ధవీరుడని ఋషులు తనని పొగిడితే దాంతో ఉబ్బిపోయి రాక్షసుల్ని చంపే అహంభావిగా రాముణ్ణి చిత్రిస్తాడు. మరోవంక రాక్షసులు కేవలం ఆహార సేకరణ దారులని,వ్యవసాయానికి అడవుల్ని నాశనం చేస్తున్న ఋషుల వల్ల వాళ్ళ భుక్తికి ప్రమాదం కలుగుతున్నదని సీత సత్యం గ్రహిస్తుంది. రాక్షసులు తిరగబడతారనీ, వాళ్ళ మానాన వాళ్ళను వదిలెయ్యమనీ సీత రాముణ్ణి కోరుతుంది. దక్షిణ ప్రాంత భూముల్ని ఆక్రమించటానికి ఇది ఋషులు వేసిన పథకం అని వివరిస్తుంది. కాని అతను వినడు.ఫలితం ఏమన్నా కానీ, బ్రాహ్మణులని కాపాడతానని మాట ఇచ్చానంటాడు. ఒకనాటికి ఆ బ్రాహ్మణుల్ని మెప్పించటానికి తనను కూడ వదులుకుంటాడని సీత జోస్యం చెప్పటంతో నాటకం ముగుస్తుంది!
ఇటీవల వచ్చిన వ్యతిరేక రామాయణాల్లో సంపూర్ణమైంది, వివాదాస్పదమైంది ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం. 1960ల నాటికి తెలుగు సాహిత్యంలో నవలకు ప్రముఖస్థానం దొరికింది. దాదాపు ఒక దశాబ్దం పాటు రచయిత్రులు ఈ రంగాన్ని శాశించారు. వాళ్ళ నవలలు మిగిలిన అన్ని పుస్తకాల కన్నా ఎక్కువగా అమ్ముడు పోయాయి. పత్రికల్లో సీరియల్స్ గా వచ్చి ఆ పత్రికల ప్రాచుర్యాన్ని బాగా పెంచాయి. అలా నవలల ద్వారా సాహిత్యరంగంలోకి వచ్చిన రచయిత్రులలో రంగనాయకమ్మ గారు ఒకరు. 1970ల తొలినాళ్ళలో ఎప్పుడో ఆమె మార్క్సిజాన్ని కనుక్కుంది. అప్పట్నుంచి ఆమె నవలలు రాయటం ఆపి మార్క్సిస్టు సైద్ధాంతిక రచనలే చేస్తున్నారు.
రామాయణ విషవృక్షంలో రామాయణానికున్న బ్రాహ్మణ, అబ్రాహ్మణ వ్యాఖ్యానాలన్నిటినీ తీవ్రంగా నిరసించిందామె. రామాయణం ఏకైక లక్ష్యం తక్కువ కులాల వాళ్ళని, స్త్రీలని, రాచరికవ్యవస్థ బంధనాల్లో ఉంచటమే నని ప్రతిపాదించింది. రామాయణ విషవృక్షం కొంత వాల్మీకం మీద వ్యాఖ్యానం, మరికొంత తను ఊహించిన విధంగా రామాయణ కథకి పునర్నిర్మాణం. దీన్లో ఆమె రాచరికాన్ని, బ్రాహ్మణ్యాన్ని విపరీతంగా తూర్పారబట్టింది. వాల్మీకి రామాయణం వచ్చినప్పటి నాగరికతా దశలో కథలు చెప్పటం, రచనలు చెయ్యటం ఇంకా శైశవంలోనే వున్న కళలని, వాల్మీకి కవే కాడని చెప్పేంత ప్రగాఢమైంది మార్క్సిజం లో ఆమె నమ్మకం. ఆమె మార్క్సిస్టు విద్వత్తు వల్ల అన్ని సమస్యలకూ ఆమె దగ్గర సమాధానాలున్నాయి. ఉత్పత్తి సాధనాల ననుసరించి మానవ జీవన గతి స్పష్టమైన దశల్లో వెళ్తుందని, రామాయణం రాచరిక దశకు చెందిందని చెప్పటానికి సందేహాలేవీ లేవు. రామాయణ మర్మాల్ని వెలికితీయటానికి రామాయణాన్ని తిరిగరాసిందామె. తన మూడు భాగాల పునర్‌కథనాన్ని సమీక్షిస్తూ, ఇలా అంటారామె
“రామాయణం పురుషుల్ని సమర్థిస్తుంది; ధనవంతుల్ని, పై కులాల వాళ్ళని, రాచకులం వాళ్ళని సమర్థిస్తుంది; దోపిడీని సమర్థిస్తుంది. అదెప్పుడూ పురోగమన రచన కాదు దాన్ని రాసిన కాలంలో కూడ”[27]. (ఇది తెలుగుమూలం కాదు; ఆంగ్లానువాదానికి తెలుగు అనువాదం)
ముగింపు
తెలుగు ప్రజల మీద ఈ వ్యతిరేక రామాయణాల ప్రభావం ఏమిటి? బహుశా ఒక్క సీత జోస్యం (దీనికి 1981లో సాహిత్య ఎకాడమీ బహుమతి వచ్చింది) తప్ప మరేదీ సాహిత్యంగా పేరు తెచ్చుకోలేదు. వాటిలో ప్రతి ఒక్కటి కొంతకాలం పాటు వివాదాస్పదంగా ఉన్నది. విద్యావంతులైన పాఠకులు వాటిని చర్చించారు. రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం బాగా అమ్ముడు పోయింది కూడ. తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. కొందరు దాన్ని కొత్తగాలిగా భావిస్తే మరికొందరు విపరీతంగా ద్వేషించారు. విమర్శలకు ఆమె వేడి సమాధానాలు కూడ ఈ వాదాలకు ఊపిచ్చాయి. మార్క్సిస్టు పార్టీల అధికారిక స్పందన అటూ ఇటూ కాకుండా ఉంది వాళ్ళా పుస్తకాన్ని నిరసించనూ లేదు, ఉత్సాహంగా దగ్గరకు తీసుకోనూ లేదు.
ఈ వ్యతిరేక రామాయణాల వల్ల కలిగిన హడావుడిలో, ఒక రచనని సాహిత్యంగా రూపొందించే గుణం ఒకటి ఉందని వాళ్ళు గ్రహించలేదు. తెలుగు సంస్కృతిలో సాహితీ చైతన్యం పురాగాధల లోంచి ఉద్భవిస్తుంది. గతం ఆధారంగా శక్తివంతం చెయ్యబడిన కథనాల వల్ల అవి పుడతాయి. సాంప్రదాయిక రామాయణాన్ని కాదనగలిగే మరొక కొత్త రామాయణాన్ని సృష్టించటంలో పూర్తిగా విఫలమయ్యారు వీరు. కాని క్రమం తప్పకుండా ఈ రచయితలంతా తమ రచనలకి పీఠికలుగా పెద్ద పెద్ద వ్యాసాలు రాశారు. వాళ్ళ భావాలు బుద్ధికి పదునుపెట్టేవే. కాని వాళ్ళ రచనా సామర్య్ధం మాత్రం దాదాపుగా అసంతృప్తికరం.
ఐతే పురాజీవ శాస్త్ర, చరిత్ర, విజ్ఞాన శాస్త్ర రంగాల్లో కొత్తగా కనుగొన్న పరిజ్ఞానంతో రామాయణం విలువ గురించి సాహిత్య విద్వాంసులు పుస్తకాలు రాశారు[28]. వ్యాసాలు, పుస్తకాలు లోతైన చర్చలకు, వాద ప్రతివాదాలకు దారితీశాయి.
వ్యతిరేక రామాయణాల గురించిన సుదీర్ఘ చర్చల వల్ల కనీసం మేధావి వర్గంలో కొంత సంస్కృతీ విశాలత కలిగింది. భక్తి రామాయణాల మత ప్రభావం పెద్దగా తగ్గలేదు గాని మధ్య తరగతి విద్యావంతులు పవిత్ర గ్రంధంగా ఎంచబడే దాని మీద విమర్శాత్మక చర్చలకు అలవాటు పడ్డారు. అంతకుముందు ఆధునికపూర్వ రామాయణాలు, జానపద రామాయణాలు రామాయణ వైవిధ్యానికి పునాది వేస్తే, ఇప్పుడు అధునాతన, వ్యతిరేక రామాయణాలు ఆ పాత్రను నిర్వహిస్తున్నాయి. ఏకైక రామాయణ కథనానికి దారితీసే అవాంఛనీయ ప్రయత్నాల్ని ఇవి కొంతవరకు అడ్డుకొంటున్నాయి.
References
- ^Tripuraneni Ramasvami Chaudari, Sambuka Vadha , 1920, rept. in vol. 2 of Kaviraju Sahitya Sarvasvam (Gunturu: KavirajuSahiti Sanmiti, 1996), 1-79.
- ^For the Valmiki telling, see 7.73-5 and 76. 1-16, Ramayana of Valmiki, ed. Katti Srinivasa-shastri (Delhi: Parimal Publications, 1983).
- ^Raghuvamsa, 15. 42-53, especially verse 53.
- ^ Uttararamacarita, 2.10-13, ed. S.K. Belvalkar (poona: Oriental Book Supplying Agency; 1921).
- ^Sheldon Pollock, “Ramayana and Political Imagination in India,” Journal of Asian Studies, 52.2 (May 1993): 263.
- ^This is the story told by King Raghunathanayaka of Tanjore in his Valmiki Caritramu.
- ^Narayana Rao, “A Ramayana of One’s own: Women’s Oral Tradition in Telugu” in Many Ramayanas: The Diversity of Narrative Tradition in South Asia, ed. Paula Richman, (Berkeley: University of California Press, and Delhi: Oxford University Press, 1991), 114-36.
- ^Sheldon I. Pollock, The Ramayana of Valmiki: An Epic of Ancient India, vol. 2, Ayodhyakanda (Princeton, NJ: Princeton University Press, 1986), 10.
- ^ Vecheru Narayana Rao, unpublished remarks for panel on “Audiences and Indian Literature,” presented at the Association of Asian Studies, 1982.
- ^There was, however, no lack of Ramayanas that presented events from the perspective of Sita. For example, a number of women’s songs and tales did so.
- ^Ravuri Dorasami Sarma, Telugu Sahutyamu: Rama Katha (Machilipatnam : Triveni Publishers, 1972), 71-6.
- ^ From Viswanatha Madhyakkaralu, cited by Sarma, Telugu Sahityamu, 247. Bhadradri, or Bhadracalam, is a famous Rama shrine in West Godavari district.
- ^ Tandra Subrahmanyam, Sri Ramanjaneya Yuddham (Tenali: Sri Venkatrama Book Depot, 1979). This play, which does not have a source in any purana, has been performed widely in Andhra Pradesh and was also produced for radio. A phonograph album of this play sold well; a movie was also made.
- ^ Kasula Purushottamakavi, Andhranayaka-satakamu, ed. Yarlagadda Balagangadhara Ravu (Visakhapatnam: Nirmala Publications, 1975), verse 88.
- ^ Professor Ravva Srihari says Kamasamudram Appalacarylu led a five-scholar team for this project, including Kanadam Peddana Somayaji, a great Sanskrit scholar of his time, preface to Kanadam Peddana Somayaji, Mukundavilasamu (Hyderabad: Telugu Vijnana Pitham, 1985), 9-10.
- ^ (Translator’s comment: Original sloka, which was here in the footnotes, is now in the text itself)
- ^ Two such books, for instance, are: Sakala-karya-siddhiki Srimadramayana-parayanamu (Madras: Little Flower Company, 1967), reprinted several times, and Sundara-hanumad-vaibhavamu by Sistla Candramouli sastri (Pedapadu, Andhra Pradesh: Author, N.D.).
- ^ Chaudari presents “linguistic evidence” to suggest that Ravana’s name was derived from the Koya language. See Suta puranamu, 2 vols. (Gunturu: Kaviraju Sahiti Samiti, 1996), vol. 1, 224-5.
- ^ Suta puranamu, 3.210, 210.
- ^ Richman, “E.V. Ramasami’s Reading of the Ramayana,” 175-201.
- ^ Chaudari clearly anticipates E.V. ramasami of Tamil Nadu. The chronology of their ideas has not received attention since Ramasvami Chaudari is not as well known as E.V. Ramasami in the West. Ramasvami Chaudari wrote Sambuka Vadha during 1914-17; however, he published it, along with a long preface, only in 1920. His Suta puranamu, with several detailed prefatory essays for each of its chapters, was published in 1924, whereas E.V. ramasami’s anti-Ramayana pamphlet Iramayanappattirankal made its first appearance in 1930, a full decade after Chaudari’s Sanbuka Vadha. Their ideas bear very close resemblance, yet significant differences as well. No work has yet been done to determine whether there were any contacts between the two leaders.
- ^ Introduction to Sambuka Vadha, 17-18.
- ^ Gudipati Venakata Chalam, Sita Agnipravesam (Vijayawada: Aruna Publishing House, 3rd edn., 1976), 45.
- ^ Satyanarayana began writing the first volume as Ramayana Kalpavrkshamu in 1934 and concluded the sixth volume in 1962. The first volume was not published until 1944. The other volumes were published during the following years, ending with the sixth volume in 1963. Satyanarayana gave readings from his book long before the first volume was published. The six volumes have been reprinted several times.
- ^ Visvanatha Satyanarayana, Ramayana Kalpavrkshamu (Vijayawada: Visvanatha Publications, 1992; 1st edn., 1944), 1.5, Translation in collaboration with David Shulman.
- ^ Narla Venkatesvara Rao, Sita Josyam (Vijayawada: Navodaya Publishers, 1979), 131.
- ^ Muppalla Ranganayakamma, Ramayanavishavrksham, 3 vols. (Hyderabad: Sweet Home Publications, 1974-6). The title parodies Ramayana Kalpavrkshamu, written a few years earlier by Visvanatha Satyanarayana (see n. 24).
- ^ Two such books are Suravaram Pratapa Reddi, Ramayana Viseshamulu (Hyderabad: Andhra Racayitala Sangham, 1957), and Kotta Satyanarayana Chaudari, Ramayana Rahasyalu (Nidubrolu: Bhashaposhaka granthamandali, 1968).