ఈమాట » ప్రయాణం

Expand to right
Expand to left

ప్రయాణం

ఈ ప్రయాణం నేను కోరుకున్నదే నేమో
ఈ విమానం నేను ఎక్కాలనుకున్నదే కాబోలు
ఈ సహప్రయాణీకులు మాత్రం నేను తెచ్చుకున్న వారు కారు

ఇది వెళ్ళేచోటు నేను అడిగిందే అనుకుంటాను
ఇది కదిలే దారి నాకు నచ్చేదేనని ఆశిస్తాను
ఇది బయల్దేరిన స్థలం మాత్రం నేను మెచ్చినది కాదు

ఇక్కడంతా చీకటి
ఇక్కడంతా ఇరుకు
ఇక్కడ చిన్న కునుకుకు కూడా అవకాశం లేదు

ఇక్కడంతా హడావుడి
ఇక్కడంతా కదలిక తెలియని వేగం
ఇక్కడ మనసు విప్పి మాట్లాడడానికి ఎవరూ లేరు

నాకు నేను ఊహాలోకాన్ని అల్లుకుంటాను
నాకు నేను బెత్తెడు జాగా చెక్కుకుంటాను
నాకు నేను దగ్గర కావడానికి ప్రయత్నిస్తాను

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a