ఈమాట » టకరగాయికె

Expand to right
Expand to left

టకరగాయికె

టకరగాయికె కొండ దారిని
ఇంకా ఎవరూ లేవకుండా
ఒక బుద్ధుని గుడి ఉందనుకుని ఈ మెట్లన్నీ ఎక్కేక
రెండు మూగ శిఖరాల మధ్యన
ఇక్కడ ఏమీ లేదు.

నిటారుగా మచ్చల చెట్టు, ఎర్ర కంకర
ఒక పాత జాపనీస్‌ జండా
ఒకరికొకరు తెలియనట్లు ఈ టకరగాయికె శిఖరాలు
ఇంక ఏమీ ఒద్దు.

పేరు తెలియని చెరువు ఒడ్డున
ఒచ్చిన తోవ తప్పిపోయి
గొగ్గిపళ్ళ రోషి తో
ఖాళీ పడవలో ఎక్కి కూర్చుని
టకరగాయికె ప్రిన్స్‌ హోటల్‌
రూం నెంబర్‌ 613
ఆ ఒడ్డుకి.

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a